RS Sharma
-
తాన్లా బోర్డులోకి ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ట్రాయ్ మాజీ చైర్మన్ ఆర్ఎస్ శర్మను డైరెక్టర్ల బోర్డులో నియమించినట్లు తాన్లా ప్లాట్‌ఫామ్స్ సోమవారం ప్రకటించింది. దీంతో సంస్థ బోర్డ్ డైరెక్టర్ల సంఖ్య ఏడుకు చేరుకుంది. 2015–20 మధ్య ట్రాయ్ చైర్మన్‌గా ఆయన విధులు నిర్వర్తించారు. ఎంపవర్డ్ గ్రూప్ ఆఫ్ కోవిడ్ వ్యాక్సిన్ అడ్మిని్రస్టేషన్ ఛైర్మన్‌గా.. భారత్‌లో కోవిడ్–19 టీకా కార్యక్రమానికి డిజిటల్ వెన్నెముక అయిన కో–విన్ రూపకల్పన, అమలుకు నాయకత్వం వహించారు. నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవోగా కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలైన ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన, ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అమలులో కీలకపాత్ర పోషించారు. 2009–13 మధ్య ఆధార్ కార్డుల జారీ సంస్థ యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్, మిషన్ డైరెక్టర్‌గా పని చేశారు. -
‘ఆధార్‌పై ఆంక్షలు పెడితే.. అసలుకే ఎసరు’
న్యూఢిల్లీ: గోప్యతను కాపాడే పేరుతో ఆధార్ వినియోగంపై విశిష్ట గుర్తింపు కార్డుల ప్రాధికార సంస్థ యూఐడీఏఐ ఆంక్షలు విధించడం సరికాదని నేషనల్ హెల్త్ అథారిటీ సీఈవో ఆర్ఎస్ శర్మ విమర్శించారు. దీని వల్ల నిర్దేశిత లక్ష్యాలు నెరవేరకుండా పోయే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. డేటా వాల్ట్ అనేది.. ఆధార్ ప్రధాన లక్ష్యాల సాధనపై ప్రతికూల ప్రభావం చూపుతుందని యూఐడీఏఐ తొలి డైరెక్టర్ జనరల్ అయిన శర్మ పేర్కొన్నారు. అధీకృత ఏజెన్సీలు అన్నీ సేకరించిన ఆధార్ నంబర్లు అన్నింటినీ కేంద్రీకృతంగా భద్రపర్చేందుకు డేటా వాల్ట్ అనే కాన్సెప్టును యూఐడీఏఐ ఇటీవల ప్రకటించింది. ఆయా సంస్థల వ్యవస్థల్లో ఆధార్ నంబర్లు నిక్షిప్తమై ఉండిపోకుండా, అనధికారికంగా ఇతరుల చేతికి చిక్కకుండా ఉండేందుకు ఇది ఉపయోగపడుతుందని పేర్కొంది. మరోవైపు, వ్యక్తుల గుర్తింపును ధృవీకరించేందుకు స్మార్ట్ఫోన్లను ’యూనివర్సల్ ఆథెంటికేటర్లు’గా వినియోగంలోకి తేవడంపై కసరత్తు చేస్తున్నట్లు యూఐడీఏఐ సీఈవో సౌరభ్ గర్గ్ తెలిపారు. అయితే, దీన్ని ఏ విధంగా అమల్లోకి తేనున్నది వెల్లడించలేదు. ప్రస్తుతం వేలిముద్రలు, ఐరిస్, వన్–టైమ్ పాస్‌వర్డ్‌ను ధృవీకరణకు ఉపయోగిస్తున్నారు. చదవండి: ఆధార్ కార్డ్ వినియోగదారులకు శుభవార్త, ఆధార్ నెంబర్‌తో మనీ ట్రాన్స్ఫర్ చేయొచ్చు -
టీకా కేంద్రాలు పెంచండి!
సాక్షి, న్యూఢిల్లీ›: మూడో విడత వ్యాక్సిన్ వ్యూహాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు, ఆసుపత్రుల మౌలిక వసతుల విస్తరణకు వీలుగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు కార్యాచరణ ప్రణాళికను సూచించింది. కోవిడ్‌ను ఎదుర్కొనేందుకు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్, టెక్నాలజీ అండ్ డేటా మేనేజ్మెంట్ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ డాక్టర్ ఆర్ఎస్ శర్మ రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. మే 1 నుంచి ప్రారంభమయ్యే వ్యాక్సిన్ మూడో దశ సంక్లిష్టతలను నివారించేందుకు కోవిన్ ప్లాట్‌ఫామ్‌ను నవీకరించినట్టు శర్మ వివరించారు. రాష్ట్రాలు సరైన, సమయానుసారమైన డేటాను అప్లోడ్ చేయాలని చెప్పారు. ఇలా చేయండి.. ప్రైవేట్ ఆస్పత్రులు, పారిశ్రామిక సంస్థల ఆసుపత్రులు, పరిశ్రమల సంఘాలు మొదలైన వాటితో సంప్రదింపులు జరపడం ద్వారా అదనపు ప్రైవేట్ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని, టీకా నిల్వలను, వాటి ధరలను కోవిన్ పోర్టల్‌లో ప్రకటించే ఆసుపత్రుల సంఖ్యను పర్యవేక్షించాలని, రాష్ట్రాలు నేరుగా వ్యాక్సిన్ల సేకరణకు ప్రాధాన్యత ఇవ్వాలని, 18–45 సంవత్సరాల మధ్య వయస్సు గలవారికి ‘ఆన్లైన్ రిజిస్ట్రేషన్ మాత్రమే’ ఉంటుందని ప్రచారం చేయాలని, టీకా, రిపోర్టింగ్, నిర్వహణ గురించి వాక్సినేషన్ సెంటర్ల సిబ్బందికి శిక్షణ ఇవ్వాలని కేంద్రం సూచించింది. కొత్త కేసులు వస్తున్న నేపథ్యంలో రాష్ట్రాలు ఆసుపత్రుల మౌలిక సదుపాయాలను సమీక్షించాలని తెలిపింది. అదనపు డెడికేటెడ్ హాస్పిటల్స్‌ను గుర్తించడం, ప్రభుత్వ, ప్రైవేట్ రంగంలో డీఆర్డీవో, సీఎస్ఐఆర్ తదితర ఏజెన్సీల సాయంతో ఫీల్డ్ హాస్పిటల్ సౌకర్యాలను సిద్ధం చేయడం, ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న పడకలు, ఐసీయూ పడకలు ఏర్పాటు చేసుకోవడం, తగినంత ఆక్సిజన్ సరఫరా ఉండేలా చూసుకోవడం, రోగుల నిర్వహణ, అంబులెన్స్ సేవలను బలోపేతం చేయడానికి అవసరమైన మానవ వనరులను మోహరింపు, లోటు మౌలిక సదుపాయాలున్న జిల్లాలకు తగిన రెఫెరల్ లింకేజీలను, అదనపు అంబులెన్స్‌లను ఏర్పాటు చేయడం, పడకల కేటాయింపు కోసం కేంద్రీకృత కాల్ సెంటర్ ఆధారిత సేవలను ఏర్పాటు చేయడం, అందుబాటులోని పడకల కోసం రియల్ టైమ్ రికార్డును నిర్వహించి, సాధారణ ప్రజలకు అందుబాటులో ఉంచడం, కోవిడ్ సంరక్షణను అందించడానికి మార్గదర్శకాలను రూపకల్పన, ఇంట్లో ఒంటరిగా ఉన్న రోగులకు టెలి–మెడిసిన్ సౌకర్యాలు కల్పన వంటి చర్యలు చేపట్టాలని ఆదేశించింది. -
COVID-19 Vaccine: 45 ఏళ్లు దాటితే టీకా..
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి మళ్లీ ఉధృతరూపం దాలుస్తుండడంతో నియంత్రణ చర్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా 45 ఏళ్ల వయసు దాటిన వారికి కూడా కరోనా టీకా ఇవ్వాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 (గురువారం) నుంచే దేశవ్యాప్తంగా ఇది అమల్లోకి రానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. కరోనా కేసులు అధికంగా నమోదవుతూ వ్యాక్సినేషనల్ ప్రక్రియ నెమ్మదిగా సాగుతున్న ప్రాంతాలను వెంటనే గుర్తించాలని కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది. అలాంటి ప్రాంతాల్లో కరోనా టీకా పంపిణీని వేగవంతం చేయాలని సూచించింది. కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్, నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) సీఈవో డాక్టర్ ఆర్.ఎస్.శర్మ బుధవారం రాష్ట్రాలు, యూటీల ఆరోగ్య శాఖ కార్యదర్శులు, ఎన్హెచ్ఎం మిషన్ డైరెక్టర్లు, ఇమ్యూనైజేషన్ ఆఫీసర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. 45 ఏళ్లు దాటిన వారికి కరోనా వ్యాక్సినేషన్‌పై చర్చించారు. హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్ల కేటగిరీలో అర్హులైన వారికే టీకా అందేలా చూడాలని పేర్కొన్నారు. కో–విన్ పోర్టల్‌లో తప్పుడు, డూప్లికేట్ ఎంట్రీలను నివారించాలన్నారు. ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్ల సేవలను సమర్థంగా ఉపయోగించుకోవాలని కోరారు. వ్యాక్సిన్ స్టాక్ పాయింట్లలో టీకా డోసులు చెడిపోకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వ్యాక్సిన్ వృథాను తగ్గించండి పెద్ద సంఖ్యలో కరోనా వ్యాక్సిన్ డోసులు వృథా అవుతుండడం పట్ల రాజేష్ భూషణ్, డాక్టర్ ఆర్.ఎస్.శర్మ విచారం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశంలో 6 శాతం డోసులు వృథా అవుతున్నట్లు అంచనా. దీన్ని ఒకటి కంటే తక్కువ శాతానికి తీసుకురావాలని రాష్ట్రాలు, యూటీలను వారు ఆదేశించారు. అందుబాటులో ఉన్న వ్యాక్సిన్ స్టాక్‌ను సమయానుగుణంగా ఉపయోగిస్తే వేస్టేజీ తగ్గుతుందన్నారు. తద్వారా కాలం చెల్లే వ్యాక్సిన్ల సంఖ్యను కనిష్ట స్థాయికి తగ్గించవచ్చని తెలిపారు. వ్యాక్సిన్ వినియోగ డేటాను ఎప్పటికప్పుడు కో–విన్, ఈవిన్ పోర్టళ్లలో అప్లోడ్ చేయాలన్నారు. రెండో డోసు ఇచ్చే వరకూ టీకాలను దాడి పెట్టాలన్న ఆలోచన సరైంది కాదని చెప్పారు. కోవిషీల్డ్ షెల్ఫ్‌లైఫ్ ఇక 9 నెలలు ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిడ్ టీకా ‘కోవిషీల్డ్’ ప్రస్తుతం ఉన్న షెల్ఫ్‌లైఫ్‌ను డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) 6 నెలల నుంచి తాజాగా 9 నెలలకు పెంచింది. ఈ టీకాను భారత్‌లోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్పత్తి తేదీ నుంచి కాలంచెల్లే తేదీ వరకు ఉన్న గడువును షెల్ఫ్‌లైఫ్ అంటారు. ఆక్స్ఫర్డ్–అస్ట్రాజెనెకా వారి కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ ప్రస్తుత షెల్ఫ్‌లైఫ్ 6 నెలలు. తాజాగా డీసీజీఐ దీన్ని 9 నెలలకు పెంచింది. అంటే కోవిషీల్డ్ టీకాను తయారు చేసిన తర్వాత 9 నెలల్లోగా ఉపయోగించవచ్చు. 9% యాక్టివ్ కేసులు 5 రాష్ట్రాల్లోనే కేవలం మహారాష్ట్రలోనే 61 శాతం యాక్టివ్ కేసులు దేశంలో ఐదు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, ఛత్తీస్‌గఢ్‌లో వైరస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. భారత్‌లోని మొత్తం యాక్టివ్ కరోనా కేసుల్లో 79.30 శాతం కేసులు ఈ ఐదు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ఒక ప్రకటనలో వెల్ల డించింది. ఇందులో 61 శాతం కేసులు కేవలం మహారాష్ట్రలోనే నమోదు కావడం గమనార్హం. ఇక కొత్త కరోనా కేసుల్లో 84.73 శాతం కేసులు ఎనిమిది రాష్ట్రాలు.. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, కేరళ, తమిళనాడు, గుజరాత్, పంజాబ్, మధ్యప్రదేశ్‌లో నమోదయ్యాయి. దేశంలో ప్రస్తుతం యాక్టివ్ కరోనా కేసులు 5,52,566. దేశంలో కొత్తగా 53,480 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,21,49,335కు చేరుకుంది. గత 24 గంటల్లో 354 మంది కరోనా బాధితులు కన్నుమూశారు. దేశంలో మొత్తం కరోనా సంబంధిత మరణాల సంఖ్య 1,62,468కి చేరింది. 6.30 కోట్ల మందికి కరోనా టీకా భారత్‌లో కరోనా వ్యాక్సినేషన్ వేగం పంజుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. బుధవారం ఉదయం 7 గంటల వరకు దేశవ్యాప్తంగా అర్హులకు 10,46,757 సెషన్లలో 6,30,54,353 కరోనా వ్యాక్సిన్ డోసులను ఇచ్చినట్లు పేర్కొంది. -
ట్రాయ్ ఛైర్మన్‌గా ఆర్ఎస్ శర్మ తిరిగి నియమాకం
సాక్షి, న్యూఢిల్లీ: ట్రాయ్ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా) చైర్మన్‌గా ఆర్ఎస్ శర్మ (65) మరోసారి నియమితులయ్యారు. ఈ మేరకు క్యాబినెట్ నియామక కమిటీ (ఎసిసి) గురువారం ఆమోదం తెలిపింది. ట్రాయ్ చైర్మన్‌గా శర్మను మరో రెండేళ్ల పాటు కొనసాగించాలని నిర్ణయించినట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. దీని ప్రకారం సెప్టెంబర్ 30, 2020వరకు ఆర్ఎస్ శర్మ ఈ పదవిలో కొనసాగుతారు. ట్రాయ్ చైర్మన్‌గా ఆయన పదవీకాలం రేపటితో ముగియనుండగా ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని రెండేళ్లపాటు కొనసాగించేలా నిర్ణయం తీసుకుంది. 2015 ఆగస్ట్‌లో తొలిసారిగా శర్మ ట్రాయ్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. కాగా సోషల్ మీడియాలో ఒకరు విసిరిన సవాల్‌కు స్పందిస్తూ తన వివరాలు బయటపెట్టాలని శర్మ ఆధార్ సంఖ్య సవాలు అభాసుపాలైన సంగతి తెలిసిందే. ఆయన ఛాలెంజ్నుస్వీకరించిన హ్యాకర్లు ఆయన బ్యాంక్ ఖాతా వివరాలతో పాటు, ఈ మెయిల్ సమాచారాన్ని ట్వీట్ చేశారు. మరికొందరు ఆయన బ్యాంక్ ఖాతాలో ఒక రూపాయి జమ చేశారు. అయితే దీనిపై స్పందించిన ఆధార్ అధికారులు.. ఆ వివరాలు యూఐడీఏఐ నుంచి సేకరించినవికావని స్పష్టం చేశారు. గూగుల్, ఇతర పబ్లిక్ డొమైన్ల నుంచి శర్మ వివరాలను హ్యాకర్లు సంపాదించారని ప్రకటించారు. అలాగే ఆధార్ వల్ల తన వ్యక్తిగత సమాచారమేదీ బయటికి రాలేదని, అలా వెల్లడైనట్లుగా చెబుతున్న ఆ వివరాలను ఆధార్ లేకుండానే తెలుసుకోవచ్చని శర్మ వెల్లడించారు. -
ట్రాయ్ చైర్మన్ శర్మ బ్యాంక్ అకౌంట్ వివరాలు లీక్
-
ఇది మాములు షాక్ కాదు
సాక్షి, న్యూఢిల్లీ: ఆధార్ వివరాలు సురక్షితం అన్నందుకు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మను నెటిజన్లు ఓ రేంజ్లో అడుకుంటున్నారు. నిన్న ఆయన వ్యక్తిగత వివరాలను విచ్చలవిడిగా వైరల్ చేసిన హ్యాకర్లు.. పలువురు నెటిజన్లు ఇప్పుడు మరో అడుగు ముందుకేశారు. బ్యాంక్ అకౌంట్ వివరాలను తస్కరించిన హ్యాకర్లు తలా రూ.1ని ఆయన ఖాతాలో డిపాజిట్ చేశారు. అనంతరం ఈ స్క్రీన్ షాట్లను ట్విటర్లో పోస్ట్ చేశారు. పేటీఎం, భీమ్ యాప్ ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ(ఏఈపీఎస్) ద్వారా ఆ డబ్బును జమ చేయటం విశేషం. అంతేకాకుండా శర్మకు 6 బ్యాంకుల్లో ఉన్న అకౌంట్ల వివరాలను మొత్తం బయటపెట్టారు. ఆధార్ వివరాలు అత్యంత సురక్షితమనీ, దమ్ముంటే తన ఆధార్ ను దుర్వినియోగం చేయాలని ఆర్ ఎస్ శర్మ హ్యకర్లకు ట్విటర్లో ఇంతకుముందు సవాలు విసిరారు. తన ఆధార్ నంబర్‌ను కూడా బయటపెట్టారు. దీంతో రెచ్చిపోయిన హ్యాకర్లు శర్మ ఈ-మెయిల్, ఆయన అడ్రస్, పాన్, ఓటర్ ఐడీలు, పుట్టిన రోజు, ఎయిర్ ఇండియా ఆయనకిచ్చిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ ఐడీలను బయటపెట్టారు. మరికొందరు హ్యాకర్లయితే ఏకంగా ఆయన ఫొటో, వివరాలతో దొంగ ఆధార్ కార్డును తయారుచేసి ఫేస్ బుక్, ఆమేజాన్ క్లౌడ్ సర్వీసుల్లో రిజిస్టర్ అయ్యారు. మరో వ్యక్తి అయితే శర్మ అడ్రస్ కు వన్ ప్లస్ ఫోన్ ను క్యాష్ ఆన్ డెలివరి ఆర్డర్ పెట్టాడు. ఆధార్ నంబర్, తదితర వివరాలు బహిర్గతమవ్వడం ద్వారా అవి దుర్వినియోగమయ్యే అవకాశముందని, ఆర్థిక వ్యవహారాలతోపాటు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో భరోసా కోసం శర్మ ట్వీట్ చేసినందుకు ఇలా ట్రోలింగ్‌ను ఎదుర్కుంటున్నారు. -
సాధారణ పౌరుడిగానే సవాలు విసిరా
న్యూఢిల్లీ: తన ఆధార్ వివరాలు దుర్వినియోగం చేసి చూపాలని నెటిజన్లకు సవాలు విసిరిన టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ ఆదివారం వెనక్కు తగ్గారు. తాను ఓ సాధారణ భారతీయుడిగానే ఈ సవాలు విసిరాననీ, ట్రాయ్ చైర్మన్‌గా కాదని వివరణ ఇచ్చారు. సమాచార గోప్యతపై జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ శుక్రవారం ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో.. పౌరుల వ్యక్తిగత సమాచార పరిరక్షణకు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఇందుకోసం ఆధార్ చట్టానికి సవరణలు చేయాలని ఆదేశించింది. దీంతో తన ఆధార్ నెంబర్‌ను బయటకు వెల్లడించిన శర్మ.. దమ్ముంటే దాన్ని దుర్వినియోగం చేయాలని సవాలు విసిరారు. శర్మ సవాలుకు స్పందించిన పలువురు హ్యాకర్లు.. ఆధార్‌తో లింక్ అయిన 2 ఈ–మెయిల్స్, ఫోన్ నంబర్, పాన్, వ్యక్తిగత చిరునామా, ఎయిర్ఇండియా ఆయనకు కేటాయించిన ఫ్రీక్వెంట్ ఫ్లయర్ నంబర్(103546250)ను బయటపెట్టారు. కొందరైతే ఆయన నంబర్‌తో నకిలీ ఆధార్‌ను తయారుచేసి ఫేస్బుక్, అమెజాన్ క్లౌడ్ సర్వీసెస్‌లో రిజిస్టర్ కాగా, మరికొందరు ఆయనకు ఖరీదైన మొబైల్ ఫోన్లను క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్ పెట్టి కసి తీర్చుకున్నారు. -
ఆధార్ నంబర్ ట్వీట్ చేసి.. చాలెంజ్ !
న్యూఢిల్లీ: భారత టెలికం నియంత్రణ సంస్థ (ట్రాయ్) చైర్మన్ ఆర్ఎస్ శర్మ శనివారం తన ఆధార్ నంబర్‌ను ట్వీట్ చేసి.. సవాల్ విసిరారు. 12 అంకెల తన ఆధార్ నంబర్‌ను తెలుసుకోవడం ద్వారా ఎలా తనకు హాని చేయగలరో నిరూపించాలని ఆయన సవాల్ చేశారు. ఆధార్ నంబర్, తదితర వివరాలు బహిర్గతమవ్వడం ద్వారా అవి దుర్వినియోగమయ్యే అవకాశముందని, ఆర్థిక వ్యవహారాలతోపాటు వ్యక్తిగత ప్రైవసీకి భంగం కలిగే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో శర్మ ఈ ట్వీట్ చేశారు. ‘నా ఆధార్ నంబర్ ఇది.. (ఇక్కడ వెల్లడి చేయడం లేదు). ఈ వివరాలతో ఎలా నాకు హాని చేయగలరో ఒక్క సరైన ఉదాహరణ నాకు చూపండి. ఇది నా చాలెంజ్’ అని ఆయన ట్విటర్లో పేర్కొన్నారు. ఆధార్ కార్డులను జారీచేసే భారత విశిష్ట గుర్తింపు సంస్థ (యూఐడీఏఐ) మాజీ డైరెక్టర్ జనరల్ అయిన శర్మ ఓ ట్వీట్‌కు ఈ మేరకు సమాధానం ఇచ్చారు. ఆధార్ వివరాలు చాలా భద్రమని మీరు భావిస్తే.. మీ ఆధార్ కార్డు వివరాలు బహిర్గతం చేయండంటూ ఓ నెటిజన్ చేసిన ట్వీట్‌కు బదులిచ్చారు. శర్మ బ్యాంకు ఖాతాలకు ఆధార్ నంబర్‌ను అనుసంధానించలేదని ఫ్రెంచ్ సెక్యూరిటీ పరిశోధకుడు ఒకరు ఆరోపించారని ఓ నెటిజన్ పేర్కొనగా.. ఈ ఆరోపణలను ఆయన ఖండించారు. సమాచార భద్రత, ఆధార్ వివరాల పరిరక్షణ విషయమై ఆధార్ చట్టంలో పలు సవరణలు సూచిస్తూ.. శ్రీకృష్ణ కమిటీ కేంద్రానికి నివేదిక సమర్పించిన మరునాడే శర్మ ఈ చాలెంజ్ చేయడం గమనార్హం. అయితే, శర్మ ట్వీట్ చేసిన ఆధార్ నెంబర్ ఆధారంగా ఆయన ఇంటి చిరునామా, జన్మదినం, ఫోన్ నంబర్, పాన్ నెంబర్ తదితర వివరాలు రాబట్టినట్టు పలువురు నెటిజన్లు ట్వీట్ చేస్తుండటం కొసమెరుపు. -
యాప్స్‌కీ టెల్కోల నిబంధనలే వర్తిస్తాయి
న్యూఢిల్లీ: డేటా భద్రతకు నిర్దిష్టమైన చట్టం వచ్చే దాకా మొబైల్ డివైజ్‌లు, యాప్స్, బ్రౌజర్స్ మొదలైన వాటన్నింటికీ టెల్కోలకు అమలు చేస్తున్న నిబంధనలే వర్తిస్తాయని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ చెప్పారు. డేటాను హ్యాండిల్ చేసే డిజిటల్ సంస్థలన్నింటిపైనా నియంత్రణ ఉండాలని సూచించడంలో ట్రాయ్ తనకి అప్పగించిన బాధ్యతల పరిధిని దాటి వ్యవహరించిందన్న విమర్శలను ఆయన తోసిపుచ్చారు. అంతిమంగా యూజర్లే తమ తమ డేటాకు యజమానులని, ఇతరత్రా సంస్థలన్నీ కస్టోడియన్లు మాత్రమేనని శర్మ స్పష్టం చేశారు. డేటాకు సంబంధించి భౌతిక ప్రపంచంలోనూ, డిజిటల్ ప్రపంచంలోనూ యాజమాన్య హక్కుల స్వభావం పూర్తి భిన్నంగా ఉంటుందన్నారు. ‘‘డిజిటల్ ప్రపంచంలో ఒకే డేటా ఏకకాలంలో అనేక సంస్థలు, వ్యక్తుల దగ్గర ఉండొచ్చు. ఇలాంటప్పుడు సదరు డేటాపై యాజమాన్య హక్కులు ఎవరికుంటాయి, ఎవరి నియంత్రణలో ఉంటుంది? అనే ప్రశ్న తలెత్తుతుంది. మాకు అప్పగించిన బాధ్య త కూడా దీన్ని పరిష్కరించమనే. అంతిమంగా యూజరే సదరు డేటాకు హక్కుదారు అవుతారని, వ్యవస్థలోని మిగతా సంస్థలన్నీ కూడా కస్టోడియన్స్ మాత్రమేనని సిఫార్సు చేశాం‘ అని శర్మ వివరించారు.ఇప్పటికే అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఈ విధానానికి కట్టుబడి ఉంటున్న నేపథ్యంలో తమ సిఫార్సులకు పెద్ద వ్యతిరేకత ఉండబోదని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
బ్రాడ్‌బ్యాండ్ మరింత మెరుగుపడాలి
• శ్రీలంక, వియత్నాంల కన్నా వెనుకబడి ఉన్నాం • ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుతో దేశీయంగా డిజిటల్ లావాదేవీలు ఒక్కసారిగా పెరిగినప్పటికీ, వీటికి కీలకమైన డిజిటల్ మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉందని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ వ్యాఖ్యానించారు. బ్రాడ్‌బ్యాండ్ కనెక్టివిటీ విషయంలో సింగపూర్, మలేషియా వంటి దేశాలతో పోలిస్తే భారత్ చాలా వెనుకబడి ఉందని పరిశ్రమల సమాఖ్య అసోచాం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిర్దిష్ట ప్రమాణాలను బట్టి భారత్‌లో బ్రాడ్‌బ్యాండ్ విసృ్తతి కేవలం 7 శాతమే ఉందని శర్మ చెప్పారు. మరోవైపు ఇది సింగపూర్‌లో 98 శాతంగాను, థాయ్‌ల్యాండ్‌లో 36 శాతంగాను, మలేషియాలో 35-36 శాతం స్థారుులో ఉందని పేర్కొన్నారు. వాస్తవానికి బ్రాడ్‌బ్యాండ్ విస్తరణలో శ్రీలంక, వియత్నాంల కన్నా కూడా భారత్ వెనుకబడి ఉందని ఆయన చెప్పారు. ’బ్రాడ్‌బ్యాండ్‌కి సంబంధించి మన దగ్గర తగినన్ని సదుపాయాలు లేకపోవడం చాలా ఆందోళనకరమైన అంశం. ఇదే ఇన్ఫ్రాపై డిజిటల్ ఇండియా ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. భారీ స్థారుులో, పటిష్టమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకపోతే డిజిటల్ ఇండియా లక్ష్యాన్ని సాధించలేము’ అని శర్మ చెప్పారు. కేబుల్ టీవీ మాధ్యమాన్ని ఉపయోగించుకోవాలి బ్రాడ్‌బ్యాండ్‌ను మరింతగా విసృ్తతిలోకి తేవడానికి కేబుల్ టీవీ మాధ్యమాన్ని మరింతగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. ఇందుకోసం సంబంధిత నిబంధనలను స్వల్పంగా సవరిస్తే సరిపోతుందని, ట్రాయ్ ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వానికి సిఫార్సులు చేసిందని వివరించారు. దేశీయంగా కోట్ల సంఖ్యలో ఉన్న కేబుల్ టీవీ కనెక్షన్లను డిసెంబర్ ఆఖరు నాటికి డిజిటలైజ్ చేయనున్న నేపథ్యంలో బ్రాడ్‌బ్యాండ్ సేవల కోసం ఈ మాధ్యమాన్ని గణనీయంగా ఉపయోగించుకోవచ్చని శర్మ తెలిపారు. అమెరికా, యూరప్ వంటి పలు సంపన్న దేశాల్లో 50-60 శాతం బ్రాడ్‌బ్యాండ్ సేవలకు డిజిటల్ కేబుల్ టీవీలే మాధ్యమంగా ఉంటున్నాయన్నారు. -
డేటా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు
టెల్కోలకు ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ హెచ్చరిక న్యూఢిల్లీ: వెబ్‌సైట్‌ను బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చే యకూడదన్న నిబంధనలతో టెలికం ఆపరేటర్లు దారికి రాని పక్షంలో మరిన్ని కఠిన చర్యలు తప్పవని టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చైర్మన్ ఆర్ఎస్ శర్మ హెచ్చరించారు. ‘కావాలంటే జరిమానా కట్టుకుంటూ పోతాం .. యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తాం అంటే కుదరదు’ అని ఆయన స్పష్టం చేశారు. ఆదేశాలను ఉల్లంఘిస్తే తీసుకునే ఇతర చర్యలు కూడా నిబంధనల్లో పొందుపర్చడం జరిగిందని శర్మ తెలిపారు. నెట్ న్యూట్రాలిటీకి మద్దతు పలికిన ట్రాయ్.. డేటా సర్వీసులకు కంటెం ట్ను బట్టి వివిధ రకాల చార్జీలు వసూలు చేయడం కుదరదని, అలా చేస్తే భారీ జరిమానాలు తప్పవని నిబంధనలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే, కంపెనీలు జరిమానాలు కట్టుకుంటూ నిబంధనలకు విరుద్ధంగా తమ వ్యాపారాలను యథాప్రకారం కొనసాగించే ప్రమాదం ఉందం టూ ఆందోళనలు వ్యక్తం కావడంతో శర్మ వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. కంపెనీలు కొత్త టారిఫ్ ప్లాన్ రూపొందిస్తే దాన్ని కచ్చితంగా ట్రాయ్‌కు అందించాలని, అది నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు తేలితే జరిమానాలు విధిస్తామని శర్మ చెప్పారు. గుత్తాధిపత్యం కుదరదు: ఇంటర్నెట్పై కొన్ని సంస్థలు గుత్తాధిపత్యం చలాయిస్తామంటే ఊరుకోబోమని, ఇలాంటి ధోరణులను అనుమతించే ప్రసక్తే లేదని కేంద్ర టెలికం మంత్రి రవి శంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. ఫేస్బుక్ ఫ్రీ బేసిక్స్ కావొచ్చు మరొకటి కావొచ్చు ఇటువంటి పథకాలు ఎంతమాత్రం ఆమోదయోగ్యమైనవి కావన్నారు. ట్రాయ్ తాజా నిబంధనలతో ప్రపంచవ్యాప్తంగా నెటిజనుల్లో భారత ప్రతిష్ట పెరిగిందని మంత్రి చెప్పారు. ట్రాయ్ ఆదేశాలు నిరాశపర్చాయి: జుకర్‌బర్గ్ నెట్ న్యూట్రాలిటికీ మద్దతుగా ట్రాయ్ ఇచ్చిన ఆదేశాలు నిరాశపర్చాయని సోషల్ నెట్వర్కింగ్ సైటు ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ చెప్పారు. కొన్ని డేటా సర్వీసులను ఉచితంగా అందించే తమ వంటి సంస్థల పథకాలకు ఈ నిబంధనల వల్ల ఆంక్షలు, అడ్డంకులు ఏర్పడతాయని ఆయన పేర్కొన్నారు. అయితే, ప్రతీ ఒక్కరికి ఇంటర్నెట్ను అందుబాటులోకి తెచ్చే దాకా కృషి కొనసాగిస్తూనే ఉంటామని ఆయన పేర్కొన్నారు.