Warning: పెను ప్రమాదంలో మానవాళి! కిల్లర్ రోబోట్ల తయారీకి అగ్రదేశాల మొగ్గు..
Warning! Terminator like robots could wipe out humanity from Earth వాషింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను తయారు చేసేందుకు అగ్రరాజ్యాల్లో తీవ్ర పోటీ నెలకొంది. ఈ కిల్లర్ రోబో టార్గెట్ విక్టిమ్ బతికున్నాడా లేదా అనే విషయాన్ని స్వయంగా తెలుసుకోగలవు కూడా. అత్యంత శక్తివంతమైన కిల్లర్ రోబోట్‌ను రూపొందించే రేసులో దేశాలు నేనంటే నేనని పరుగులు తీస్తున్నాయి. ఐతే ఈ రోబోల వంటి టెర్మినేటర్లు భూమిపై మానవాళిని తుడిచిపెట్టగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇలాంటి డ్రోన్లను అభివృద్ధి చేయడానికి చైనా, రష్యా, అమెరికా పూర్తి మద్ధతును తెలిపాయి.
సాంకేతికతతో ఊచకోత కోసేందుకు యత్నం
కిల్లర్ రోబోల ముప్పుపెరుగుతున్న దృష్ట్యా ఈ నెలలో జెనీవాలో ఐక్యరాజ్యసమితి సమావేశం జరిగింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాణాంతక స్వయం ప్రతిపత్తి గల ఆయుధాల సాంకేతికతపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ రోబోలు పూర్తిగా మెషిన్ కంట్రోల్‌తో పెద్ద ఎత్తున ప్రజల ప్రాణాలను తీయగలవు. వీటిలో కృత్రిమ మేధస్సు, ముఖ గుర్తింపు సాంకేతికత పొందుపరచి ఉంటాయి.
ఇప్పటికే మొదటి కిల్లర్ రోబో తయారీ పూర్తిచేసిన లిబియా
కిల్లర్ రోబోల్లో ఉన్న సాంకేతికత సహాయంతో ఎరను వేటాడి చంపగలవు. సంక్లిష్ట పరిస్థితుల్లో కూడా పనిచేసేలా ఈ రోబోలను రూపొందించబడినట్లు తాజా నివేదికలు వెల్లడించాయి. అంతేకాదు ఒక వ్యక్తిని చంపాలా వద్దా అనే విషయాన్ని కూడా స్వయంగా నిర్ణయించుకోగలవు. సాంకేతికత సహాయంతో మనుషులు పెద్ద సంఖ్యలో ఊచకోత కోసే అవకాశం ఉందని మకాలెస్టర్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ జేమ్స్ డావ్స్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇవి మొత్తం మావనవాళి అంతం చేస్తాయి. లిబియాలో మొదటి స్వీయ నిర్ణయాత్మక దాడి చేయగల డ్రోన్‌ను విజయవంతంగా తయారు చేసిందని మార్చిలో ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. అణ్వాయుధ పోటీలో తప్పిదాలకు చోటివ్వకూడదని, ఇటువంటి డ్రోన్లను వెంటనే నియంత్రించాలని ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వినిపిస్తోంది.
చదవండి: హెచ్చరిక! అదే జరిగితే మనుషులంతా ఒకరినొకరు చంపుకు తింటారు!