Redmi Pro
-
మార్కెట్లోకి రెడ్మి నోట్ 6 ప్రో
న్యూఢిల్లీ: చైనాకి చెందిన ఎలక్ట్రానిక్స్ సంస్థ షావోమీ తాజాగా భారత మార్కెట్లో రెడ్మి నోట్ 6 ప్రో ఫోన్‌ను ఆవిష్కరించింది. ఇందులో 4జీబీ ర్యామ్, 64జీబీ మెమరీ ఉండే ఫోన్ ధర రూ.13,999 కాగా, 6జీబీ + 64జీబీ వేరియంట్ ధర రూ. 15,999గా ఉంటుంది. నవంబర్ 23న (శుక్రవారం) మి.డాట్‌కామ్, ఫ్లిప్‌కార్ట్, మి హోమ్ స్టోర్స్‌లో బ్లాక్ ఫ్రైడే సేల్ సందర్భంగా రూ.1,000 డిస్కౌంట్‌పై ఇవి లభిస్తాయి. ముందు రెండు (12 ఎంపీ+5ఎంపీ), వెనుక రెండు (20ఎంపీ+2ఎంపీ) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాలతో మొత్తం నాలుగు కెమెరాల సెటప్ ఇందులో ఉంటుంది. 6.26 అంగుళాల డిస్ప్లే, క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 636 ఆక్టా కోర్ ప్రాసెసర్, 64 జీబీ ఇంటర్నల్ మెమరీ, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్స్ ఈ ఫోన్ ప్రత్యేకతలు. 4జీబీ, 6జీబీ ర్యామ్‌లలో రెడ్మి నోట్ 6 ప్రో లభిస్తుందని షావోమీ వైస్ ప్రెసిడెంట్ మను జైన్ తెలిపారు. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ క్షీణించడంతో తమ ఉత్పత్తులపై ధరలపరంగా ఒత్తిడి ఉంటోందని ఆయన చెప్పారు. తమ ఫోన్లు, పవర్ బ్యాంకులను భారత్‌లోనే తయారు చేస్తున్నప్పటికీ, అవసరమైన ముడి సరుకు, కీలకమైన ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ అసెంబ్లీ (పీసీబీఏ)ని డాలర్లలోనే కొనుగోలు చేయాల్సి వస్తుండటమే ఇందుకు కారణమన్నారు. -
షావోమి ‘నోట్‌బుక్’లు వస్తున్నాయ్...
చైనాలో ‘మి నోట్‌బుక్ ఎయిర్’ ఆవిష్కరణ బీజింగ్: చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘రెడ్మి ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లో ఆవిష్కరించింది. అలాగే ‘మి నోట్‌బుక్ ఎయిర్’ ప్రొడక్ట్‌తో ల్యాప్‌టాప్ విభాగంలోకి కూడా ప్రవేశించింది. చైనీయులు ‘రెడ్మి ప్రొ’ స్మార్ట్‌ఫోన్‌ను సంస్థ వెబ్సైట్ (మి.కామ్), హోమ్స్టోర్లలో ఆగస్ట్ 6 నుంచి కొనుగోలు చేయవచ్చు. ఇక ‘మి నోట్‌బుక్ ఎయిర్’ ఆగస్ట్ 2 నుంచి అందుబాటులోకి వస్తుంది. రెడ్మి ప్రొ: ఇందులో 5.5 అంగుళాల స్క్రీన్, రెండు రియర్ కెమెరాలు (13 ఎంపీ, 5 ఎంపీ), మీడియాటెక్ హీలియో ఎక్స్25 ప్రాసెసర్, 4,050 ఎంఏహెచ్ బ్యాటరీ, టైప్-సీ యూఎస్బీ పోర్ట్, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, ఫింగర్‌ప్రింట్ స్కానర్ వంటి తదితర ప్రత్యేకతలు ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్‌ఫోన్ 3 జీబీ, 4 జీబీ అనే రెండు ర్యామ్ ఆప్షన్లలో లభించనుంది. భారత్‌లో దీని ప్రారంభ ధర దాదాపు రూ. 15,000గా ఉండొచ్చని అంచనా. నోట్‌బుక్ ఎయిర్: ఇందులో 13.3 అంగుళాల స్క్రీన్, ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఎస్ఎస్డీ, జీఫోర్స్ 940 ఎంఎక్స్ గ్రాఫిక్స్ కార్డ్, విండోస్ 10 ఓఎస్, రెండు యూఎస్బీ 3.0 పోర్ట్స్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ తెలిపింది. ధర రూ. 51,400గా ఉండొచ్చని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. -
"రెడ్ మి ప్రో" టీజర్ వచ్చేసింది
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షియోమి, కొత్తగా మార్కెట్లోకి లాంచ్ చేయబోతున్న రెడ్ మి ప్రో ఎలా ఉంటుందో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఉత్సాహవంతులైన యూజర్ల కోసం షియోమి, రెడ్ మి ప్రో టీజర్ ను విడుదల చేసేసింది. చైనీస్ టెక్ కంపెనీ వైబోలో తన టీజింగ్ ను ప్రారంభించింది. ఓలెడ్ డిస్ ప్లే, మీడియా టెక్స్ 10-కోర్ ప్రాసెసర్ తో రెడ్ మి ప్రో మార్కెట్లోకి రాబోతున్నట్టు షియోమి హింట్ ఇచ్చింది. జూలై 27న చైనాలో ఈ ఫోన్ లాంచింగ్ కు సిద్ధమైంది. మొదటి టీజర్ లో ఓలెడ్ పింగ్ వంట చేస్తున్న ప్రముఖ చెఫ్ లియు షి షి దృశ్యాలు, దీంతో తర్వాత రాబోతున్న స్మార్ట్ ఫోన్ ఓలెడ్ డిస్ ప్లే అని తెలుస్తోంది. ఈ డిస్ ప్లేతో బ్యాక్ లైట్ లేకుండానే అంకెలను, టైమ్ ను చూసుకునే వీలుంటుందట. అదేవిధంగా రెండో టీజర్ ద్వారా రెడ్ మి ప్రో ప్రాసెసర్, డెకా కోర్ ప్రాసెసర్ అని హింట్ ఇచ్చేసింది. అయితే ఈ టీజర్ లో సైజు, రెసుల్యూషన్ గురించి ఎలాంటి వివరాలను విడుదల చేయలేదు. గత కొంతకాలంగా చక్కర్లు కొట్టిన లీక్ లో ఈ ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్ డీ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలోతో రన్ కాబోతుందని సమాచారం. యూనిబాడీ మెటల్ డిజైన్ తో ఇది రాబోతుందట. అయితే ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుక వైపు మిస్ అయి, ముందు వైపు ఉంటుందని ముందస్తు లీక్ లు వెల్లడించాయి. బ్లూటూత్, 4జీ ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ, వై-ఫై 802.11ఏసీ, జీపీఎస్ లు లీకేజీలోని రెడ్ మి ప్రో ఫీచర్లు.. మరి ఈ లీక్ లన్నీ నిజమవుతూ రెడ్ మి ప్రో విడుదల అవుతాదో లేదో జూలై 27వరకు వేచి చూడాల్సిందే.