‘అక్రమంగా టోల్‌టాక్స్ వసూలు’
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట టోల్ ప్లాజా వద్ద యదేచ్ఛగా టోల్ టాక్స్ వసూలు చేస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్న తరుణంలో వాహనదారుల అవస్థలు గుర్తించిన కేంద్రప్రభుత్వం ఈ నెల 14 వరకు టోల్‌టాక్స్ రద్దు చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికి కేంద్ర ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి అక్రమంగా పన్నులు వసూలు చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బండి సంజయ్ కుమార్ అక్కడికి చేరుకొని టోల్‌టాక్స్ వసూలును అడ్డుకొని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.