Saluru MLA Peedika Rajanna Dora
-
ఒడిశా దుశ్చర్యపై రాజన్నదొర అసహనం
విజయనగరం: ఒడిశా దుశ్చర్యపై సాలూరు ఎమ్మెల్యే రాజన్నదొర అసహనం వ్యక్తం చేశారు. కొటియా గ్రామాల్లో ఒడిశా దూకుడుపై సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆయన తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి ఫొటో, వీడియో ఆధారాలున్నాయని ఎమ్మెల్యే రాజన్నదొర పేర్కొన్నారు. కొండంగి, సారిక, ధనసరాయి, సంపంగిపాడు, కురుకుట్టి సర్పంచ్‌లకు.. డబ్బు ఆశ చూపి లోబరుచుకుంటున్నారు. ఒడిశా తరచూ కవ్వింపు చర్యలకు దిగుతోందని ఎమ్మెల్యే రాజన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనుల భద్రత కోసమే సంయమనం పాటిస్తున్నామని ఎమ్మెల్యే రాజన్నదొర అన్నారు. (చదవండి: కొటియా గ్రామాలపై ఒడిశా దూకుడు) కాగా ఆంధ్రా–ఒడిశా సరిహద్దులోని కొటియా గ్రామాలపై ఆ రాష్ట్రం కన్నేసింది. విజయనగరం జిల్లా సాలూరు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే 34 కొటియా గ్రామాలను ఎలాగైనా గుప్పిటపట్టాలని కొత్త ఎత్తుగడలు వేస్తోంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఆనవాళ్లనే అక్కడ లేకుండా చేయడానికి దూకుడుగా వెళ్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన రోడ్డును పెకలించేసిన ఒడిశా అధికారులు తాజాగా బీటీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. అంతేకాకుండా హడావుడిగా కొన్ని శాశ్వత భవనాలను కూడా నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్మాణం తలపెట్టినా అభ్యంతరం చెబుతున్న అటవీ శాఖ అధికారులు.. ఒడిశా చర్యల విషయంలో మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
నేను లేకుండా పంచేస్తారా?
సాలూరు: ‘నేను మంజూరుచేయించిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను నేను లేకుండా పంపిణీ చేస్తారా?, అంటూ సాలూరు ఎమ్మెల్యే పీడిక రాజన్నదొర తెలుగుదేశం పార్టీ నేతలపై మండిపడ్డారు. సాలూరు తహశీల్దార్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ సంధ్యారాణి, మున్సిపల్ చైర్పర్సన్ గొర్లె విజయకుమారి, మాజీ ఎమ్మెల్యే ఆర్పీ భంజ్‌దేవ్ తదితరులు అనారోగ్యంతో ఉన్న వారికి సీఎం రలీఫ్ ఫండ్ చెక్కులు శుక్రవారం పంపిణీ చేసిన విషయం తెలియడంతో రాజన్నదొర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్య పీడితులకు కిరణ్‌కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఆర్థిక సాయం మంజూరయ్యేలా తాను కృషి చేస్తే ఇప్పుడు తాను లేకుండా తామేదో మంజూరు చేయించినట్లు అధికార పార్టీ నేతలు చెక్కులు పంపిణీ చేస్తున్నారని మండిపడ్డారు. ఆపదలో ఉన్న వారికి కూడా పైసా మంజూరుచేయని నియోజకవర్గంలో తాను గత ప్రభుత్వ హయాంలో మంజూరుచేయించిన భవణాలు, వంతెనలు, రోడ్లను ప్రారంభిస్తున్నారే తప్ప వారు మంజూరుచేయించిన ఒక్క అభివృద్ధి పనిని చూపగలరా అని ప్రశ్నించారు. మాజీలను పిలిస్తే ఊరుకునేది లేదు ఇంతవరకు తాను ప్రోటోకాల్ విషయంలో చూసీచూడనట్టు వ్యవహరించానని, ఇకపై ఊరుకునేది లేదని రాజన్నదొర అధికారులను హెచ్చరించారు. అధికారిక కార్యక్రమాలకు అధికార పార్టీకి చెందిన మాజీ నేతను ఆహ్వానిస్తున్నారని, ఇకపై అలా జరిగితే మర్యాదగా ఉండదని తేల్చిచెప్పారు.