Refilled
-
మిస్డ్ కాల్‌తో గ్యాస్ కనెక్షన్
న్యూఢిల్లీ: ఎల్పీజీ కనెక్షన్‌దారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ) శుభవార్త చెప్పింది. కేవలం మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా ఎల్పీజీ కొత్త కనెక్షన్ తీసుకోవడం, ఎల్పీజీæ రీఫిల్ వంటి సదుపాయాలు పొందేలా సదుపాయం తీసుకొచ్చింది. కొత్త కస్టమర్లు, పాత కస్టమర్లు ఈ సదుపాయాన్ని 8454955555కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా పొందొచ్చని ఐఓసీ చైర్మన్ ఎస్ఎం వైద్య సోమవారం వెల్లడించారు. దీనితో పాటు ఒక సిలిండర్ కలిగిన వారు మరో సిలిండర్ పొందే సదుపాయాన్ని (డబుల్ బాటిల్ కనెక్షన్) ఇంటివద్దకే తీసుకొచ్చేందుకు కొత్త ప్రణాళిక రచించారు. 14.2 కేజీల సిలిండర్ ఉన్నవారు బ్యాక్అప్ కోసం మరో 5కేజీల సిలిండర్ ఐచ్ఛికాన్ని ఎంచుకోవచ్చని సూచించారు. -
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త!?
ఎల్పీజీ సిలిండర్ వినియోగదారులకు కేంద్రం శుభవార్త తెలిపింది. ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని, అక్కడి నుంచే గ్యాస్ సిలిండర్ పొంద వచ్చని ప్రకటించింది. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా... ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌కి సంబంధించి వినియోగదారులు ఎదుర్కొంటున్న కష్టాల్ని ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించారు. దీనికి కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ స్పందిస్తూ... ‘ ఇకపై వంట గ్యాస్ వినియోగదారులు తమకు నచ్చిన డిస్టిబ్యూటర్ ను ఎంపిక చేసుకోవచ్చని, వారి వద్ద నుంచే సిలిండర్ ను ఫిల్ చేయించుకోవచ్చు’ అని ప్రకటించారు. పైలట్ ప్రాజెక్టుగా ఇప్పటి వరకు సిలిండర్ వినియోగదారులు ఒక్క డిస్టిబ్యూటర్ వద్ద మాత్రమే గ్యాస్ ఫిల్ చేయించుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచైనా గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే వెసులుబాటును పైలట్ ప్రాజెక్టుగా చండీగడ్, కోయంబత్తూర్, గుర్గావ్, పూణే, రాంచీలలో ఇప్పటికే అమలు చేస్తున్నారు. పార్లమెంటులో కేంద్ర పెట్రోలియం, సహజ ఇంధన వనరుల శాఖ మంత్రి రామేశ్వర్ చేసిన ప్రకటనతో ఈ పథకం దేశమంతటా అమలు చేస్తారని తెలుస్తోంది. అయితే ఈ పథకం ఎప్పుడు అమలు చేస్తారనే దానిపై మరికొద్ది రోజుల్లో క్లారిటీ రానుంది. మొత్తంగా కేంద్రం తాజా నిర్ణయం గ్యాస్ వినియోగదారులకు ఊరట కలిగించింది. -
బండ బాదుడు
సాక్షి,సిటీ బ్యూరో: మహానగరంలో ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగదారులు నిలువు దోపిడీకి గురవుతున్నారు.. సిలిండర్ డోర్ డెలివరీ సమయంలో రీఫిల్ నిర్ణీత ధరకంటే అదనంగా వసూలు చేస్తున్నారు. వినియోగదారులు సిలిండర్ ధరపై డెలివరీ బాయ్స్‌కు అదనపు చెల్లించేది చిల్లర రూపాయిలు కదా.. అనుకొని తేలికగా తీసుకుటుండంతో అది కాస్తా డిమాండ్‌గా మారింది. ఫలితంగా అదనపు వసూళ్లు డెలివరీ బాయ్స్‌కు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం సిలిండర్ రీఫిల్ ధర రూ.667.50 ఉండగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి బలవంతంగా వసూలు చేస్తోంది రూ.690లు. అంటే నిర్ణీత ధర కంటే రూ.22.50 ఎక్కువగా వసూలు చేస్తున్నారు. ఇందు కోసమే గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు బిల్లుల వసూళ్లలో స్వైపింగ్ మిషన్ జోలికి వెళ్లడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు తూట్లు గ్యాస్ ఏజెన్సీలు నిబంధనలకు తూట్లు పొడుస్తున్నాయి. రీఫిల్ డోర్ డెలివరీ భారాన్ని డెలివరి బాయ్స్‌పై వదిలేసి చేతులు దులుపుకుంటున్నారు. ఫలితంగా చమురు సంస్థలు నిర్దేశించిన ఎల్పీజీ వంట గ్యాస్ నిర్ణీత ధర అమలు కావడం లేదు. గ్యాస్ డిస్ట్రిబ్యూటర్లు రీఫిల్ ధర, గ్యాస్, డోర్ డెలివరీ చార్జీ (రవాణా, హమాలీ, నిర్వహణ)లతో కలుపుకొని బిల్లింగ్ చేసి వినియోగదారులకు సరఫరా చేయాల్సి ఉంటుంది. చమురు సంస్థల నిర్ధేశించిన ధరనే బిల్లింగ్ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్లు వినియోగదారులకు సిలిండర్ సరఫరా భారాన్ని డెలివరీ బాయ్స్‌పై పెట్టి చేతులు దులుపుకుంటున్నారు. వాస్తవంగా డెలివరీ బాయ్స్‌కు ఏజెన్సీలు కనీస వేతనాలను అమలు చేయాల్సి ఉండగా కొందరు నామమాత్రంగా వేతనాలు అందిస్తున్నారు, మరికొందరు సిలిండర్ డెలివరీపై కమీషన్ మాత్రమే ఇస్తున్నారు. ఫలితంగా డెలివరీ బాయ్స్ వినియోగదారుల నుంచి అదనంగా వసూలు చేయడం సర్వ సాధారణంగా మారింది. నిబంధన ప్రకారం బాయ్స్ డోర్ డెలివరీ సమయంలో ప్రత్యేక పరికరంతో రీఫిల్ నిర్ణీత బరువు పరిమాణాన్ని వినియోగాదారులకు చూపించాలి. అయితే ఈ విధానం ఎక్కడా అమలవుతున్న దాఖలాలు కానరావడం లేదు. కేవలం బిల్లింగ్‌పై అదనపు బాదుడు ధ్యాస తప్ప బరువు చూపించాలన్నా.. నిబంధనలను డెలివరీ బాయ్స్ మరిచి పోయారు. నిబంధనలివీ. వినియోగదారుడు ఆన్లైన్లో గ్యాస్ రీఫిల్ బుక్ చేసుకున్న తర్వాత బిల్లింగ్ చేసి డోర్ డెలివరీ చేయాలి ఏజెన్సీ నుంచి 5 కిలో మీటర్ల వరకు ఉచితంగా డోర్ డెలవరీ ఇవ్వాలి. ఏజెన్సీ నుంచి 6 కిలో మీటర్ల నుంచి 15 కిలో మీటర్లు ఉంటే రవాణ చార్జీల పేరిట రూ.10 వసూలు చేయాలి. 16 –30 కిలో మీటర్లు దూరం ఉంటే రవాణా చార్జీలు పేరిట రూ. 15 వసూలు చేయాలి వినియోగదారుడు సిలిండర్ రీఫిల్‌ను గ్యాస్ కంపెనీ గోదాముకు వెళ్లి తీసుకుంటే బిల్లులో రూ.8 మినహాయించాలి, గ్రేటర్లో వంటగ్యాస్ వినియోగదారులు ః 29.18 లక్షలు ఎల్పీజీ గ్యాస్ ఏజెన్సీలు ః 115 ప్రతిరోజు గ్యాస్ బుకింగ్ ః 80 వేలు ప్రతిరోజు సిలిండర్ సరఫరా ః 60 వేలు డెలివరీ బాయ్స్ ః 1150 ప్రస్తుతం వంటగ్యాస్ నిర్ణీత ధర ః రూ. 667.50 వినియోగదారుడు చెల్లించాల్సింది ః రూ. 667.50 డెలివరీ బాయ్స్ వసూలు చేస్తోంది ః రూ. 690 వినియోగదారుడిపై అదనపు భారం ః రూ.22.50