Regulators
-
దిగ్గజ బ్యాంక్ మూసివేత.. ప్రపంచ దేశాల్లో కలకలం!
అంతర్జాతీయ సంస్థల నుంచి స్టార్టప్ కంపెనీల్లో కలవరం మొదలైంది. ప్రపంచ వ్యాప్తంగా టెక్ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టే అమెరికాకు చెందిన సిలికాన్ వ్యాలీ బ్యాంకు (Silicon Valley Bank)ను ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (Federal Deposit Insurance Corporation) మార్చి 10న షట్‌డౌన్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది. శాంతాక్లారా కేంద్రంగా శాంతాక్లారా కేంద్రంగా సిలికాన్ వ్యాలీ బ్యాంక్ (svb).. బ్యాకింగ్ కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. బ్యాంక్ డిపాజిట్లు, ఖజానా నిర్వహణ సంస్థలకు ( treasury management) లోన్స్, ఆన్లైన్ బ్యాకింగ్, విదేశీ మారక వాణిజ్యం (foreign exchange trade)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా వినియోగదారులకు సేవలు అందిస్తుంది. ఎస్వీబీ మూసివేతకు కారణం ఎస్వీబీ షట్ డౌన్‌కు కారణంగా తన పేరెంట్ సంస్థ ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ చేసిన నిర్వాకమేనని తెలుస్తోంది. ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్ పోలియాలో 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలు,2.25 బిలియన్ల షేర్లను విక్రయించినట్లు ప్రకటన చేసిందని బ్లూమ్‌బెర్గ్ నివేదించింది.ఎస్వీబీ బ్యాంకు సైతం నికర వడ్డీ ఆదాయం క్షీణించినట్లు నివేదించింది. అతిపెద్ద 16వ బ్యాంక్ ఎస్వీబీ అమెరికాలోనే అతి పెద్ద 16వ బ్యాంక్. కాలిఫోర్నియా, మసాచుసెట్స్లలో 17 బ్రాంచీల నుంచి వినియోగదారులకు సేవలందిస్తుంది. బ్యాంక్‌ను ఎఫ్డీఐసీను షట్‌డౌన్ చేసిందన్న వార్తల నేపథ్యంలో ఎస్వీబీ ఆస్తుల విలువ మంచులా కరిగి 209 బిలియన్ల డాలర్ల నుంచి 175.4 బిలియన్ డాలర్లకు పరిమితమైంది. 80 బిలియన్ డాలర్ల నష్టం ఎస్వీబీ ప్రకటన రావడంతో మదుపర్లు బ్యాంకులో చేసిన డిపాజిట్లను వెనక్కి తీసుకున్నారు. కష్టకాలంలో అండగా నిలవాల్సిన వెంచర్ క్యాపిటలిస్టులు బ్యాంకులో ఉన్న పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని,డబ్బును ఉపసంహరించుకోవాలని తమ పోర్ట్‌ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశాయి. వెరసి ఎస్వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు 35 ఏళ్లలోనే అత్యంత దారుణంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60శాతం షేర్లు క్షీణించడంతో 80 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. స్టార్టప్‌లకే నష్టం సిలికాన్ వ్యాలీ బ్యాంక్ టెక్నాలజీ స్టార్టప్‌లకు రుణాలు ఎక్కువ ఇచ్చింది. ఈ పరిణామంతో ఇతర బ్యాంకులపై చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయని చెబుతున్నారు. చదవండి👉 కేంద్రం కీలక నిర్ణయం.. పాన్, ఆధార్ కార్డ్ ఉన్న వారికి గుడ్ న్యూస్! -
నియంత్రణ సంస్థలు పక్కాగా ఉన్నాయి
న్యూఢిల్లీ: భారత నియంత్రణ సంస్థలు ఎంతో కచ్చితత్వంతో, కఠినంగా పనిచేస్తుంటాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం మార్కెట్లలో నెలకొన్న పరిణామాలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లలో అనిశ్చితికి దారితీశాయా? అంటూ గౌతమ్ అదానీ గ్రూప్ షేర్ల పతనం గురించి ఓ వార్తా సంస్థ అడిగిన ప్రశ్నకు మంత్రి స్పందించారు. దశాబ్దాలుగా ఎన్నో పాఠాలు నేర్చుకున్నామని చెబుతూ.. నియంత్రణ సంస్థలు మన మార్కెట్‌ను చక్కని, సరైన స్థితిలో నిలబెట్టినట్టు పేర్కొన్నారు. ముందున్నట్టే భారత్ ఇక మీదటా చక్కని నియంత్రణలతో కూడిన ఫైనాన్షియల్ మార్కెట్‌గా కొనసాగుతుందన్నారు. ‘‘అంతర్జాతీయంగా ఎక్కువగా చర్చించుకుంటున్న ఓ సంఘటన భారత మార్కెట్లు ఎంత గొప్పగా నిర్వహించబడతాయనే దానికి నిదర్శనం కాబోదు’’అని మంత్రి పేర్కొన్నారు. అమెరికాకు చెందిన హిండెన్‌బర్గ్ సంస్థ అదానీ గ్రూపు కంపెనీలు, షేర్లపై ఆరోపణలతో ఓ నివేదిక విడుదల చేయడం తెలిసిందే. ఈ నివేదిక తర్వాత అదానీ గ్రూపు కంపెనీలు ఈ వారంలో ఊహించని విధంగా భారీ నష్టాలు చూశాయి. దీంతో ఆర్థిక మంత్రి దీనిపై స్పష్టత ఇచ్చారు. మెరుగ్గా బ్యాంకింగ్ వ్యవస్థ భారత బ్యాంకింగ్ వ్యవస్థ నేడు ఎంతో సౌకర్యంగా ఉందని మంత్రి సీతారామన్ స్పష్టం చేశారు. నికర నిరర్థక రుణాలు (ఎన్పీఏలు) చాలా కనిష్ట స్థాయికి దిగొచ్చినట్టు చెప్పారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్టు మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేబినెట్ ఆమోదం పొందిన పెట్టుబడుల ఉపసంహరణ, ఆస్తుల నగదీకరణను ముందుకు తీసుకెళతామని ప్రకటించారు. -
కొల్లేరుకు మహర్దశ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: స్వచ్ఛ కొల్లేరు దిశగా సర్కారు అడుగులు వేస్తుంది. కొల్లేరువాసులకు కలగా ఉన్న రెగ్యులేటర్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో పనులు చకచకా జరుగుతున్నాయి. ఉప్పుటేరులో మూడు ప్రాంతాల్లో రెగ్యులేటర్లు నిర్మించి ఉప్పునీరు కొల్లేరులో కలవకుండా అడ్డుకట్ట వేయనున్నారు. దీనికి సంబంధించి సాంకేతికపరమైన లాంఛనాలన్నీ పూర్తికాగా టెండర్ల ఆహ్వానానికి రంగం సిద్ధమైంది. ఉప్పునీటి ముప్పు తొలగించేలా.. ఉప్పునీటితో కొల్లేరు సరస్సు కలుషితమవుతోంది. సరస్సుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. దీంతో కొల్లేరుపై రెగ్యులేటర్లు నిర్మించి సరస్సును పరిరక్షించాలనే డిమాండ్ సుదీర్ఘకాలంగా ఉంది. 2004లో దివంగత వైఎస్సార్ హయాంలో రెగ్యులేటర్ల నిర్మాణంపై దృష్టి పెట్టారు. అయితే ఆయన మరణానంతరం ఈ అంశం అటకెక్కింది. ఈ నేపథ్యంలో సీఎం వైఎస్ జగన్ కొల్లేరు పరిరక్షణపై దృష్టి సారించారు. రెగ్యులేటర్ల నిర్మాణానికి జలవనరుల శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయగా ప్రభుత్వం ఆమోదం తెలిపిది. భూగర్భ జలాలు పెంచేలా.. సముద్ర నీటిమట్టం నుంచి కొల్లేరు ఐదు మీటర్ల ఎత్తులో ఉంది. ఆటుపోట్ల నేపథ్యంలో సముద్రం నీరు కాలువల ద్వారా సరస్సులోకి చేరుతుంది. దీంతో సుమారు 10 మండలాల్లో వేలాది ఎకరాలు ఉప్పునీటి కయ్యలుగా మారుతున్నాయి. రైతులు సాగుకు ఇబ్బంది పడుతున్నారు. ఈ క్రమంలో కొల్లేరుపై మూడుచోట్ల రెగ్యులేటర్లను నిర్మిస్తే ఉప్పు నీటిని కట్టడి చేయడం ద్వారా కొల్లేరుకు 113 కాలువల ద్వారా మంచినీరు చేరుతుంది. తద్వారా భూగర్భ జలాలు పెరగడంతో పాటు స్వచ్ఛ కొల్లేరు సాకారం కానుంది. 13 నుంచి టెక్నికల్ బిడ్ ఈనెల 13 నుంచి 27 వరకు టెక్నికల్ బిడ్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నారు. సాంకేతిక బిడ్లను స్వీకరించి 28న టెక్నికల్ బిడ్‌ను ఫైనల్ చేసి 29న ప్రైజ్ బిడ్‌ను ఖరారు చేయనున్నారు. అనంతరం రెండు వారాల్లో మిగిలిన అధికారిక ప్రక్రియ పూర్తి చేసి టెండర్లు కేటాయించనున్నారు. రెగ్యులేటర్లు ఎక్కడెక్కడంటే.. ఆకివీడు మండలం దుంపగడప గ్రామంలో ఉప్పుటేరుపై 10.560 కిలోమీటర్ల వద్ద రూ.87 కోట్లతో రెగ్యులేటర్ నిర్మాణం. మొగల్తూరు మండలం పడతడిక గ్రామంలో 1.400 కిలోమీటరు వద్ద రూ.136.60 కోట్లతో బ్రిడ్జి కమ్ లాక్ నిర్మాణం. మొగల్తూరు మండలం మోళ్లపర్రు వద్ద 188.40 కోట్లతో బ్రిడ్జి కమ్ లాక్ నిర్మాణం. ఈ మూడు రెగ్యులేటర్ల నిర్మాణానికి రూ. 412 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అధికారులు ఖరారు చేసిన డీపీఆర్, ప్రతిపాదనలను గతనెల 23న స్టేట్ లెవెల్ టెక్నికల్ కమిటీ ఆమోదించింది. అనంతరం సిద్ధం చేసిన టెండర్ కాపీని జ్యూడి షియరీ ప్రివ్యూకు పంపి అక్కడి అనుమతితో టెండర్ల ప్రక్రియను ఖరారు చేశారు. -
అలీబాబాకు మరో ఎదురుదెబ్బ
బీజింగ్ : ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థికసాంకేతిక సంస్థ యాంట్ గ్రూప్, చైనాలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. దేశంలోని ఇంటర్నెట్ రంగంలో గుత్తాధిపత్య వ్యతిరేక పద్ధతులపై పెరిగిన పరిశీలనల మధ్య తన వ్యాపారాలను సరిదిద్దుకోవాలని, నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ఉండాలని రెగ్యులేటరీ సంస్థలు ఆదేశించాయి. ఈ మేరకు విచారణకు ఆదేశించాయి.ఐపీఓ నిలిపివేత ద్వారా ఇబ్బందులు పడ్డ ప్రముఖ పారిశ్రామికవేత్త అలీబాబా, యాంట్ గ్రూప్ వ్యవస్థాపకుడు జాక్ మాకు మరోసారి భారీ షాక్ తగిలింది. ఫైనాన్షియల్ హోల్డింగ్ కంపెనీని స్థాపించి, తగినంత మూలధనాన్ని కలిగి ఉండాలని రెగ్యులేటర్లు యాంట్ గ్రూప్‌ను ఆదేశించారు. కార్పొరేట్ పాలనను మెరుగుపరిచేటప్పుడు, దాని వ్యాపారాల నియంత్రణ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుంటూ, యాంట్ గ్రూప్ దాని చెల్లింపుల మూలానికి తిరిగి రావాలని, లావాదేవీల చుట్టూ పారదర్శకతను పెంచుకోవాలని, అన్యాయమైన పోటీని నిషేధించాలని వారు చెప్పారు. రెగ్యులేటరీ అవసరాలకు అనుగుణంగా ఉంటామని, రిస్క్ మేనేజ్మెంట్, నియంత్రణను మెరుగుపరుస్తామని, అవసరమైన దిద్దుబాట్లు చేయడానికి వర్కింగ్ గ్రూపును ఏర్పాటు చేస్తామని యాంట్ గ్రూప్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. గత నెలలో ప్రపంచంలోనే అతిపెద్ద ఐపీవో (37 బిలియన్ డాలర్ల) ప్లాన్ చేసింది కంపెనీ. షాంఘైతో పాటు, హాంకాంగ్ స్టాక్‌మార్కెట్లలో డెబ్యూ లిస్టింగ్‌కు ప్రయత్నించింది. అయితే ప్రభుత్వ ఆదేశాల మేరకు దీన్ని అడ్డుకున్న సంగతి తెలిసిందే. ఈ షాక్ నుంచి కోలుకోకముందే యాంట్ గ్రూపులో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో విచారణకు ఆదేశించారు. తాజా నిర్ణయంతో కంపెనీ షేరు 6శాతం పడిపోయింది. మార్కెట్ నిబంధనలకు విరుద్దంగా మోనోపలిగా కంపెనీ వ్యవహరిస్తుందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. పోటీతత్వం లేకుండా కస్టమర్లకు ఆప్షన్ లేకుండా చేస్తోందనేది ప్రధాన ఆరోపణ. దీనిపై చైనా ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరిస్తోంది. మరోవైపు అలీబాబా మాతృ సంస్థ యాంట్ మనదేశంలో కూడా భారీగా పెట్టుబడులు పెట్టింది. బిగ్ బాస్కెట్, స్విగ్గీ వంటి కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
భారతీయురాలికి బంగారు కత్తెర
వాషింగ్టన్: అమెరికాలో కాలంచెల్లిన నియంత్రణల రద్దులో కీలక పాత్ర పోషించిన ఇండో–అమెరికన్ నయోమి జహంగీర్ రావ్‌కు తగిన గుర్తింపు లభించింది. శ్వేతసౌధంలో జరిగిన కార్యక్రమంలో అధ్యక్షుడు ట్రంప్ ఆమెకు బంగారు కత్తెరను బహూకరించారు. 1960ల నాటి, ప్రస్తుత నియంత్రణలను కలిగిన ప్రతులను చుట్టిన రెడ్ టేప్(కఠిన నియంత్రణలకు సూచిక)ను ట్రంప్ ఈ కత్తెరతోనే కత్తిరించి రావ్‌కు అందించారు. 2017 జూలై 18 నుంచి శ్వేతసౌధ సమాచార, నియంత్రణ వ్యవహారాల హెడ్‌గా వ్యవహరిస్తున్న రావ్ పాత నిబంధనలు, నియంత్రణల తొలగింపుకు కృషిచేశారు. ట్రంప్ ప్రతి కొత్త నియంత్రణకు 22 పాత వాటిని ఎత్తివేశారు. సంస్కరణలతో సుమారు రూ.51925 కోట్లు ఆదా అవుతాయని భావిస్తున్నారు. -
ఆ కారణాలను శాంసంగ్ కనిపెట్టేసింది..
సుదీర్ఘకాల విచారణ అనంతరం ఎట్టకేలకు దక్షిణ కొరియా దిగ్గజం శాంసంగ్ తన గెలాక్సీ నోట్7 పేలుళ్ల కారణాలు కనిపెట్టేసింది. గెలాక్సీ నోట్7 పేలుడుకు గల మూల కారణాలను తాము కనుగొన్నామని శాంసంగ్ రిపోర్టు చేసింది. ఈ కారణాల రిపోర్టును కొరియా టెస్టింగ్ ల్యాబోరేటరీకి, ఇతర రెగ్యులేటరీ సంస్థలకు శాంసంగ్ సమర్పించింది. అయితే ఈ వివరాలను ఇంకా ప్రజలకు వెల్లడించలేదు. పేలుళ్ల కారణాలను కనుగొన్నాం, వాటిని రెగ్యులేటరీకి సమర్పించామని మాత్రమే ఈ దక్షిణ కొరియా దిగ్గజం పేర్కొంది. గెలాక్సీ నోట్ 7 పేలుళ్లతో శాంసంగ్ తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. గెలాక్సీ నోట్7 ఫోన్లలన్నింటినీ రీకాల్ చేసి సమస్యను పునరుద్ధరించుకుని మళ్లీ కొత్తగా మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. అయినప్పటికీ ఆ సంస్థను పేలుళ్ల సమస్య వెన్నాడుతూనే ఉంది. దీంతో తమ ఫోన్లను వెనక్కిచేయలంటూ కంపెనీ ప్రకటించింది. పేలుళ్లకు అసలు మూల కారణాలేమిటో తెలుసుకోవడం కోసం ఓ ప్రత్యేక ఇన్వెస్టిగేషన్ టీమ్‌ను కంపెనీ నియమించింది. ప్రస్తుతం అంతర్గత విచారణ పూర్తయిందని, ఈ రిపోర్టులను బయట ల్యాబోరేటరీలకు పంపించామని శాంసంగ్ వెల్లడించింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా గెలాక్సీ నోట్7 ఫోన్‌ను శాంసంగ్ ప్రవేశపెట్టింది. కానీ ఈ ఫోన్‌కు పేలుళ్ల సమస్య తలెత్తడంతో ఎంతోకాలంగా కంపెనీ సాధించుకున్న ప్రతిష్ట మట్టిపాలైంది. చాలామంది గెలాక్సీ కస్టమర్లు ఇతర ఫోన్లకు తరలివెల్లారు. కంపెనీ త్రైమాసిక ఫలితాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. పేలుళ్ల సమస్య కనుగొనే వరకు గెలాక్సీ 8ను కూడా విడుదల చేయమని కంపెనీ జాప్యం చేస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ఫిబ్రవరిలో ఉండే అవకాశముందని తెలుస్తోంది. -
రైల్వే రెగ్యులేటరీపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: టెలికం రంగంలో ట్రాయ్, విద్యుత్ రంగంలో ఈఆర్సీ ఉన్నట్లే రైల్వేల్లోనూ ప్రత్యేక నియంత్రణ సంస్థ(రెగ్యులేటరీ)ను నెలకొల్పేందుకు రంగం సిద్ధమైంది. ఈ నియంత్రణ సంస్థ ఏర్పాటుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించాలని ‘నీతి ఆయోగ్’ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియాను రైల్వే మంత్రి సురేశ్ ప్రభు కోరారు. రైల్వేల్లో స్వతంత్ర నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు అవసరముందన్నారు. రైల్వేల్లో ప్రైవేటు భాగస్వామ్యం వల్ల ప్రజా ప్రయోజనాలకు విఘాతం కలగకుండా చూడాల్సిన అవసరముందని, ఈ దిశగా నియంత్రణ సంస్థ ఏర్పాటుకు మోడల్ సిద్ధం కాగానే దానిపై చర్చిస్తామన్నారు. -
చిట్ ఫండ్ మోసాలపై ఫోరం
ముంబై: చిట్‌ఫండ్ మోసా లపై నియంత్రణ సంస్థలు దృష్టి సారిం చాయి. ఈ పథకాలపై ప్రభుత్వ విభాగాలు సమాచారం ఇచ్చిపుచ్చుకునేందుకు, తీసుకోవాల్సిన చర్యలపై సమన్వయానికి ప్రత్యేక ఫోరం ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. బుధవారం జరిగిన ఆర్థిక స్థిరత్వ, అభివృద్ధి మండలి (ఎఫ్ఎస్డీసీ) సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ తెలిపిం ది.ఆర్బీఐ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు సారధ్యంలో జరిగిన సమావేశంలో సెబీ, ఐఆర్డీఏ, పీఎఫ్ఆర్డీఏ చీఫ్‌లు పాల్గొన్నారు. కొత్తగా ఆర్బీఐ గవర్నర్ పగ్గాలను చేపట్టబోతున్న రాజన్ కూడా హాజరయ్యారు.