Recruitment Test
-
ప్రాంతీయభాషల్లోనూ సీఏపీఎఫ్ పరీక్ష
న్యూఢిల్లీ: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం నిర్వహించే పరీక్షలపై కేంద్ర హోంశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నియామక పరీక్షను హిందీ, ఇంగ్లిష్తో పాటుగా మరో 13 ప్రాంతీయ భాషల్లో నిర్వహించడానికి అనుమతినిచ్చింది. కేంద్ర సాయుధ బలగాల్లో స్థానిక యువత భాగస్వామ్యాన్ని, ప్రాంతీయ భాషల్ని ప్రోత్సహించడానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నట్టుగా శనివారం విడుదల చేసిన అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. హిందీ, ఇంగ్లిష్తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, ఒరియా, ఉర్దూ, పంజాబీ, మణిపురి, కొంకణి భాషల్లో కానిస్టేబుల్ పరీక్షలు నిర్వహిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నిర్ణయాన్ని ప్రశంసించారు. ఇదొక కొత్త శకానికి నాంది పలుకుతుందని ట్వీట్ చేశారు. ‘‘మన దేశ యువత ఆకాంక్షలు నెరవేరేలా ఈ నిర్ణయం ఉంది. ఎవరైనా తాము కన్న కలలు సాకారం చేసుకోవడానికి భాష అడ్డంకిగా మారకూడదన్న కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి ఈ నిర్ణయమే ఒక నిదర్శనం.’’ అని ప్రధాని ట్వీట్లో పేర్కొన్నారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీసు ఫోర్సెస్ (సీఏపీఎఫ్) పరిధిలోకి సెంట్రల్ రిజర్వ్ పోలీసు ఫోర్స్ (సీఆర్పీఎఫ్), బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీసు (ఐటీబీపీ), సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ), నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్ఎస్జీ) వస్తాయి. సీఆర్పీఎఫ్ రిక్రూట్మెంట్ కోసం నిర్వహించే పరీక్షల్లో తమిళం కూడా చేర్చాలంటూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ లేఖ రాసిన నేపథ్యంలో ఈ నిర్ణయం వెలువడింది. -
పంచాయతీ సెక్రటరీ..పట్టు సాధించే మార్గమిదీ!
పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్.. రాష్ట్రంలో నిర్వహిస్తున్న మరో భారీ రిక్రూట్మెంట్ టెస్ట్. దీనికి దాదాపు 5,67,798 మంది దరఖాస్తు చేసుకున్నారు. మెయిన్ ఎగ్జామినేషన్‌కు ఎంపికవ్వాలంటే ఇందులో చూపే ప్రతిభే కీలకం. ఏదైనా డిగ్రీ అర్హతగా పేర్కొన్న ఈ పరీక్షకు.. పీజీతో పాటు బీటెక్ లాంటి సాంకేతిక డిగ్రీలు పొందిన అభ్యర్థులు సైతం దరఖాస్తు చేసుకున్నారు. వీరి సంఖ్య 30 శాతం వరకు ఉంటుందని అంచనా. అంతేకాకుండా గ్రూప్–2, గ్రూప్–1 స్థాయి పరీక్షలకు సిద్ధమవుతున్న వారు సైతం దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇలా అన్ని నేపథ్యాల నుంచి పోటీ నెలకొన్న తరుణంలో స్క్రీనింగ్ టెస్ట్‌లో రాణించడానికి నిపుణుల సూచనలు... ప్రణాళికతో.. పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్‌కు అందుబాటులో ఉన్న సమయం దాదాపు 40 రోజులు. స్క్రీనింగ్ టెస్ట్‌లో పేర్కొన్న సిలబస్ ప్రకారం మొత్తం 13 అంశాలున్నాయి. వీటిలో పరస్పర అనుసంధానం ఉన్నవాటిని ఒకే సమయంలో.. మిగతా అంశాలను వేర్వేరు సమయాల్లో చదివే విధంగా అభ్యర్థులు ప్రణాళిక రూపొందించుకోవాలి. సిలబస్‌లో ఎనిమిది నుంచి పదో అంశం వరకు పంచాయతీ రాజ్ వ్యవస్థకు సంబంధించినవి ఉన్నాయి. వీటిని ఒక క్రమంలో చదివే విధంగా టైమ్ ప్లాన్ రూపొందించుకోవాలి. పదకొండు నుంచి పదమూడో అంశం వరకు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, మహిళా సాధికారత తదితర అంశాలున్నాయి. వీటిని ఒక క్రమంలో చదవాలి. ఒకటి నుంచి నాలుగో అంశం వరకు కరెంట్ అఫైర్స్, బేసిక్ జనరల్ సైన్స్, ఆధునిక భారతదేశ చరిత్ర, ఆర్థికాభివృద్ధి తదితరాలున్నాయి. ఆరో అంశంలో భారత రాజ్యాంగం, ఏడో అంశంలో ఆంధ్రప్రదేశ్ విభజన, పరిపాలన, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, న్యాయ పరంగా ఎదురైన సమస్యలకు సంబంధించినవి ఉన్నాయి. వీటికి సంబంధించిన ముఖ్యాంశాలను అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి ఐదో అంశంలో పేర్కొన్న లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబి లిటీ, డేటా ఇంటర్‌ప్రిటే షన్‌కు ప్రత్యేక సమయం కేటాయించాలి. ఇలా మొత్తం పదమూడు అంశాలను వర్గీకరించుకొని.. ప్రతిరోజూ కనీసం ఎనిమిది నుంచి పది గంటలు చదివేలా టైం టేబుల్ రూపొందించుకోవాలి. ప్రాధాన్యం ఇలా ప్రిపరేషన్ పరంగా అభ్యర్థులు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశాల క్రమం.. జాతీయ స్థాయిలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పాటుకు దారితీసిన పరిస్థితులు. 73, 74వ రాజ్యాంగ సవరణలు పంచాయతీరాజ్ వ్యవస్థలో విధులు–విధానాలు కమిటీలు – సిఫార్సులు మహిళా సాధికారత, స్వయం సహాయ సంఘాల ఏర్పాటు. గ్రామీణాభివృద్ధి పథకాలు (డ్వాక్రా, డ్వామా, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం) రాష్ట్ర స్థాయిలో అమలవుతున్న పథకాలు, వాటి అమలుకు సంబంధించి నిధుల కేటాయింపు గణాంకాలు. వీటిని అధ్యయనం చేయడం ద్వారా పదమూడు అంశాల్లో నాలుగింటికి సంబంధించి పూర్తి అవగాహన పొందే అవకాశం ఉంటుంది. జనరల్ స్టడీస్ విషయంలో.. సమకాలీనంగా ప్రాధాన్యం సంతరించుకున్న జాతీయ, అంతర్జాతీయ అంశాలపై దృష్టి సారించాలి. చరిత్రకు సంబంధించి ఆధునిక చరిత్ర అని స్పష్టంగా పేర్కొన్న నేపథ్యంలో మొదటి స్వాతంత్య్ర పోరాటం (సిపాయిల తిరుగుబాటు) నుంచి స్వాతంత్య్ర సాధన వరకు ముఖ్యమైన ఉద్యమాలు, తేదీలు, నేతృత్వం వహించిన వ్యక్తుల గురించి తెలుసుకోవాలి. ఎకానమీకి సంబంధించి పంచవర్ష ప్రణాళికలపై దృష్టి పెట్టాలి. అదే విధంగా ఇటీవల కాలంలో ఆర్థికంగా చేపట్టిన సంస్కరణల గురించి తెలుసుకోవాలి. రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగ రచనా కమిటీ, పీఠిక, ఆర్టికల్స్ గురించి తెలుసుకోవాలి. ముఖ్యంగా గ్రామీణాభివృద్ధి, సమానత్వ హక్కుకు సంబంధించిన ఆర్టికల్స్, వాటిలో పొందుపర్చిన అంశాలను ఔపోసన పట్టాలి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్ కోసం.. పదో తరగతి స్థాయిలోని మ్యాథమెటిక్స్ బేసిక్స్‌పై అవగాహన పొందడమే కాకుండా ప్రాక్టీస్ చేయడం ముఖ్యం. పునర్విభజన సమస్యలపై ప్రత్యేకంగా పంచాయతీ సెక్రటరీ స్క్రీనింగ్ టెస్ట్‌లో అభ్యర్థులు ప్రధానంగా దృష్టి సారించాల్సిన అంశాలు.. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన, దీనికి సంబంధించిన నేపథ్యం, ఆ తర్వాతి కాలంలో (గత మూడేళ్లలో) ఏర్పడిన పరిస్థితులు, అమలు చేస్తున్న పథకాలు. రాష్ట్ర బడ్జెట్లో గ్రామీణాభివృద్ధి కోసం కేటాయించిన నిధులు, కొత్త పథకాల గురించి ప్రత్యేక దృష్టితో అధ్యయనం చేయాలి. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన తదనంతర పరిణామాలు, పర్యవసానాల గురించి మెయిన్ ఎగ్జామినేషన్‌లో పొందుపర్చిన సిలబస్‌ను ఆధారంగా చేసుకుంటూ చదవడం వల్ల స్పష్టతతో ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కారణం.. మెయిన్ ఎగ్జామినేషన్‌లో ఈ విభాగానికి సంబంధించి ఏయే అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారో సిలబస్‌లో పేర్కొనడమే (ఉదాహరణకు ఉమ్మడి సంస్థల విభజన, పునర్నిర్మాణం, ఉద్యోగుల విభజన – స్థానికత అంశాలు తదితరాలు). రివిజన్ సులువుగా.. అభ్యర్థులు ప్రిపరేషన్ క్రమంలోనే కొన్ని వ్యూహాలతో రివిజన్‌ను సులభతరం చేసుకోవచ్చు. ఇందుకోసం అనుసరించాల్సిన వ్యూహాలు.. కమిటీలు – ఏర్పాటైన సంవత్సరాలు– నేతృత్వం వహించిన వ్యక్తులు – సిఫార్సులను ఒక టేబుల్‌గా రూపొందించుకోవాలి. ముఖ్యమైన రాజ్యాంగ అధికరణలు – వాటిలో పేర్కొన్న అంశాలను ఒక జాబితాగా రూపొందించుకోవాలి. చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, ఉద్యమాలతో కూడిన జాబితా తయారుచేసుకోవాలి. ఏకానమీ విషయంలో పంచవర్ష ప్రణాళికల లక్ష్యాలు, ప్రాధాన్య అంశాలు, సాధించిన వృద్ధిరేటు తదితరాలను వరుసగా రాసుకోవాలి. ఆర్థిక సర్వేలో పేర్కొన్న ముఖ్య గణాంకాలు, సిఫార్సులను ఒకచోట రాసుకోవాలి. గ్రామీణాభివృద్ధి పథకాల జాబితా మొత్తాన్ని ఒక చోట పొందుపర్చుకోవాలి. కరెంట్ అఫైర్స్‌కు సంబంధించి ముఖ్య సదస్సులు – తీర్మానాలు; విదేశీ పర్యటనలు, ఒప్పందాలు, అవార్డులు – గ్రహీతలు తదితరాలను ఒక జాబితాగా రాసుకోవాలి. స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ ప్రశ్నలు మార్కులు సమయం జనరల్ స్టడీస్ 150 150 150 పరీక్ష తేదీ: ఏప్రిల్ 23, 2017 సమయం: ఉదయం 10:00 నుంచి 12:30 -
పాత ప్రతిపాదనలకు కొత్త రూపం
డీఎస్సీ-2014 పోస్టుల మంజూరులో లోపించిన పారదర్శకత ఉన్నత పాఠశాలలను వేధిస్తున్న స్కూల్ అసిస్టెంట్ల కొరత జిల్లాలో భర్తీ చేయనున్న పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులే అధికం 8వ తరగతికి అప్ గ్రేడ్ చేసిన యూపీ స్కూళ్లకు పోస్టులు శూన్యం గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ నియామకాలకు ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన డీఎస్సీ-2014 ప్రక్రియ పాత ప్రతిపాదనలకు కొత్త రూపం కల్పించినట్లు ఉంది. రాష్ట్రస్థాయిలో భర్తీ చేసేందుకు నిర్ణయించిన 9061 పోస్టుల్లో జిల్లాకు 907 పోస్టులు ఉన్న విషయం తెలిసిందే. గత సెప్టెంబర్ 5వ తేదీకి ముందుగానే జిల్లా విద్యాశాఖ నుంచి వెళ్లిన ప్రతిపాదనలను పరిగణలోకి తీసుకుని ఆయా పోస్టులను ప్రభుత్వం ఖరారు చేసింది. డీఎస్సీ స్థానంలో ప్రవేశపెట్టిన టీచర్స్ ఎలిజిబులిటీ టెస్ట్ కం టీచర్స్ రిక్రూట్మెంట్ టెస్ట్ (టెట్ కం టీఆర్టీ) నోటిఫికేషన్లో మూడు నెలల క్రితం ఖాళీల ఆధారంగా గుర్తించిన పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. జిల్లాలో భర్తీ చేయనున్న 907 పోస్టుల్లో ఎస్జీటీ పోస్టులు 682 ఉన్నాయి. మిగిలిన వాటిలో 159 స్కూల్ అసిస్టెంట్స్, 43 భాషా పండిట్, 23 పీఈటీ పోస్టులున్నాయి. ప్రాథమిక పాఠశాలల్లో విద్యాబోధనకు అనుగుణంగా ఎస్జీటీ పోస్టులను ప్రకటించినప్పటికీ ఉన్నత పాఠశాలల్లో విద్యాబోధనకు అవసరమైన స్కూల్ అసిస్టెంట్ పోస్టులు నామ మాత్రంగా మంజూరయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 340 ప్రభుత్వ, జెడ్పీ ఉన్నత పాఠశాలల్లో తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్, హిందీ పాఠ్యాంశాల బోధనకు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు లేరు. విద్యాహక్కు చట్టం అమలు ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 240 ప్రాథమికోన్నత పాఠశాలలను 8వ తరగతికి అప్‌గ్రేడ్ చేసిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులను మంజూరు చేయాల్సిన బాధ్యతను విస్మరించింది. ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8వ తరగతిని చేర్చిన ప్రభుత్వం పాఠ్యాంశాలను బోధించు ఉపాధ్యాయ పోస్టులను మంజూరు చేయడంలో నిర్లక్ష్యం వహించింది. టెన్త పరీక్షలకు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టులను బోధించేందుకు ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో లేరనే విషయం జిల్లా విద్యాశాఖ లెక్కలే చెబుతున్నాయి. గుర్తింపు లేని పాఠశాలల్లో చేర్చడం వలన తలెత్తే ఇబ్బందులను గమనిస్తున్న తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. రెండు నెలల కాలంలో జిల్లాలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 6 నుంచి 10వ తరగతి వరకూ విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయి. 10వ తరగతి పరీక్షలకే ప్రభుత్వ ఉన్నత పాఠశాలల నుంచి దాదాపు 30 వేల మంది హాజరవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఇవేవీ పట్టించుకోకుండా నాలుగు నెలల క్రితం సిద్ధం చేసిన ఖాళీల జాబితానే ప్రభుత్వం టెట్ కం టీఆర్టీ నోటిఫికేషన్లో పొందు పర్చింది. డిసెంబర్ 3వ తేదీన దరఖాస్తుల స్వీకరణతో మొదలు కానున్న ఉపాధ్యాయ నియామక ప్రక్రియ వచ్చే ఏడాది మే 28న వెలువడే ఫలితాల విడుదల వరకూ కొనసాగనుంది. ఈ క్రమంలో ప్రస్తుతం మంజూరు చేసిన పోస్టులు ద్వారా కొత్త ఉపాధ్యాయులు జూన్ నెలలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరిస్తారు. తదుపరి వచ్చే రెండేళ్ల వ్యవధిలో ప్రభుత్వం మళ్లీ ఉపాధ్యాయ నియామకాలు చేపట్టే అవకాశం లేదు. ఫలితంగా ఉన్నత పాఠశాలల్లో స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీగానే కొనసాగే పరిస్థితులు కనిస్తున్నాయి. -
టీచర్‌పోస్టుల జాతర
* జిల్లాకు 907 పోస్టులు మంజూరు * డీఎస్సీ ప్రక్రియను టెట్ కంటీఆర్టీగా మార్పు * డిసెంబర్ 3 నుంచి దరఖాస్తుల స్వీకరణ * వచ్చే ఏడాది మేలో రాత పరీక్షలు గుంటూరు ఎడ్యుకేషన్ : ఎన్నాళ్లుగానో ఊరిస్తూ వచ్చిన ఉపాధ్యాయుల నియూమకానికి ఎట్టకేలకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. గత సెప్టెంబర్ ఐదో తేదీన డీఎస్సీ-2014 ప్రక్రియ రెండున్నరల నెలల అనంతరం మొదలుకాబోతోంది. ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించి ఇప్పటి వరకూ కొనసాగించిన టెట్, డీఎస్సీ ప్రక్రియలను రద్దుచేసిన ప్రభుత్వం వాటి స్థానంలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ కం రిక్రూట్మెంట్ టెస్ట్(టెట్ కం టీఆర్టీ)ను ప్రవేశ పెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలో 907 పోస్టులు భర్తీ కానున్నాయి. స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు పరిమితమైన బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అర్హత కల్పిస్తామని గత సెప్టెంబర్ 5న జారీ చేయాల్సిన డీఎస్సీ నోటిఫికేషన్ ప్రక్రియను వాయిదా వేసిన ప్రభుత్వం దీనిపై ఎటూ తేల్చలేదు. బీఈడీ అభ్యర్థులకు ఎస్జీటీ పోస్టుల్లో అర్హత కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించకపోవడంతో చివరికి పాత విధానంలోనే బీఈడీలతో స్కూల్ అసిస్టెంట్స్, డీఈడీలతో ఎస్జీటీ పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించి జీవో విడుదల చేసింది. ఇందులో భాగంగా డిసెంబర్ 3వ తేదీ నుంచి జనవరి 17వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరించనుంది. వచ్చే ఏడాది మే 9, 10, 11 తేదీల్లో రాత పరీక్షలు నిర్వహించి జూన్ 28న ఫలితాలు విడుదల చేయనుంది. ఎస్జీటీ పోస్టులకు 180 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 200 మార్కులుగా ఖరారు చేశారు. కేటగిరీల వారీగా పోస్టులు.. జిల్లాకు మంజూరైన పోస్టుల్లో ఎస్జీటీ తెలుగు-672, ఉర్ధూ-10, స్కూల్ అసిస్టెంట్ విభాగంలో తెలుగు-51, గణితం-16, భౌతికశాస్త్రం-4, జీవశాస్త్రం-17, ఇంగ్లిష్-10, సాంఘికశాస్త్రం-52, సంస్కృతం-1, భాషా పండిట్ ఉర్దూ-1, తెలుగు-15, సంస్కృతం ఒక పోస్టు, పీఈటీలు 23 పోస్టుల చొప్పున ఉన్నాయి.