Real life story
-
"ఆమే ఒక సైన్యమై, సందేశమై.. " క్యాన్సర్ బాధితురాలి యదార్థ గాధ
‘నీ కన్నీళ్లను మోసే శక్తి నాకు లేదు’ అని నటులు ఏదో ఒక సందర్భంలో మనసులోనో, మనసు దాటో అని ఉండవచ్చు. కొన్ని పాత్రలు అలా ఉంటాయి మరి! పాత్ర పండాలంటే జీవం ఉట్టిపడాలి. పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసే ప్రయత్నం చేసినా, ఆ ప్రయత్నం ఫలించకపోవచ్చు. తేలిపోవచ్చు. మరి బాధితులే నటమాధ్యమంలోకి, తమ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేస్తే..? వారి జీవితం మన కళ్ల ముందుకు నడిచొస్తుంది. జీవం ఉట్టిపడుతుంది. పదిమందికి మంచి చేసే సందేశం వేగిరంగా అందుతుంది... ప్రియ జోషి (హైదరాబాద్) నటి, రచయిత్రి. ఆమె ఒవేరియన్ క్యాన్సర్ బారిన పడింది. ఆ సమయంలో ప్రియ మానసిక ప్రపంచం ఏమిటో మనకు తెలియదు. ధైర్యంగా కనిపించి ఉండొచ్చు. కాని నిజంగానే ధైర్యంగా ఉందా? కళ్లలో నీటిపొరలేవీ కనిపించకపోవచ్చు. కానీ మనకు కనిపించని దుఃఖసముద్రాలు ఆమె మనసులో ఏమైనా ఉన్నాయా? తనకు క్యాన్సర్ ఉందన్న చేదునిజం తెలిసిన క్షణం నుంచి క్యాన్సర్ నుంచి బయట పడిన రోజు వరకు ఆమె హృదయం రణరంగంగా మారి ఉండవచ్చు. అక్కడ ఆశ, నిరాశలకు మధ్య ఎన్నో యుద్ధాలు జరిగి ఉండవచ్చు. ఆత్మవిశ్వాసం అనే ఆయుధం అప్పుడప్పుడూ చేజారిపోతూ ఉండవచ్చు. దాని జాడ కనిపించకుండా ఉండవచ్చు. చేజారిన ఆయుధాన్ని ఆమె కష్టపడి వెదికి పట్టుకొని ఉండవచ్చు. ఎన్నో సందేహాలు, ఎన్నో ప్రశ్నలకు ఇప్పుడు ఒక ఏకాంకిక సమాధానం చెప్పబోతుంది. ప్రియ జోషి ఆత్మబలం, పోరాట పటిమను నితిన్ బస్రూర్ హిందీలో ‘ఔర్ షమా జల్తీ రహీ’ పేరుతో సోలో ప్లేగా మలిచారు. ఈ ప్లేలో ప్రియ జోషి తన పాత్రలో తానే నటించడానికి సన్నద్ధం కావడం ఒక విశేషం అయితే, కస్ట్యూమ్, స్టేజ్ సపోర్ట్, మ్యూజిక్, లైట్ ఆరెంజ్మెంట్లాంటి బాధ్యతలను స్త్రీలే నిర్వహించడానికి రెడీ కావడం మరో విశేషం. ఆర్మీ ఆఫీసర్ భార్యగా, కాన్సర్ సర్వైవర్‌గా తన అనుభవాలతో రెండు పుస్తకాలు రాసింది ప్రియ. గతంలో టీచర్‌గా పనిచేసిన ప్రియ ఇప్పుడు ‘మేక్ ఏ విష్ ఫౌండేషన్’ అనే స్వచ్ఛంద సంస్థ తరపున పనిచేస్తుంది. రంగస్థలం అనేది సృజనాత్మక వేదిక మాత్రమే కాదు...సందేశం అందే విశాల వేదిక కూడా. అంకితభావం, ఆశావహæదృక్పథం, సంకల్పబలం ఉంటే ఎంతటి జటిలమైన పరిస్థితి నుంచైనా బయటపడవచ్చు అనే సందేశాన్ని ‘ఔర్ షమా జల్తీ రహీ’ ద్వారా ఇవ్వాలన్నది ప్రియ జోషి ఉద్దేశం. నిజజీవితం నుంచి నడిచొచ్చిన కథ, నాటకంలాంటి సృజనాత్మక రూపాలకు జనాలు జేజేలు పలకడం కొత్త కాదు. అయితే ఈ సింగిల్ ప్లే మనం ప్రశంసించడానికి మాత్రమే పరిమితమైన కళారూపం కాదు. మనకు ధైర్యాన్ని ఇచ్చే ఆయుధం కూడా! -
తనకు ఆ సమస్య ఉందని తెలిసి బాధపడ్డ సిరివెన్నెల
Sirivennela Seetharama Sastry: రోజుకి 19 గంటల పాటు ఏకాంతంగా... ఏకధాటిగా 30 ఏళ్లు పాటతోనే జీవించిన ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి ‘అంతర్యామి అలసితి సొలసితి...’ అంటూ అక్షరాల నుంచి సెలవు తీసుకున్నారు. సిరివెన్నెలలు పంచడానికి వెన్నెల చెంత చేరారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ జిల్లా అచ్యుతాపురం మండలం దోసూరు గ్రామంలో 1955 మే 20న డా. చేంబోలు వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు సీతారామశాస్త్రి జన్మించారు. వెంకట యోగి, సుబ్బలక్ష్మీ దంపతులకు ఇద్దరు అబ్బాయిలు, ఐదుగురు అమ్మాయిలు కాగా సీతారామశాస్త్రి తొలి సంతానం. పదో తరగతి వరకూ అనకాపల్లిలో చదువుకున్న సీతారామశాస్త్రి కాకినాడలో ఇంటర్ పూర్తి చేశారు. ఆ తర్వాత ఐటీఐ కాలేజీ లెక్చరర్‌గా వెంకట యోగికి కాకినాడకు బదిలీ కావడంతో సీతారామశాస్త్రి ఇంటర్మీడియెట్ చదువు అక్కడే సాగింది. కాగా వెంకట యోగికి హోమియోపతి వైద్యంలో ప్రవేశం ఉండటంతో సీతారామశాస్త్రిని మెడిసిన్ చదివించాలనుకున్నారు. అలా విశాఖపట్నంలోని ఆంధ్ర వైద్య కళాశాలలో 1973లో ఎమ్బీబీఎస్లో చేరారు. అయితే ఎమ్బీబీఎస్లో చేరే ముందే కుటుంబ పోషణ విషయంలో ఇబ్బందిపడుతున్న తండ్రికి సాయం చేయాలని టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్ ఉద్యోగానికి అప్లై చేశారు. కానీ ఎమ్బీబీఎస్లో చేరారు. అప్పటివరకు సీతారామశాస్త్రికి మొదటి బెంచ్‌లో కూర్చొనే అలవాటు ఉంది. కానీ ఎమ్బీబీఎస్లో చివరి బెంచ్ దొరికింది. పైగా లెక్చరర్స్ చెప్పే పాటలు అర్థం అయ్యేవి కావు. ఎందుకంటే అప్పుడు ఇంగ్లిష్‌లో సీతారామశాస్త్రికి అంతగా ప్రావీణ్యత లేదు. చివరి బెంచ్‌లో కూర్చున్న ఆయనకు బ్లాక్‌బోర్డ్ సరిగ్గా కనిపించకపోవడంతో, తనకు కంటి సమస్య ఉందని గ్రహించి, బాధపడ్డారు. ఇంగ్లిష్ సమస్య, ఐ సైట్... ఈ రెంటితో పాటు ఉమ్మడి కుటుంబ పోషణ విషయంలో తండ్రి ఇబ్బంది.... ఈ మూడు అంశాలు సీతారామశాస్త్రికి చదువుపై ఏకాగ్రత నిలవనివ్వకుండా చేశాయి. అదే సమయంలో టెలిఫోన్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరమని కబురు రావడంతో ఎమ్బీబీఎస్కి ఫుల్స్టాప్ పెట్టి, 300 రూపాయలకు టెలిఫోన్ శాఖలో అసిస్టెంట్‌గా చేరారు. అయితే తండ్రికి మాత్రం తాను ఓపెన్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తానని మాటిచ్చారు. అన్నట్లుగానే ఆ తర్వాత బీఏ చేశారు. అంతా సజావుగా సాగుతున్న సమయంలో 40 ఏళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ పోషణ భారమంతా సీతారామశాస్త్రిపై పడిపోయింది. తండ్రి హోమియోపతి వైద్యాన్ని సీతారామశాస్త్రి తమ్ముడు చూసుకున్నారు. ఆ తర్వాత సీతారామశాస్త్రి తమ్ముడికి ఉద్యోగం దొరికింది. సోదరీమణుల వివాహాలను ఈ ఇద్దరు అన్నదమ్ములు జరిపించారు. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే కాకినాడలో సాంస్కృతిక కార్యకలాపాల్లో చురుగ్గా ఉన్న సీతారామశాస్త్రికి ‘కళా సాహితి సమితి’తో పరిచయం కలిగింది. ఈ ప్రయాణంలో భాగంగానే సీవీ కృష్ణారావు, ఇస్మాయిల్, సోమసుందర్, ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ వంటి ప్రముఖ సాహితీవేత్తలతో సీతారామశాస్త్రికి సాన్నిహిత్యం ఏర్పడింది. అప్పుడే ‘భరణి’ అనే కలం పేరుతో సీతారామశాస్త్రి రాసిన రచనలు ఆంధ్రప్రభ, విజయ తదితర పత్రికల్లో ప్రచురితం అయ్యాయి. ఇదే టైమ్‌లో ఆకెళ్ల సూర్య వెంకటనారాయణ సినిమాల్లోకి వెళ్లారు. ఇదిలా ఉండగా.. 1980లో కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘శంకరాభరణం’ సినిమా విజయోత్సవాల్లో భాగంగా కాకినాడలో ఓ వేడుక ఏర్పాటు చేశారు. కె. విశ్వనాథ్‌కి ఓ స్వాగతగీతాన్ని రాయాల్సిందిగా సీతారామశాస్త్రిని కోరారు ఆకెళ్ల. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. ఆ తర్వాత ఓ సందర్భంలో కె. విశ్వనాథ్ పాల్గొన్న ఓ వేడుకలో సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను కె. విశ్వనాథ్ స్వాగత గీతంగా ఆలపిం చారు. విశ్వనాథ్‌కి ఈ పాట నచ్చింది. ఈ పాట ఎవరు రాశారో తెలుసుకోవాలని ప్రయత్నించగా ఆయనకు భరణి (సీతారామశాస్త్రి కలం పేరు) అని తెలిసింది. భరణి అనేది సీతారామశాస్త్రి కలం పేరు అని తెలుసుకున్న కె. విశ్వనాథ్ ఆయన్ను కలవాలనుకున్నారు. అంతేకాదు.. సీతారామశాస్త్రి రాసిన ‘గంగావతరణం’ పాటను తన సినిమా (బాలకృష్ణ హీరోగా నటించిన ‘జననీ జన్మభూమి)లో వినియోగించాలనుకుంటున్నట్లుగా కబురు పంపారు. ‘‘ఓ సందర్భంలో ‘గంగావతరణం’ పాటను మీ కోసమే రాశాను. ఇప్పుడు అది మీ చెంతకు చేరడం, మీ సినిమాలో వినియోగించుకోవాలనుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు సీతారామశాస్త్రి. అయితే ఈ సినిమా పాటల రచయిత విభాగంలో క్రెడిట్ కావాలని విశ్వనాథ్‌ని కోరారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్ ఓకే అన్నారు. తాను గురువుగా భావించే వేటూరి సుందర రామమూర్తి పేరు కింద తన పేరు ‘చేంబోలు సీతారామశాస్త్రి (భరణి)’ అనే టైటిల్‌ను సిల్వర్ స్క్రీన్‌పై చూసుకుని ఆనందపడిపోయారు. ఇంటి పేరుగా మారిన ‘సిరివెన్నెల’ ‘సిరివెన్నెల’ (1986)తో సీతారామశాస్త్రి సినిమా కెరీర్ పూర్తిగా మొదలైంది. చిత్రదర్శకుడు కె. విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ కథ చెప్పి ఓ పాట రాయాల్సిందిగా కోరారు. ‘విధాత తలపున..’ అని రాశారు సీతారామశాస్త్రి. విశ్వనాథ్‌కి చాలా బాగా నచ్చింది. అంతే.. ఈ చిత్రంలోని మొత్తం పాటలూ నువ్వే రాస్తున్నావని సీతారామశాస్త్రితో అన్నారు. అది మాత్రమే కాదు.. ఈ సినిమా పేరుతోనే విశ్వనాథ్ ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి అని టైటిల్ కార్డ్ వేశారు. అప్పటినుంచి ఇప్పటివరకూ పాటల వెన్నెలలు పంచారు ‘సిరివెన్నెల’. ఆ సినిమాలోని ‘విధాత తలపున’ పాటకు సిరివెన్నెల అల్మరాలో ‘నంది’ కూడా చేరింది. ఆ తర్వాత విశ్వనాథ్–సిరివెన్నెల కాంబినేషన్లో పలు సూపర్ హిట్ పాటలు వచ్చాయి. అందుకు శ్రుతిలయలు, స్వయం కృషి, స్వర్ణకమలం, సూత్రధారులు, ఆపద్బాంధవుడు, స్వాతికిరణం, శుభసంకల్పం లాంటి చిత్రాల్లోని పాటలు ఓ ఉదాహరణ. మూడు దశాబ్దాల్లో ... ఒక్క విశ్వనాథ్ అనే కాదు.. సిరివెన్నెల ప్రతి దర్శకుడికీ హిట్ పాటలు ఇచ్చారు. ‘శివ’ సినిమాలో రామ్‌గోపాల్ వర్మకు ‘బోటనీ పాఠముంది..’ అని రాశారు. అదే వర్మకు ‘క్షణక్షణం’లో ‘కో అంటే కోటి, జాము రాతిరి జాబిలమ్మా’, ‘గాయం’లో ‘అలుపన్నది ఉందా, నిగ్గ దీసి అడుగు’, నంది అవార్డు సాధించిన ‘స్వరాజ్యమవలేని’ పాటలు రాశారు. మరోవైపు కృష్ణవంశీకి ‘గులాబి’ కోసం ‘ఈవేళలో నీవు ఏం చేస్తు ఉంటావు..’, ‘ఏ రోజైతే∙చూశానో నిన్నూ..’ రాశారు. ‘సిరివెన్నెల’ రాసిన ‘జగమంత కుటుంబం నాది..’ పాట విని, ఆ పాట కోసమే సినిమా తీయాలని కృష్ణవంశీ తీసిన చిత్రం ‘చక్రం’. శివనాగేశ్వ రావు ‘మనీ’లో ‘చక్రవర్తికి వీధి బిచ్చగత్తెకీ, భద్రం బీ కేర్ ఫుల్ బ్రదరూ..’ అని రాశారు. ఒకటా.. రెండా వేల పాటలు రాశారు. మూడు దశాబ్దాల కెరీర్లో త్రివిక్రమ్, గుణశేఖర్, క్రిష్, రాజమౌళి ఇలా ఎందరో దర్శకులకు పాటలు రాశారు. విడుదలకు సిద్ధమవుతున్న ‘ఆర్ఆర్ఆర్’లో ‘దోస్తీ..’ పాట, ‘శ్యామ్ సింగరాయ్’లో రెండు పాటలు రాశారు. సిరివెన్నెల నుంచి ఇంకా ఎన్నో పాటలు వచ్చి ఉండేవి. ‘జగమంత కుటుంబం నాది... ఏకాకి జీవితం నాది’ అంటూ ఒంటరిగా వెళ్లిపోయారు ‘సిరివెన్నెల’. -
Cheena Kapoor: కొత్త దారి...కెమెరా చెప్పే కథలు
‘మనుషులే కాదు కెమెరా కూడా కథలు చెబుతుంది...వినే మనసు ఉంటే!’ అంటుంది చీనాకపూర్. దిల్లీలో ఇంజనీరింగ్ చేసిన చీనా లండన్‌లో ఐటీ ఇండస్ట్రీలో పనిచేసింది. అయితే ‘జీవితంలో ఉద్యోగం’ కాదు ‘ఉద్యోగమే జీవితం’లాంటి పరిస్థితి ఎదురైంది. కొత్తగా ఏదైనా చేయాలనిపించింది. అప్పుడు వచ్చిన ఆలోచనే కెమెరా చెప్పే కథలు. అయితే ఇవి ప్రకృతి అందాలను కళ్లకు కట్టే కథలు కాదు. కాల్పనిక కథలు అంతకంటే కాదు. కదిలించే నిజజీవిత కథలు. మానసిక సమస్య బాధితుల ఆశ్రమం నుంచి రెడ్‌లైట్ ఏరియాల వరకు ఎన్నో ప్రాంతాలకు వెళ్లింది చీనా. వారి జీవితాన్ని, దైన్యాన్ని ఫొటోల్లోకి తీసుకువచ్చింది. ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ చీనాకు మంచి పేరు తీసుకువచ్చింది. ఈ ప్రాజెక్ట్ ఆలోచన ఎలా వచ్చిందంటే... చీనా వాళ్ల బంధువుల కుర్రాడు యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి నుంచి అతడి తల్లి మానసిక పరిస్థితి సరిగా లేదు. కుటుంబ సభ్యులు ఆమెను ఒక ఆశ్రమంలో చేర్చి చేతులు దులుపుకున్నారు. 35 సంవత్సరాల నుంచి ఆమె అక్కడే ఉంటోంది. వచ్చి చూసే వారు లేరు. పలకరించేవారు లేరు. ఆమెను చూడడానికి ఒకసారి ఆశ్రమానికి వెళ్లింది చీనా. అక్కడ తన బంధువులాంటి ఎంతో మందిని చూసి చలించిపోయింది. ఆ సమయంలోనే ‘ఫర్గాటెన్ డాటర్స్’ ప్రాజెక్ట్ ఆలోచన వచ్చింది. ‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే’ అంటారు. ఆర్థిక విషయాలే కాదు ఆరోగ్య విషయాలు కూడా మానవసంబంధాల్లో కీలక పాత్ర పోషిస్తాయని ‘ఫర్గాటెన్ డాటర్స్’ చెప్పకనే చెబుతుంది. ఆరోగ్య సమస్యలు ఉంటే అయిన వారు కూడా కాని వారవుతారా! అలాంటి ఎంతోమంది బాధిత మహిళల దీనస్థితికి చిత్రరూపం ఇచ్చింది చీనా. రెడ్‌లైట్ ప్రాంతాలకు వెళ్లేముందు వద్దని వారించారు చాలామంది. అయితే చీనాకపూర్ వారి మాటలు వినలేదు. అక్కడ ఎన్నో దృశ్యాలు. కనిపించే దృశ్యం ఒకటి... కనిపించని దృశ్యం ఒకటి. వీటిని ఆమె కెమెరా పట్టుకోగలిగింది. ఎప్పుడూ ఎవరో వచ్చే ఆ ప్రాంతంలో ‘భద్రత’ లేదనే విషయం అర్థమైంది. అక్కడ ఉన్న ఎంతోమందితో తాను మాట్లాడింది. వారి కన్నీటికథలను డాక్యుమెంట్ చేసింది. ఇన్స్టాగ్రామ్ వేదికగా చీనా నిర్వహించే ‘మై షాట్ స్టోరీస్’కు ఎంతోమంది ఫాలోవర్స్ ఉన్నారు. తాను చేస్తున్న పనికి ‘యూనిసెఫ్’లాంటి అంతర్జాతీయ సంస్థల నుంచి ప్రశంసలు లభించాయి. డాక్యుమెంటరీ ఫొటోగ్రాఫర్‌గా చీనా కపూర్‌కు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. అయితే తన గుర్తింపు కంటే గుర్తింపుకు నోచుకోని బాధిత సమూహాల పైనే ఎక్కువ దృష్టి పెడుతోంది చీనా కపూర్. -
ప్రేమకు ద్రోహం చేయకూడదనుకున్నా..
ప్రేమ.. ఆకర్షణ.. తెలిసీ తెలియని వయస్సులో రెండు మనసుల మధ్య చిగురించే బంధం ఎన్నో మార్పులకు నాంది పలుకుతుంది. ఇళ్లలో తెలియనంత వరకు అది ప్రేమామృతం. తెలిసిన రోజు నుంచి ముళ్ల మీద ప్రయాణం. పెద్దలు ఒప్పుకుంటే ప్రణయం.. లేదంటే ప్రళయం. మూడునాళ్ల ముచ్చటగా ముగుస్తున్న ప్రేమలు కొన్నయితే.. మెప్పించి ఒప్పించి గెలుపుతీరాలకు చేరే ప్రేమలు ఇంకొన్ని. ఇందుకు భిన్నంగా సాగిందీ ప్రేమకథ. ఇరువురి పెద్దలూ అక్షింతలకు సిద్ధమైనా.. విధి కన్నుకుట్టింది. ఓ ప్రమాదంలో ప్రియుడు శాశ్వత దివ్యాంగుడు కాగా.. ఆ ప్రియురాలు మూడుముళ్ల సాక్షిగా అతని జీవితాన్ని కొత్త అడుగులు వేయించింది. ఆ ప్రేమపక్షుల గెలుపుతీరమే ఈ వారం ‘సండే స్పెషల్’. సోమందేపల్లి: సోమందేపల్లికి చెందిన చేనేత కార్మికుడు శిరివెళ్ల కుళ్లాయప్ప, నాగరత్నమ్మ దంపతులకు ముగ్గురు సంతానం. వీరిలో చిన్న కుమారుడు వినోద్. పిల్లలను బాగా చదివించి ప్రయోజకులను చేయాలని కుళ్లాయప్ప దంపతులు భావించారు. ఇందులో భాగంగా తమ సంపాదనలో కొంత మేర పిల్లల చదువులకు వెచ్చిస్తూ వచ్చారు. వినోద్‌ను బీటెక్ చదివించేందుకు హిందూపురంలోని ఓ కళాశాలలో చేర్పించారు. కలలు కల్లలు కాగా.. మరో ఏడాదిలో కోర్సు పూర్తి అవుతుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా జీవితంలో స్థిరపడాలని వినోద్ కలలు కన్నాడు. 2012లో కళాశాలకు ద్విచక్ర వాహనంపై బయలుదేరిన వినోద్.. కొద్ది దూరం వెళ్లగానే రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. తీవ్రంగా గాయపడటంతో ఉన్నత వైద్య చికిత్సల కోసం కుటుంబసభ్యులు వెంటనే బెంగళూరుకు తీసుకెళ్లారు. ప్రమాదంలో రెండు కాళ్లు పూర్తిగా దెబ్బతినడంతో శస్త్రచికిత్స చేసి తొలగించారు. వైద్య చికిత్సలు చేయించే ఆర్థిక స్థోమత కుళ్లాయప్పకు లేకపోవంతో వినోద్ స్నేహితులు, పలువురు దాతలు ముందుకొచ్చారు. దాదాపు రూ.10 లక్షల వరకు ఖర్చు పెట్టి ప్రాణాపాయం తప్పించినా.. జీవితం అవిటిదైంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్ కావాలనే కల కలగానే మిగిలిపోవడంతో వినోద్ కుంగిపోయాడు. ఆ సమయంలోనే హైదరాబాద్‌లోని అభయ ఫౌండేషన్ గురించి తెలుసుకుని అక్కడకు చేరుకున్నాడు. వినోద్ పరిస్థితిని గమనించిన ఫౌండేషన్.. రూ.10 లక్షల విలువ చేసే కృత్రిమ కాళ్లను 2013లో ఉచితంగా అమర్చి, వాటి సాయంతో నడిచేలా చేసింది. తోడుగా నిలిచిన ప్రియురాలు.. వినోద్, సుజాత ఇద్దరూ ఎనిమిదో తరగతి చదువుతున్నప్పటి నుంచి స్నేహితులు. ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. కళాశాల స్థాయికి చేరుకోగానే వీరి మధ్య ప్రేమ చిగురించింది. విషయం తెలుసుకున్న ఇరువైపుల కుటుంబసభ్యులు ఆమోదం తెలుపుతూ చదువుల అనంతరం పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారు. ఊహించని ప్రమాదంతో వినోద్ వైకల్యం బారిన పడడంతో పరిస్థితులు తారుమారయ్యాయి. అవిటి వాడితో జీవితం సాఫీగా సాగదని, పెళ్లి వద్దని సుజాతకు బంధువులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా సుజాత మనసు మారలేదు. ఎవరెన్ని చెప్పినా అతనితోనే తన జీవితమంటూ భీష్మించింది. వీరి ప్రేమను హర్షిస్తూ 2015లో స్నేహితులు దగ్గరుండి పెళ్లి జరిపించారు. తర్వాత వీరు బెంగళూరుకు మకాం మార్చారు. అక్కడ ఓ కాలేజీలో అడ్మిన్‌గా రూ.10వేల జీతానికి వినోద్ చేరాడు. ఎంఎస్సీ పూర్తి చేసిన సుజాత సైతం రూ.13 వేల జీతంతో ఓ కళాశాలలో లెక్చరర్‌గా చేరారు. కుటుంబ పోషణ పోను మిగిలిన మొత్తాన్ని దాచుకుని రూ.3 లక్షల వరకూ ఆదా చేసుకున్నారు. ఈ మొత్తంతో సొంతూరిలో ఏదైనా వ్యాపారం చేసుకుని జీవించాలనుకుని 2018లో సోమందేపల్లికి తిరిగి వచ్చేశారు. అండగా నిలిచిన తల్లిదండ్రులు.. కోటి ఆశలతో సొంతూరికి వచ్చిన కొడుకు, కోడలికి వినోద్ తల్లిదండ్రులు కుళ్లాయప్ప, నాగరత్నమ్మ అండగా నిలిచారు. సోమందేపల్లిలో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ పెట్టాలనే కొడుకు ఆలోచనకు చేయూతనిచ్చారు. షాప్ ఏర్పాటుకు రూ.8 లక్షల పెట్టుబడి అవసరం కాగా, తాముంటున్న ఇంటిని బ్యాంకులో తాకట్టు పెట్టి రూ.5 లక్షలను వినోద్ తల్లిదండ్రులు సమకూర్చడంతో ఫ్లెక్సీ ప్రింటింగ్ షాప్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ రెండేళ్లలో అన్ని విధాలుగా వ్యాపారం కలిసి వచ్చింది. వారి కృషి ఫలించి పెట్టుబడులు కాస్తా రూ.30లక్షలకు చేరుకున్నాయి. ప్రస్తుతం దూరవిద్య ద్వారా వినోద్ డిగ్రీ చేస్తూ మరోవైపు ఫ్లెక్సీలు.. పెళ్లి పత్రికలు, రబ్బర్ స్టాంపులు, విజిటింగ్ కార్డులు, బ్యాంకు లావాదేవీలు జరుపుతూ వచ్చే సంపాదనతో కుటుంబాన్ని పోషిస్తున్నాడు. సుజాత, వినోద్ దంపతులకు చేతన్, కార్తికేయన్ అనే ఇద్దరు పిల్లలు సంతానం. ప్రేమకు ద్రోహం చేయకూడదనుకున్నా.. టెన్త్ పూర్తి అయిన తర్వాత మా స్నేహం కాస్త ప్రేమగా మారింది. వినోద్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు చాలా బాధపడ్డాను. ఆ సమయంలో పెళ్లి చేసుకోవద్దని కొందరు బలవంతం పెట్టారు. అయితే కష్టాల్లో ఉన్నప్పుడు అండగా ఉండాలని, ద్రోహం చేయకూడదని భావించా. ఇష్టపూర్వకంగానే వినోద్‌ను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడెంతో సంతోషంగా ఉన్నాం. – సుజాత, వినోద్ భార్య, సోమందేపల్లి చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న డెలివరీ డ్రైవర్ దీన గాథ అచ్చెన్న ‘రాజ్యం’లో అరాచకం -
ఆర్జీవీ అదిరిపోయే సమాధానం
సినీ ఇండస్ట్రీలో సంచలనాలకు మారుపేరు, వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయిన దర్శకుడు రామ్‌గోపాల్ వార్మ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘పవర్ స్టార్’. ఈ లాక్డౌన్ కాలంలో క్లైమాక్స్, నగ్నం వంటి చిత్రాలను ఓటీటీ వేదికగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అమృత, మారుతీరావుల కథ ఆధారంగా మర్డర్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. మర్డర్‌తో పాటు ‘కరోనా వైరస్’, ‘ది మ్యాన్ హూ కిల్డ్ గాంధీ’, ‘కిడ్నాప్ ఆఫ్ కత్రినా కైఫ్’ చిత్రాలను చేస్తున్నారు. తాజాగా ‘పవర్ స్టార్’ పేరుతో ఓ చిత్రం చేయబోతున్నట్లు ఆదివారం ట్విటర్ వేదికగా ఆర్జీవీ ప్రకటించి మరో సంచలనానికి తెరలేపారు. (ఆర్జీవీ ‘మర్డర్’: మరో పోస్టర్ వైరల్) అయితే ఆర్జీవీ దగ్గర కథలు అయిపోవడంతోనే నిజ జీవిత కథలు, సంఘటనలపై పడ్డారని పలువురు విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ అదిరిపోయే సమాధానం ఇచ్చారు. ‘నా కాలేజీలో జరిగిన కథనే శివ. గాయం, సర్కార్, సత్య, కంపెనీ, రక్తచరిత్ర ఇవన్నీ నిజ జీవిత కథల ఆధారంగానే తెరకెక్కించిన చిత్రాలు. నా మొత్తం సినీ కెరీర్లో 70 శాతం చిత్రాలు సమాజంలో జరిగిన ఘటనలు, నిజ జీవిత అనుభవాల ఆధారంగానే తెరకెక్కించాను. మరికొన్ని ఇంగ్లీష్ నవలలు, ఫారిన్ చిత్రాల నుంచి కాపీ కొట్టాను’ అంటూ ఆర్జీవీ కుండబద్దలు కొట్టి చెప్పారు. ప్రస్తుతం ఆర్జీవీ సమాధానం నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. (వర్మ కొత్త సినిమా: పవర్ స్టార్ ఇతనే) Here is the STAR of my new film POWER STAR ...This shot was taken when he visited my office ..Any resemblance to any other person is incidentally coincidental and intentionally unintentional.. pic.twitter.com/geulQ4YAj8 — Ram Gopal Varma (@RGVzoomin) June 28, 2020 -
లయ తప్పిన బతుకులు
-
తెరపై హాట్‌టాపిక్... వంగవీటి రంగా
నిజ జీవిత కథాంశాలకు, బయోపిక్‌లకు ప్రస్తుతం ఉత్తరాదినా, దక్షిణాదినా గిరాకీ. విజయవాడ కేంద్రంగా ఒకప్పుడు కోస్తా జిల్లాల రాజకీయాలను శాసించిన స్వర్గీయ వంగవీటి రంగా నిజ జీవిత కథతో ధవళ సత్యం ఓ సినిమా చేయనున్నారు. ఆయన 28 ఏళ్ల క్రితం ఇలాంటి నేపథ్యంతోనే ‘చైతన్యరథం’ సినిమా చేశారు. కాగా, ఇప్పుడు తాజా చిత్రాన్ని రంగ మిత్ర మండలి సమర్పణలో ఎమ్ఎస్ఆర్ క్రియేషన్స్ పతాకంపై మంచాల సాయి సుధాకర్ నాయుడు నిర్మించనున్నారు. దర్శకుడు మాట్లాడుతూ - ‘‘ఆంధ్రా రాబిన్‌హుడ్ లాంటి రంగా హత్యకు గురైనప్పుడు రాష్ట్రం అల్లకల్లోలమైంది. వాస్తవఘటనలతో చిత్రం నిర్మిస్తున్నాం. పూర్తి వివరాలను ఈ 23న విజయవాడలో తెలుపుతాం’’ అన్నారు. ‘‘రంగా సామాజిక వర్గానికి చెందిన ఓ పవర్ఫుల్ స్టార్‌తో ఆ పాత్ర చేయించడానికి ఒప్పిస్తున్నాం’’ అని నిర్మాత తెలిపారు. కాగా దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇప్పటికే ‘వంగవీటి’ అనే టైటిల్‌తో చిత్రం నిర్మిస్తున్నట్లు ప్రకటించడం విశేషం. -
అమ్మ అయిన రేష్మీమీనన్
ప్రతి స్త్రీ మాతృప్రేమను చవి చూసే తరుణం వ స్తుంది. నటి రేష్మీమీనన్ ప్రస్తుతం అలాంటి తల్లి ప్రేమను అనుభవిస్తున్నారు. అదేంటి ఆమె తల్లి అవ్వడం ఏమిటీ? ఇటీవలేగా నటుడు బాబీ సింహాతో ప్రేమ కలాపాలు అంటూ ప్రచారం హోరెత్తింది అంటారా? నిజమే. అది రియల్ లైఫ్ కథ. ఇది రీల్‌లైఫ్ కహానీ. ఇంతకీ విషయం ఏమిటంటే రేష్మీమీనన్ భయమా ఇరుక్కు అనే చిత్రంలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇందులో ఆమె ఒక బిడ్డ కు తల్లిగా నటించడం విశేషం. సంతోష్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని వసంతం ఫిలింస్ సంస్థ నిర్మిస్తోంది. కోవైసరళ, నన్కడవుల్ రాజేంద్రన్, విజయ్ టీవీ.జగన్, లోల్లుసభ జీవా, భరణీ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి పి.జవహర్ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర వివరాలను ఈయన తెలుపుతూ ఇది వినోదం మేళవిం చిన వైవిధ్యభరిత థ్రిల్లర్ కథా చిత్రం అని చెప్పా రు. వివాహానంతరం భార్యాభర్తల మధ్య ప్రేమను ఆవిష్కరించే చిత్రం భయమా ఇరుక్కు అని తెలిపారు. ఇందులో రేష్మీమీనన్ బిడ్డకు తల్లిగా నటించారని చెప్పారు. వీరిద్దరితోపాటు నాన్‌కడవుల్ రాజేంద్రన్ పాత్ర మొదటి నుంచి చివరి వరకూ పయనించే ముఖ్యమైన పాత్రగా ఉంటుందన్నారు. అదేవిధంగా కోవైసరళ స్వామీజీగా కీలక పాత్రలో నటిస్తున్నారని పేర్కొన్నారు. చిత్రం తొలి ఘట్టం షూటింగ్‌ను కేరళలో పూర్తి చేసినట్లు, రెండో ఘట్టం షూటింగ్‌ను చెన్నైలో చిత్రీకరిస్తునట్లు వెల్లడించారు. ఇందులో ఒక ఇల్లు ముఖ్య భూమికగా ఉంటుందన్నారు. కేరళలో జనసంచారానికి దూరంగా ఉన్న ఒక ఇంటిలో కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లు చెప్పారు. ఎలాంటి రవాణా వసతులు లేని ఆ ఇంటిని చేరడానికి బోటులో మూడు గంటల పాటు ప్రయాణం చేయాల్సి వచ్చేదన్నారు. -
ఆమె జీవితకథలో నటించాలని ఉంది!
నాటి తరంలో బాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన అందగత్తెల్లో పర్వీన్ బాబీ ఒకరు. గ్లామరస్ పాత్రలకు చిరునామాగా నిలిచారామె. ఈ హాట్ బ్యూటీతో నటించడానికి అప్పట్లో హీరోలు పోటీపడేవారట. దాన్నిబట్టి పర్వీన్‌కు ఎంత క్రేజ్ ఉండేదో ఊహించుకోవచ్చు. ఇప్పుడు పర్వీన్ బాబీ గురించి చెప్పడానికి ఓ కారణం ఉంది. ఇటీవల ఓ సందర్భంలో ఈ హాట్ లేడీ గురించి శ్రద్ధాకపూర్ నాన్‌స్టాప్‌గా మాట్లాడారు. పర్వీన్ బాబీ అంటే తనకెంతో అభిమానమని శ్రద్ధాకపూర్ పేర్కొన్నారు. ఏ స్థాయి అభిమానం అంటే... ఎవరైనా పర్వీన్ బాబీ జీవితం ఆధారంగా సినిమా తీస్తే, అందులో నటించాలని శ్రద్ధాకపూర్ అనుకుంటున్నారట. ఈ విషయం గురించి శ్రద్ధాకపూర్ చెబుతూ - ‘‘పర్వీన్ మా ఇంటి పక్కనే ఉండేవారు. ఆమె కనిపిస్తే చాలు అలా చూస్తూ ఉండిపోవాలనిపించేది. గొప్ప అందగత్తె. ఆమె అందాన్ని మాటల్లో వర్ణించలేం. చిన్న వయసులోనే బోల్డన్ని పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్నారు. వృత్తి జీవితంలో తిరుగులేదనిపించుకున్న పర్వీన్ వ్యక్తిగతంగా మాత్రం అంత ఆనందంగా గడపలేదనిపిస్తోంది. ఎందుకో తెలియదు కానీ, పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా మిగిలిపోయారు. చివరికి, అనారోగ్యంతో ఆమె జీవితం విషాదాంతంగా ముగిసింది’’ అని చెప్పుకొచ్చారు. -
ఒక రొమాంటిక్ క్రైం కథ
ప్రేమించడమే కాదు.. ఆ ప్రేమను కాపాడుకోవడం కూడా యువతకు ఓ పరీక్షే. తెలిసీ తెలియని వయస్సులో ఆకర్షణకు లోనవడం.. అది ప్రేమో కాదో తెలుసుకోలేక ఆమెను ఎలాగైనా తన గుప్పిట్లో పెట్టుకోవాలనే తాపత్రంతో యువత పెడదోవ పడుతోంది. ఇటీవల కాలంలో వచ్చిన ‘ఒక రొమాంటిక్ క్రైం కథ’ను పోలిన నిజ జీవిత కథ కర్నూలు నగరంలో వెలుగుచూసింది. ప్రేమించిన అమ్మాయిని ఎలాగైనా దక్కించుకునేందుకు.. ఆమె తల్లిదండ్రుల వద్ద డబ్బున్న అబ్బాయిలా కనిపించేందుకు ఓ ఇంజనీరింగ్ విద్యార్థి దొంగగా మారి కన్నవారి కలలను నిలువునా కూల్చేశాడు. కర్నూలు: జల్సాలు చేయాలి... ప్రియురాలి వద్ద డబ్బున్న కుర్రాడిలా కనిపించాలనే కోరికతో చోరీలకు పాల్పడిన ఓ భావి ఇంజినీర్ కటకటాల పాలయ్యాడు. ఉన్నత చదువు చదివి తమకు ఆసరాగా నిలుస్తాడని భావించిన తల్లిదండ్రుల ఆశలను నీరుగార్చాడు. తుగ్గలి మండలం గుడిసెగుప్పరాళ్ల గ్రామానికి చెందిన చౌటప్పా చిరంజీవి అలియాస్ చిరంజీవి నంద్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. చదువుకునే సమయంలో డోన్ పట్టణానికి చెందిన ఓ యువతితో పరిచయం పెరిగి ప్రేమగా మారింది. ఆమెతో కలిసి జల్సాలు చేయడానికి డబ్బుల్లేక మొదట చిన్న చిన్న నేరాలు చేశాడు. వారి స్నేహం అమ్మాయి యువతి తల్లిదండ్రులకు తెలియజేయడంతో ఒక సందర్భంలో గొడవ కూడా జరిగింది. ఎలాగైనా ఆ యువతినే పెళ్లి చేసుకోవాలని పట్టుదలతో డబ్బు, నగల కోసం దొంగగా మారి పోలీసుల వలలో చిక్కాడు. కర్నూలు నగరంలోని వివిధ ప్రాంతాల్లో పది ఇళ్లల్లో చోరీలకు పాల్పడి ప్రియురాలి కోసం బంగారు నగలను ఓ చోట పాతిపెట్టాడు. పోలీసుల విచారణలో విషయం వెలుగు చూసింది. కొత్తబస్టాండ్‌కు ఎదురుగా ఉన్న యుకాన్ షాపీ కాంప్లెక్స్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న చిరంజీవిని అదుపులోకి తీసుకుని ఎస్పీ ఆకే రవిక్రిష్ణ ఎదుట హాజరు పరిచారు. ఈ సందర్భంగా సోమవారం మధ్యాహ్నం వ్యాస్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెళ్లడించారు. నిందితుడి నుంచి రూ.11 లక్షలు విలువ చేసే 41 తులాల బంగారు ఆభరణాలు, నాలుగు కంప్యూటర్లు, రూ.31 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసులను ఛేదించి, సొమ్ములు రికవరీ చేసినందుకు సీఐలు ములకన్న, ప్రవీణ్‌కుమార్, రంగనాయకులు, మధుసూధన్‌రావు, ఎస్ఐలు నాగలక్ష్మయ్య, తులసి, నాగప్రసాద్, ఏఎస్ఐ భాస్కర్, సిబ్బంది, రంగారావు, శివశంకర్, రమణ, శ్రీనివాసులు, రాజ్‌కుమార్, మద్దీశ్వర్ తదితరులను ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు. దొంగల కోసం సబ్ డివిజన్ల వారీగా ప్రత్యేక బృందాలు.. దొంగతనాల నివారణ కోసం సబ్ డివిజన్ల వారీగా ప్రత్యేక పోలీస్ బృందాలను రంగంలోకి దింపినట్లు ఎస్పీ వెళ్లడించారు. ప్రజలు కూడా పోలీసులకు సహకరించి అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు సమాచారం అందించాలని సూచించారు. వేసవి కాలమైనందున రాత్రి వేళల్లో ఇళ్లకు తాళాలు వేసి ఇళ్లపైన మిద్దెలపైన పడుకునేటప్పుడు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇళ్లకు తాళాలు వేసి ఇతర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విలువైన ఆభరణాలను బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలన్నారు. చిరంజీవి నేరాల చిట్టా... * వెంకటరమణ కాలనీలోని రిటైర్డ్ ఉద్యోగి దేవదానం పవర్ సొల్యూషన్స్ అనే కార్యాలయాన్ని నిర్వహిస్తున్నాడు. ఈ ఏడాది జనవరి 7వ తేదిన కార్యాలయంలో చొరబడి కంప్యూటర్లను చోరీ చేశాడు. * సీతారామనగర్లో నివాసముంటున్న పి.నాగరాజు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులను కలిసి వేరే ఊరికి వెళ్లాడు. గతేడాది జూన్ 13న రాత్రి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేశాడు. * కస్తూరినగర్‌లో నివాసముంటున్న ఎన్.రామాంజనేయులు ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో బంధువుల ఇళ్లకు వెళ్లారు. గతేడాది మార్చి 31వ తేదిన రాత్రి ఇంట్లోకి చొరబడి బంగారు, వెండి ఆభరణాలను మూట కట్టుకుని ఉడాయించాడు. * పుష్పావతి నగర్లో నివాసముంటున్న అబ్రార్ ఫర్హానా ఇంట్లో గతేడాది నవంబర్ 20వ తేదిన సెల్‌ఫోన్, ట్యాబ్, బంగారు వస్తువులు చోరీ చేశాడు. ట్యాబ్‌ను వేరే వ్యక్తులకు విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. దాని ఐఎంఈ నంబర్ ఆధారంగానే పోలీసులు నిందితున్ని గుర్తించారు. * గతేడాది జులై 1వ తేదిన ధనలక్ష్మినగర్‌లోని నాగభూషణరావు ఇంట్లో చొరబడి రూ.20 వేలు నగదు అపహరించాడు. ఈ ఏడాది జనవరి 4వ తేదిన కిసాన్‌నగర్‌లో నివాసముంటున్న మద్దయ్య ఇంట్లో చొరబడి రూ.10 వేలు లూటీ చేశాడు. * ఈ ఏడాది జనవరి 18న మహాలక్ష్మినగర్‌లో నివాసముంటున్న డాక్టర్ శారద ఇంట్లో చొరబడి రూ.48 వేలు నగదును మూట కట్టుకుని ఉడాయించాడు. * ఈ ఏడాది మార్చి 12వ తేదిన ధనలక్ష్మినగర్‌లో నివాసముంటున్న పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ ఆకుమల్లె శేషుఫణి ఇంట్లో 15 తులాల బంగారు నగలు చోరీ చేశాడు. * ఈ ఏడాది జనవరి 8న బాలాజీ నగర్లో నివాసముంటన్న వెంకటేశ్వర్లు ఇంట్లో రాత్రి ఆరు తులాల బంగారు నగలు చోరీ చేశాడు. * గతేడాది అక్టోబర్ 7వ తేదిన బాలాజీ నగర్లో నివాసముంటున్న కానిస్టేబుల్ మాబుసాహెబ్, శిరీషా దంపతులు ఇంట్లో చొరబడి 11 తులాల బంగారు నగలు అపహరించాడు.