Richards
-
భారత్ నుంచి సంపన్నుల వలస
న్యూఢిల్లీ: పేదవారు పొట్ట చేత పట్టుకుని వలస పోవడం వినే ఉంటారు. వారిది జీవనపోరాటం. అయితే, వలసలు వారికే పరిమితం కాదు. సంపన్నులు కూడా తమ అవసరాల కోసం, ఆశయాల కోసం, మెరుగైన జీవనం కోసం వలసల బాట పడుతున్నారు. విదేశాలకు తమ గమ్యస్థానాన్ని మార్చుకుంటున్నారు. 2017లో మన దేశం నుంచి 7,000 మంది మిలియనీర్లు (అధిక విలువ కలిగిన వ్యక్తులు/మిలియన్ డాలర్లు/రూ.6.4 కోట్లు ఆపై సంపద ఉన్నవారు) విదేశాలకు వలసపోయారని న్యూవరల్డ్ వెల్త్ రిపోర్ట్ చెబుతోంది. 2016లో వలస వెళ్లిన వారి సంఖ్య కంటే 16 శాతం అధికం. 2016లో 6,000 మంది, 2015లో 4,000 మంది మిలియనీర్లు మన దేశం నుంచి విదేశాలకు మకాం మార్చారు. అమెరికా, యూఏఈ, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మన దేశ వాసులను ఆకర్షించిన టాప్ దేశాలు. కీలక అంశాలు... ♦ 2017లో 10,000 మంది చైనీయులు ఆ దేశం వీడి వెళ్లారు. వలసల్లో అంతర్జాతీయంగా మొదటి స్థానం చైనాదే. టర్కీ 6,000 మంది, బ్రిటన్ 4,000 మంది, ఫ్రాన్స్ 4,000 మంది, రష్యా 3,000 మంది మిలియనీర్లను కోల్పోయాయి. మిలియనీర్ల వలసల సంఖ్య 2017లో మొత్తం మీద అంతర్జాతీయంగా 95,000గా ఉంది. ♦ మిలియనీర్లను ఆకర్షించడంలో ఆస్ట్రేలియా అగ్రస్థానం దక్కించుకుంది. 2017లో ప్రపంచ దేశాల నుంచి ఈ దేశానికి తరలివెళ్లిన వారు 10,000 మంది ఉన్నారు. అగ్ర రాజ్యం అమెరికా ఈ విషయంలో మరోసారి ఆస్ట్రేలియా కంటే వెనుకబడింది. అయితే, మొత్తం మీద మిలియనీర్ల ఆకర్షణలో ఆస్ట్రేలియా తర్వాత నిలిచింది అగ్రరాజ్యమే. 9,000 మంది ఈ దేశాన్ని ఆశ్రయించారు. ఆ తర్వాత కెనడా 5,000 మంది, యూఏఈ 5,000 మందిని ఆకర్షించాయి. ♦ మిలియనీర్ల సంపద ఎక్కువగా వున్న దేశాల్లో భారత్‌కు ఈ నివేదిక ఆరో స్థానం కల్పించింది. మొత్తం సంపద విలువ 8,230 బిలియన్ డాలర్లు. ♦ భారత్‌లో 3,30,400 మంది మిలియనీర్లు ఉన్నారు. మిలియనీర్ల సంఖ్యా పరంగా భారత్ అంతర్జాతీయంగా 9వ స్థానంలో నిలిచింది. మల్టీ మిలియనీర్లు 20,730 మంది ఉన్నారు. ఈ విషయంలో ఏడో స్థానంలో ఉంది. 119 మంది బిలియనీర్ల (100 కోట్ల డాలర్లు, అంతకు పైన సంపద ఉన్నవారు)తో అమెరికా, చైనా తర్వాత మూడో స్థానంలో నిలిచింది. -
పాకిస్తాన్లో విండీస్ పర్యటన?
సిరీస్‌పై పీసీబీ ఆశాభావం కరాచీ: గత ఏడేళ్లుగా పాకిస్తాన్లో క్రికెట్ మ్యాచ్‌లు ఆడేందుకు పెద్ద జట్లను ఒప్పించడంలో విఫలమైన పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తమ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. తాజాగా దీనిపై పీసీబీ, వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇరు జట్ల మధ్య వచ్చే సెప్టెంబర్‌లో యూఏఈలో రెండు టెస్టులు, ఐదు వన్డేలు, రెండు టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. ఇందులో కొన్ని మ్యాచ్‌లను పాకిస్తాన్‌లోనే ఆడితే బాగుంటుందని విండీస్‌కు పాక్ విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై విండీస్ దిగ్గజాలు రిచర్డ్స్, లారా తమ బోర్డును ఒప్పించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తమ దేశంలో ఆడితే విండీస్ క్రికెటర్లకు ఎక్కువ మొత్తంలో ఫీజులు చెల్లించేందుకు కూడా పీసీబీ సిద్ధమైంది. 2009లో శ్రీలంక జట్టుపై తీవ్రవాదుల దాడి తర్వాత ఆ దేశంలో మరే పెద్ద జట్టు అడుగు పెట్టలేదు. -
సచిన్-రిచర్డ్స్ ట్రోఫీ!
‘మాస్టర్’ పేరుతో సిరీస్ ఆలోచనలో బీసీసీఐ ముంబై: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరును ఏదో ఒక దేశంతో క్రికెట్ సిరీస్‌కు పెట్టి గౌరవించాలని బీసీసీఐ భావిస్తోంది. ప్రస్తుతం భారత్, ఆస్ట్రేలియాల సిరీస్‌కు బోర్డర్-గవాస్కర్ పేరుతో; ఇంగ్లండ్, భారత్ సిరీస్‌కు పటౌడీ పేరుతో ట్రోఫీలు అందిస్తున్నారు. ఇప్పుడు సచిన్ పేరును కూడా ఏదో ఒక సిరీస్‌కు పెట్టాలని బోర్డు పెద్దలు ఆలోచనలో ఉన్నారు. ఈ నెలలో జరిగే గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చిస్తారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలిస్తే... పాకిస్థాన్‌తో ఎప్పుడు సిరీస్ జరుగుతుందో, ఎప్పుడు జరగదో తెలియదు. దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌లలో సచిన్‌తో సమాన స్థాయి ఉన్న దిగ్గజాలు లేరు. కాబట్టి వెస్టిండీస్, భారత్ సిరీస్‌కు సచిన్-రిచర్డ్స్ ట్రోఫీ ఏర్పాటు చేస్తే మేలనే ప్రతిపాదన ఉంది. వచ్చే నెలలో వెస్టిండీస్‌తో స్వదేశంలో భారత్ ఆడే సిరీస్‌కే ఈ పేరు పెట్టే అవకాశం ఉంది. మాస్టర్ తన చివరి మ్యాచ్‌ను కూడా వెస్టిండీస్‌పైనే ఆడాడు. -
ఆర్తులను చూస్తే ఆగిపోతాడు!
కష్టాల్లో ఉన్నవాళ్లను చూసి అయ్యోపాపం అనడం జాలి. ఏదైనా సాయం చేస్తే బాగుంటుందేమో అని ఆలోచించడం మంచితనం. తనంత తానుగా వెళ్లి సాయం చేయడం మానవత్వం. కానీ అన్నీ తానుగా మారి, ప్రతిక్షణం కళ్లల్లో పెట్టుకుని కాపాడి, సొంతవాళ్లు కూడా చూపించనంత ప్రేమను ఎల్లవేళలా చూపిండాన్ని ఏమనాలి? రిచర్డ్సని ఈ ప్రశ్న అడిగితే నవ్వుతాడు. ఎందుకంటే అది తనని ఉద్దేశించే అడిగామని అతడికి అర్థమవుతుంది కనుక. వర్ణించడానికి కూడా మాటలు చాలని తన గొప్పదనాన్ని మనం గుర్తించాలని కోరుకోడు కనుక! ముంబై ప్రధాన రహదారి మీద ఇరవయ్యేళ్ల రిచర్డ్స మెల్లగా నడచుకుంటూ పోతున్నాడు. ఏదో ఆలోచనలో మునిగిపోయి ఉన్నాడు. కానీ అంత ఆలోచనలోనూ తను దాటి వెళ్లిపోయిన ఓ దృశ్యం అతడి కాళ్లకు బంధనాలు వేసింది. ఒక్కసాగి ఆగి వెనక్కి చూశాడు. రోడ్డు పక్కన ఓ వ్యక్తి గోనెసంచీ మీద కూచుని ఉన్నాడు. చాలా జాలిగా ఉన్నాడు. అనుకోకుండా అతడి కాలివైపు చూశాడు రిచర్డ్స. ఆ వ్యక్తి కాలు సగానికే ఉంది. పైగా పుండు పడి వికృతంగా తయారైంది. రసి కారి ఈగలు ముసురుతున్నాయి. మనసంతా ఏదోలా అయిపోయింది రిచర్డ్సకి. అసహ్యంతో కాదు... దయతో, బాధతో. మెల్లగా అతడి దగ్గరకు వెళ్లాడు. గాయం వల్ల అతడి దగ్గర వాసన వేస్తోంది. అయినా రిచర్డ్స పట్టించుకోలేదు. అతడి పేరు అజిత్ అని తెలుసుకున్నాడు. అతడి గాయాన్ని పరిశీలించాడు. ఇన్ఫెక్షన్ అజిత్ కాలిని తినేస్తోంది. అలాగే వదిలేస్తే కాలు పూర్తిగా పాడైపోతుంది. మిగతా భాగాలకు కూడా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ప్రాణానికే ప్రమాదం ఏర్పడుతుంది. కొద్ది క్షణాల్లోనే ఇవన్నీ అంచనా వేసుకున్న రిచర్డ్స వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు. వికలాంగుల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థకి ఫోన్ చేశాడు. వాళ్లతో అతడిని పంపించాడు. అంతటితో వదిలేయలేదు. తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు. వాళ్లతో కలిసి కొన్ని విరాళాలు సేకరించాడు. ఆ డబ్బుతో అజిత్‌కి మంచి డాక్టర్ దగ్గర వైద్యం చేయించాడు. అతడి పుణ్యమా అని ఈ రోజు అజిత్ పెద్ద ప్రమాదం నుండి బయటపడి ప్రశాంతంగా జీవిస్తున్నాడు. ఇప్పటికీ రిచర్డ్స అజిత్‌ని కలుస్తూనే ఉంటాడు. అతడి మంచి చెడ్డలు చూస్తూనే ఉంటాడు. అతడనే కాదు... రిచర్డ్స మంచితనానికి మచ్చుతునకలుగా చెప్పుకోదగ్గ జీవితాలు ముంబైలో చాలానే ఉన్నాయి! అలా మొదలైంది... ఇతరులను ప్రేమించమన్న మాటను చిన్ననాటి నుంచీ వింటూనే ఉన్నాడు రిచర్డ్స. ఆ వాక్యం అతడి మనసును పదే పదే తట్టి లేపేది. నీకొక ప్రత్యేక బాధ్యత ఉంది అని చెబుతున్నట్టుగా అనిపించేది. ఆ బాధ్యత తెలుసుకునే రోజు రానే వచ్చింది.2011లో థానే రోడ్డుమీద పోతున్నప్పుడు ఓ వృద్ధుడిని చూశాడు రిచర్డ్స. దిక్కులేని అతడికి సాయం చేసేందుకు పోలీసులను, ఓ స్వచ్ఛంద సంస్థలో పనిచేసే తన స్నేహితుడిని ఆశ్రయించాడు. అందరూ కలిసి ఓ వృద్ధుడిని ఓ ఎన్జీవో చెంతకు చేర్చారు. నాటి నుంచీ సాయపడటంలోని తృప్తి కోసం రిచర్డ్స మనసు పరితపించసాగింది. ఎక్కడ దిక్కులేని వాళ్లు కనిపించినా వెంటనే వాళ్లను ఒక సురక్షితమైన చోటికి చేర్చేవరకూ నిద్రపోయేవాడు. మత్తు మందులకు, మద్యానికి బానిసైన వాళ్లని రిహాబిలిటేషన్ సెంటర్లకు పంపించి మామూలు మనుషుల్ని చేస్తాడు. వాళ్లు మారాం చేసినా, మీద పడి కొట్టినా కూడా ఓపిగ్గా తీసుకెళ్తాడు. కుష్ఠు రోగులు, అవ యవాలు లేని అజిత్ లాంటివాళ్లనయితే అస్సలు విడిచిపెట్టడు రిచర్డ్స. ఆస్పత్రుల్లో చేరుస్తాడు. విరాళాలు సేకరించి వైద్యం చేయిస్తాడు. వాళ్లకిక ఏ ప్రమాదమూ లేదు అనుకున్న తర్వాతే ఊపిరి పీల్చుకుంటాడు. రిచర్డ్సలో ఉన్న మరో గొప్పదనం. ఏ ఒక్కరినీ మర్చిపోక పోవడం. తన పని అయిపోయిందని చేతులు దులిపేసు కోవడం అతనికి చేతగాదు. వాళ్లతో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాడు. వాళ్ల అవసరాలు తీరుస్తూ ఉంటాడు. ఓ పక్క సివిల్ ఇంజినీరింగ్ చదువుతూనే, మరోపక్క అవసరంలో ఉన్నవాళ్ల కోసం ఆరాటపడుతుంటాడు. ఈ వయసులో ఇంత ఎలా చేయగలుగుతున్నావ్ అని ఎవరైనా అడిగితే... ‘‘సాయం చేయడానికి వయసు కాదు, మనసు ఉండాలి, ప్రతి ఒక్కరూ ఒక్కరికైనా సాయం చేస్తే, రోడ్డు పక్కన ఎవ్వరూ దీనంగా కనిపించరు, దిక్కులేనివాళ్లంటూ ఎవరూ ఉండరు’’ అంటాడు రిచర్డ్స. నిజమే. అందరూ రిచర్డ్సలా ఉంటే ఎంత బాగుంటుంది!