remote control system
-
ప్రతిపక్షాలను కూడా రిమోట్‌తో కంట్రోల్ చేసే సిస్టమ్ ఏదైనా ఉంటే చూడండీ!
ప్రతిపక్షాలను కూడా రిమోట్‌తో కంట్రోల్ చేసే సిస్టమ్ ఏదైనా ఉంటే చూడండీ! -
ఢిల్లీలో ఉండి స్వీడన్లో కారు నడిపిన మోదీ.. అది ఎలా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఉన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ యూరప్‌లోని స్వీడన్లో కారు నడపటం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అయితే.. అది నిజమే. 5జీ టెక్నాలజీతో అది సాధ్యమైంది. ‘ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022’ కార్యక్రమానికి హాజరైన ప్రధాని మోదీ.. దేశంలో 5జీ మొబైల్ సేవలను ప్రారంభించారు. ఈ సందర్భంగా.. 5జీ లింక్ సాయంతో ఇండియా మొబైల్ కాన్ఫరెన్స్‌లోని ఎరిక్సన్ బూత్ నుంచి యూరప్‌లో కారు టెస్ట్ డ్రైవ్ చేశారు. ఆ సమయంలో కారు స్వీడన్లో ఉంది. స్వీడన్లో ఉన్న కారును నియంత్రించే సాకేతికతను ఎరిక్సన్ బూత్‌లో అమర్చటం ద్వారా ఇది సాధ్యమైంది. రిమోట్ కంట్రోల్ కారు స్టీరింగ్ పట్టుకుని ఉన్న ప్రధాని మోదీ ఫోటోను కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ట్విట్టర్లో షేర్ చేశారు. ‘భారత 5జీ టెక్నాలజీ సాయంతో ఢిల్లీ నుంచి యూరప్‌లోని కారును రిమోట్ కంట్రోల్స్ ఆధారంగా ప్రధాని మోదీజీ టెస్ట్ డ్రైవ్ చేశారు.’ అని రాసుకొచ్చారు గోయల్. ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2022 కార్యక్రమం ఆసియాలోనే అతిపెద్ద డిజిటల్ సాంకేతికత ప్లాట్‌ఫాం. ఢిల్లీలోని ప్రగతి మైదానంలో శనివారం ప్రారంభమైన ఆరవ ఎడిషన్ మొబైల్ కాంగ్రెస్ కార్యక్రమం అక్టోబర్ 4 వరకు జరగనుంది. రిమోట్ కంట్రోల్స్‌తో కారు నడపటంతో పాటు 5జీ సాంకేతికతతో అందుబాటులోకి వచ్చే వివిధ సౌకర్యాలను పరిశీలించారు మోదీ. India driving the world. PM @NarendraModi ji tests driving a car in Europe remotely from Delhi using India’s 5G technology. pic.twitter.com/5ixscozKtg — Piyush Goyal (@PiyushGoyal) October 1, 2022 WATCH | Prime Minister @narendramodi tries his hands on virtual wheels at the exhibition put up at Pragati Maidan before the launch of 5G services in the country. pic.twitter.com/zpbHW9OiOU — Prasar Bharati News Services & Digital Platform (@PBNS_India) October 1, 2022 ఇదీ చదవండి: PM launch 5G services: 5జీ సేవలను ప్రారంభించిన ప్రధాని -
2024 లోక్‌సభ ఎన్నికల నాటికి రిమోట్ ఓటింగ్!
న్యూఢిల్లీ: దేశ ఎన్నికల వ్యవస్థలో రిమోట్ ఓటింగ్ అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నామని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి సునీల్ ఆరోరా వెల్లడించారు. వచ్చే రెండు, మూడు నెలల్లో దీనికి సంబంధించిన పైలెట్ ప్రాజెక్టు మొదలవుతుందని, 2024 లోక్‌సభ ఎన్నికల నాటికి ఇది కార్యరూపం దాల్చే అవకాశాలున్నాయని అన్నారు. రిమోట్ ఓటింగ్‌కు సంబంధించిన అధ్యయనాన్ని ఈ ఏడాది మొదట్లో ప్రారంభించామని చెప్పారు. ఐఐటీ మద్రాసుతో పాటు దేశంలోని ఇతర ఐఐటీల్లోని సాంకేతిక నిపుణుల సహకారంతో దీనిపై కసరత్తు చేస్తున్నట్టుగా అరోరా చెప్పారు. రిమోట్ ఓటింగ్ అంటే ఆన్లైన్ ఓటింగ్ కాదని, ఇంటి నుంచి ఓటు హక్కు వినియోగించుకోవడం కూడా కాదని సీఈసీ స్పష్టం చేశారు. ఎన్నికల వ్యవస్థకి మరింత విశ్వసనీయత తీసుకురావడమే ప్రధాన లక్ష్యంగా ఈ విధానాన్ని రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. త్వరలోనే దీనికి తుదిరూపు రేఖ వస్తాయని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సహా అన్ని వర్గాల వారితో దీనిపై సంప్రదింపులు జరపవలసి ఉందని అన్నారు. గతంలో మాజీ డిప్యూటీ ఎన్నికల అధికారి సందేప్ సక్సేనా ఈ ప్రాజెక్టుని ‘‘బ్లాక్‌చైన్’’టెక్నాలజీ ద్వారా రూపొందిస్తున్నట్టుగా చెప్పారు. టూ–వే ఎలక్ట్రానిక్ ఓటింగ్ వ్యవస్థ కలిగి ఉండే ఈ విధానంలో వైట్ లిస్ట్‌లో ఉండే ఐపీ పరికరాలు, వెబ్ కెమెరాలు, బయోమెట్రిక్ డివైస్‌లు వంటివన్నీ ఉంటాయన్నారు. రిమోట్ ఓటింగ్ సదుపాయాన్ని వినియోగించుకోవాలనుకునే ఓటర్లు ముందుగా నిర్ణయించిన సమయానికి, నిర్దేశిత ప్రాంతానికి రావల్సి ఉంటుందని అప్పట్లో సక్సేనా వెల్లడించారు. (చదవండి: ఏప్రిల్ 17న తిరుపతి ఉప ఎన్నిక) -
అరచేతిలో అన్నీ..
ఏదో పనిమీద ఊరికి వెళ్తారు.. అప్పుడు గుర్తొస్తుంది.. అరె ఇంట్లో ఫ్యాన్, లైట్లు ఆన్ చేసి వచ్చామే అని. టీవీ చూస్తుంటాం.. బయటి నుంచి శబ్దాలు వస్తుంటాయి.. అబ్బా ఎవరైనా ఆ తలుపు మూసేస్తే బాగుండూ అనుకుంటాం.. ఇవే కాదు చాలా సందర్భాల్లో ఇలా చాలా మందికి అనిపించి ఉంటుంది కదా... ఇలాంటి వాటన్నింటికీ ఓ పరిష్కారంగా వచ్చేసింది. ‘బి.వన్’. అవును దీని సాంకేతికత సాయంతో ప్రపంచంలో ఎక్కడున్నా సరే.. మీ ఇంట్లోని ఫ్యాన్లు, ఏసీలు ఆన్ లేదా ఆఫ్ చేసేయొచ్చు. ఒకే ఒక్క మాటతో టీవీలో మీకిష్టమైన సినిమా ప్రత్యక్షం అయ్యేలా చేయొచ్చు. ఆ వెంటనే.. కిటికీ తెరలు మూసుకుపోయి.. ఇంటిలో వెలుతురు తగ్గించుకునేలా చేసుకోవచ్చు. అబ్బో ఇదంతా కావాలంటే ఖర్చు బాగానే అవుతుందిగా.. అనే కదా మీ డౌటు.. అంతేం అవసరం లేదండి బాబోయ్ అంటో బ్లేజ్ ఆటోమేషన్ అనే కంపెనీ. బి.వన్ ఈజీ పేరుతో ఓ యూనివర్సల్ రిమోట్‌ను విడుదల చేసింది ఆ సంస్థ. మధ్యతరగతి వారికి కూడా దీన్ని చాలా చౌకగా, అందుబాటులోకి తెచ్చింది. చేసింది హైదరాబాద్‌లోనే.. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బ్లేజ్ ఆటోమేషన్ శుక్రవారం బి.వన్ ఈజీని మార్కెట్లోకి విడుదల చేసింది. ఒక్క మాటలో చెప్పా లంటే ఈ గాడ్జెట్ సార్వత్రిక రిమోట్ కంట్రోలర్ అన్నమాట. మన టీవీ రిమోట్ కంట్రోలర్ ముందువైపు ఉండే ఎర్రటి బల్బు చూసే ఉంటారు. పరారుణ కాంతి (ఇన్ఫ్రారెడ్) ఆధారంగా పనిచేస్తాయి ఈ రిమోట్లు. ఒక్కో రిమోట్‌కు ఒక్కో ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. బి.వన్ ఈజీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 2 లక్షల గాడ్జెట్ల కోడ్లను గుర్తించి తదనుగుణంగా పనిచేస్తుంది. అంటే ఏ కంపెనీకి చెందిన టీవీ, ఏసీ, మ్యూజిక్ ప్లేయర్ అయినా సరే.. వాటిని ఓ స్మార్ట్‌ఫోన్ యాప్ సాయంతో ప్రపంచంలోని ఏ మూల నుంచైనా నియంత్రించొచ్చు. ఇంటర్నె ట్ ఆధారిత గాడ్జెట్ల అవసరం లేకుండా ప్రస్తుతమున్న వాటినే స్మార్ట్‌గా మార్చేందుకు ఓ ప్లగ్ అభివృద్ధి చేసినట్లు సంస్థ సీఈవో పొనుగుపాటి శ్రీధర్ తెలిపారు. మనం చెప్పినట్లే వింటుంది.. ఉదాహరణకు ఇంట్లో ప్రస్తుతమున్న రిఫ్రిజిరేటర్‌ను స్మార్ట్‌ప్లగ్ ద్వారా కనెక్ట్ చేస్తే, అది ఎంత కరెంటు వాడుతుందన్న వివరాలతో పాటు మనం నిర్దేశించిన ప్రకారం ఆన్/ఆఫ్ చేయొచ్చు. అమెజాన్ అలెక్సా, గూగుల్ హోమ్‌లతో కూడా పనిచేస్తుంది కాబట్టి.. వాటిద్వారా ఇచ్చే మాటలతోనూ పనులు చేసుకోవచ్చు. ప్రస్తుత అంచనాల ప్రకారం బి.వన్ ఈజీతో రెండు బెడ్రూమ్ల ఇంటి ఆటోమేషన్‌కు రూ.25 వేల నుంచి రూ.75 వేల వరకూ ఖర్చు అవుతుందని తెలిపారు. ఇప్పటి వరకు అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న బి.వన్ ఈజీ ఈ నెల నుంచి భారత్‌లోనూ అందుబాటులోకి రానుందని సంస్థ చైర్మన్ వల్లూరి అర్జున్ తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 25 వేల ఇళ్లల్లో బ్లేజ్ ఆటోమేషన్ వ్యవస్థలు పనిచేస్తున్నాయని, భారత్‌లో ప్రస్తుతం 3,500 అపార్ట్మెంట్లలో ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. బి.వన్ ఈజీతో ఏమేం చేయొచ్చు? డిజిటల్ తాళంతో ఇంటికి ఎవరు.. ఎప్పుడు వచ్చారన్నది గమనించొచ్చు. నేరుగా తాళం తెరవడంతో పాటు అవసరమైతే కొంత సమయం వరకే వ్యక్తులను లోపలికి అనుమతించేలా నియంత్రించవచ్చు. కమాండ్‌తో కొన్ని పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటి జరిగేలా ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. గుడ్‌నైట్ అనగానే.. కర్టెన్లు మూసుకుపోవడం.. ఏసీ ఆన్ అవడం, బెడ్‌ల్యాంపులు వెలగడం వంటివి చేసుకోవచ్చు. కదలికలను గుర్తించేందుకు మోషన్ సెన్సర్, తలుపు తెరిచి ఉందా.. మూసి ఉందా.. వంటి వాటిని గుర్తించేందుకు ఇంకో గాడ్జెట్నూ బ్లేజ్ రూపొందించింది. – సాక్షి హైదరాబాద్ -
పెంపుడు కుక్కలకూ రిమోట్లు!
వాషింగ్టన్: రిమోట్ కంట్రోల్‌లతో ఎంత హాయో చెప్పనక్కర్లేదు. కూర్చున్నచోటి నుంచే టీవీలు, మ్యూజిక్ సిస్టమ్‌లు, ఫ్యాన్లు, లైట్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో పాటు కార్లు, ద్విచక్రవాహనాలను కూడా నియంత్రించవచ్చు. మరి మనం అల్లారుముద్దుగా పెంచుకునే కుక్కల వంటి పెంపుడు జంతువులను కూడా రిమోట్‌తో నియంత్రించగలిగితే..!? అమెరికాలోని ఓబర్న్ యూనివర్సిటీ పరిశోధకులు అలాంటి ఓ పరికరాన్ని రూపొం దించారు. ఇందులో ఒక మైక్రో ప్రాసెసర్, వైర్లెస్ రేడియో, జీపీఎస్ రిసీవర్ వంటివి ఉంటాయి. మన పెంపుడు కుక్కలకు అలవాటైన, ముందుగానే శిక్షణ ఇచ్చిన పిలుపులు, కమాండ్లను ఆ పరికరంలో పొందుపరుస్తారు. పెంపుడు కుక్కలు దూరంగా ఉన్నప్పుడు జీపీఎస్ సహాయంతో అవి ఎక్కడికి వెళ్లాలి.. ఎలా రావాలి.. ఏం చేయాలి? తదితర విషయాలను మన దగ్గర ఉండే పరికరం ద్వారా ఆదేశించవచ్చు. అయితే, ఈ పరికరం ద్వారా ఇచ్చిన ఆదేశాలను పెంపుడు కుక్కలు 98 శాతం కచ్చితత్వంతో పాటించాయని పరిశోధనకు నేతృత్వం వహించిన జెఫ్ మిల్లర్ చెప్పారు. యజమానులు ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాటిని నేరుగా నియంత్రించలేనంత దూరంలో ఉన్నప్పుడు ఈ పరికరం ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.