Reimbursements fees
-
ఫీజుల భారం తగ్గేదెప్పుడు?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్నత, సాంకేతిక, వృత్తి విద్యాకోర్సుల ఫీజులకు సంబంధించి ప్రభుత్వం ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచకపోవడంతో విద్యార్థులపై పెనుభారం పడుతోంది. ఈ కోర్సులు అభ్యసించే విద్యార్థుల కుటుంబాలు భారీగా ఉన్న ఫీజులు చెల్లించడానికి అప్పులు చేసి రుణ ఊబిలో కూరుకుపోతున్నాయి. అప్పులు చేసే స్థోమత కూడా లేని విద్యార్థులు ఫీజులను చెల్లించలేక మధ్యలోనే చదువు మానుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. మరికొంతమందికి చదువులు ముగిసినా ప్రభుత్వం బకాయిలు చెల్లించని కారణంగా కాలేజీలు సర్టిఫికెట్లను ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. దీంతో విద్యార్థులే ఆ డబ్బునూ చెల్లించి తమ సర్టిఫికెట్లను తీసుకుంటున్నారు. ఆయా కోర్సుల ఫీజులను ప్రతి మూడేళ్లకోసారి పెంచుతున్న ప్రభుత్వం ఆ మేరకు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఒక్క ఇంజనీరింగ్ మాత్రమే కాకుండా ఎంబీఏ, ఎంసీఏ, ఎంటెక్, ఫార్మా తదితర కోర్సుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. రీయింబర్స్మెంట్పెంచకుండా ఫీజుల పెంపు ఇంజనీరింగ్ సహా వివిధ వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన ఫీజులను ప్రభుత్వం ప్రతి మూడేళ్లకు పెంచుతోంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిబంధనల మేరకు కాలేజీల నిర్వహణకు అయ్యే ఖర్చులకు అనుగుణంగా ఈ ఫీజులను ప్రవేశాలు, ఫీజుల నియంత్రణ కమిటీ (ఏఎఫ్ఆర్సీ) ఖరారు చేస్తుంటుంది. 2016–17, 2018–19 విద్యా సంవత్సరాల ఫీజులను మూడేళ్ల క్రితం ఏఎఫ్ఆర్సీ సిఫార్సుల మేరకురాష్ట్ర ప్రభుత్వం పెంచింది. దీంతో అన్ని కోర్సుల ఫీజులు అమాంతం పెరిగిపోయాయి. అయితే ఫీజులను పెంచిన చంద్రబాబు ప్రభుత్వం విద్యార్థులపై ఆ భారం పడకుండా ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచకుండా రూ.35 వేలకే పరిమితం చేసింది. దీంతో విద్యార్థులపై ఫీజుల భారం తడిసిమోపెడైంది. బీటెక్ కోర్సునే తీసుకుంటే విద్యార్థులు అదనంగా రూ.70 వేల వరకు భరించాలి. నాలుగేళ్ల కోర్సు పూర్తయ్యేటప్పటికీ ప్రతి విద్యార్థి దాదాపు రూ.3 లక్షలు అప్పు చేయాల్సి వస్తోంది. ఇది ఫీజు వరకు మాత్రమే. దీనికి అదనంగా వసతి, భోజన ఖర్చులను కూడా కలుపుకుంటే ఈ అప్పుల భారం మరింత పెరుగుతుంది. నిపుణుల నివేదికనుపెండింగ్లో పెట్టిన ప్రభుత్వం విద్యార్థులపై ఫీజుల భారం అధికంగా ఉంటోందని, ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని పెంచాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నారు. నిపుణులు కూడా ఫీజురీయింబర్స్‌మెంట్ పెంచాలని ప్రభుత్వానికి సూచించారు. దీనిపై గతేడాది ప్రభుత్వం.. అధికారులు, నిపుణులతో కమిటీని ఏర్పాటు చేసింది. ఫీజులు భారీగా ఉన్నందున ఫీజురీయింబర్స్‌మెంట్ మొత్తాన్ని రూ.35 వేల నుంచి రూ.65 వేలకు పెంచాలని కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం ఈ నివేదికను ప్రభుత్వం పెండింగ్‌లో పెట్టింది. ఫీజురీయింబర్స్‌మెంట్‌ను పెంచకుండా విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఇబ్బందులకు గురిచేస్తోంది. ఫీజుల పెంపునకు ఏఎఫ్ఆర్సీ కసరత్తు మరోవైపు 2019–20, 2021–22 విద్యా సంవత్సరాలకు ఫీజులు నిర్ణయించడానికి ఏఎఫ్ఆర్సీ కసరత్తు ప్రారంభించింది. ఇప్పటికే ఆయా కాలేజీల నుంచి ప్రతిపాదనలను కోరింది. ఆయా కోర్సుల నిర్వహణకయ్యే వ్యయంపై కాలేజీలు సమర్పించే ఖర్చులను పరిశీలించి ప్రస్తుత ఫీజులను పెంచనున్నారు. ఏఐసీటీఈ నియమించిన జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ సిఫార్సుల మేరకు ఫీజులు పెంచాలని కాలేజీలు ప్రభుత్వాన్ని, ఏఎఫ్ఆర్సీని కోరుతున్నాయి. ఏఐసీటీఈ నిబంధనలు, రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశిస్తున్న ప్రమాణాల మేరకు కాలేజీలను నిర్వహించాలంటే ప్రస్తుత ఫీజులు సరిపోవడం లేదని అంటున్నాయి. బీటెక్‌లో గరిష్ట ఫీజు రూ. 1.44 లక్షల నుంచి రూ.1.58 లక్షలుగా, బీఫార్మసీలో రూ.1.41 లక్షల నుంచి రూ.1.55 లక్షలుగా, ఎంబీఏలో రూ.1.57 లక్షల నుంచి రూ.1.71 లక్షలుగా, ఎంటెక్‌లో రూ.2.31 లక్షల నుంచి రూ.2.51 లక్షలుగా ఉండొచ్చని శ్రీకృష్ణ కమిటీ సూచించింది. ఈ మేర ఫీజులు పెరిగితే విద్యార్థులకు ఇచ్చే ఫీజురీయింబర్స్‌మెంట్‌ను కూడా పెంచాల్సిన అవసరముంటుందని నిపుణులు పేర్కొంటున్నారు. -
కదం తొక్కిన విద్యార్థి లోకం
పట్నంబజారు(గుంటూరు): చదువుల తల్లి ఒడిలో స్వేచ్ఛగా విద్యనభ్యసించాల్సిన విద్యార్థులు సమస్యలతో సతమతవుతున్నారు. మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు టీడీపీ ప్రభుత్వం కుయుక్తులు పన్నుతుందని ఆరోపిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. పార్టీ విద్యార్థి విభాగం గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పానుగంటి చైతన్య ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. లాడ్జి సెంటర్లోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భారీగా సంఖ్యలో విద్యార్థులు పాల్గొని శంకర్ విలాస్ సెంటర్ వరకు ప్రదర్శన నిర్వహించి, ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఈ సందర్భంగా పానుగంటి చైతన్య మాట్లాడుతూ దివంగత మహానేత వైఎస్సార్ పేద విద్యార్థుల భవిష్యత్తుకు ఆర్థిక పరిస్థితులు ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో చేపట్టిన మహోన్నత పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. విద్యార్థుల జీవితాలను సర్వనాశనం చేసేలా చంద్రబాబు సర్కార్ ఫీజురీయింబర్స్‌మెంట్‌కు తిలోదకాలిస్తోందన్నారు. విద్యార్థులకు బంగారు భవిష్యత్తు అందించేందుకు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫీజుపోరు చేపట్టారన్నారు. రాష్ట్రంలో విద్యావ్యవస్థను భ్రష్టుపట్టించే ప్రభుత్వం పాలన చేస్తోందని, విద్యార్థులు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉన్నత చదువులు చదువుకునే అవకాశాన్ని కల్పిస్తారన్నారు. విద్యావ్యవస్థను సర్వనాశనం చేస్తున్న చంద్రబాబు సర్కార్‌పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. చంద్రబాబు దిగిపో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తుకు అండగా ఉంటామని ప్రతినబూనింది. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు విఠల్, వినోద్, గంటి, రవి, బాజీ, జగదీష్, నాగరాజు, అజయ్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పోలీసుల అత్యుత్సాహం వైఎస్సార్ సీపీ విద్యార్థి విభాగం నేతలు ప్రదర్శన చేపట్టే సమయానికి టీడీపీ నేతలు కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిరసన చేపట్టారు. పూర్తిస్థాయిలో రోడ్డుపై ట్రాఫిక్‌ను నిలువరించి సుమారు గంటన్నరకు పైగా ఆందోళన చేపట్టి, కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను తగులబెట్టారు. ఇదంతా పోలీసులు ఎదుటే జరిగింది. దిష్టిబొమ్మ తగులబెడుతుంటే.. మారు మాట్లాడని పోలీసులు విద్యార్థులు శాంతియుతంగా చేస్తున్న ప్రదర్శనలో అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ నేతలు ఉన్నారంటూ..గంటన్నరకు పైగా వైఎస్సార్ సీపీ నేతలను, విద్యార్థులను నడిరోడ్డుపై నిలబెట్టారు. ప్రదర్శనలో పాల్గొన్న నేతలకు పోలీస్ అధికారులు బెదిరింపులకు దిగారు. అధికార పక్షానికి పోలీసులు వత్తాసు పలుకుతున్నారని విద్యార్థులు బాహాటంగానే విమర్శించారు. -
నెలాఖరులోగా ‘ఫీజు’ బకాయిలు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ డిమాండ్ హైదరాబాద్: ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులను ఈ నెలాఖరులోగా చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేనియెడల నవంబర్‌లో మంత్రులు, ప్రజాప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీయాలని, ప్రభుత్వాన్ని స్తంభింపచేయాలని బీజేవైఎం కార్యకర్తలకు, విద్యార్థులకు ఆయన పిలుపునిచ్చారు. ఫీజు రీరుుంబర్స్‌మెంట్ బకారుులు చెల్లించాలని బీజేవైఎం ఆధ్వర్యంలో బుధవారం ఇక్కడ ఇందిరాపార్క్ వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. విద్యార్థులు, యువకుల పోరాటాలతో ఏర్పడ్డ తెలంగాణలో వారి హక్కులనే కాలరాచే విధంగా సర్కార్ వ్యవహరిస్తోందని అన్నారు. కేజీ టూ పీజీ ఉచిత ఆంగ్ల విద్య అంటూ ఎన్నికల హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కాకమ్మ కబుర్లు చెబుతూ కార్పొరేట్‌కు ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు, సిబ్బంది లేరని, రేషనలైజేషన్ పేరుతో దాదాపు 450 పాఠశాలలను మూసివేశారని పేర్కొన్నారు. రెండేళ్లుగా ఫీజు బకారుులు చెల్లించకపోవడంతో 14 లక్షల మంది విద్యార్థులు, రెండు లక్షల యాభై వేలమంది లెక్చరర్లు, సిబ్బంది, 3 వేల కళాశాలల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారిందని అన్నారు. ఆర్థికభారం పేరుతో రీరుుంబర్స్‌మెంటు పథకాన్ని నీరుగార్చడం తగదని సూచించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల రీడిజైన్ చేసి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నారని, విద్యార్థుల ఫీజు బకారుులు చెల్లించడానికి సీఎంకు చేతులు రావడం లేదన్నారు. కేంద్రం నుంచి వస్తున్న వివిధ రకాల నిధులు, స్కాలర్షిప్ నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలైన పేదలకు ఉన్నత విద్య అవకాశాలు అందించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీరుుంబర్స్‌మెంట్ పథకాన్ని అమలు చేశారని, దీనితో ఎంతోమంది ఇంజనీర్లు, డాక్టర్లుగా తయారయ్యారని అన్నారు. బకారుులను చెల్లించి బడుగు, బలహీనవర్గాలను ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, నాయకులు ప్రదీప్, మహిపాల్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు విక్రంరెడ్డి, ప్రధానకార్యదర్శి భరత్‌గౌడ్ పాల్గొన్నారు.