Rule of Reservation
-
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నష్టపోకుండా పదోన్నతులు
సాక్షి, అమరావతి : ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల పదోన్నతుల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు చేయడంతోపాటు, ఇప్పటికే వారికి కేటాయించిన సంఖ్య కంటే ఎక్కువ సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి నష్టం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. అధిక సంఖ్యలో పదోన్నతులు పొందిన వారికి డిమోషన్ ఇవ్వకుండా, సూపర్ న్యూమరరీ పోస్టులు సృష్టించి.. అదే స్థానాల్లో కొనసాగించే దిశగా కసరత్తు చేస్తోంది. పదోన్నతులపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల నేపథ్యంలో ఉద్యోగులు ఎవరికీ నష్టంలేకుండా అత్యంత బాధ్యతతో వ్యవహరిస్తోంది. అందుకు అనుగుణంగా సలహా మండలిని ఏర్పాటు చేసింది. వాస్తవ లెక్కలు తేల్చడం ద్వారా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు నష్టపోకుండా చర్యలు చేపట్టనుంది. ♦ ప్రమోషన్లలో ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 6 శాతం రిజర్వేషన్ అమలుపై ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అన్ని విభాగాల్లోని అన్ని కేటగిరీల పోస్టులకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా పదోన్నతిలో రిజర్వేషన్లు అమలు చేయాలని సాంఘిక సంక్షేమ శాఖ 2003 ఫిబ్రవరి 14న జీవో నంబర్ 5 జారీ చేసింది. ♦రిజర్వేషన్ ఉపయోగించుకొని ప్రమోషన్ పొందిన తర్వాత నుంచి ప్రమోషన్ పోస్టు సీనియారిటీ గణించి తదుపరి ప్రమోషన్ ఇవ్వడానికి అవకాశం కలి్పంచే ‘కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ’ని అమలు చేస్తూ 2009 ఫిబ్రవరి 20న సాంఘిక సంక్షేమ శాఖ జీవో నంబర్–26 జారీ చేసింది. ♦ కాన్సిక్వెన్సియల్ సీనియారిటీ వల్ల ఎస్సీ, ఎస్టీలకు న్యాయంగా దక్కాల్సిన ప్రాతినిధ్యం (ఎస్సీ–15 శాతం, ఎస్టీ–6శాతం) కంటే ఎక్కువ మంది ప్రమోషన్లు పొందారని, ఫలితంగా మిగతా ఉద్యోగులు నష్టపోతున్నారని సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో వేసిన కేసుల్లో వారికి అనుకూలంగా తీర్పులు వచ్చాయి. జీవో–26ను రద్దు చేసి, వాస్తవంగా ఎస్సీ, ఎస్టీలు కేటాయించిన పోస్టులకు మించి ప్రమోషన్లు పొందిన వారి సంఖ్యను గణించి, మిగతా వారికీ న్యాయం చేయాలని తీర్పులు చెప్పాయి. ఈ నేపథ్యంలో సలహా కమిటీ సిఫార్సుల మేరకు అడుగులు ముందుకు వేయనుంది. పోస్టులెన్ని? ఎంత మంది ఉన్నారు? తెలంగాణ రాష్ట్రం కూడా సలహా కమిటీని ఏర్పాటు చేయడం ద్వారా ప్యానెల్లను సమీక్షించడానికి కసరత్తు చేపట్టింది. ఆ కమిటీ సిఫార్సుల ఆధారంగా.. ఎస్సీ, ఎస్టీలు కేటాయించిన పోస్టుల కంటే ఎక్కువగా ఉన్న వారి కోసం సూపర్ న్యూమరీ పోస్టులు సృష్టించాలని నిర్ణయించింది. ఫలితంగా వారిని ఉన్న ఉద్యోగాల్లోనే తెలంగాణ ప్రభుత్వం కొనసాగించింది. అడిషనల్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ కేటగిరీలుగా ఐదు సూపర్ న్యూమరీ పోస్టులు, 30 నోషనల్ ప్రమోషన్లను అనుమతించింది. ఏపీ ప్రభుత్వం కూడా ఇదే విధంగా కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీలకు దక్కాల్సిన పోస్టుల కంటే అధిక సంఖ్యలో ప్రమోషన్లు పొందిన పోస్టుల వివరాలు తీసుకొని నివేదిక సమర్పించడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ సచివాలయంలోని అన్ని ప్యానెల్లు, ప్రమోషన్లను అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ నుండి ప్రభుత్వ అదనపు కార్యదర్శి వరకు అమలు చేయడానికి కసరత్తు చేస్తోంది. -
12, 13న నిరుద్యోగుల నిరాహార దీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ: రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలుకోసం సీఎం కేసీఆర్ మెడలు వంచేందుకు ఎస్సీ, బీసీ నిరుద్యోగులు ప్రభుత్వంపై యుద్ధానికి సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పిలుపునిచ్చారు. ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు కటాఫ్ మార్కు లు తగ్గించి రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల సమస్యపై 11న ఎమ్మెల్యేలకు వినతి పత్రాలు ఇస్తామని, ఈ నెల 12, 13 తేదీల్లో ఇందిరాపార్కు వద్ద సామూహిక నిరాహార దీక్ష చేపడతామని ప్రకటించారు. ఓయూలోని ఐసీఎస్ఎస్ఆర్ సెమినార్ హాల్లో శనివారం జరిగిన విద్యార్థి సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశంలో మంద కృష్ణ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ అభ్యర్థులకు ద్రోహం చేయాలనే ఎస్సై, కానిస్టేబుల్ నోటిఫికేషన్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించలేదని, టీఎస్ఎల్పీఆర్బీ చైర్మన్ శ్రీనివాసరావును తొలగించాలని డిమాండ్ చేశారు. -
యూనివర్సిటీ యూనిట్‌గానే రిజర్వేషన్లు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో అమలు చేయనున్న రూల్ ఆఫ్ రిజర్వేషన్ విధానం దాదాపుగా ఖరారైంది. యూనివర్సిటీ యూనిట్‌గానే రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయానికి ఉన్నత విద్యామండలి నియమించిన ఏడుగురితో కూడిన అధికారుల కమిటీ నిర్ణయానికి వచ్చింది. సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశం జరిగింది. త్వరలోనే దీనిపై ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు. అధ్యాపక నియామకాల్లో యూజీసీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని నిర్ణయించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్రంలో రాత పరీక్షను నిర్వహించాలన్న అంశంపైనా సమావేశంలో చర్చించారు. మరోవైపు 2021 నుంచి యూని వర్సిటీల్లో నియమితులయ్యే అసిస్టెంట్ ప్రొఫెసర్లకు తప్పనిసరిగా పీహెచ్డీ ఉండాలని యూజీసీ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించబోయే నియామకాల్లో పీహెచ్‌డీని అమలు చేయాలా? వద్దా? అనేది చర్చించారు. సోమవారం జరిగిన సమావేశంలో కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిసింది. రిజర్వేషన్లను యూ నివర్సిటీ యూనిట్‌గా కొనసాగిస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని, డిపార్ట్మెంట్ యూనిట్‌గా చేస్తే అన్యాయం జరిగే ప్రమాదం ఉందని కమిటీ అభిప్రాయపడింది. వీటిపై కమిటీ త్వరలో మరోసారి సమావేశమై ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. ఈలోగా యూనివర్సిటీల వైస్ ఛాన్స్లర్ల నియామకం జరుగుతుందని, ఆ తరువాత అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరు పేర్కొన్నారు. -
కర్నూలుకు శాసనసభ బీసీ కమిటీ రాక
- రూల్ ఆఫ్ రిజర్వేషన్‌పై సమీక్ష కర్నూలు (అర్బన్) : ఈ నెల 28, 29 తేదీల్లో జిల్లాలో ఏపీ శాసనసభ బీసీ కమిటీ పర్యటించనున్నట్లు జిల్లా బీసీ సంక్షేమాధికారి బి.సంజీవరాజు తెలిపారు. మంగళవారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కమిటీ చైర్మన్ జి.తిప్పేస్వామి ఆధ్వర్యంలో 28వ తేదీన ఉదయం 8.30 గంటలకు కర్నూలుకు వస్తున్న కమిటీ ముందుగా మల్యాలలో హంద్రీనీవా ఎస్ఈతో బీసీ ఉద్యోగుల సంక్షేమంపై సమావేశం నిర్వహిస్తారన్నారు. 11 గంటల నుంచి 12.45 వరకు కర్నూలులో ఇరిగేషన్ ఎస్ఈతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీ పథకంలో పనిచేస్తున్న బీసీ ఉద్యోగుల సంక్షేమంపై సమీక్ష నిర్వహిస్తారని తెలిపారు. మధ్యాహ్నం 1 గంటకు జిల్లా పరిషత్ సమావేశ భవనంలో బీసీ ప్రజా సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారన్నారు. 3 గంటలకు రూల్ ఆఫ్ రిజర్వేషన్, బీసీ వర్గాలకు చెందిన ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలపై జిల్లా కలెక్టర్‌తో సమీక్షిస్తారని తెలిపారు. సాయంత్రం 5 గంటలకు ఆర్డీఓ కార్యాలయంలో జిల్లాలోని బీసీ వసతి గృహ సంక్షేమాధికారులతో సమావేశం అవుతారన్నారు. రాత్రి 7.30 గంటలకు మంత్రాలయం బీసీ వసతి గృహాన్ని పరిశీలిస్తారని సంజీవరాజు తెలిపారు. అదే రోజు రాత్రి మంత్రాలయంలో బస చేసి 29వ తేదీన ఉదయం 9.30 గంటలకు ఆదోని ఆర్డీఓ కార్యాలయంలో బీసీ ప్రజా ప్రతినిధులు, బీసీ సంఘాల నుంచి వినతులు స్వీకరించడంతో పాటు బీసీ హెచ్‌డబ్ల్యూఓలతో సమావేశం నిర్వహిస్తారని తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆదోని నుంచి బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు నంద్యాలకు చేరుకొని అక్కడి ఆర్డీఓ కార్యాలయంలో బీసీ సంఘాల ప్రతినిధుల నుంచి వినతి పత్రాలను స్వీకరించి డివిజన్లోని బీసీ వసతి గృహ సంక్షేమాధికారులతో సమావేశం అవుతారని చెప్పారు. 4 గంటలకు నంద్యాల నుంచి బయలుదేరి మహానంది చేరుకొని దేవస్థానం ఈఓతో సమావేశం నిర్వహిస్తారని, అక్కడి నుంచి 5 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు శ్రీశైలం చేరుకుని అక్కడే బస చేస్తారని ఆయన వివరించారు. -
నిబంధనలకు నీళ్లు
అమలుకాని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆటవిడుపుగా మారిన పార్ట్‌టైం పీహెచ్‌డీలు {పైవేటు వర్సిటీని తలపించేలా అనంత జేఎన్టీయూ యూనివర్సిటీ : విద్యాభ్యసం, పరిశోధనలో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాలన్న రాజ్యంగ నిబంధనలకు విరుద్ధంగా జేఎన్టీయూలో పీహెచ్డీ ప్రవేశాలు కల్పిస్తున్నా రు. దీంతో ప్రతిభావంతులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ, స్పోర్ట్స్, ప్రత్యేక కేటగిరి విద్యార్థులకు అవకాశాలు దక్కడం లేదు. రాష్ట్రప్రభుత్వం ప్రైవేటు వర్సిటీలను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవి ఏర్పాటు కాక ముందే ప్రైవేటు వర్సిటీ తరహాలో జేఎన్టీయూలో విధానాలు అమలు చేయడం గమనార్హం . రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతం.. జేఎన్టీయూలో ప్రతి ఏటా రీసెట్ నోటిఫికేషన్‌ను ఇస్తారు. ఇందులో దరఖాస్తు చేసుకొన్న వారికి ప్రాథమికంగా పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష అర్హత సాధించిన విద్యార్థులను ఇంటర్వ్యూల ద్వారా పీహెచ్డీ సీట్లను భర్తీ చేస్తారు. ఇందులో మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ వర్తించేలా ఆయా కేటగిరి విద్యార్థుల కోటా ప్రకారం భర్తీ చేయాల్సి ఉంటుంది. ఇందుకు విరుద్ధంగా జేఎన్టీయూలో నిర్ణయాలు అమలు చేస్తుండం విమర్శలకు తా విస్తోంది. దీంతో బడుగు, బలహీన వర్గాలకు పరిశోధన లో అవకాశాలు దూరమవుతున్నాయి. మరోవైపు పీహెచ్డీ అడ్మిషన్ రాకపోవడంతో ఫెలోషిప్‌లు లభించడం లేదు. ఆట విడుపులా.. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నుంచి ఫిస్ట్, శాప్ ప్రాజెక్ట్‌లు ఆయా విభాగాలకు పరిశోధన కొరకు వస్తాయి. వీటిలో జరిగే పరిశోధనల ద్వారా వర్సిటీకి న్యాక్(నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడియేషన్ కౌన్సిల్) గ్రేడింగ్ ఇస్తుంది. కానీ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలాజికల్ యూనివర్సిటీ, అనంతపురంలో మాత్రం పార్ట్‌టైం పీహె చ్‌డీ ప్రవేశాలు కల్పిస్తున్నారు. బయట ప్రైవేటు కళాశాలల్లో అధ్యాపకులుగా పనిచేస్తున్నవారు ఆటవిడుపుగా ఈ విధానం ద్వారా పీహెచ్డీ చేస్తున్నారు. దీంతో పరిశోధన పడకేసింది. ఆవిష్కరణల ఊసే లేదు. చెప్పుకోదగ్గ పేటేంట్లు లేవు. పార్ట్‌టైం తరహా పీహెచ్‌డీలు రద్దు చేయాలని యూజీసీ గతంలోనే స్పష్టం చేసింది. ఈ ఆదేశాలు జేఎన్టీయూలో అమలు కావడం లేదు.