Samajwadi Party MLA
-
వీడియో: బీజేపీ నేతపై ఎస్పీ ఎమ్మెల్యే దాడి.. కారణం ఇదే..
అమేథి: ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేతపై సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే దాడికి చేశారు. పోలీసు స్టేషన్ వద్ద పోలీసుల ఎదుటే ఆయన దాడి చేయడం గమనార్హం. కాగా, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో వారిద్దరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల ప్రకారం.. సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ బుధవారం గౌరిగంజ్ కోత్వాలి పోలీసు స్టేషన్ వద్ద ధర్నాలో పాల్గొన్నారు. బీజేపీ నేత దీపక్ సింగ్ తన మద్దతుదారులపై దాడి చేశారని ఆరోపిస్తూ ప్రతాప్ సింగ్ నిన్న రాత్రి గౌరీగంజ్ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. ఈ సందర్బంగా బీజేపీ నేత దీపక్ సింగ్ అక్కడికి వచ్చారు. అయితే, కారు దిగిన వెంటనే దీపక్ సింగ్.. ఎమ్మెల్యే ప్రతాప్ సింగ్, అతడి అనుచరులను దూషించారు. దీంతో, ఆగ్రహానికి లోనైన రాకేష్ ప్రతాప్ సింగ్ ఒక్కసారిగా దీపక్ సింగ్‌పై దాడికి పాల్పడ్డారు. అతడి అనుచరులు కూడా దీపక్ సింగ్‌పై ఎగబడ్డారు. అయితే, ఇంతలో తేరుకున్న పోలీసులు.. వారికి అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ.. ఎమ్మెల్యే, అతడి అనుచరులు మాత్రం బీజేపీ నేతలను తీవ్రంగా కొట్టారు. Warning: Disturbing video, abusive content Inside Gauriganj Kotwali police station in UP's Amethi district. Samajwadi Party MLA Rakesh Pratap Singh and his supporters attack Deepak Singh, husband of Nagar Palika chairman BJP candidate Rashmi Singh. pic.twitter.com/BcJGQEMzGY — Piyush Rai (@Benarasiyaa) May 10, 2023 అనంతరం, ఎమ్మెల్యే రాకేష్ మాట్లాడుతూ.. మేము ప్రశాంతంగా ధర్నా చేస్తుంటే దీపక్ సింగ్ అక్కడికి వచ్చి అసభ్యకరంగా మాట్లాడారు. అతను బూతులు తిడుతున్నా పోలీసులు మాత్రం దీపక్ సింగ్‌ను వారించలేదు. నాపై, మా పార్టీ కార్యకర్తలను దూషించిన కారణంగానే దాడి చేశామని చెప్పుకొచ్చారు. ఇక, ఈ ఘటనలో ఇరు వర్గాలపై కేసుల నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఎమ్మెల్యే రాకేష్ ప్రతాప్ సింగ్ పోలీసుల ఎదుటే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించిన మరో వీడియో వెలుగులోకి వచ్చింది. In UP's Amethi, another video of Samajwadi Party MLA Rakesh Pratap Singh threatening to kill self in front of policemen has surfaced. Accusing BJP leader Deepak Singh of assaulting his supporters, MLA Rakesh Pratap Singh had sat on dharna at Gauriganj police station last night. pic.twitter.com/oG2nZssGSU — Piyush Rai (@Benarasiyaa) May 10, 2023 ఇది కూడా చదవండి: కర్ణాటక ఎన్నికలు.. దుఃఖాన్ని దిగమింగి బందోబస్తు విధులకు -
డాన్సర్లతో ఎమ్మెల్యే చిందులు.. వీడియో వైరల్
ఆయన అధికారపార్టీకి చెందిన ఎమ్మెల్యే. పవర్ చేతిలో ఉంది కదా.. మనల్ని ఎవరేం చేస్తారులే అనుకున్నట్లున్నారు. అవకాశం దొరికిందే తడవుగా.. డాన్సర్లతో చెలరేగిపోయి అసభ్యంగా ప్రవర్తించారు. దానికి సంబంధించిన వీడియో ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో ప్రతిపక్షాలు ఈ వ్యవహారంపై భగ్గుమన్నాయి. కొన్ని స్థానిక టీవీ చానళ్లలో కూడా ఈ వీడియో ప్రసారమైంది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన జగత్‌రామ్ పాశ్వాన్ అనే ఈ ఎమ్మెల్యే ఓ పెళ్లికి హాజరై.. అక్కడ డాన్సు చేస్తున్న యువతుల మీదకు కరెన్సీ నోట్లు విసరడంతో పాటు వారి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దీనిపై ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలకు దిగాయి. సమాజ్‌వాదీ పార్టీ అగ్రనాయకత్వం వాళ్లలో వాళ్లే తన్నుకోవడంలో బిజీగా మారిపోతే.. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు డాన్సర్ల మీద నోట్లు చల్లుతూ ఆనందం పొందుతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ బహదూర్ పాఠక్ విమర్శించారు. సమాజ్‌వాదీ పార్టీ గూండాలు, మాఫియా శక్తులతో నిండిపోయిందని కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి అరుణ్ ప్రకాష్ సింగ్ మండిపడ్డారు. ఆ పార్టీ అసలు లక్షణం ఇప్పుడు వీడియో రూపంలో బయటకు వచ్చిందని అన్నారు. సమాజ్‌వాదీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ ప్రజాప్రతినిధులు ఇలాంటి కార్యకలాపాల్లోనే ఉంటున్నారని పీస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ మన్నన్ అన్నారు. -
మీ ఆత్మాహుతి బాంబర్లను పాక్ పంపండి
పాకిస్థాన్‌కు చెందిన నటీనటులంతా 48 గంటల్లోగా భారతదేశాన్ని వదిలి వెళ్లిపోవాలంటూ మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చేసిన హెచ్చరికలపై సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర ఎమ్మెల్యే అబూ అజ్మీ స్పందించారు. దమ్ముంటే రాజ్ ఠాక్రే తన ఆత్మాహుతి బాంబర్లను పాకిస్థాన్‌లోని లాహోర్, కరాచీ నగరాలకు పంపాలని సవాలుచేశారు. పాకిస్థాన్ తన ఆత్మాహుతి దళాలను భారత్ పంపుతోందని, దానికి ప్రతీకారంగా కావలంటే మీ వాళ్లను పాక్ పంపాలని తెలిపారు. అంతేతప్ప చట్టబద్ధంగా భారతదేశ వీసా తీసుకుని ఇక్కడకు వచ్చేవారిని భయపెట్టొద్దని తెలిపారు. దానివల్ల మీ ఓటుబ్యాంకే దెబ్బతింటుందని అన్నారు. పాకిస్థాన్ విషయం పక్కన పెడితే.. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చంద్రాపూర్ లాంటి ప్రాంతాల్లో నక్సలైట్లు పోలీసులపై దాడులు చేస్తున్నారని.. ముందుగా పార్టీ కార్యకర్తలను పంపి ఆ పోలీసులను రక్షించాలని అబూ అజ్మీ అన్నారు. పాకిస్థానీ ఉగ్రవాదులు మన 18 మంది జవాన్లను హతమార్చిన మాట నిజమేనని, దానిపై ప్రతీకారం తీర్చుకోవాల్సిందేనంటూ అంతమాత్రాన అక్కడి నుంచి వచ్చే కళాకారులు, క్రీడాకారులను భయపెట్టడం సరికాదన్నారు. రాజ్‌ఠాక్రేకు దమ్ముంటే ఢిల్లీ వెళ్లి పాకిస్థాన్ రాయబార కార్యాలయాన్ని మూసేయాలని, అలాగే పాకిస్థాన్‌లోని భారత ఎంబసీకి వెళ్లి ఆ దేశం వాళ్లకు ఇక్కడి వీసాలు ఇవ్వకుండా చూడాలని తెలిపారు. -
ఎమ్మెల్యే కారును ఓవర్ టేక్ చేశారని..
ఆగ్రా: ఎమ్మెల్యే కారును బర్రెలను తీసుకెళ్తున్న ఓ ట్రక్ ఓవర్ టేక్ చేయడం ఆయనకు కోపం తెప్పించింది. స్పీడుగా వెళ్లి ట్రక్‌ను ఓవర్ టేక్ చేయాల్సిందిగా డ్రైవర్‌ను ఆదేశించాడు. ఎమ్మెల్యే ట్రక్‌ను ఆపి అందులో ఉన్న 30 బర్రెలను బయటకు తోలారు. ఉత్తరప్రదేశ్‌లో అధికార సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రాజ్‌కుమార్ యాదవ్ చేసిన నిర్వాకమిది. రాజ్‌కుమార్ రాజస్థాన్‌లోని కోటా నుంచి తన నియోజకవర్గం సాదార్కు వెళ్తున్నారు. తన కారును ఓవర్ టేక్ చేసినందుకు ట్రక్‌లో ఉన్న బర్రెలను విడిచిపెట్టి వెళ్లిపోయారు. వీటిని చూసిన గ్రామస్తులు తొలుత ఆశ్చర్యపోయినా, తమకు దొరికినందుకు సంతోషించి ఇళ్లకు తోలుకుపోయారు. యజమానుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామాల్లో ప్రతి ఇల్లూ గాలించి బర్రెలను గుర్తించారు. కాగా బర్రెలను కబేళానికి తీసుకెళ్తుంటే ట్రాక్‌ను ఆపానని, గ్రామస్తులు వాటిని విడిపించారని ఎమ్మెల్యే చెప్పగా.. స్థానిక డైరీకి తీసుకెళ్తున్నామని యజమానులు చెప్పారు. చివరకు ఎమ్మెల్యే, బర్రెల యజమానుల మధ్య రాజీకుదరడంతో కేసును ఉపసంహరించుకున్నారు.