
లక్నో : ఉత్తర ప్రదేశ్‌లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కార్యకర్త హత్య కలకలం రేపుతోంది. రాజేశ్ మిశ్రా అనే వ్యక్తిని గుర్తు తెలియని దుండగులు శనివారం కాల్చి చంపారు.
ఆర్‌ఎస్‌ఎస్‌లో చురుకుగా పని చేయటంతోపాటు, జర్నలిస్ట్ అయిన రాజేశ్ మిశ్రా ఘజిపూర్‌లోని కరందలో ఓ దుకాణంను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన షాపులో ఉండగా.. శనివారం ఉదయం బైక్ వచ్చిన వచ్చిన ఇద్దరు దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఘటనలో రాజేశ్ అక్కడిక్కడే కుప్పకూలిపోయాడు. ఆ సమయంలో పక్కనే ఆయన సోదరుడికి తీవ్ర గాయాలు కాగా, స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా, వరుసగా ఆర్ఎస్‌ఎస్ వర్గీయుల హత్యలు జరుగుతుండటం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా లూథియానాలో రవిందర్ గోసెయిన్ అనే ఆర్ఎస్‌ఎస్ నేతను ఇదే రీతిలో కాల్చి చంపగా.. ఆ కేసు దర్యాప్తును పంజాబ్ ప్రభుత్వం ఎన్‌ఐఏకు అప్పగించింది.
Comments
Please login to add a commentAdd a comment