గేట్ తెరిచాకే ఆర్యూబీ పనులు చేపట్టాలి
ఆలేరు : యథావిధిగా రైల్వేగేట్‌ను తెరిచాకే రైల్వే అండర్ బ్రిడ్జ్(ఆర్యూబీ) పనులను చేపట్టాలని డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ డిమాండ్ చేశారు. స్థానిక ఇందిరాకాంగ్రెస్ భవనంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైల్వేగేట్ మూసివేతతో ప్రజలకు కలుగుతున్న అసౌకర్యాలను దృష్టిలో పెట్టుకుని త్వరితగతిన బైపాస్ రోడ్డు పనులు చేపడుతూ ఆర్యూబీ నిర్మాణాన్ని వేగవంతం చేయాలన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాటు అయ్యే వరకు రైల్వేగేట్‌ను కొనసాగించాలని కోరారు. వాస్తవ జల దృశ్యం పేరిట కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రదర్శనలో వాస్తవాలు, విశ్లేషణలు లేవని తెలంగాణ ప్రభుత్వ నీటి పారుదల సలహాదారు విద్యాసాగర్‌రావు పేర్కొనడం హాస్యస్పదమన్నారు. ప్రజలను మభ్యపెడుతూ సీఎం కేసీఆర్ కాలం వెల్లదీస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో జనగాం ఉపేందర్‌రెడ్డి, కొలుపుల హరినాథ్, నీలం పద్మ, కె సాగర్‌రెడ్డి, ఎండీ.జైనోద్దీన్, నీలం వెంకటస్వామి, ఎలగల కృష్ణ, ఎంఏ.ఎజాజ్, పుట్ట మల్లేశం, ముదిగొండ శ్రీకాంత్, సీస రాజేష్‌గౌడ్, ఎగ్గిడి శ్రీశైలం పాల్గొన్నారు.