RTC special services
-
శ్రీశైలం భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ
సాక్షి, అమరావతి: శ్రీశైలం వెళ్లే భక్తులకు ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ ప్రవేశపెట్టింది. రోజూ 1,075 దర్శనం టికెట్లు అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి దర్శనం కోసం ఆర్టీసీ ప్రత్యేక ప్యాకేజీ అందిస్తోంది. తాజాగా ఈ నెల 9 నుంచి శ్రీశైలం భక్తులకు కూడా ప్యాకేజీని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు దేవదాయ శాఖతో ఒప్పందం చేసుకుంది. వాటిలో స్పర్శ, శీఘ్ర, అతి శీఘ్ర దర్శనం టికెట్లు ఉన్నాయి. రూ.500 స్పర్శ దర్శనం టికెట్లు 275, రూ.300 అతి శీఘ్ర దర్శనం టికెట్లు 300, రూ.150 శీఘ్ర దర్శనం టికెట్లు 500 అందుబాటులోకి తీసుకువచ్చింది. భక్తులు ఆర్టీసీ వెబ్సైట్ ద్వారా శ్రీశైలం వెళ్లేందుకు ప్రయాణ టికెట్లతోపాటు ఈ దర్శనం టికెట్లు కూడా బుక్ చేసుకోవచ్చును. వివిధ ప్రాంతాల నుంచి శ్రీశైలానికి నిర్వహించే 95 ఆర్టీసీ బస్సుల్లోనూ ఈ టికెట్లను బుక్ చేసుకునేందుకు కూడా అవకాశం కల్పించారు. శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యవంతంగా ఉండేందుకే దేవదాయ శాఖతో కలసి ఈ ప్యాకేజీని ప్రవేశపెట్టామని ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. -
శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
టికెట్ కౌంటర్‌ను ప్రారంభించిన ఈడీ నెల్లూరు (టౌన్): శబరిమలై, పంచారామ క్షేత్రాలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు నడుపుతున్నట్లు ఆర్టీసీ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ రవీంద్రబాబు తెలిపారు. నగరంలోని ఆర్టీసీ డిపో ప్రాంగణంలో డిపో–1 ఆధ్వర్యంలో శబరిమలై, పంచారామ క్షేత్రాలకు సంబంధించి ప్రత్యేక టికెట్ కౌంటర్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ శబరిమలైకు ఒకేసారి 15 టికెట్లను కొనుగోలు చేస్తే ఒకరికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.బస్సు బుక్ చేసుకున్న అయ్యప్పలకు ఇద్దరు వంటవాళ్లు, ఇద్దరు మణికంఠ స్వాములు, ఒక గురుస్వామికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని వివరించారు. శబరిమలై, పంచారామ క్షేత్రాలకు అన్ని వర్గాల ప్రయాణికులకు అనుకూలంగా సూపర్‌లగ్జరి, శబరిమలై నాలుగు రోజుల ప్యాకేజీ టూర్లో భాగంగా రానుపోను చార్జీలతో కలిపి ఒక్కొక్కొరికి సూపర్‌లగ్జరీ బస్సుకు రూ.3,300, అల్ట్రాడీలక్స్కు రూ.3,300 ఎక్స్‌ప్రెస్‌కు రూ.2,500, తెలుగువెలుగుకు రూ.2వేలుగా నిర్ణయించినట్లు చెప్పారు. శబరిమలై యాత్రకు నెల్లూరు బస్టాండ్ నుంచి నవంబర్ 16,19,21,24, డిసెంబరు 1,4,6,9,10,15,18,20,23,31, జనవరి 4,7,11 తేదీల్లో ఉదయం 10 గంటలకు బస్సులు బయలు దేరుతాయని తెలిపారు. పంచారామ క్షేత్రాలకు పంచారామ క్షేత్రాలైన అమరారామం, సోమేశ్వరామం, క్షీరారామం, భీమేశ్వరం, కొమరారామంకు నెల్లూరు బస్టాండ్ నుంచి ప్రతి ఆదివారం రాత్రి బస్సులు బయలు దేరుతాయని ఆర్టీసీ ఈడీ తెలిపారు. సూపర్లగ్జరికు రూ.1950, డీలక్స్‌కు రూ.1875గా టికెట్ చార్జి నిర్ణయించినట్లు వివరించారు. ఈ నెల 30, నవంబర్ 11, 13, 20 తేదీల్లో బస్సులు బయలుదేరుతాయని వెల్లడించారు. వివరాలకు 73829 96410, 99592 25641, 73828 83003, 99592 25653, 0861 2323333 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవివర్మ, డిప్యూటీ సీటీఎం సత్యనారాయణ, విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ జయరామసుబ్బారెడ్డి, డిపో మేనేజర్లు శీనయ్య, మురళీ, తదితరులు పాల్గొన్నారు. -
కోరితే... ఊరికే బస్సు
ఒక ఊర్లో 30 మంది ఉంటే ఆదే గ్రామానికే బస్సు పుష్కరాల కోసం మెదక్ రీజియన్ నుంచి 424 ప్రత్యేక బస్సులు ఆర్టీసీ ప్రయాణం సురక్షితం.. భక్తులకు శుభప్రదం ప్రతి భక్తుడు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్నే ఎంచుకోవాలి ఆర్టీసీ రీజినల్ మేనేజర్ రఘునాథ్‌రావు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: కృష్ణా పుష్కరాల కోసం ఒక గ్రామం నుంచి కనీసం 30 మంది ప్రయాణికులు ఉంటే వాళ్ల సొంత గ్రామానికే బస్సు పంపుతామని, భక్తులు కోరిన పుష్కర ఘాట్‌కు తీసుకువెళ్లి.. భక్తులు స్నానమాచరించిన తరువాత మళ్లీ ఇళ్ల వద్ద వదులుతామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రఘునాథరావు చెప్పారు. కృష్ణా పుష్కరాలను పురస్కరించుకుని జిల్లా నుంచి పుణ్య స్నానాలకు భక్తులు తరలివెళ్లనున్న నేపథ్యంలో ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ప్రత్యేక బస్సుకు ప్రయాణికుల వద్ద నిర్ణీత టికెట్ ధర మాత్రమే తీసుకుంటామని, మిగిలిన సీట్లను ఆయా గ్రామాల మధ్య నింపుకొంటామని చెప్పారు. తెలంగాణ కృష్ణా పుష్కరాలలో ఆర్టీసీ భక్తులకు సురక్షిత, శుభప్రదమైన ప్రయాణాన్ని అందిస్తోందని ఆయన చెప్పారు. ప్రతి భక్తులు ఆర్టీసీ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని ఆయన కోరారు. సాక్షి: జిల్లా నుంచి ఎన్నిబస్సులు నడుపుతారు? ఎప్పటి వరకు నడుపుతారు? ఆర్ఎం: పుష్కరాల కోసం మెదక్ రీజియన్ నుంచి 424 డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సులను సిద్దం చేశాం. అవసరమైతేæ బస్సుల సంఖ్యను ఇంకా పెంచుతాం. ఆగస్టు 12 నుంచి ప్రారంభించి కృష్ణా పుష్కరాలు ముగిసే వరకు అంటే ఆగస్టు 23 వరకు బస్సు సర్వీసులు ఉంటాయి. సాక్షి: ఎక్కడెక్కడి నుంచి ప్రత్యేక బస్సులు నడుస్తాయి? ఆర్ఎం: జిల్లాలో ప్రస్తుతం 7 డిపోలు ఉన్నాయి. ఈ డిపోల పరిధిలోని అన్ని ప్రధాన బస్స్టేషన్ల వద్ద నుంచి 260 బస్సులు నడుస్తాయి. ఇవికాక పటాన్చెరు, లింగంపల్లి, బీహెచ్ఈఎల్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట ప్రాంతాల నుంచి మరో 164 బస్సులను ప్రత్యేకంగా నడుపుతాం. బీచ్పల్లి, వాడపల్లి, మట్టపల్లి, శ్రీశైలం, నాగార్జునసాగర్, కొల్లాపూర్, అమరగిరి ప్రాంతాలకు బస్సులు ఏర్పాటు చేశాం. రద్దీని బట్టి ప్రయాణికుల కోరక మేరకు పుష్కర ఘాట్లకు తీసుకువెళ్తాం. సాక్షి: టికెట్ ధరలు ఎలా నిర్ణయించారు? ఆర్ఎం: టికెట్ ధర ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాం.. స్టార్టింగ్ పాయింట్ నుంచి పుష్కర ఘాట్ మధ్య దూరాన్ని పరిగణలోకి తీసుకొని టికెట్ ధర నిర్ణయిస్తాం. మొత్తానికి సామాన్య భక్తులకు భారం కాకుండా టికెట్ ధర ఉంటుంది. సాక్షి: టికెట్ ఎలా బుక్ చేసుకోవాలి? రిజర్వేషన్ లేకుంటే ప్రయాణం ఉండదా? ఆర్ఎం: టికెట్ బుకింగ్ కోసం ప్రధాన బస్ స్టేషన్లలో బుకింగ్ కౌంటర్లు ఏర్పాటు చేశాం. ఆన్లైన్లో కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఎలాంటి టికెట్ రిజర్వేషన్లు లేకుండా అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని వచ్చిన భక్తుల కోసం సమీప బస్టాండ్ ఆవరణలో పుష్కర ప్రత్యేక బస్సులు సిద్దంగా ఉంటాయి.