Rohit Kumar Chillar
-
రోహిత్ కు 2 రోజుల పోలీస్ కస్టడీ
న్యూఢిల్లీ: భార్య ఆత్మహత్యలో అరెస్టైన జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్ కుమార్ చిల్లర్ కు ఢిల్లీ కోర్టు రెండు రోజుల పాటు పోలీసు కస్టడీ విధించింది. ఆదివారం అతడిని డ్యూటీ మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరిచారు. అక్టోబర్ 25 వరకు తమ కస్టడీకి అప్పగించాలని పోలీసులు కోరగా న్యాయమూర్తి అంగీకరించారు. రెండు రోజుల పాటు అతడిని పోలీసులు ఇంటరాగేట్ చేయనున్నారు. నావికా దళంలో పనిచేస్తున్న అతడిని ఈనెల 21న ముంబైలో అరెస్ట్ చేశారు. శనివారం రాత్రి ఢిల్లీకి తీసుకొచ్చారు. ఇదే కేసులో లొంగిపోయిన రోహిత్ తండ్రి విజయ్ సింగ్ కు కోర్టు నవంబర్ 4 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. రోహిత్ భార్య లలిత అక్టోబర్ 17న పశ్చిమ ఢిల్లీలోని తన అపార్టుమెంటులో దుపట్టాతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ లో ఆమె పేర్కొంది. ఆత్మహత్యకు పురిగొల్పారన్న ఆరోపణలతో రోహిత్, అతడి తండ్రిపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆమె ఆత్మహత్య.. పరారీలో రోహిత్!
రోహిత్‌కుమార్ చిల్లర్.. ఇటీవల బాగా ప్రజాదరణ పొందిన ప్రో కబడ్డీ లీగ్ చూసేవారికి ఈ ఆటగాడు బాగా తెలిసినవాడే. జాతీయ కబడ్డీ జట్టుకు కూడా ప్రాతినిధ్యం వహిస్తున్న రోహిత్ కుమార్ భార్య ఆత్మహత్య చేసుకోవడంతో.. అతను చిక్కుల్లో పడ్డాడు. రోహిత్‌కు వ్యతిరేకంగా పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదు చేయడంతో.. అతను, అతని కుటుంబం పరారయింది. దీంతో నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేశారు. 26 ఏళ్ల రోహిత్‌కుమార్ భార్య లలిత దబాస్ సోమవారం రాత్రి ముంబైలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో రోహిత్‌కుమార్ ఢిల్లీలో ఉన్నాడు. రోహిత్ కుటుంబం ఢిల్లీ శివారులో నివసిస్తోంది. గత మార్చిలో తన కన్నా రెండేళ్లు పెద్దదైన లలితను రోహిత్ పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో రోహిత్‌తో వేరయి గతకొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న లలిత తన ఆత్మహత్యకు ముందుకు ఓ లేఖ, రెండున్నర గంటల వాయిస్ మెసేజ్ రికార్డు చేసింది. కట్నం కోసం రోహిత్‌కుమార్, అతని కుటుంబసభ్యులు తనను తీవ్రంగా వేధించారని, వారితో వేగలేక ఒంటరిగా ఉంటున్నట్టు పేర్కొంది. లలిత ఆత్మహత్య గురించిన సమాచారం అందించినా రోహిత్గానీ, అతని కుటుంబసభ్యులుగానీ పోలీసుల ముందు హాజరుకాలేదని, దీంతో పరారీలో ఉన్న వారిని గుర్తించి అరెస్టు చేసేందుకు రెండు బృందాలను ఏర్పాటుచేసినట్టు పోలీసులు తెలిపారు. -
జాతీయ కబడ్డీ ఆటగాడి భార్య ఆత్మహత్య
-
జాతీయ కబడ్డీ ఆటగాడి భార్య ఆత్మహత్య
న్యూఢిల్లీ: జాతీయ కబడ్డీ ఆటగాడు రోహిత్ కుమార్ చిల్లర్ భార్య లలిత సోమవారం రాత్రి పడమర జిల్లా అశోక్ మొహల్లా నంగ్లోయ్ ప్రాంతంలోని తన తండ్రి నివాసంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటరిగా ఉండటంతో పాటు భర్తతో విభేదాల కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు వెల్లడించారు. ఆమె రాసిన ఆత్మహత్య లేఖలో బలవంతంగా ఒంటరిగా ఉండటంతో పాటు, ఇటీవల నగరంలో జరిగిన కబడ్డీ ప్రీమియర్ లీగ్ సందర్భంగా ఆటగాడైన తన భర్త రోహిత్‌ను చూసేందుకు వెళ్లగా జరిగిన పరిణామాలకు అసంతృప్తితో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు డిప్యూటీ పోలీస్ కమిషనర్ (డీసీపీ) విజయ్ కుమార్ తెలిపారు. గతేడాది మార్చిలో లలిత.. చిల్లర్‌ను రెండో వివాహం చేసుకుంది. అయితే ఆమె ప్రస్తుతం ఒంటరిగానే ఉంటోంది. లేఖలో తన భర్త ఆనందం కోసమే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆమె పేర్కొంది. సమాచారాన్ని రోహిత్‌కు తెలియజేయగా, ఆయన ముంబైలో ఉన్నాడని డీసీపీ పేర్కొన్నారు.