Riyaz
-
ఎన్నికల ప్రచారంలో రింగ్ రియాజ్
-
ఎన్నికల ప్రచారంలో రింగ్ రియాజ్
-
చదువు లేని భవిత పెద్ద సున్నా.. మీ జీవితాన్ని మార్చుకునే చక్కటి అవకాశం..
-
నిరాడంబరంగా సీఎం కుమార్తె వివాహం
సాక్షి, తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పెద్ద కుమార్తె టీ వీణ వివాహం సోమవారం నిరాడంబరంగా జరిగింది. సీపీఐఎం యువజన విభాగం డీవైఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు, న్యాయవాది మహ్మద్ రియాజ్ తిరువనంతపురంలో వీణను పెళ్లాడారు. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో అత్యంత సన్నిహితుల మధ్య ఈ వివాహం జరిగింది. ఇవాళ ఉదయం 10.30 గంటలకు జరిగిన ఈ వివాహ వేడుకలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బాలకృష్ణన్, డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రహీమ్ సహా మొత్తం 50 మంది అతిథులు పాల్గొంటారు. అనంతరం ట్విటర్లో పెళ్లి ఫోటోలను షేర్ చేశారు. వీరిద్దరికీ ఇది రెండో వివాహమే. మొదటి వివాహంలో వీణకు ఒకరు, రియాజ్‌కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా వీణ 2014లో బెంగళూరులో ఎక్సోలాజిక్ సొల్యూషన్స్ సంస్థను నెలకొల్పి దానికి మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అబ్దుల్ ఖాదర్ కుమారుడు అయిన మహ్మద్ రియాజ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ)తో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. ఆయన 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థిగా పోటీ చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్కే రాఘవన్ చేతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. -
రెండో పెళ్లికి సిద్ధమైన సీఎం కుమార్తె
తిరువనంతపురం: కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ కుమార్తె వీణ పెళ్లి కూతురుగా ముస్తాబవనున్నారు. డీఎఫ్‌వైఐ (డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) జాతీయ అధ్యక్షుడు పీఏ మహ్మద్ రియాజ్‌తో ఆమెకు వివాహం జరగనుంది. ఇందుకోసం జూన్ 15న ముహూర్తం ఖరారు చేయగా వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి. ఇక లాక్డౌన్ నిబంధనల కారణంగా ఎలాంటి హంగూ ఆర్భాటాలకు పోకుండా తిరువనంతపురంలో కొద్దిమంది అతిథుల మధ్యే పెళ్లి జరిపించనున్నట్లు ముఖ్యమంత్రి సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. (అక్కడబ్బాయి.. ఇక్కడమ్మాయి.. రోడ్డుపై పెళ్లి!) పినరయ్ విజయన్, కమల విజయన్‌ల పెద్ద కుమార్తె వీణ. ఆమె బెంగళూరులో సొంతంగా స్టార్టప్ కంపెనీ పెట్టి దానికి డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. పెళ్లి కొడుకు మహ్మద్ రియాజ్.. వృత్తి రీత్యా అడ్వకేట్ అయినప్పటికీ ఆసక్తి రీత్యా ఎస్ఎఫ్ఐ(స్టూడెంట్ ఆఫ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) సభ్యుడిగా రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో కోజికోడ్ నియోజకవర్గం నుంచి సీపీఐ(ఎమ్) అభ్యర్థిగా బరిలోకి దిగగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్కే రాఘవన్ చేతిలో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యారు. (రైలులో నిద్రించిన వృద్ధురాలు మెంటల్ హాస్పిటల్‌కు) -
అతడు నేనే.. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా..
శ్రీలంకలో ఉగ్రవాదుల మారణహోమం నేపథ్యంలోఐటీ సిటీలో రకరకాల వదంతులు వ్యాప్తిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓ మెట్రో రైల్వేస్టేషన్లో కనిపించిన అనుమానితవ్యక్తి ఉగ్రవాది కావచ్చని జోరుగా ప్రచారం జరగడం, చివరకుఆ అనుమానితుడు అమాయకుణ్నని పోలీసులనుకలవడంతో కథ సుఖాంతమైంది. బనశంకరి: మెజస్టిక్ మెట్రోస్టేషన్లో అనుమానాస్పదంగా తెలుపురంగు జుబ్బా, పైజామా ధరించి సంచరించిన వ్యక్తి ఆచూకీ లభించింది. బుధవారం ఆ అనుమానిత వ్యక్తే డీసీపీ కార్యాలయానికి వెళ్లి మెట్రోస్టేషన్లో చోటు చేసుకున్న ఘటనను వివరించారు. సోమవారం రాత్రి మెజస్టిక్ మెట్రో స్టేషన్లో జుబ్బా, పైజామాతో ఉన్న వ్యక్తి మెటల్ డిటెక్టర్ వద్ద కు వెళ్లాడు. ఈ సమయంలో భద్రతా సిబ్బంది అతడిని తనిఖీ చేయడానికి యత్నించగా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అతని ఆచూకీ కోసం పోలీసులు విచారణ ఆరంభించారు. రోజూ మెట్రోలో వెళ్లి వస్తుంటా వైరల్ అయిన వీడియోలో ఉన్న వ్యక్తి రియాజ్‌అహ్మద్ (70), మెజస్టిక్‌లో గడియారాల విక్రయాలు, మరమ్మతులు చేసే వ్యక్తి అని తేలింది. ఆయన బెంగళూరు పశ్చిమవిభాగ డీసీపీ రవి డీ.చెన్నణ్ణవర్ కార్యాలయానికి వెళ్లి చోటు చేసుకున్న ఘటన ను వెల్లడించారు. తాను నాయండహళ్లిలో నివాసం ఉంటున్నానని, మెజస్టిక్‌లో గడియారాల రిపేరీలు చేస్తూ జీవిస్తుంటానని తెలిపారు. నిత్యం మెట్రో రైల్లో వెళ్లి వస్తుంటానని తెలిపారు. తాను ఉగ్రవాదిని కాదని, అనుమానిత ఉగ్రవాది అని మీడియాలో ప్రసారం కావడంతో ప్రజలు కొందరు తనపై దాడికి ప్రయత్నించారని, రక్షణ కల్పించాలని విన్నవించారు. గడ్డం పెంచుకున్నవారందరూ ఉగ్రవాదులా? గడ్డం పెంచుకోవడం తప్పేనంటూ తన భాద వెళ్లగక్కారు. దీంతో అతని వివరాలను నమోదు చేసుకుని పోలీసులు పంపించివేశారు. భయంతో తగ్గిన ప్రయాణికుల రద్దీ అంతకుముందు డీజీపీ నీలమణి రాజు మీడియాతో మాట్లాడుతూ బ్లాక్ కలర్ జుబ్బా ధరించిన వ్యక్తి ఆచూకీ లభించలేదని తెలిపారు. సాధ్యమైనంత వరకు అనుమానితవ్యక్తి ఆచూకీ కనిపెట్టాలని నగర సీపీ సునీల్‌కుమార్‌కు సూచించారు. మెట్రోస్టేషన్లో అనుమానిత వ్యక్తి సంచరించారనే సమాచారం నేపద్యంలో ప్రయాణికుల్లో భయం నెలకొంది. దీంతో మెట్రోలో సంచరించడానికి నగరప్రజలు భయపడుతున్నారు. మెజస్టిక్ కెంపేగౌడ బస్టాండ్, చిక్కలాల్‌బాగ్‌గేట్ వద్ద రెండుచోట్ల బుదవారం మెట్రో ప్రయాణికుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. వాటిలో అదనపు భద్రత కల్పించారు. భద్రతను పెంచాం: పోలీస్ కమిషనర్ మెజస్టిక్ మెట్రోస్టేషన్ వద్ద అనుమానాస్పదంగా కనపించిన వ్యక్తి ఆచూకీకోసం తీవ్రంగా గాలిస్తున్నామని ననగర పోలీస్‌కమిషనర్ సునీల్‌కుమార్ తెలిపారు. బుధవారం నగరపోలీస్‌కమిషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పోలీస్ అధికారులతో కలిసి ఆయన మాట్లాడారు. నగరంలోని అన్ని మెట్రోస్టేషన్లు వద్ద అదనపు సిబ్బందిని, కేఐఎస్‌ఎఫ్‌ను నియమించామన్నారు. అవసరానికి అనుగుణంగా నగరపోలీసులు అందుబాటులో ఉంటూ గస్తీలో ఉంటారని తెలిపారు. జుబ్బా, పైజామా దరించి గడ్డం కలిగిన వ్యక్తి పట్ల అనుమానం వస్తే తక్షణం పోలీసులకు సమాచారం అందించాలని నగరప్రజలకు మనవిచేశారు. మెజెస్టిక్ మెట్రోస్టేషన్లో అనుమానితుని ఆచూకీ కోసం ఏసీపీ మహంతరెడ్డి నేతృత్వంలో ఓ బృందం ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు పోలీస్‌కమిషనర్ః సీమంత్‌కుమార్, డీసీపీలు ఇషాపంత్, రాహుల్‌దేవ్ తదితరులు పాల్గొన్నారు. కాగా, కమిషనర్ సమావేశం అనంతరం అనుమానిత వ్యక్తి డీసీపీని కలవడంతో అనుమానాలు తొలగిపోయాయి. -
వైఎస్ఆర్సీపీలోకి విజయవాడ మైనారిటీ సెల్ అధ్యక్షుడు
-
లోకేశ్ అవినీతికి సంబంధించిన ఆధారాలున్నాయి
-
లోకేశ్‌పై మరో బాంబు పేల్చిన జనసేన
సాక్షి, హైదరాబాద్: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్‌పై జనసేన మరో బాంబు పేల్చింది. మంత్రి లోకేశ్ అవినీతికి సంబంధించి తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని జనసేన నేతలు చెబుతున్నారు. ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సైతం లోకేశ్ అవినీతికి సంబంధించి తనకు అన్ని వ్యవహారాలు తెలుసునని, ఆధారాలున్నాయని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. తాజాగా లోకేశ్ అవినీతి భాగోతం తమకు తెలుసునంటూ జనసేన నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. 40 మంది టీడీపీ ఎమ్మెల్యేలు జనసేనతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. ఇంకా చెప్పాలంటే ఆ ఎమ్మెల్యేలు ఎవరో కూడా సీఎం చంద్రబాబుకు తెలుసునని పేర్కొన్నారు. మంత్రి లోకేశ్ అవినీతి వ్యవహారాన్ని వదిలిపెట్టేది లేదన్నారు. ఆయన అవినీతిపై ఢిల్లీ స్థాయి ఏజెన్సీతో విచారణ చేపట్టాలని కోరుతామని తెలిపారు. త్వరలో ఏపీ మంత్రులు, వారి కుటుంబ సభ్యుల బండారం బయటపెట్టేందుకు జనసేన సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కొన్న భూములకు సంబంధించి అన్ని లెక్కలు తమ వద్ద ఉన్నాయని ఆ పార్టీ నేతలు అద్దేపల్లి శ్రీధర్, మహేందర్ రెడ్డి, రియాజ్ వివరించారు. జనసేన పార్టీ ఆవిర్భావసభలో లోకేశ్ అవినీతిపై, చంద్రబాబు ప్రభుత్వం పాల్పడుతున్న అక్రమాలపై పవన్ విమర్శించిన నేపథ్యంలో లోకేశ్, జనసేన మధ్య రాజకీయాలు వేడెక్కాయి. -
నమ్మకంగా నటించి ఊడ్చుకెళ్లారు
సాక్షి, మైసూరు: ఆ ఇంటికి వస్తూ పోతూ నమ్మకంగా వ్యవహరించారు.. తరచూ వ్యాపార విషయంగా మాట్లాడేవారు. అదును చూసి అదే ఇంటికి కన్నం వేసి మొత్తం ఊడ్చుకుని పోయిన సంఘటన మైసూరులోని బన్ని మంటప లేఔట్లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 23 లక్షల నగదు, రూ.6 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం రియాజ్ షరీఫ్, ఫయాజ్ షరీఫ్‌లు తండ్రి కొడుకులు. స్థానికంగా ఉండే మండి మోహల్లా పట్టెంగావ్ వీధిలో నివాసముంటున్న ఓ వ్యాపారితో తరచూ రియాజ్, ఫయాజ్‌లు వ్యాపారం పేరుతో కలుస్తూ ఉండేవారు. నమ్మకంగా నటిస్తూ ఆ ఇంట్లో ఎవరికి అనుమానం రాకుండా వ్యవహరించేవారు. ఈ క్రమంలో గత నెల 31న సదరు వ్యాపారి కుటుంబం మొత్తం పని నిమిత్తం మేలుకోటే వెళ్లారు. అదే సమయంలో తండ్రీకొడుకులు వ్యాపారి ఇంటి వద్దకు వచ్చి చూడగా తాళం వేసి ఉంది. ఇదే అదునునగా భావించిన వారు 31 అర్థరాత్రి ఇంటి తాళం పగులగొట్టి లాకర్లో ఉన్న రూ. 23 లక్షలు, రూ. 6 లక్షల విలువైన నగలు ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు వచ్చిన వ్యాపారి కుటుంబం చోరి విషయం గుర్తించి పోలీసులుకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన విచారణ చేపట్టి సోమవారం నిందితులను అరెస్టు చేశారు. చోరీ చేసిన నగదును స్వాధీనం చేసుకున్నారు. -
నడి రోడ్డుపై పొడిచి చంపారు
-
నడి రోడ్డుపై పొడిచి చంపారు
హైదరాబాద్: హైదరాబాద్‌లో దారుణం చోటుచేసుకుంది. బేగంపేటలో ఓ వ్యక్తిని నడి రోడ్డుపై నరికి చంపేశారు. రియాజ్ అనే రియల్టర్ ని గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి చంపేశారు. స్థల వివాదమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
చిట్టీ డబ్బులు అడిగాడని కత్తితో దాడి
దర్శి (ప్రకాశం): చిట్టీ డబ్బులు అడిగాడని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా దర్శి మండలంలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు.. మండల కేంద్రానికి చెందిన రియాజ్, మస్తాన్ పాషాలు చికెన్ షాపులు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే చిట్టీ చెల్లింపు విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో మస్తాన్ పాషా, రియాజ్‌పై కత్తితో దాడి చేసి గాయపర్చాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
పోతుల సురేష్ పేరుతో బెదిరింపులు
అనంతపురం : అనంతపురం జిల్లా ధర్మవరంలో పోతుల సురేష్ పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్న ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. ధర్మవరం సీటీఓగా పని చేస్తున్న నాగేందర్ కుమార్‌ను రూ.30 లక్షలు ఇవ్వాలంటూ పోతుల సురేష్ పేరుతో డబ్బులు డిమాండ్ చేశారు. నిన్న సాయంత్రం నాగేందర్ కుమార్‌ను కలిసిన వారు... తాము అడిగిన డబ్బు సమకూర్చకుంటే చంపేస్తామని బెదిరించారు. దాంతో బాధితుడు పోలీసుల్ని ఆశ్రయించాడు. దాంతో బెదిరింపులకు పాల్పడిన టీడీపీ నేత జీవీ చౌదరి, ఆర్ఎంపీ డాక్టర్ రియాజ్‌ను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ శ్రీరామ్ తెలిపారు. వారిని ఈరోజు కోర్టులో హాజరు పరచనున్నారు.