Resurrection
-
Easter Special: లోకానికే మహోదయం క్రీస్తు పునరుత్థానం
యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పండుగను జరుపుకొంటున్నారు. మరణాన్ని జయించి తిరిగి లేచిన యేసుక్రీస్తు మహాత్మ్యాన్ని కొనియాడుతూ భక్తిపారవశ్యంతో పునీతులవుతున్నారు. యెరూషలేములోని యేసు ఖాళీ సమాధి మనిషికి నిరీక్షణను, అపరిమితమైన ధైర్యాన్ని, మనో నిబ్బరాన్ని ప్రసాదిస్తుంది. ఈ సందర్భంగా యేసుక్రీస్తు జీవితం నుండి కొన్ని అమూల్య పాఠాలను ‘సాక్షి’ పాఠకులకు అందిస్తున్నాం. తన జీవితకాలమంతా భౌతికంగా అంధురాలైనప్పటికీ క్రీస్తు ప్రభువు దైవత్వాన్ని అయన ప్రేమతత్వాన్ని తాను రచించిన ఎనిమిదివేల పాటలతో తెలియచేసి క్రైస్తవ ప్రపంచంలో విశిష్టమైన ఖ్యాతిని ఆర్జించిన ఫ్యానీ క్రాస్బీ క్రీస్తు పునరుత్థానాన్ని గురించి ఇలా వ్రాసింది. ‘క్రీస్తు తిరిగి లేచాడు. ఆయన విశిష్ఠ బలము ద్వారా మరణాన్ని జయించాడు. రాయి పొర్లింపబడింది, సమాధి ఆయన్ను శాశ్వతంగా బంధించలేకపోయింది. జగమంతా ఆనందంతో నిండిపోయింది. క్రీస్తు స్నేహితులారా! మీరు కన్నీళ్లు విడచుట మానండి. ఎందుకంటే ఆయన మహిమగల రాజు.’ ఈ మాటలను తన హృదయాంతరంగములో నుండి రాయడం ద్వారా తాను భౌతికంగానే అంధురాలు గాని ఆధ్యాత్మికంగా కాదు అని ఋజువుచేసింది క్రాస్బీ. యేసుక్రీస్తు జీవితం ఒకింత ప్రత్యేకమైనది, విలక్షణమైనది. ముప్పయి మూడున్నర సంవత్సరాల ఆయన జీవిత ప్రస్థానం ప్రపంచ చరిత్రలో పెనుమార్పులను తీసుకు వచ్చింది. ప్రేమ, దయ, వినయ స్వభావం వంటి అనేకమైన ఆత్మీయ పదాలకు మనిషి మనసులో చోటు లభించింది. పువ్వు నుంచి పరిమళాన్ని, తేనె నుంచి మాధుర్యాన్ని, చంద్రుని నుంచి చల్లదనాన్ని, మీగడ నుంచి కమ్మదనాన్ని, అమ్మ నుంచి అనుబంధాన్ని వేరుచేయలేనట్టుగానే క్రీస్తు నుంచి ప్రేమను, కరుణ పూరితమైన మనస్సును వేరుచేయలేము. ఆయన పుట్టింది బెత్లేహేము అనే చిన్న పల్లెటూరులోనైతే ఆయన పెరిగింది ఒక వడ్లవాని ఇంటిలో. పేరుకు మాత్రం తండ్రి అని పిలువబడిన యేసేపుకి అన్ని విషయాలలో సహాయం చేశాడు. యేసు భూమ్మీద జీవించిన కాలంలో స్నేహం చేసింది పామరులతో, గొర్రెల కాపరులతో, చేపలు పట్టే జాలరులతో. మనిషి సమస్యలను, పేదరికాన్ని చాలా దగ్గరగా చూసిన వ్యక్తి యేసుక్రీస్తు. అందుకేనేమో! వారందరి హృదయాల్లో రారాజుగా కొలువుంటున్నాడు. కాంతికి వేగాన్ని నియమించిన దేవుడు శరీరధారిగా ఉన్నప్పుడు ఎంత దూరమైనా కాలిబాటతోనే ప్రయాణించాడు. ఇవన్నీ ఆయన కారుణ్యానికి నిలువెత్తు నిదర్శనాలు. నక్కలకు బొరియలున్నాయి, పక్షులకు గూళ్లున్నాయి, కాని తలవాల్చుకొనుటకు మనుష్య కుమారునికి చోటు లేదని చెప్పడం ద్వారా ప్రజల కోసం తానెంత కరుణామయుడిగా మారిపోయాడో తెలియచెప్పాడు. ధవళ సింహాసనం మీద కూర్చున్నప్పుడు దివ్య మహిమతో నిండిన ఆ మహాఘనుడు శరీరధారిగా తగ్గించుకొని వచ్చినప్పుడు కుష్ఠు వ్యాధిగ్రస్తులను కౌగలించుకున్నాడు. రోగ పీడితులను పరామర్శించి తన దివ్యస్పర్శతో స్వస్థపరచాడు. పాపంలో పట్టుబడి భయంతో సభ్య సమాజంలో తలదించుకొన్న వ్యభిచారిని సయితం అమ్మా! అని పిలిచిన పరిశుద్ధుడు క్రీస్తు. చులకనగా వ్యవహరించిన వారిని కూడా తన ప్రేమతో తన్మయుల్ని చేసిన కరుణామయుడు. సీయస్ లూయీ అనే సుప్రసిద్ధ సువార్తికుడు ఒకసారి ఇలా అంటాడు. యేసు ఈ లోకానికి వచ్చి తానెవరో లోకానికి తెలియచేశాడు. ‘నేను లోకానికి వెలుగును, జీవాహారము నేనే, మార్గము సత్యమును జీవమును నేనే’ చెప్పడంలో మనిషి మనసులో ఉన్న ప్రశ్నలకు జవాబులనిచ్చాడు. క్రీస్తు ఆవిధంగా పలికాడంటే ఆయన అబద్ధికుడైనా లేదా మతిస్థిమితం లేనివాడైనా లేదా రక్షకుడైనా అయ్యుండాలి. యేసుక్రీస్తు జీవితాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తే ఆయన ఎక్కడా అబద్ధాలు చెప్పలేదు. ఆయన మతిస్థిమితం లేనివాడు కాదు. అదే వాస్తవమైతే ఆయన ఇన్ని విశిష్ఠ బోధలు చేసి ఉండేవాడు కాదు. అనేకులను స్వస్థపరచేవాడు కాదు. ఆయన రక్షకుడు గనుకనే సిలువలో మనిషి పాపముల నిమిత్తం మరణించి మూడవ రోజున తిరిగి లేచారు. యేసుక్రీస్తు మానవాళిని తమ పాపముల నుండి రక్షించడానికి ఈ లోకానికి వచ్చారు. యేసు జన్మ చాలా ప్రత్యేకమైనది, పరిశుద్ధమైనది, జీవన విధానం మరింత శ్రేష్ఠమైనది, విలక్షణమైనది. మరణ విధానం కూడా సాటిలేనిది. మూడవ రోజున జరిగిన ఆయన పునరుత్థానం అద్భుతమైనది. గుడ్ ఫ్రైడే మరియు ఈస్టర్ పండుగలు విశ్వవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. మానవ జీవితాలకు పట్టిన పాపాంధకారాన్ని తొలగించి జీవపు వెలుగునందించాడు క్రీస్తు ప్రభువు. జీవచ్ఛవాలుగా పడివున్న ఎందరికో స్ఫూర్తినిచ్చి ఉన్నత శిఖరాలపై నిలబెట్టాడు. వాస్తవానికి క్రీస్తు మరణం, పునరుత్థానం సంభవించిన సమయంలో జరిగిన సంఘటనలు మనకు ఎన్నో విశిష్ఠమైన పాఠాలు నేర్పిస్తాయి. ‘నజరేయుడైన యేసు’ పాపులను రక్షించుటకు సిలువపై ప్రాణమర్పించారు. రోమన్ సైనికులు, యూదా మతపెద్దలు నిర్దాక్షిణ్యంగా యేసుక్రీస్తుకు సిలువ వేశారు. న్యాయస్థానాల చుట్టూ తిప్పారు. అన్యాయపు తీర్పు తీర్చారు. భయంకరమైన కొరడాలతో విపరీతంగా కొట్టి పైశాచికానందాన్ని పొందారు. యెరూషలేము వీధుల్లో సిలువను మోయించి, గొల్గతాపై మేకులు కొట్టి, సిలువలో వేలాడదీసి, పక్కలో బల్లెపు పోటు పొడిచి చిత్రహింసలకు గురి చేశారు. ప్రేమ, సమాధానములకు కర్తయైన దేవుడు వాటినన్నిటినీ ప్రేమతో సహించి, భరించి సిలువలో మరణించాడు. దేవుని లేఖనాలు యేసుక్రీస్తు సిలువపై మరణించాయని ధ్రువీకరిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఇశ్రాయేలు దేశంలోని కైసరయ అనే ప్రాంతంలో తవ్వకాలు జరిపారు పురాతత్వ శాస్త్రవేత్తలు. ఆ తవ్వకాలలో వారికి పిలాతు రాతి పలక లభించింది. విస్తృత పరిశోధనల తదుపరి యేసుక్రీస్తు ప్రభువునకు తీర్పు తీర్చిన రోమన్ గవర్నర్ పిలాతు అని బైబిల్లో అతని గూర్చి వ్రాయబడిన విషయాలు వాస్తవాలని గుర్తించారు. యేసుక్రీస్తు సిలువ మరణానికి ముందురోజు కొన్ని సంఘటనలు జరిగారు. గెత్సేమనె తోటకు ప్రభువు రాకమునుపు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. శిష్యులను వెంట బెట్టుకొని గెత్సెమనేకు వచ్చిన తర్వాత ఆయన ప్రార్థించుట మొదలు పెట్టెను. నేటికి యెరూషలేములో గెత్సేమనే తోట ఉంది. దానిలోని కొన్ని ఒలీవ చెట్లు యేసుక్రీస్తు కాలానికి సంబంధించినవే. అక్కడ ఆయన ప్రార్థించిన రాయి కూడా ఉంది. దానిమీద ఓ గొప్ప దేవాలయం నిర్మించబడింది. ఇశ్రాయేలు దేశాన్ని సందర్శించే వారందరూ కచ్చితంగా వాటిని చూస్తారు. ఆ తోటలో శిష్యులు నిద్రించుట చూసిన ప్రభువు వారిని మేల్కొల్పెను. అతి వేదనతో ప్రార్థించుట వలన చెమట రక్తపు బిందువులుగా మారెను. యేసుక్రీస్తుకు అన్యాయపు తీర్పు తీర్చబడింది. ప్రపంచ చరిత్రలో ఏ వ్యక్తినీ తీర్పుకోసం న్యాయాధికారుల ముందు పన్నెండు గంటల వ్యవధిలో ఆరుసార్లు నిలబెట్టలేదు. చీకటి రాత్రిలో సాధారణంగా తీర్పులు చెప్పరు. కాని యేసుక్రీస్తు విషయంలో ఆనాటి మతపెద్దలు, న్యాయాధికారులు అన్యాయపు తీర్పులు విధించారు. ఆ తదుపరి ప్రేతోర్యం అనే స్థలములో యేసుక్రీస్తు అతి తీవ్రంగా కొట్టబడెను. ఈనాటికీ యెరూషలేమునకు వెళితే అక్కడ వయా డొలొరిసా అనే మార్గాన్ని చూస్తాము. ఆ మార్గంలో పద్నాలుగు స్టేషన్లు ఉంటాయి. ఒక్కో ప్రాంతంలో క్రీస్తు ఏ విధంగా శ్రమపడ్డారో చరిత్రను తెలుసుకోవచ్చు. సిలువ మరణ శిక్ష మొదటిగా ఫోనీషియన్లు అమలు పరచేవారు. వారి నుండి పర్షియన్లు, గ్రీసు దేశస్థులు మరియు రోమన్లు ఈ శిక్షను అమలు పరచేవారు. నేరస్థుడు వెంటనే చనిపోకుండా తీవ్రమైన బాధను అనుభవిస్తూ చచ్చిపోవాలి అనే ఉద్దేశంలో భాగంగా రోమన్లు ఈ శిక్షను విధించేవారు. రోమన్ చట్ట ప్రకారం ఆ దేశస్థులకు సిలువ శిక్ష విధించకూడదు. కేవలం బానిసలకు, తిరుగుబాటుదారులకు, పరాయి దేశస్థులకు, నేరస్థులకు ఈ శిక్ష విధించే వారు. యేసుక్రీస్తుకు సిలువ మరణం ఖరారు చేయబడిన తర్వాత పదునైన ముళ్లు కలిగిన కిరీటాన్ని ఆయన తలమీద పెట్టి భుజాలపై సిలువను మోపి కల్వరి కొండపైకి నడిపించారు. సిలువ సుమారుగా 80 నుండి 120 కేజీలు బరువు ఉంటుందని అంచనా. భారభరితమైన ఆ సిలువను యేసు భుజాలపై మోపి గరుకైన ప్రాంతాల్లో నడిపించారు. కల్వరి అనగా కపాలమనబడిన స్థలము. మనిషి యొక్క పుర్రె ఆకారంలో ఆ స్థలం ఉంటుంది గనుక దానికి ఆ పేరు వచ్చింది. రోమన్ సైనికులందరూ ఈ ప్రక్రియలో పాల్గొంటారు. వారికి శతాధిపతి నాయకుడుగా ఉండి నడిపిస్తాడు. ఇశ్రాయేలు దేశంలో లభించిన భూగర్భ శాస్త్రవేత్తల నివేదికల ఆధారంగా ఇనుముతో చేయబడిన మేకులు సుమారు 7 అంగుళాల పొడవు ఉంటాయి. సుమారు 1 నుండి 2 సెంటిమీటర్ల మందం ఉండేవి. ఇటీవల ప్రపంచ దృష్టిని ఆకర్షించిన ట్యురిన్ వస్త్రపు పరిశోధనల ఆధారంగా మేకులను మణికట్టులో కొట్టేవారని తేలింది. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఇశ్రాయేలు మ్యూజియంలో మొదటి శతాబ్దానికి చెందిన ఒక వ్యక్తి పాదము, ఆ పాదములో దించబడిన మేకు కనబడుతుంది. దానిని బట్టి ఆ కాలంలో సిలువ విధించబడే సమయంలో ఏవిధంగా మేకులు కొట్టేవారో అర్థం చేసుకోవచ్చు. యేసుక్రీస్తు ప్రభువును సిలువపై ఉంచి చేతులలో కాళ్లల్లోను కఠినమైన మేకులను దించారు. తీవ్రమైన వేదన యేసు భరించాడు. మేకులతో సిలువకు దిగగొట్టిన తరువాత సుమారు ఆరు గంటలు యేసుక్రీస్తు సిలువపై వేలాడారు. ఏడు మాటలు పలికిన తరువాత పెద్దకేక వేసి తన ప్రాణమర్పించారు. అయితే విశ్రాంతి దినమున దేహములు సిలువ మీద ఉండకూడదు. కాబట్టి కాళ్లు విరుగ గొట్టడానికి సైనికులు సిద్ధపడ్డారు. వారు వచ్చి యేసుతో పాటు సిలువ వేయబడిన నేరస్థుల కాళ్ళు విరుగగొట్టారు. అయితే యేసు అంతకు ముందే మృతినొందుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు. ‘సైనికులలో ఒకడు ఈటెతో ఆయన పక్కలో పొడిచెను. వెంటనే రక్తమును, నీళ్లును కారెను’ అని బైబిల్లో వ్రాయబడింది. యేసుక్రీస్తు మరణించిన కొద్దిసేపటికి ఆయన దేహములో పొడవబడిన ఈటె వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. రోమన్లు వాడే బల్లెము లేక ఈటె పొడవు సుమారు 1.8 మీటర్లు. ఆయన దేహములో కుడి పక్కన పొడవబడిన బల్లెపు పోటు వలన రక్తము, నీళ్లు బయటకు వచ్చాయి. ఇక్కడ బల్లెపు కొన లోతుగా గుచ్చుకొనుట ద్వారా గుండె వరకు చేరి అక్కడ ఉన్న కుడి కర్ణిక, కుడి జఠరిక నుంచి రక్తం బయటకు వచ్చింది. ఆ తదుపరి నీళ్లు అనగా దేహములో ఉన్న శ్లేష్మరసము, గుండె చుట్టూ ఉన్న పొర చీల్చబడుటను బట్టి వచ్చిన ద్రవము. వాస్తవాన్ని పరిశీలిస్తే ‘యేసు గొప్ప శబ్దముతో కేకవేసి..’ అనే మాట లూకా సువార్త 23:46లో చూడగలము. ఒక వ్యక్తి చనిపోయే ముందు పెద్దకేక ఏ పరిస్థితుల్లో వేస్తాడు? ఈ విషయంపై తలపండిన వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోనికి వచ్చాయి. సిలువ వేయబడడానికి ముందు సాయంత్రం నుంచి తీవ్రవేదన అనుభవించారు. న్యాయస్థానాల యొద్దకు త్రిప్పడం వలన శరీరం బాగా అలసిపోయింది. కొరడా దెబ్బల ద్వారా చాలా రక్తము పోయింది. తలపై ముళ్లకిరీటం, భారభరితమైన సిలువ మోయడం, చేతుల్లో కాళ్లలో మేకులు కొట్టడం ద్వారా దాదాపుగా చాలా రక్తం యేసుక్రీస్తు దేహంనుంచి బయటకు పోయింది. శరీరం రక్తము, ద్రవములు కోల్పోవుట వలన గుండె రక్తప్రసరణ చేయలేని పరిస్థితి, శ్వాసావరోధము, తీవ్రమైన గుండె వైఫల్యం. వైద్య శాస్త్ర ప్రకారం సిలువపై యేసుక్రీస్తు పెద్ద కేకవేసి చనిపోవడానికి కారణములు ఇవే. ఈ విషయంపై ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన అనేక మంది వైద్య శాస్త్రవేత్తలు పరిశోధన జరిపి అనేక పుస్తకాలను కూడా వెలువరించారు. వాటిలో మెడికల్ అండ్ కార్డియోలాజికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ప్యాషన్ అండ్ క్రూసిఫిక్షన్ ఆఫ్ జీసస్, ఎ డాక్టర్ ఎట్ కల్వరి, ద లీగల్ అండ్ మెడికల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ట్రయల్ అండ్ ద డెత్ ఆఫ్ క్రైస్ట్’ ప్రాముఖ్యమైనవి. ‘దేవుడు మనయెడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై యుండగానే క్రీస్తు మనకొరకు చనిపోయెను’ అని అపొస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి పత్రిక వ్రాస్తూ తెలియచేశాడు. క్రీస్తు సిలువలో మరణించుట ద్వారా ప్రేమ ఋజువు చేయబడింది. ప్రేమంటే తీసుకోవడం కాదు, ప్రేమంటే ఇవ్వడం అని క్రీస్తు తన ఆచరణతో మానవాళికి తెలియచేశారు. పరిశుద్ధుడైన దేవుడు మానవాళిని పాపబంధకముల నుండి, పాపశిక్ష నుండి విడుదల చేయుటకు తన్నుతానే బలిగా అప్పగించుకున్నాడు. గుడ్‌ఫ్రైడే కేవలం యేసుక్రీస్తు మరణదినం కాదు. మానవుడు పరిశుద్ధతను పొందుకొని నూతనంగా జన్మించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన రోజు. సిలువలో యేసుప్రభువు పలికిన సప్తస్వరాలు శిథిలమైపోయిన మానవుని జీవితాన్ని అద్భుతమైన నవకాంతులమయమైన నిర్మాణముగా మార్చివేశాయి. ప్రపంచానికి ఆయన అందించిన వెలలేని ప్రేమ, శత్రువుని కూడా కరిగించగలిగిన ఆయన క్షమాపణ, ఎంతటి దీనులనైనా అక్కున చేర్చుకోగలిగిన ఆదరణ, ఆప్యాయత, చెక్కు చెదరనవని ఆ సిలువలో ఆయన ప్రకటించిన నిత్యజీవము చిరస్థాయిగా నిలిచేదని ఋజువు చేశాయి. దేవుని ప్రేమను రుచిచూచిన ఒక దైవజనుడు ఇలా అంటాడు. ‘అంతులేని పాపము జలరాసుల్లో నన్ను దింపగా సిలువ రక్తము నాకై కార్చితివో, క్రయధనం నాకై చెల్లించితివో! కమ్మనైన నీదు ప్రేమ నాదు కట్లు తెంపెను. నీవు పొందిన గాయము నాకు స్వస్థత నిచ్చెను. ఏమిచ్చి ఋణం తీర్తునయ్యా యేసయ్యా! నా జీవితం అంకితం నీకే.’ అప్పటికే ఆయన చెప్పినట్లు తిరిగి లేస్తాడేమోనని ఆనాటి యూదులు, రోమన్ సైనికులు అనేక కథనాలు రచించుకుని సిద్ధంగా ఉన్నారు. కాని ఆ కథలేవీ సత్యం ముందు నిలబడలేదు. ఆయనను సిలువ మరణం ద్వారా చంపేశామని జబ్బలు కొట్టుకునే యూదులకు, రోమన్లకు మింగుడుపడని వార్త ‘ఆయన సజీవుడై పునరుత్థానుడుగా లేచెను.’ యేసుక్రీస్తుకు సిలువ మరణం విధించిన రోమన్ శతాధిపతి పేరు బైబిల్లో లేదు గాని చరిత్రలో అతని పేరు చూడగలము. ఆ వ్యక్తి పేరు లాజినస్. పిలాతు ఆజ్ఞను శిరసావహించడంలో ప్రథముడు. అతని సమక్షములోనే యేసు మేకులు కొట్టబడ్డాయి. ముళ్లకిరీటం ధరించబడింది. సిలువ ప్రక్రియంతా పూర్తయ్యాక పొంతి పిలాతు ముందు క్రీస్తు మరణాన్ని ధ్రువీకరించి వెళ్తున్నాడు. ఆ సందర్భంలో ఆ నీతిమంతుని జోలికి పోవద్దు అని తన భర్తకు వర్తమానం పంపిన పిలాతు భార్య క్లౌదియ ప్రొక్యులా లాజినస్‌ను కలుసుకుంది ఇలా అడిగింది సిలువలో మరణించిన ‘క్రీస్తుపై నీ అభిప్రాయం ఏమిటి?’. ఆ ప్రశ్నలకు లాజినస్ ఇచ్చిన సమాధానమిది–‘క్రీస్తు మరణించినప్పుడు జరిగిన పరిస్థితులను గమనిస్తే ఆయన నిజముగా దేవుడని రుజువు చేయబడింది. మిట్ట మధ్యాహ్నం సూర్యుడు తన ముఖాన్ని దాచుకున్నప్పుడు వచ్చిన చీకటి, సమాధులలో నుండి మనుష్యులు లేవడం, దేవాలయపు తెర పైనుండి క్రిందకు చినగడం చూస్తుంటే తాను చెప్పినట్టే ఆయన మూడవ రోజున తిరిగి లేస్తాడు. మరణపు మెడలు వంచి సజీవుడై బయటకు వస్తాడు. సమాధి నుంచి బయటకు వచ్చాక ఆయన విశ్వసంచారానికి బయలుదేరుతాడు. ఈసారి ఆయన్ను ఏ రోమన్ చక్రవర్తి, శతాధిపతి గాని, సైనికుడు గాని, యూదా మత పెద్దలైన శాస్త్రులు, పరిసయ్యులు గాని ఏ ఒక్కరూ అడ్డుకోలేరు’ అని బదులిచ్చాడు. క్రీస్తు పునరుత్థానాన్ని ఈస్టర్ అని పిలుస్తారు. ప్రపంచవ్యాప్తంగా క్రీస్తు పునరుత్థాన పండుగను చాలా భక్తిశ్రద్ధలతో క్రైస్తవులు జరుపుకుంటారు. యేసు లేఖనాల ప్రకారం మరణించి సమాధి చేయబడి మూడవ దినమున లేచెను. నా విమోచకుడు సజీవుడు అని యోబు కొన్ని వేల సంవత్సరాల క్రితమే ప్రవచనాత్మకంగా పలికాడు. దావీదు కీర్తనలలో కూడా క్రీస్తు పునరుత్థానమును గూర్చి ప్రవచనాలు ఉన్నాయి. ‘నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు. నీ పరిశుద్ధుని కుళ్లుపట్టనియ్యవు’ (కీర్తన 16:10) అనే ప్రవచనం క్రీస్తుకు ముందు వెయ్యిసంవత్సరాల క్రితమే చెప్పబడింది. యెషయా అనే ప్రవక్త క్రీస్తును గూర్చి ఎన్నో ప్రవచనాలు చెప్పాడు. అవన్నీ క్రీస్తుకు ముందు ఏడువందల సంవత్సరాల క్రితం చెప్పబడ్డాయి. వాటిలో క్రీస్తు పునరుత్థానానికి సంబంధించిన ప్రవచనం యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో చూడగలము. అతడు తన్నుతానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును. యేసుక్రీస్తు పునురుత్థానానికి ఎన్నో ఆధారాలు, సాక్ష్యాలు ఉన్నాయి. క్రీస్తు పునరుత్థానానికి ఆయన శిష్యులే ప్రధాన సాక్షులు. ‘శిష్యులు భ్రమలో ఉన్నారు. అందుకే వారు ఎవరిని చూసినా యేసులాగే కనిపించారు అని తలచేవారు’ అని కొందరు వాదిస్తారు. నిజంగా వారికున్నది భ్రమ అయితే అది కొంతకాలమే ఉంటుంది. క్రీస్తు శిష్యులలో చాలామంది హతసాక్షులయ్యారు. తాము నమ్మిన ప్రభువు కోసం తమ ప్రాణాలను అర్పించారు. ఒక అబద్ధం కోసం అంతమంది ప్రాణాలర్పించరు కదా! ఉదాహరణకు క్రీస్తు శిష్యుడైన తోమా భారతదేశానికి వచ్చి సువార్తను ప్రకటించాడు. క్రీస్తు సువార్త మొదటి శతాబ్దంలోనే భారతదేశంలోనికి వచ్చింది. యేసు శిష్యుడైన తోమా ఆయన తిరిగి లేచాడంటే మొదట నమ్మలేదు. నీవు అవిశ్వాసి కాక విశ్వాసివై యుండు అని ప్రభువు చెప్పిన మాటకు సానుకూలంగా స్పందించి ‘నా దేవా నా ప్రభువా’ అని పలికాడు. అప్పటి నుండి తోమా క్రీస్తు సాక్షిగా జీవిస్తూ అనేకులను సత్యంవైపు నడిపించాడు. తోమా భారతదేశానికి మొదటి శతాబ్దంలోనే వచ్చి యేసుక్రీస్తు సువార్తను అనేకులకు అందించాడు. అనేక సంఘాలను మరియు దేవాలయాలను కట్టి చివరకు బల్లెము ద్వారా పొడవబడి చనిపోయాడు. యేసు క్రీస్తు దైవత్వము మీద, ఆయన మరణ పునరుత్థానముల మీద సందేహాలు కలిగిన వ్యక్తులలో ఒకనిగా పేరుగాంచిన ఫ్రాంక్ మోరిసన్ యేసు క్రీస్తు మరణమును జయించి తిరిగి లేవలేదని నిరూపించాలని పరిశీలన ప్రారంభించాడు. అనేక ప్రాంతాలు సందర్శించి అనేక వివరాలు సేకరించిన తదుపరి ఆయనకు లభించిన చారిత్రక ఆధారాలు అన్నింటిని బట్టి యేసుక్రీస్తు దైవత్వాన్ని అంగీకరించి అద్భుతమైన పుస్తకాన్ని వ్రాశాడు. దాని పేరు ‘ఈ రాతిని ఎవరు కదిలించారు?’ ఆ పుస్తకంలో యేసుక్రీస్తు పునురుత్థానానికి సంబంధించి అనేక నిరూపణలతో క్రీస్తు పునరుత్థానం వాస్తవికమని తెలియజేశాడు. యేసు మరణాన్ని జయించి తిరిగి లేవలేదు అని చెప్పడానికి ఏవేవో సిద్ధాంతాలను చలామణీలోకి తీసుకొచ్చినా, అవేవీ వాస్తవం ముందు నిలబడలేదు. అరిమతయియ యోసేపు, నికోదేము అనువారు క్రీస్తు దేహాన్ని సిలువనుండి దింపి ఒక తోటలో తొలచబడిన సమాధిలో ఉంచారు. అరిమతయియ యోసేపు బహు ధనవంతుడు, యూదుల న్యాయసభలోని సభ్యుడు. తాను ఇంతకు ముందు క్రీస్తుకు రహస్య శిష్యుడు. తనకోసం తొలిపించుకున్న సమాధిని క్రీస్తుకు ఇచ్చేశాడు. నీ పరిస్థితేంటి అని ఎవరో అడిగారట. అందుకు యోసేపు ఇచ్చిన సమాధానం ‘నేను యేసుకు ఈ సమాధిని మూడు రోజులకే ఇస్తున్నాను’. నిజమే! యేసు సమాధిలో మూడు రోజులే ఉన్నాడు. తాను మరణించక ముందు తన పునరుత్థానమును గూర్చి పదే పదే మాట్లాడాడు. తాను చెప్పినట్టే క్రీస్తు మరణాన్ని జయించి లేచాడు. ఓ మరణమా నీ ముల్లెక్కడా? ఓ మరణమా నీ విజయమెక్కడా? అని శాసిస్తూ మరణపు ముల్లును విరచి క్రీస్తు మృత్యుంజయుడైనాడు. పునః అనగా తిరిగి, ఉత్థానము అనగా లేపబడుట. ప్రపంచాన్ని గడగడలాడించిన ఘనులెందరో సమాధులకే పరిమితమయ్యారు. ఈజిప్టులో నేటికి ఫారోల సమాధులు (పిరమిడ్లు), వారి దేహాలు ఉన్నాయి. సూర్యదేవుని కుమారులమని చాటించుకున్న ఫారోల్లో ఏ ఒక్కరూ మరణాన్ని జయించలేకపోయారు. బబులోను రాజైన నెబుకద్నెజరు మరణాన్ని ఓడించలేకపోయాడు. అలెగ్జాండ్రియాలో ఇప్పటికీ అలెగ్జాండర్ ది గ్రేట్ సమాధి ఉంది. రోవ్‌ులో జూలియస్ సీజర్ సమాధి మూయబడి ఉంది. చరిత్రలో ఎందరో మరణాన్ని జయించలేకపోయారు. యేసు మరణాన్ని జయించుట ద్వారా దేవునికి అసాధ్యమైనది ఏది ఉండదని ఋజువుచేయబడింది. క్రీస్తు మరణంతో పాపం ఓడిపోయింది. అయితే ఆయన పునరుత్థానంతో పాపానికి జీతమైన మరణం సమాధిచేయబడింది. చావు దాని రూపురేఖలను కోల్పోయింది. బంధింపబడిన వ్యక్తికి సంపూర్ణ విడుదల వచ్చింది. ఏండ్ల తరబడి పాపిగా ముద్రవేయబడిన మానవుడు హర్షాతిరేకంతో ఆనందించే భాగ్యం కలిగింది. సమస్యలమీద సమస్త మానవ ఉద్రేకాల ఫలితాల మీద చివరకు మరణం మీద విజయం కల్గింది. ఇంతవరకు మానవాళి మీద పురులు విప్పుకొని పంజాలు విసిరిన మరణం కనీవినీ ఎరుగని రీతిలో మచ్చుకైనా మిగలకుండా మరణమైపోయింది. క్రీస్తు పునరుత్థానం మనిషికి నిజమైన శాంతిని సమాధానాన్ని ప్రసాదించింది. డబ్బు, పలుకుబడి, ఆస్తి ఐశ్వర్యాలు ఎన్నున్నా ఈ రోజుల్లో మనిషికి ఆనందం, శాంతి కరువైపోతోంది. శాంతిగా బతకడానికి మానవుడు చెయ్యని ప్రయత్నమంటూ ఏదీ లేదు. నవ్వుతూ బతకాలి అనే ఉద్దేశంతో ప్రపంచవ్యాప్తంగా లాఫ్టర్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. రోజులో కొంత సమయం అక్కడికి వెళ్ళి పగులబడి నవ్వుకుంటున్నా శాంతి సమాధానాలు దొరకని కారణాన ఈ మధ్యన క్రైయింగ్ క్లబ్‌లు ప్రారంభమయ్యాయి. గుండెల్లో ఉన్న దుఃఖాన్ని ఏడ్వడం ద్వారా బయటకు పంపిస్తే సంతోషంగా ఉండొచ్చన్నది వారి అభిప్రాయం. ఇవన్నీ తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించే మార్గాలు మాత్రమే. నిజమైన ఆనందం, శాంతి దేవుణ్ణి హృదయంలోనికి ఆహ్వానించడం ద్వారా లభిస్తుంది. యేసుక్రీస్తు అలసిపోయిన ప్రజలను చూచి ఇలా అన్నాడు. ‘ప్రయాసపడి భారము మోసుకొనువారలారా! నా యొద్దకు రండి! నేను మీకు విశ్రాంతిని కలుగచేతును’. ఆయన చెంతకు వచ్చిన ఎన్నో జీవితాలు పావనమయ్యాయి. సమస్త జ్ఞానమునకు మించిన సమాధానమును అనుభవిస్తు ఆనందంతో పరవశులౌతున్నారు. పునరుత్థానుడైన క్రీస్తును చూచి శిష్యులు పులకించిపోయారు. దేవుడు తమ్మును విడిచిపెట్టలేదన్న సత్యం వారికి కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. నూతనోత్తేజంతో తమ లక్ష్యసాధనలో ముందుకు సాగిపోయారు. జర్మనీ దేశంలో క్రీ.శ 1483లో జన్మించిన మార్టిన్ లూథర్ గురించి తెలియని వారుండరు. యవ్వనకాలంలోనే స్ఫూర్తిదాయకమైన ఆలోచనలతో నింపబడినవాడు. సంకుచితత్వానికి దర్పణాలుగా మారిపోయిన స్వార్థజీవులకు వ్యతిరేకంగా తన పోరాటాన్ని ప్రారంభించాడు. తాను జీవించిన కాలంలో అధికారం మూర్ఖుల చేతుల్లో ఉందని గుర్తించాడు. సగటు మనిషి అన్ని విషయాల్లో బానిసగానే ఉన్నాడన్న విషయాన్ని గుర్తించాడు. ప్రతి ఒక్కరూ దేవుణ్ణి తెలుసుకోవాలి. మనిషి చేసే కార్యాల వలన రక్షణ రాదుగాని విశ్వాసం ద్వారానే సాధ్యమని నిరూపించాలనుకున్నాడు. రాత్రింబగళ్ళు విశేషంగా ప్రయాసపడ్డాడు. ఆనాటి మతాధికారులకు ఎదురు తిరగడమంటే మరణాన్ని కోరుకోవడమే. ఒకరోజు మార్టిన్ లూథర్ నిరాశ నిస్పృహతో నీరుగారిపోయాడు. ఇంటిలో ఓ బల్లపై ముఖాన్ని వాల్చి ఏడుస్తున్నాడు. భయరహిత వాతావరణం సృష్టించుకొని ముందుకు సాగడం కష్టం అనిపించింది. దుఃఖిస్తున్న తన భర్తను చూచిన కేథరిన్ గబగబా లోపలికి వెళ్ళి నల్లబట్టలు వేసుకొని లూథర్ ముందు నిలబడింది. జర్మనీ దేశంలో ఏదైనా దుర్వార్తను తెలియచేసే సందర్భంలో నల్లబట్టలు ధరిస్తారు. ‘నేను ఇప్పటికే దుఃఖములో ఉన్నాను. నీవు తీసుకొచ్చిన మరొక దుర్వార్త ఏమిటని ప్రశ్నించాడు’. ‘యేసుక్రీస్తు చచ్చిపోయాడు’ అని జవాబిచ్చింది కేథరిన్. నీవు చెప్పేది వాస్తవమే గానీ క్రీస్తు మరణించి తిరిగి లేచాడు గదా! లూథర్ కొంచెం స్వరం పెంచి అన్నాడు. కేథరిన్ లూథర్ భుజం మీద చెయ్యి వేసి ‘క్రీస్తు మరణాన్ని జయించి లేచాడని నమ్మే ప్రతి ఒక్కడూ ఏవిషయానికీ బెదిరిపోడు, చింతించడు. తుది శ్వాస వరకు నాభర్తలో ధైర్య సాహసాలను, దేవునిపై అచంచల విశ్వాసాన్ని మాత్రమే నేను చూడాలనుకొంటున్నాను’ అని కేథరిన్ మాట్లాడుతుండగానే లూథర్‌లో ఉన్న భయం పటాపంచలయ్యింది. అప్రతిహతంగా ముందుకు సాగిపోయి ఉత్తమ వ్యక్తిగా ఎదిగాడు. తాను అనుకున్న వాటిని దైవిక బలంతో, దృఢ విశ్వాసంతో సాధించగలిగాడు. ప్రపంచ క్రైస్తవ చరిత్రలో ఓ నూతన అధ్యాయానికి నాంది పలికాడు. సమాధికి, శ్మశానానికి చేరడమే మానవుని ముగింపనుకున్న వారందరికీ పాపరహితుడైన యేసుక్రీస్తు పునరుత్థానం మరో గొప్ప సత్యంతో కళ్లు తెరుచుకొనేలా చేసింది. మానవునికి ముగింపు లేదని ఒక అపూర్వమైన అనిర్వచనీయమైన నిత్యత్వమనేది వుందని గొంతు చించుకొని చాటి చెప్పింది. దుఃఖముతో, నిరాశతో, నిస్పృహలతో వేసారిపోతున్న వారందరికీ ఆశా కిరణంగా క్రీస్తు వున్నాడన్న అద్భుత సత్యం వెల్లడయ్యి పోయింది. ఎన్నో ఏండ్లుగా ఎన్నో కోట్లమంది సమైక్యంగా పోరాడినను మన జీవితాల్లో శత్రువై నిలిచిన దుర్వ్యసనాలు, దౌర్భాగ్యమైన శారీరక కోరికలు, పాపపు ఇచ్ఛలు, విచ్చలవిడి పాపకార్యాలు మరే నరశక్తి వలన పటాపంచలు చేయబడవు గాని, పరమాత్ముడు కార్చిన అమూల్య రక్తం ద్వారా చేసిన త్యాగం ద్వారా అందించిన పునరుత్థాన శక్తిచేత మాత్రమే సాధ్యం. యేసుక్రీస్తు మరణ పునరుత్థానాలు కులమతాలకు అతీతమైనవి. ఇది మానవ హృదయాలకు సంబంధించినది తప్ప ఈ భౌతికానుభవాలకు చెందినది కాదని యేసుక్రీస్తును రక్షకునిగా రుచి చూచిన వారందరికీ యిట్టే అవగతమవుతుంది. లోక వినాశనానికి మూలకారకుడైన అపవాది క్రియలను లయపరచుటకే యేసు క్రీస్తు ప్రత్యక్షమాయెనని సత్యగ్రంథమైన బైబిల్ గ్రంథం స్పష్టపరచింది. సాక్షి పాఠకులకు ఈస్టర్ శుభాకాంక్షలు. డా. జాన్‌వెస్లీ, క్రైస్ట్ వర్షిప్ సెంటర్, రాజమండ్రి -
ఎగిసిన క్షమా కేతనం పునరుత్థాన ఆదివారం
‘మృతులుండే సమాధిలో యేసుక్రీస్తును వెదకడానికి వచ్చారా? ఆయన ఇక్కడ లేడు, సజీవుడయ్యాడు. తన వారిని కలుసుకోవడానికి గలిలయ ప్రాంతానికి వెళ్ళాడు. ఆయన్ను శుక్రవారం ఇదే సమాధిలో పడుకోబెట్టగా, ఇపుడు ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని కావాలంటే చూడండి’ అంటూ ఖాళీ సమాధిలో ఉన్న ఒక దేవదూత, ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామునే ప్రభువు దేహానికి పరిమళ క్రియలు సంపూర్తి చేసేందుకు వచ్చిన యేసు తల్లి మరియకు, సలోమి అనే మరొక స్త్రీకి, ప్రభువు శిష్యురాలైన మగ్దలేనే మరియకు ఇంకా ఇతర స్త్రీలకు ఆనాటి ‘బ్రేకింగ్ న్యూస్’ ప్రకటించాడు. అది విని స్త్రీలంతా విస్మయమొంది భయంతో వణుకుతూ పారిపోయారు. అయితే సజీవుడైన యేసుక్రీస్తు మగ్దలేనే మరియకు ఆ రోజే మొట్టమొదట కనిపించి, తన పునరుత్థాన శుభవార్తను తన శిష్యులకు ప్రకటించమని ఆదేశించాడు. అయితే యేసు మరణంతో పుట్టెడు దుఃఖంలో కూరుకుపోయిన శిష్యులకు ఇది నమ్మశక్యంగా కనిపించలేదు. అందువల్ల వాళ్లంతా భోజనానికి కూర్చున్న సమయంలో యేసుప్రభువు వారిమధ్య ప్రత్యక్షమై, వారి అపనమ్మకాన్ని బట్టి వారిని మందలించి, సర్వలోకానికి వెళ్లి సర్వ సృష్టికి తన పునరుత్థాన క్షమా శుభవార్తను ప్రకటించమని ఆదేశించాడు (మార్కు 16:1–10). అందువల్ల క్రైస్తవానికి పునాది యేసుప్రభువు పునరుత్థానమే!! ప్రపంచంలోని అతి చిన్నదైన ఇజ్రాయేలు అనే దేశంలోని యూదయ అనే ఒక మూలన ఉన్న ప్రాంతంలో యేసుక్రీస్తు దైవకుమారుడుగా జన్మించి, ఒక సాధారణ మానవుడుగా అయినా ఏ లోపమూ లేని పాపరహితమైన సంపూర్ణ మానవుడుగా 33 ఏళ్ళపాటు సామాన్యులు, నిరుపేదలు, నిరక్షరాస్యులైన అతి సాధారణ ప్రజలతో మమేకమై జీవించిన యేసుక్రీస్తు ప్రబోధాలు, విలక్షణమైన ఆయన దైవికత మూల స్తంభాలుగా ఆరంభమైన ‘క్రైస్తవం’ అతి కొద్దికాలంలోనే అనేక ప్రపంచ దేశాలకు పాకి అనేక ప్రపంచ నాగరికతల్ని ప్రభావితం చేసింది. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ, కరడుగట్టిన హింసాత్మకతకు పుట్టినిల్లుగా మారిన లోకానికి ప్రేమ, సాత్వికత్వం, దీనత్వం, సమన్యాయం, క్షమాభావనల సౌరభాలనద్ది, కోట్లాదిమంది అనామకులకు ఉనికినిచ్చిన ఒక ఆత్మీయవిప్లవమైంది. క్రైస్తవం స్పృశించిన ప్రతి జీవి, నేల పరివర్తన నొంది పులకరించింది. ఈస్టర్ పండుగ అంటే, ఈ లోకం సిలువ వేసి చంపిన ఒక మహనీయుడు తిరిగి సజీవుడయ్యాడని సంబరపడే సందర్భం మాత్రమే కాదు, హింసకు ప్రతి హింసే జవాబని మాత్రమే తెలిసిన లోకానికి, క్రీస్తు జీవితంలో పరిఢవిల్లిన క్షమాపణను, ప్రేమను పరిచయం చేసి విప్లవాత్మక మార్పులకు నాంది పలికిన శుభారంభపు తొలి దినమది. రెండు రోజుల ముందే సిలువలో యేసు ప్రభువు మీద ఉవ్వెత్తున విరుచుకుపడ్డ కనీ వినీ ఎరుగని దౌర్జన్యం, దమనకాండ, హింస ఆయన ప్రేమ, క్షమాపణ శక్తి ముందు నిర్వీర్యమై ఓటమి పాలయ్యాయని లోకానికి ప్రకటితమైన రోజు అది. అది సమాప్తమే... కాని అంతం కాదు... శుక్రవారం నాటి యేసు సిలువ యాగం విషాదంతో సమాప్తమైంది. అయితే ఆదివారం తెల్లవారు జామున యేసు పునరుత్థానంతో లోకంలో ‘క్షమాయుగపు’ శుభారంభం జరిగింది. మానవాళిని తన అపారమైన కృపలో భాగం చేసుకోవాలన్న దేవుని అనాది సంకల్పం, అలా దౌర్జన్యం, దుర్మార్గం పైన యేసు సిలువ బలియాగం ద్వారా ఘన విజయం సాధించి క్రైస్తవానికి బీజాలు వేసింది. శుభ శుక్రవారం నాడు సిలువలో, ఈస్టర్ ఆదివారం నాడు యేసు పునరుత్థానంతో ఖాళీ అయిన రాతి సమాధిలో దేవుని ప్రేమ, క్షమాపణ పునాదులుగల దేవుని రాజ్యం వెల్లివిరిసింది. ఆయన్ను సిలువ వేసి చంపి అంతం చేద్దామనుకున్న రోమా సామ్రాజ్యం ఆ తరువాత మూడొందల ఏళ్లకే పతనమై భూస్థాపితమైంది. కానీ నాటి సిలువలో, ఖాళీ సమాధిలో అంకురార్పణ జరిగిన దేవుని క్షమారాజ్యం ఈ రెండువేల ఏళ్లుగా ప్రపంచమంతా విస్తరిస్తూనే ఉంది, కోట్లాదిమందికి ఆశీర్వాదాల్ని ప్రసాదిస్తూనే. ఆరున్నర అడుగుల ప్రభువు యూదుల అత్యున్నత చట్టసభ సన్ హెడ్రిన్లో సభ్యుడైన అరిమతై యోసేపు తన కోసం తొలిపించుకున్న ఒక కొత్త రాతి సమాధిలో శుభ శుక్రవారం నాటి సాయంత్రం యేసుప్రభువు పార్థివ దేహాన్ని ఖననం చేశారని బైబిల్ పేర్కొంటోంది (మత్తయి 27:57–60, యోహాను 19:41). ప్రభువు సమాధి ఒక తోటలో ఉండిందని కూడా యోహాను సువార్త పేర్కొంది (19:41). పైగా యెరూషలేములో హీబ్రు భాషలో ‘గొల్గొతా’ అని, లాటిన్ భాషలో ‘కల్వరి’ అని పిలిచే కపాలం లాగా కనిపించే ఒక కొండకు దగ్గరలో ఆయన్ను సిలువ వేశారని, దానికి దగ్గరలోని ఒక తోటలోనే ఆయన సమాధి ఉందని కూడా బైబిల్ పేర్కొంది. ఈ ఆనవాళ్ళంటికీ సరిపోలిన ఆయన సమాధి స్థలం కోసం చరిత్రలో పురాతత్వశాస్త్రవేత్తలు, బైబిల్ పండితులు చేసిన ఎంతో అన్వేషణ, పరిశోధనలు ఫలించి ‘గార్డెన్ టూంబ్’గా పిలిచే ఒక రాతి సమాధి యెరూషలేము పట్టణంలో దమస్కు ద్వారానికి దగ్గరలో బయటపడింది. బైబిల్ పురాతత్వ పరిశోధనలకు పితామహుడుగా పేర్కొన దాగిన ఎడ్వర్డ్ రాబిన్సన్ అనే అమెరికన్ చరిత్రకారుడు 1852 దాకా చేసిన తన పరిశోధనల సారాంశాన్నంతా ‘బిబ్లికల్ రీసెర్చ్ ఇన్ పాలస్తీనా’ అనే పేరుతో ఒక గ్రంథంగా ప్రచురించడంతో ఈ సమాధి విషయం ప్రపంచానికి తెలిసింది. అప్పటి నుండి ‘గార్డెన్ టూంబ్’ అనే ఈ సమాధి స్థలం క్రైస్తవ పర్యాటకులకు ముఖ్యంగా ప్రొటెస్టెంట్ తెగకు చెందిన వారికి దర్శనీయ స్థలమైంది. ఈ తోట భూగర్భంలో బయటపడిన బ్రహ్మాండమైన ఒక రాతి నీటి తొట్టి, ఒక పెద్ద ఒలీవ నూనె గానుగ ఒకప్పుడు అదొక ఆలివ్ తోట అని చెప్పడానికి రుజువులయ్యాయి. గొప్ప విశేషమేమిటంటే, ఆ సమాధిని అరిమతై యోసేపు తన కోసం తన ఎత్తు ప్రకారంగా తొలిపించుకున్నాడు. కాని అనుకోకుండా యేసుప్రభువును అందులో పడుకోబెట్టినపుడు, ఆ భాగం యేసుప్రభువు ఎత్తుకు సరిపోలేదు. అందువల్ల ఆయన కాళ్ళుండిన స్థలంలో సమాధి రాతి గోడను నాలుగంగుళాలపాటు అప్పటికప్పుడు తొలిపించిన గుర్తులు కనిపిస్తాయి. దాన్ని బట్టి యేసుప్రభువు ఎత్తు ఆరడుగుల ఐదంగుళాలకు పైనే ఉంటుందని అంచనా వేయవచ్చు. పైగా ఆయన సమాధికి అడ్డుగా పెట్టిన అతి పెద్ద రాయిని మనకోసం ఎవరు తొలగిస్తారంటూ ప్రభువు అనుచరులైన మగ్దలేనే మరియ తదితర స్త్రీలు ఈస్టర్ ఆదివారం తెల్లవారుజామున ఆయన సమాధి వద్దకు వెళ్తూ మాట్లాడుకున్నట్టు బైబిల్లో చదువుతాము. నాడు సమాధికి అడ్డంగా ఐదడుగుల ఎత్తు రెండు టన్నుల బరువున్న ఒక గుండ్రటి రాయిని పెట్టారన్నది, ఇపుడా సమాధి ద్వారం వద్ద దాన్ని దొర్లించడానికి చేసిన రాతి కాలువలాంటి స్థలాన్ని బట్టి అర్థమవుతుంది. – రెవ.డా.టి.ఎ.ప్రభుకిరణ్ సువార్త ప్రబోధకులు -
పిల్లలమర్రికి పునర్జన్మ!
సాక్షి, మహబూబ్‌నగర్: పిల్లలమర్రికి పునర్జన్మ! పిల్లలమర్రికి ప్రాణమొచ్చింది. ఏడాది క్రితం వరకు ఎండిన ఆకులు.. విరిగిపడ్డ ఊడలతో కళావిహీనంగా కనిపించిన 800 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఆ చెట్టు మళ్లీ పునరుజ్జీవం పోసుకుంటోంది. నాడు 60 శాతం వరకు ఎండిపోయిన పిల్లలమర్రి నేడు 90 శాతం వరకు చిగురించిన ఆకులతో మళ్లీ చూడముచ్చటగా దర్శనమిస్తోంది. మరో ఏడాదిలోగా పూర్తి పూర్వస్థితికి తిరిగి రానుంది. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో గల ఈ మర్రి చెట్టు.. శాఖోపశాఖలుగా 4 ఎకరాల్లో విస్తరించింది. కానీ నిర్వహణ లోపించడంతో పూర్తిగా ఎండిపోయిన రెండు ఊడలు, ఒక చెట్టు భాగం 2017 డిసెంబర్ 16న రాత్రి భారీ శబ్దంతో విరిగిపడ్డాయి. దీంతో అదే నెల 20న పిల్లలమర్రి ప్రధాన ద్వారాన్ని అధికారులు మూసేశారు. మిగతా చెట్టు పరిరక్షణలో భాగంగా ఊడలు కిందికి పడకుండా వాటికి సహాయంగా రూ.3.80 లక్షలతో 36 పిల్లర్లు నిరి్మంచారు. చచ్చిపోతున్నన చెట్టును బతికించేందుకు సెలైన్ బాటిళ్లతో ప్రాణం పోసే చర్యలకు శ్రీకారం చుట్టారు. ఒక బాటిల్ నీళ్లలో 20 మి.లీ.ల క్లోరోపైరిపస్ మందును కలిపి పడిపోతున్న ఊడలకు కట్టారు. లీటర్ నీళ్లలో 5 మి.లీ. క్లోరోపైరిపస్ మందు ను కలిపి ఊడల కింది భాగంలో పిచికారీ చేశారు. చెదలు పట్టిన భాగాన్ని తీసివేసి సల్ఫర్‌ఫాస్ఫేట్‌ను చల్లుతున్నారు. వేసవిలో ట్యాంకర్ల ద్వారా నీటిని తీసుకొచ్చి చెట్లు.. ఊడలకు అందిం చారు. చెట్టు చుట్టుపక్కల 300 ట్రాక్టర్ల ఎర్రమట్టి పోయించారు. దీని పునరుజ్జీవం కోసం ఇప్పటి వరకు అధికారులు రూ.10 లక్షల వరకు వెచ్చించారు. పిల్లలమర్రి ఆవరణలో పర్యాటకులు వెళ్లకుండా గేటు ఎదుట ఒకవైపు చెట్టును చూసుకుంటూ మరోవైపు దిగేలా ఏడాది క్రితం రూ.4 లక్షలతో కెనోపివాక్ బ్రిడ్జిను ఏర్పాటుచేశారు. దీంతో పిల్లలమర్రి పూర్వస్థితికి వస్తోంది. -
ఏడాదిలోగానే ‘పునరుజ్జీవం’!
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి శ్రీరాంసాగర్‌కు నీటిని ఎత్తిపోసేలా చేపట్టిన పునరుజ్జీవ పథకంతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రెండు పంటలకు నీళ్లు అందుతాయని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. పునరుజ్జీవ పథకాన్ని 18 నెలల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నా.. సంవత్సర కాలంలోనే పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల్లో టీఆర్ఎస్ సభ్యులు మనోహర్‌రెడ్డి, కె.విద్యాసాగర్‌రావు, బీజేఎల్పీనేత జి.కిషన్‌రెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ప్రభుత్వం పునరుజ్జీవ పథకానికి రూ.1,067 కోట్లతో పరిపాలన అనుమతులు ఇచ్చిందని, వరద కాల్వ ద్వారా రోజుకు ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీకి తరలిస్తామని చెప్పారు. దీనికితోడు ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు సైతం నీళ్లిచ్చేలా కాల్వల ఆధునీకరణ చేపట్టామన్నారు. ప్రజలపై భారం పడుతుందనే.. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ల విలువ పెంచితే 99 శాతం ప్రజలపై తీరని భారం పడుతుందని.. అందువల్లే పెంచడం లేదని హరీశ్‌రావు తెలిపారు. రిజిస్ట్రేషన్ విలువ పెంచకపోవడంతో ప్రాజెక్టుల కింద భూమిని కోల్పోతున్న నిర్వాసితులు తీవ్రంగా నష్టపోతున్నారని కాంగ్రెస్ సభ్యుడు టి.జీవన్‌రెడ్డి సభ దృష్టికి తేగా.. హరీశ్ సమాధానమిచ్చారు. కాంగ్రెస్ హయాంలో భూసేకరణకు రూ.60 వేల నుంచి రూ.2 లక్షలకు మించి పరిహారం చెల్లించలేదని.. తాము ప్రస్తుతం రూ.6 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం చెల్లిస్తున్నామని చెప్పారు. రిజిస్ట్రేషన్ విలువ రూ.60 వేల వరకే ఉన్న చోట మూడింతల పరిహారం లెక్కన రూ.1.80 లక్షలు మాత్రమే వస్తాయని.. కానీ తమ ప్రభుత్వం మానవతా దృక్పథంతో వారికి సైతం రూ.6 లక్షల నుంచి రూ.8 లక్షల పరిహారం అందిస్తోందని పేర్కొన్నారు. ఇక మూసీ ప్రాజెక్టు ఆధునీకరణ కోసం రూ.65.56 కోట్లతో పరిపాలన అనుమతులు మంజూరు చేశామని మరో ప్రశ్నకు మంత్రి హరీశ్‌రావు సమాధానమిచ్చారు. ఈ పనులను 18 నెలల్లో పూర్తిచేసి, చివరి ఆయకట్టు వరకు నీరిందిస్తామన్నారు. ప్రభుత్వాస్పత్రులపై విమర్శలొద్దు: కేసీఆర్ ప్రభుత్వాస్పత్రుల్లో పరిస్థితులపై వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయొద్దని కేసీఆర్ పేర్కొన్నారు. పడకల సంఖ్యకు మించి రోగులు వస్తున్నారని, వైద్యులు మానవతా దృక్పథంతో వైద్యం అందిస్తున్నారని చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో టీఆర్ఎస్ సభ్యుడు జలగం వెంకటరావు అడిగిన ప్రశ్నపై సీఎం స్పందించారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల భయంకరమైన స్థితిలో కూరుకుపోయిన వైద్యారోగ్య శాఖకు తాము జీవం పోస్తున్నామన్నారు. ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్న వైద్య రంగాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని, విమర్శలు చేయడం సరికాదని సూచించారు. ఇటీవల తాను ఓ పత్రికలో ఒక వార్తను చూశానని.. ఓ ప్రభుత్వాస్పత్రిలో బెడ్లు లేవని, కిటికీకి సెలైన్ బాటిల్ కట్టి చికిత్స అందిస్తున్నారని ఫొటోతో సహా ఓ కథనాన్ని ప్రచురించారని చెప్పారు. దానిపై తాను వైద్యారోగ్య మంత్రి, ఆస్పత్రి సిబ్బందితో మాట్లాడితే.. అసలు విషయం తెలిసిందన్నారు. ప్రతి ఆస్పత్రిలో నిర్ణీత సంఖ్యలో పడకలు ఉంటాయని, అంతకు మించి రోగులు రావడంతో వైద్యులు, సిబ్బంది అలా చేయాల్సి వచ్చినట్లుగా వెల్లడైందని చెప్పారు. అందరికీ వైద్యం అందించాలన్న సదుద్దేశం, మానవతా దృక్పథంతో వైద్యులు వ్యవహరిస్తే.. విమర్శిస్తూ కథనాలు ప్రచురించడం సరికాదన్నారు. తర్వాత తాను సదరు పత్రిక యాజమాన్యానికి ఫోన్ చేశానన్నారు. విషయం తెలుసుకోకుండా ఇలాంటి వార్తలు రాయొద్దని.. వైద్యులను ప్రోత్సహించాలని సూచించినట్లు తెలిపారు. రోగుల సంఖ్య పెరిగినా చిత్తశుద్ధితో వైద్యం అందిస్తున్న ప్రభుత్వ వైద్యులను అభినందిస్తున్నానన్నారు. సమయ పాలనపై వద్దా? శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయపాలన అంశంపై బుధవారం అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం జరిగింది. ప్రశ్నోత్తరాల్లో ఎక్కువ సమయం తీసుకోవడంపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గీతారెడ్డి, జీవన్‌రెడ్డిలను సభా వ్యవహారాల మంత్రి హరీశ్‌రావు తప్పుబట్టారు. వారు 15 నిమిషాలకు పైగా సమయం తీసుకుని.. సంబంధం లేకుండా ప్రశ్నలు వేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకే మంత్రికి 30 నిమిషాల సమయం పడుతుందన్నారు. అయినా కాంగ్రెస్ సభ్యులు బయటకు వెళ్లి అధికారపక్షం తమకు సమయం ఇవ్వడం లేదంటోందని విమర్శించారు. ప్రశ్న సూటిగా వేస్తే మంత్రి క్లుప్తంగా సమాధానం ఇస్తారన్నారు. ఖమ్మం జిల్లాలో బోదకాలు వ్యాధిపై మంత్రి లక్ష్మారెడ్డి మాట్లాడితే.. మీరేమో జహీరాబాద్, జగిత్యాల జిల్లాల్లో ప్రబలిన వ్యాధులను ప్రస్తావిస్తున్నారని, ఇది సరికాదని పేర్కొన్నారు. దీంతో హరీశ్‌రావు తీరును కాంగ్రెస్ సభ్యులు తప్పుబట్టడంతో కొంతసేపు వాగ్వాదం జరిగింది. అనంతరం కూడా పలువురు సభ్యులు ఇదే తీరులో ప్రశ్నలు సంధిస్తుండటంతో స్పీకర్ వారి మైక్ కట్ చేశారు. బోదకాలు బాధితులకు పింఛన్లు: లక్ష్మారెడ్డి రాష్ట్రంలో బోదకాలు (పైలేరియా)ను శాశ్వతంగా నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. ఆ వ్యాధి లక్షణాలున్న వారికి, వ్యాధి సోకిన వారికి మందులు అందజేస్తున్నామన్నారు. బోదకాలు సోకి అంగవైకల్యం వచ్చిన వారికి పింఛన్లు ఇవ్వాలని శాసనసభ్యులు కోరిన నేపథ్యంలో.. దీనిపై ముఖ్యమంత్రితో చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో విష జ్వరాలు, పైలేరియాను పూర్తిగా అరికట్టామని తెలిపారు. -
రిసరెక్షన్
కథ రాత్రి పదకొండవుతోంది. భారతి లైబ్రరీలో కూర్చుని చదువుకుంటోంది. అడుగుల శబ్దం వినిపించి తల పెకైత్తి చూసింది. దాదాపు పాతికేళ్ల వయసుంటుంది అతనికి. డెనిమ్ జీన్స్ మీద రౌండ్ నెక్ బ్లూ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు. అతనికి లైబ్రరీ అంతా పరిచయమున్నట్టుగా ఉంది. తనకేం కావాలో బాగా తెలిసినట్టుగా తటపటాయింపు లేకుండా సైన్స్ సెక్షన్లోకి వెళ్లిపోయాడు. అతను ఏదో పాట పాడుతూ సైన్స్ సెక్షన్‌లోని ర్యాక్స్‌లో ఉన్న ఒక్కొక్క పుస్తకాన్ని చూస్తూ ముందుకి వెళ్తున్నాడు. ర్యాక్ చివర్లో ఉన్న సెలైన్స్ ప్లీజ్ అన్న బోర్డ్ చూశాడు. పాట ఆపి, ష్... అనుకుని, తనలో తానే నవ్వుకుంటూ మరొక ర్యాక్ దగ్గరికి వెళ్లిపోయాడు. అతను వెళ్లిపోయేంతవరకూ అతన్నే ఆశ్చర్యంగా చూసిన భారతి తను చదువుతున్న పుస్తకం మూసి కవర్‌పేజీ చూసింది. పోస్ట్‌మార్టం. భారతి చదువుతున్న బుక్ టైటిల్ అది. తెలుగులో ఇక ఎవరి పుస్తకాలు వాళ్లే ప్రచురించుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి, రచయిత సెల్ఫ్ పబ్లిష్ చేసుకున్న పుస్తకం. చరిత్ర మనకి ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది. ఆ పాఠాలను మర్చిపోతే అప్పటి తప్పులే పునరావృత్తం అవుతూ ఉంటాయి. అందుకే మరణించిన నా మిత్రుడి జ్ఞాపకంగా ఈ పుస్తకం రాస్తున్నానని పరిచయ వాక్యాల్లో చెప్పుకొచ్చాడు రచయిత. భారతికి చదువుకోవడం అంటే చాలా ఇష్టం. చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని, పెళ్లి చేసుకుని, ఇల్లు కట్టుకుని, పిల్లల్ని కని - ఇలా పద్ధతి ప్రకారం జీవితం సాగిపోవాలని ఆమె కోరిక. అయితే తన సబ్జెక్ట్‌కి సంబంధం లేని పుస్తకాలు చదవడమంటే భారతికి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. అయినా కూడా ఆమె ఆసక్తిగా పుస్తకం తెరిచి ఆపిన చోటు నుంచి చదవడం మొదలుపెట్టింది. ఈ పోస్ట్‌మార్టం పుస్తకాన్ని ఈ మధ్య అందరూ చదువుతున్నారు. ఫేస్బుక్లో చాలామంది ఈ పుస్తకం గురించి రివ్యూలు రాస్తున్నారు. ఆ రివ్యూల్లో చాలామంది - పోస్ట్‌మార్టం పుస్తకం చదివాక నిద్రపట్టలేదనీ, తమని బాగా డిస్టర్బ్ చేసిందనీ, చదువుతున్నంతసేపూ కన్నీళ్లు పెట్టుకున్నామని రాశారు. పోస్ట్‌మార్టం పుస్తకం ఒక ఫ్రెండ్ ద్వారా భారతికి చేరింది. నువ్వు బోర్ కొట్టి బుక్స్ చదువుతావు. నాకు బుక్ చదవడమే బోర్. అది కూడా బయోగ్రఫీలు నావల్ల కాదు అని తన ఫ్రెండ్‌కి చెప్పి తప్పించుకుందామని చూసింది భారతి. కానీ అతను ఒప్పుకోలేదు. ఈ బుక్ చదవకపోతే నీ లైఫ్ వేస్ట్ అన్నాడు. ‘ఇది మన స్టూడెంట్స్ తప్పక చదవాల్సిన పుస్తకం. నీ కోసం బుక్ ఎగ్జిబిషన్ నుంచి ఒక కాపీ తెచ్చాను. చదవాల్సిందే’ అనడంతో ఇష్టం లేకున్నా ఆ పుస్తకాన్ని తీసుకుంది. కానీ చాలా రోజుల వరకూ ఆ పుస్తకాన్ని తెరవనైనా లేదు భారతి. ఇప్పుడు ఎగ్జామ్స్ దగ్గర పడ్డాయి కాబట్టి లైబ్రరీకి వచ్చి చదువుకుందామనుకుంది. వస్తూ వస్తూ తెచ్చుకున్న క్లాస్ పుస్తకాలతో పోస్ట్‌మార్టం కూడా కలిసిపోయింది. సాయంత్రం నుంచీ సబ్జెక్ట్ పుస్తకాలు చదివి బోర్ కొడుతుంటే సరేలే అని పోస్ట్‌మార్టం తెరిచింది. పదిహేను పేజీలకు పైగానే చదివింది. ఏదో బోరింగ్ డాక్యుమెంటరీ సినిమా చూసినట్టుగా ఉంది భారతికి. అబ్బా, ఇంక చదివింది చాల్లే అని మూసేద్దామనుకుంది. కానీ అదే సమయానికి లైబ్రరీలోకి నడుచుకుంటూ వచ్చాడు. అతన్ని చూడగానే భారతి ఆశ్చర్యపోయింది. ఆ వచ్చిన అతను, పోస్ట్‌మార్టం పుస్తకంలో నుంచి నడిచొచ్చినట్టుగా ఉన్నాడు. అంతే వయసు. అదే హైట్. అదే వెయిట్. డ్రెస్ చేసుకునే తీరు, నడిచే విధానం, పెరిగిన గెడ్డం. సేమ్ టు సేమ్ ఆ పుస్తకంలోని క్యారెక్టర్లానే ఉన్నాడు అతను. పెద్ద హీరోల సినిమాలు హిట్ అయితే ఫ్యాన్స్ ఆ హీరో స్టైల్‌ని కాపీ కొట్టి అభిమానం చాటుకోవడం సహజం. కానీ మరణించిన ఒక సామాన్యుడికి కూడా అభిమానులుంటారా? అనుకుంది భారతి. చదివిన కొన్ని పేజీల్లో అతని గురించి భారతికి తెలిసిందేమిటంటే అతను అందరిలాంటివాడే. కానీ కళ్లల్లో వెలుగుల్ని నింపుకుని కొత్త ఆశలవైపు ప్రయాణించినవాడు. అతను కవి, రచయిత. రీసెర్చ్ స్కాలర్. యువకుడు, పోరాట పటిమ ఉన్నవాడు. చనిపోయినప్పుడు అతను సామాన్యుడే. కానీ అతని మరణం అతన్ని ప్రపంచానికి అసామాన్యుడిగా పరిచయం చేసింది. కాబట్టి అభిమానులు, ఫాలోయింగ్ ఉండటంలో ఆశ్చర్యమేముందిలే అనుకుంది భారతి. ఆ రోజు తర్వాత చాలాసార్లు అతన్ని చూసింది భారతి. ప్రతిరోజూ తన సబ్జెక్ట్ పుస్తకాలు చదివి అలసిపోయాక అలవాటుగా పోస్ట్‌మార్టం బుక్ చదువుతుండగా అతను వస్తాడు. అదే పాట పాడుకుంటూ సైన్స్ సెక్షన్‌కి వెళతాడు. లైబ్రరీలో అతన్ని చూడడం - తన రొటీన్ జీవితంలో ఒక చిన్నపాటి ఆనందం భారతికి. ఏ రోజైనా లైబ్రరీకి వెళ్లడం వీలుకాకపోతే భారతికి ఇబ్బందిగా ఉండేది. అటు తన సబ్జెక్ట్ పుస్తకాలకు అన్యాయం చెయ్యకుండా, కొత్తగా ఆసక్తి పెంచుకున్న పోస్ట్మార్టంకీ అన్యాయం చేయకుండా రోజుకి పది పేజీలు చదువుతూ అతని గురించి ప్రతిరోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకుంటూనే ఉంది. చాలా కష్ట నష్టాలతో కూడిన అతని బాల్యం. తల్లిదండ్రుల మధ్య వైరం, సొంత ఇంటిలోనూ పరాయి వాడిగా పెరగాల్సి రావడం, పేదరికం. అతని జీవితంలో ఉన్నన్ని కష్టాలు లేకున్నా పేదరికం విషయంలో భారతికి తన జీవితంతో పోలికలు కనిపించాయి. అందుకే ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చేస్తున్నప్పటికీ, రోజూ పోస్ట్మార్టంలోని కొన్ని పేజీలైనా చదివితే గానీ నిద్రపట్టేది కాదు భారతికి. ఒకరోజు రాత్రి ఎప్పటిలాగే భారతి లైబ్రరీలో ఉండగా అతను వచ్చాడు. తన స్టైల్లో పాట పాడుకుంటూ సైన్స్ సెక్షన్ వైపు వెళ్తుంటే, భారతి లేచి అతని దగ్గరకు వెళ్లింది. హలో అని పలకరించింది. అతను గోడ మీదున్న సెలైన్స్ ప్లీజ్ బోర్డ్ వైపు చూపించి, ష్ అని ముందుకు వెళ్లిపోయాడు. ఆ రోజు అతనితో ఎలాగైనా మాట్లాడాలని నిర్ణయించుకుంది భారతి. అతని వెంటే నడిచింది. అతను మరొక ర్యాక్‌లో ఏదో పుస్తకం కోసం వెడుతున్నాడు. అతని పక్కనే నిలబడి చూస్తున్నప్పటికీ, భారతిని అతను పట్టించుకోలేదు. భారతి అతని భుజం మీద చెయ్యేసి, తన చేతిలో ఉన్న పుస్తకం చూపించి, ‘ఈ పుస్తకం కోసమేనా వెతుకుతున్నావ్’ అంది. భారతి చేతిలో ఉన్న కార్ల్ సాగన్ పుస్తకం చూడగానే అతను లాక్కున్నంత పనిచేశాడు. ‘ఇది నాకిస్తావా? అని అడిగాడు. అది నీదే!’ అంది భారతి, అతను దగ్గరకొచ్చి నీకెలా తెలుసు అన్నాడు. ‘నేను కూడా పోస్ట్‌మార్టం చదువుతున్నాలే’ అంది భారతి. ‘పోస్ట్‌మార్టమా? అదేంటి?’ అని కార్ల్ సాగన్ పుస్తకం తెరిచాడు. ఎప్పటినుంచో వెంటాడుతున్న ప్రశ్నలకు అందులోనైనా సమాధానాలు దొరుకుతాయేమో అని ఆత్రంగా పేజీలు తిరగేశాడు అతను. ‘నీకు నిజంగానే పోస్ట్‌మార్టం బుక్ తెలియదా?’ అడిగింది భారతి. తల పెకైత్తకుండానే తెలియదన్నట్టుగా తలూపాడు. ‘ఒక్క నిమిషం ఆగు’ అని భారతి తను కూర్చున్న టేబుల్ వైపు నడిచింది. పోస్ట్‌మార్టం బుక్ పట్టుకుని భారతి అక్కడికొచ్చేసరికి అతను లేడు. అతనలా చెప్పా పెట్టకుండా వెళ్లిపోయాక అతని మీద మరింత ఆసక్తి కలిగింది భారతికి. ఆ రోజు ఎప్పటిలా పది పేజీలు కాకుండా, పుస్తకంలో ఇంకొన్ని పేజీలు చదివింది. పేజీ నంబర్ 114లో అతను ఎన్నో రోజులుగా వెతుకుతున్న ఒక పుస్తకం అతనికి ఎలా దొరికిందో - రచయిత చాలా వివరంగా రాసిన విషయం చదివి - భారతికి ఆ పుస్తకం మీద మరింత ఆసక్తి కలిగింది. కొంచెం వింతగా కూడా అనిపించింది. చదువుతున్నకొద్దీ ఆమెకి ఆ పుస్తకం మరింత చదవాలని అనిపించింది. కానీ లైబ్రరీ క్లోజ్ చేసే టైమ్ అవ్వడంతో హాస్టల్‌కి బయల్దేరింది. ఆ తర్వాత రోజు లైబ్రరీలో ఎప్పటిలానే పోస్ట్‌మార్టం చదవడం మొదలుపెట్టింది భారతి. చదువుతున్నంతసేపూ అతనెప్పుడు లైబ్రరీకి వస్తాడా అని ఎదురుచూస్తూనే ఉంది. కానీ ఆ రోజు అతను రాలేదు. లైబ్రరీ మూసేంతవరకూ అతని కోసం ఎదురుచూసింది. అయినా అతను రాలేదు. అసలే పద్ధతి ప్రకారం నడిచే ఆమె జీవితంలో అతను రాకపోవడం కొంత వయొలెన్స్‌ని సృష్టించింది. తనేమైనా తప్పు చేసిందా? లేదంటే అతనికి కావాల్సిన పుస్తకం దొరికింది కాబట్టి అతను ఏ మూలో కూర్చుని చదువుకుంటున్నాడా? - ఇలా ఎన్నో విధాలుగా ఆలోచిస్తూ లైబ్రరీ బయటకు నడిచింది. కొంచెం దూరం నడవగానే అతను ఎదురయ్యాడు. ఒక చేతిలో మడత పెట్టిన పరుపు, దుప్పటి... మరొక చేతిలో పెద్ద అంబేద్కర్ ఫొటో పట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాడు. ‘హలో’ అంది. ఎవరు నువ్వు అన్నట్టుగా భారతి వైపు చూశాడు అతను. లైబ్రరీ, కార్ల్ సాగన్ పుస్తకం - అని ఇంకా ఏదో చెప్పి అతనికి గుర్తు తెప్పించాలనుకుంది. కానీ అతను ఇబ్బందిగా మోస్తున్న అంబేద్కర్ ఫొటో చేతిలోకి తీసుకుని అతనితో నడిచింది. ‘ఎక్కడికి?’ అని అడిగింది. ‘ఆకాశంలో నక్షత్రాలు చూడ్డానికి’ అన్నాడతను. మౌనంగా అతని వెంటే నడిచింది. కొంచెం దూరం నడిచాక అతను ఆగి ఫుట్‌పాత్ మీద పరుపు పరిచి కూర్చున్నాడు. భారతి కూడా అతని పక్కనే కూర్చుంది. ‘నక్షత్రాలు చూడ్డానికొస్తూ అంబేద్కర్‌ని ఎందుకు తోడు తెచ్చుకున్నావ్?’ అడిగింది భారతి. ‘వుయ్ ఆర్ ఆల్ మేడ్ ఆఫ్ స్టార్స్. కొన్ని వందల ఏళ్ల క్రితం ఆ నక్షత్రాలపై తయారైన కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అణువులే మనందరిలోనూ ఉన్నాయి. కానీ మానవత్వం వికసించిన ఇన్నేళ్లకు కూడా రంగు, రూపం, ప్రాంతం, భాష, పుట్టక ఆధారంగా మనుషులను అంచనా వేసి అణచివేతకు గురి చేస్తూనే ఉన్నారు. మనుషుల మధ్య జాతి, కులం, మతం అని గోడలు కట్టి విడదీశారు. వంతెనలు కట్టాల్సిన చోట మనిషి గోడలు కడుతున్నాడు. అసలు గొడవంతా ఇదే! అందుకే నాకు మనుషుల కంటే నక్షత్రాలే ఇష్టం.’ అతనితో పాటు అంబేద్కర్ ఫొటో మాత్రమే కాదు. అంబేద్కర్ రాసిన ఎనిహిలేషన్ ఆఫ్ కేస్ట్ పుస్తకం కూడా ఉంది. ఆ రాత్రి చాలాసేపు వాళ్లు ఆకాశంలో నక్షత్రాలని చూస్తూ కూర్చుండిపోయారు. లైబ్రరీ నుంచి వచ్చేవాళ్లు, పరీక్షల కోసం రాత్రంతా చదివి కాసేపు రిలాక్స్ అవ్వడానికి రోడ్ మీద తిరిగేవాళ్లు - కొంత మంది వారి పక్క నుంచి పట్టించుకోకుండా నడుచుకుని వెళ్లిపోయారు. కొంతమంది వాళ్లతో పాటే ఫుట్‌పాత్ మీద కూర్చుని నక్షత్రాలను చూస్తుండిపోయారు. భారతి జీవితంలోనే - ఆ రాత్రి నక్షత్రాలను చూడడం, అతను చెప్పింది వినడం - ఒక అద్భుతమైన అనుభవం. ఎప్పుడు తను హాస్టల్ రూమ్‌కి చేరుకుందో, ఎప్పుడు నిద్రలోకి జారుకుందో తెలియదు. భారతి నిద్ర లేచేసరికి సాయంత్రమైంది. అంతసేపు నిద్రపోయినందుకు తనని తాను తిట్టుకుని పుస్తకాలు పట్టుకుని లైబ్రరీకి బయల్దేరింది. ముందు రోజు రాత్రి జరిగిన విషయం గుర్తొచ్చింది ఆమెకు. వెంటనే చదువుతున్న పుస్తకాలు మూసేసి పోస్ట్‌మార్టం పుస్తకం తెరిచింది. క్యాంపస్‌లో జరిగిన ఒక ఘటన, దాని పర్యవసానంగా అతను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి చెప్తున్నాడు రచయిత. అతనిలోని ఒక గుణాన్ని తెలుపుతూ, ఎంతో క్లిష్టమైన విషయాన్ని కూడా చాలా సింపుల్‌గా తన స్నేహితులకు వివరించి చెప్పడం గురించి చెప్పుకొచ్చాడు రచయిత. ఒక ఉదాహరణగా, ఒక రాత్రిపూట ఆరుబయట పడుకుని నక్షత్రాల గురించి ఒక అమ్మాయికి చెప్పడం గురించి రాశాడు. ఆ పేజీ చదవడం అవ్వగానే భారతికి ఆశ్చర్యం వేసింది. ఆ పేజీని మళ్లీ మళ్లీ చదివింది. భారతికి భయం వేసింది. పుస్తకాన్ని దూరంగా తోసేసింది. ఫోన్ తీసుకుని తన ఫ్రెండ్‌కి డయల్ చేసింది. ‘పుస్తకంలో నేనెలా ఉన్నాను?’ అడిగింది. ‘నువ్వు పుస్తకంలో ఉండటమేంటి? అసలే పుస్తకం?’ అన్నాడతను. ‘అదే మొన్న నువ్విచ్చిన పోస్ట్‌మార్టం పుస్తకం. అందులో నా గురించి కూడా ఉంది.’ ‘అందులో నీ గురించి ఉండడమేంటి? ఏం మాట్లాడుతున్నావు?’ ‘నేనతన్ని రోజూ లైబ్రరీలో కలుస్తున్నాను.’ ‘ఎవర్ని?’ ‘అదే ఆ బుక్‌లోని క్యారెక్టర్ని.’ ‘నీకు పిచ్చెక్కిందా? అతను చనిపోయి చాలా రోజులైంది.’ ‘మరి అతను రోజూ నాకెలా కనిపిస్తున్నాడు?’ ‘భారతీ ఏమైంది నీకు? ఏదో అతని గురించి తెలుసుకుంటావని బుక్ చదవమన్నాను. చదవకపోతే వదిలెయ్. ఎందుకు జోక్ చేస్తావు?’ భారతి ఏదో చెప్దామనుకునే లోపలే అతను ఫోన్ కట్ చేశాడు. భారతి లైబ్రరీ నుంచి బయటికొచ్చేసరికి అతను దూరంగా ఒక రాయిమీద కూర్చుని ఉన్నాడు. భారతి వెళ్లి అతని పక్కనే కూర్చుంది. ‘ఏమాలోచిస్తున్నావ్?’ అడిగింది. ‘అంబేద్కర్ ఏమన్నాడో తెలుసా? లైఫ్ షుడ్ బి గ్రేట్ రేదర్ దెన్ లాంగ్. ఆ విషయం గురించే ఆలోచిస్తున్నాను’ అన్నాడు. ‘నీ కష్టాలు నాకు తెలుసు. కానీ చనిపోతే కష్టాలు పోవు. వంద రెట్లవుతాయి. నిన్ను ఇష్టపడినవారందరినీ అవి బాధపెడతాయి’ అంది భారతి. ‘నేనేం చావనులే’ అన్నాడు. ‘గుడ్ బాయ్. గుడ్ నైట్’ అని చెప్పి అక్కడ్నుంచి బయల్దేరింది భారతి. భారతికి అంతా అర్థమైంది. ఈ పుస్తకం ఒక టైం మెషీన్. తను పుస్తకం చదివిన ప్రతిసారీ అతను బతికొస్తాడు. తర్వాతి రోజు భారతి లైబ్రరీలో కొంచెం భయంగానే పోస్ట్‌మార్టం తెరిచింది. దాదాపుగా పుస్తకం మొత్తం అయిపోయింది. చివరి కొన్ని పేజీలు మాత్రమే ఉన్నాయి. చదవడం పూర్తయితే ఏమవుతుందో ఆమెకు తెలుసు. అందుకే పుస్తకం తెరిచి ఒక్కొక్క పదమే మెల్లిగా చదువుతోంది. ఎక్కడో అతను మళ్లీ రక్తమాంసాలను తనలో నింపుకుంటున్నాడు. ఒక పేజీ మాత్రమే చదివి లైబ్రరీ నుంచి బయటికొచ్చింది భారతి. అతను మరికొంతమందితో కలిసి నేలమీద పరుపులేసుకుని కూర్చుని ఉన్నాడు. దూరం నుంచి అతన్నే చూస్తోంది భారతి. అతను లేచాడు. ఇప్పుడే వస్తానని అతని మిత్రులతో చెప్పి అక్కడ్నుంచి ముందుకు నడిచాడు. భారతి అక్కడ్నుంచి పరిగెత్తింది. ‘ఎక్కడికి పరిగెడ్తున్నావు?’ అడిగాడు. ‘నిన్ను కాపాడ్డానికి’ అంది భారతి. ‘నన్ను కాపాడలేవు.’ ‘కాపాడతాను. నువ్వు నా బిడ్డవి. నేనే నీకు మళ్లీ జన్మనిచ్చాను. నిన్ను నేను మాత్రమే కాపాడగలను.’ ‘ఎలా?’ భారతికి ఏం చెప్పాలో తెలియలేదు. వాళ్లిద్దరూ అలా పరిగెట్టుకుంటూ హాస్టల్ వైపు వెళ్తున్నారు. వాళ్లిద్దరూ అలసిపోయి హాస్టల్ ముందు ఆగి చూస్తుండగానే అతను హాస్టల్లోకి అడుగుపెట్టాడు. ‘చూశావా వాడు ఎలా ధైర్యంగా ముందుకు నడుస్తున్నాడో? చావడాని కంటే బతికుండడానికే ఎక్కువ ధైర్యం కావాలన్నాడు ఒక పెద్దమనిషి. కొటేషన్స్ మనిషిని బతికించవు. వాడు రూంలోకి వెళ్లిపోతున్నాడు. మనం వాడిని అందుకోలేం. ఆపలేము. ది ఎండ్ ఈజ్ వెరీ నియర్’ - అన్నాడు. ‘లేదు నిన్ను కాపాడతాను’ అంది భారతి. ‘ఎలా?’ అన్నాడతను. ‘పాతికేళ్లు వెనక్కి వెళ్లి అప్పటి బర్త్ సర్టిఫికెట్స్‌లో క్యాస్ట్ అనే కాలమ్ లేకుండా చేస్తే?’ అంది. ‘కులం అనేది మనసుల్లో నుంచి పోవాలి అప్లికేషన్ ఫామ్స్ నుంచి కాదు’ అన్నాడతను. ‘ఒకవేళ మనం 1936కి వెళ్లి జాత్‌పాత్ తోడక్ మండల్ వాళ్లని ఒప్పించి అంబేద్కర్ చేత అనిహిలేషన్ ఆఫ్ కాస్ట్ స్పీచ్ ఇప్పించేలా చేస్తే? అది విని ప్రజలు మారిపోతే?’ అడిగింది భారతి. ‘ఆయన ఒక్కడి వల్ల అయ్యే పని అయ్యుంటే, ఇప్పుడీ పరిస్థితి ఉండేది కాదు’ అన్నాడు అతను. ‘మరెలా?’ ‘ఈ సమస్య ఇప్పటిది కాదు, మనం ఇంకా వెనక్కి వెళ్లాలి. వేదాలు, స్మృతులు, సదాచారాలు - అప్పటిలోకి వెళ్లాలి.’ ‘వెళ్తాను.’ ‘వెళ్లినా పెద్దగా ఉపయోగం ఉండదేమో! ఎంత వెనక్కి వెళ్లినా, మారాల్సింది ఇప్పుడు మన ముందున్న జనాలు. అప్పుడే సమస్యకి పరిష్కారం. కానీ వీళ్లు మారరు. అందుకే నేను వెళ్తున్నా. నా టైం వచ్చేసింది’ అని అతను బయల్దేరాడు. ‘నో, ఈ కథకి ఈ ముగింపు సరికాదు’ అంది భారతి. ‘నాది కథ కాదు. జీవితం’ అన్నాడతను. - వెంకట సిధారెడ్డి