టీటీడీ సీవీఎస్వోగా చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, తిరుమల: టీటీడీ కొత్త సీవీఎస్వోగా ఎస్.చంద్రశేఖర్‌రెడ్డి నియమితులయ్యారు. ఇక్కడ పనిచేస్తుండిన టీటీడీ సీవీఎస్వో జీవీజీ.అశోక్‌కుమా ర్ వైఎస్సార్ జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. కొత్తసీఎస్వో ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే జీఆర్పీ ఎస్పీగా పనిచేస్తున్నారు. ఈయన జిల్లాకు, టీటీడీకి సుపరిచతుడే. 2003లో తిరుపతి అదనపు ఎస్పీగా, 2010లో జిల్లా ఇంటెలిజెన్స్ ఎస్పీగా పని చేశారు. ఆ తర్వాత కర్నూలు ఎస్పీగా పనిచేసి బదిలీపై సికింద్రాబాద్ రైల్వే ఎస్పీగా వెళ్లారు. తాజాగా బదిలీపై టీటీడీకి వస్తున్నారు. గతంలో తిరుమల, తిరుపతిలోని భద్రతాపరమైన విధులు, తిరుమల బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక బందోబస్తునుసమర్థవంతంగా పర్యవేక్షించారు. విధి నిర్వహణలో ముక్కుసూటి, నిక్కచ్చిగా వ్యవహరించే అధికారిగా పేరు తెచ్చుకున్నారు.
వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీగా అశోక్‌కుమార్ బదిలీ
టీటీడీ సీవీఎస్వో జీవీజీ.అశోక్‌కుమార్ కడప జిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన హైదరాబాద్ నగర ట్రాఫిక్ డీసీపీగా పనిచేస్తూ 2012 ఏప్రిల్ 18న టీటీడీలో బాధ్యతలు చేపట్టారు. సరిగ్గా ఏడాదిన్నర కాలం పనిచేశారు. తిరుమల శ్రీవారి ఆలయ భద్రతకు అధిక ప్రాధాన్యం ఇచ్చారు. సిబ్బందికి ప్రత్యేక కమెండో శిక్షణ ఇప్పించారు. నాలుగంచెల భద్రతా వ్యవస్థను అమలు చేశారు. ఆలయ నాలుగు మాడ వీధుల్లో ఇన్నర్ సెక్యూరిటీ కార్డాన్ పనులను తూర్పు మాడ వీధి మినహా పూర్తి చేశారు. ఔట్ సెక్యూరిటీ పనుల ప్రతిపాదనలు వేగవంతమయ్యాయి. ఆలయానికి భద్రతగా ఉన్న ఆక్టోపస్ బలగాలను మరింత పటిష్టం చే శారు. రూ.2 కోట్లతో 2వేల సీసీ టీవీల ప్రాజెక్టుకు టీటీడీ ధర్మకర్తల మండలి ఆమోదముద్ర వేయించడంలో కీలకంగా వ్యవహరించారు.
ఢిల్లీ తరహా భద్రతా వ్యవస్థను తిరుమలలో ఏర్పాటు చేసేందుకు కచ్చితమైన ప్రణాళికలు సిద్ధం చేశారు. టీటీడీకి ప్రత్యేకంగా రూ.కోటితో బాంబు డిస్పోజబుల్(బీడీ టీం)లు సిద్ధం చేయించారు. పరిపాలనలో, సిబ్బంది, ఉన్నతాధికారులతో సంబంధాలు నెరపడంలో సౌమ్యుడన్న పేరును సొంతం చేసుకున్నారు.
స్వామి ఆశీస్సులతోఆనందంగా పనిచేశా
శ్రీవారి ఆశీస్సులతో ఇక్కడ ఆనందంగా పనిచేశా. టీటీడీలో పనిచేసిన ఏడాదిన్నర కాలం కత్తిమీద సాము. అయినా సంతృప్తి మిగిలింది. ఆనందంగా ఉంది.
-జీవీజీ.అశోక్‌కుమార్ టీటీడీ సీవీఎస్వో