RSS worker
-
కేరళలో ఘర్షణ: ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి
తిరువనంతపురం: కేరళలోని అలప్పుజ జిల్లాలో బుధవారం రాత్రి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్), స్థానిక సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ (ఎస్డీపీఐ) మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో ఆర్ఎస్ఎస్కు చెందిన ఓ కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన పలువురు కార్యకర్తలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అలప్పుజ జిల్లాలోని వయలార్ పట్టణంలో ఆర్ఎస్ఎస్, ఎస్డీపీఐ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలో ఆర్ఎస్ఎస్కు చెందిన నందు అనే కార్యకర్త మృతి చెందాడు. ఇరు వర్గాలకు చెందిన ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా పార్టీకి చెందిన ఎస్డీపీఐ ఆర్గనైజేషన్ విరాళలు సేకరిస్తున్న సమయంలో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరుగురు ఎస్డీపీఐ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బంద్.. ఆర్ఎస్ఎస్ కార్యకర్త మృతి చెందడాన్ని నిరసిస్తూ అలప్పుజ జిల్లాలో గురువారం ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు బీజేపీ, పలు హిందూ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎంవీ గోపకుమార్ తెలిపారు. కాజర్గోడ్ నుంచి తిరువనంతపురం వరకు బీజేపీ చేపట్టిన విజయ యాత్ర ప్రారంభోత్సవానికి వచ్చిన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పర్యటనపై ఎస్డీపీఐ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గురువారం ఇరు వర్గాల మధ్య ఘర్షణ ఉద్రిక్తంగా మారినట్లు తెలుస్తోంది. తమ కార్యకర్తలపై ఆర్ఎస్ఎస్ దాడి చేయాలని ముందుగానే ప్రణాళిక వేసుకుందని ఎస్డీపీఐ ఆరోపించింది. అందులో భాగంగానే గురువారం ఎస్డీపీఐ కర్యకర్తలతో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గొడవకు దిగారని మండిపడింది. చదవండి: మందేశాడు.. ఎస్సైని ఢీకొట్టాడు -
మరో ఆరెస్సెస్ కార్యకర్త దారుణ హత్య!
వామపక్ష సీపీఐ అధికారంలో ఉన్న కేరళలో రాజకీయ హత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) కార్యకర్త హత్యకు గురయ్యాడు. అధికార సీపీఎం కార్యకర్తలే ఈ హత్యకు పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. ఆరెస్సెస్ కార్యకర్త అయిన పీ ఆనంద్పై ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో దాడి జరిగింది. మోటారుబైక్పై వెళుతున్న అతన్ని గుర్తుతెలియని దుండుగులు కత్తులతో దాడిచేసి పొడిచారు. ప్రముఖ పుణ్యక్షేత్రం గురువాయూర్లోని నెన్మిని వద్ద ఈ ఘటన జరిగింది. దుండగులు పలుసార్లు పొడవడంతో తీవ్రంగా గాయపడ్డ ఆనంద్ను స్థానికంగా ఉన్న ఆస్పత్రికి తరలించగా..అక్కడ ప్రాణాలు విడిచాడు. మూడేళ్ల కిందటి సీపీఎం కార్యకర్త కాశీం హత్యకేసులో ఆనంద్ నిందితుడు. బెయిల్పై బయట ఉన్న అతడిపై సీపీఎం కార్యకర్తలే దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. కేరళలో ఆరెస్సెస్, సీపీఎం మధ్య నిత్యం హింస చోటుచేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజకీయ హత్యలకు నెలవుగా మారిన కేరళలో ఇటీవల బీజేపీ అధికార సీపీఎంకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా జనరక్షణ యాత్రనుచేపట్టింది. ఈ యాత్రలో బీజేపీ చీఫ్ అమిత్ షా కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురికావడం రాష్ట్రంలో కలకలం రేపుతోంది. -
ఆర్ఎస్ఎస్ కార్యకర్త దారుణ హత్య
లక్నో : ఉత్తర ప్రదేశ్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త హత్య కలకలం రేపుతోంది. రాజేశ్ మిశ్రా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు శనివారం కాల్చి చంపారు. ఆర్ఎస్ఎస్లో చురుకుగా పని చేయటంతోపాటు, జర్నలిస్ట్ అయిన రాజేశ్ మిశ్రా ఘజిపూర్లోని కరందలో ఓ దుకాణంను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన షాపులో ఉండగా.. శనివారం ఉదయం బైక్ వచ్చిన వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో రాజేశ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో పక్కనే ఆయన సోదరుడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, వరుసగా ఆర్ఎస్ఎస్ వర్గీయుల హత్యలు జరుగుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా లూథియానాలో రవిందర్ గోసెయిన్ అనే ఆర్ఎస్ఎస్ నేతను ఇదే రీతిలో కాల్చి చంపగా.. ఆ కేసు దర్యాప్తును పంజాబ్ ప్రభుత్వం ఎన్ఐఏకు అప్పగించింది. -
నడిరోడ్డుపై ఆరెస్సెస్ కార్యకర్త నరికివేత!
కేరళలో మరో రాజకీయ హత్య.. తీవ్ర ఉద్రిక్తత కొచ్చి: కేరళలో నడిరోడ్డుపై మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో నిందితుడిగా ఉన్న విపిన్ గురువారం ఉదయం మలప్పురం జిల్లాలో కత్తిపోట్లతో హత్యకు గురై కనిపించాడు. ఇటీవల కేరళలో రాజకీయ హింస పేట్రేగుతున్న నేపథ్యంలో తాజా ఘటన రాష్ట్రంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని భావిస్తున్నారు. ఫైజల్ పుల్లనీ అలియాస్ అనీష్కుమార్ హత్యకేసులో విపిన్ నిందితుడిగా ఉన్నాడు. ఎనిమిది నెలల కిందట ఇస్లాం మతంలోకి మారాడన్న కారణంతో ఫైజల్ను దుండగులు కొట్టిచంపారు. ఈ దుండగుల బృందంలో ఒకడైన విపిన్ గతవారమే బెయిల్పై విడుదలయ్యాడు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రత్యర్థులను కిరాతకంగా హతమారుస్తోందని ఆరెస్సెస్ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నెలలోనే 34 ఏళ్ల ఆరెస్సెస్ కార్యకర్త కిరాతకంగా హత్యకు గురయ్యాడు. సీపీఎం మద్దతుదారులు అతడ్ని చేతులు నరికి చంపినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో మరో ఆరెస్సెస్ కార్యకర్త హత్యకు గురికావడం కేరళలో ఉద్రిక్తత రేపుతోంది.