sandeep kaur
-
సందీప్, సాయి ధరమ్‌తేజ్‌తో ఎఫైర్స్.. రెజీనా రియాక్షన్
రెజీనా కసాండ్రా తన ఎఫైర్స్ గురించి తాజాగా రివీల్ చేశారు. తను నటించిన కొత్త చిత్రం 'ఉత్సవం' విడుదల సందర్భంగా ఆమె ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దక్షిణాదిలో తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి రెజీనా, టాలీవుడ్లో పిల్ల నువ్వు లేని జీవితం, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్,కొత్త జంట వంటి సినిమాలతో కుర్రాళ్లకు బాగా కనెక్ట్ అయింది. అయితే, ఈ బ్యూటీ గురించి అప్పుడప్పుడు భారీగానే రూమర్స్ వస్తూ ఉంటాయి. గతంలో యంగ్ హీరో సందీప్ కిషన్‌తో పాటు సాయి ధరమ్ తేజ్‌తో రెజినా రిలేషన్లో ఉన్నారంటూ ప్రచారం జరిగింది. వారిద్దరిలో ఒకరిని పెళ్లి చేసుకోనుందంటూ కూడా సోషల్‌మీడియాలో వైరల్ అయింది. అయితే, సందీప్ గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఆమె స్నేహితురాలు మాత్రమే.. దయచేసి ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేయకండి అంటూ పేర్కొన్నారు. తాజాగా రెజీనా కూడా రియాక్ట్ అయ్యారు.'సందీప్, సాయి ధరమ్‌తేజ్ ఇద్దరూ కేవలం స్నేహితులు అయినప్పటికీ, వారితో నా అనుబంధం చాలా భిన్నంగా ఉంటుంది. సందీప్, నేను టామ్ అండ్ జెర్రీ లాంటి వాళ్లం. మేము ఇద్దరం ఒకరిపై మరొకరం తరచూ అరచుకుంటాం. ఒక్కోసారి ఒకరితో ఒకరం రెండు నెలలు మాట్లాడుకోము. కానీ, కాస్త గ్యాప్ తర్వాత మళ్లీ మాట్లాడటం మొదలుపెడుతాం. మా సంభాషణ ఎలా ఉంటుందంటే.. అసలు మా మధ్య ఎలాంటి గొడవ జరగలేదు అనేంతగా ఉంటుంది. ఇదీ చదవండి: హీరోయిన్ 'సమంత' దినచర్య ఇదే.. నెట్టింట వైరల్సాయి కూడా నాకు చాలామంచి స్నేహితుడు. అతను ఎప్పుడూ చాలా ప్రశాంతంగా ఉంటాడు. చాలా స్వీట్ పర్సన్. అతనితో నా బంధం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. సందీప్‌తో గొడవపడినట్లు సాయితో జరగదు. అలా మేమిద్దరం ఎప్పుడూ పోట్లాడుకోలేదు. అయినప్పటికీ, ప్రేక్షకులు మాకు ఎప్పుడూ సీక్రెట్‌గా పెళ్లి చేసేస్తుంటారు.' అని రెజీనా తెలిపింది. కొద్దిరోజుల క్రితం కూడా ఓ బిజినెస్‌మేన్‌తో రెజీనా వివాహం అంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అలా ఆమె పెళ్లి చుట్టూ పుకార్లు వస్తూనే ఉన్నాయి.అదే ఇంటర్వ్యూలో రెజీనాకు ఎలాంటి వ్యక్తి కావాలో కూడా చెప్పుకొచ్చింది. బాధ్యత తెలియని వ్యక్తితో కలిసి ఉండాలని ఏ అమ్మాయి కోరుకోదని చెప్పింది. తనను జాగ్రత్తగా చూసుకునే వాడు అయితే చాలు అంటూ ఆమె పేర్కొంది. తన జీవితంలో చాలామందితో రిలేషన్షిప్లో ఉన్నాను షాకింగ్ న్యూస్ చెప్పింది. ఒక రకంగా తాను సీరియల్ డేటర్ అంటూ నవ్వేసింది. అయితే, ప్రస్తుతం బ్రేక్ తీసుకున్నానని, ఇప్పుడు ఎక్స్ బాయ్‌ఫ్రెండ్స్ మాత్రమే తనకు ఉన్నారిని చెప్పింది. ఈ విషయంలో తాను ఎలాంటి అబద్దం చెప్పడంలేదని పేర్కొంది. -
ది లిప్‌స్టిక్ బ్యాండిట్..
2015.. వరుస బ్యాంక్ దోపిడీలతో అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాలైన ఆరిజోనా, కాలిఫోర్నియా, ఉటాలను ఊపేసిన బాంబ్‌షెల్ బాండిట్ గుర్తుంది కదా? అదేనండీ ఉరఫ్ సందీప్ కౌర్... 24 ఏళ్ల అమ్మాయి.. కాలిఫోర్నియాలో నర్స్‌గా పనిచేసేది. కాసినోకి వెళ్లే వ్యసనంతో విపరీతంగా అప్పులపాలై వాటిని తీర్చడానికి బ్యాంకులకు కన్నం వేయాలని నిర్ణయించుకుంది. మారువేషం.. ఆమె మోడస్ ఆపరెండి. తల మీద విగ్గు.. సగం మొహాన్ని కప్పేసే సన్‌గ్లాసెస్.. ట్రాక్ సూట్, హ్యాండ్ బ్యాగ్‌తో బ్యాంక్‌కు వెళ్లేది. క్యాషియర్ దగ్గరకు వెళ్లి.. ‘‘ఈ బ్యాగ్‌లో బాంబ్ ఉంది.. ఈ బ్యాగ్‌లో పట్టినంత డబ్బు సర్దకపోతే బాంబ్‌తో బ్యాంక్ పేల్చేస్తా’’ అని స్థిర స్వరంతో బెదిరించి లూటీ చేసి వెళ్లిపోయేది ఈ రాణి. అలా వరసగా అయిదు వారాలు ఆరిజోనా, కాలిఫోర్నియా, ఉటాలో తన దోపిడీలతో కలకలం సృష్టించింది. అలా దొంగతనం చేసి వెళ్లిపోతుంటే పోలీసులు ఆమెను వెంటాడారు. పసిగట్టిన కౌర్ తన వెహికిల్‌ను హై స్పీడ్‌లో మూడు రాష్ట్రాలను అంటే రెండు టైమ్‌జోన్స్‌ను దాటించింది. ఈ చేజింగ్ సీన్ హాలీవుడ్ సినిమాకూ తక్కువకాదు. మొత్తానికి పోలీసులకు చిక్కి 66 నెలల జైలు శిక్షకు గురైంది. ఆమె బెదిరింపు విని భయంతో గొంతు తడారిపోయిన వాళ్లకు నీళ్లు తాగించి మరీ డబ్బులు దోచుకొళ్లేదట దొరసాని.ఓకే.. క్వీన్ సినిమా కూడా గుర్తుంది కదా? ఏంటీ ఒక స్క్రీన్ మీద రెండు కథలు? అని ఐబ్రోస్‌ను ముడేయకండి! నిజంగా ఒక టికెట్‌కు రెండు కథల సినిమానే సిమ్రన్. విడాకులు తీసుకున్న30 ఏళ్ల ఓ వనిత కథ... ప్రఫూల్ పటేల్ అలియాస్ సిమ్రన్... అమెరికాలోని జార్జియా (అట్లాంటా)లో ఉంటుంది... తల్లిదండ్రులతో కలిసి. ఓ ఫైవ్ స్టార్ హోటల్లో హౌజ్ కీపింగ్ ఉద్యోగం చేస్తూ. భర్తతో విడిపోయి ఇంట్లో ఉంటున్న కూతురంటే తల్లికి, తండ్రికి ఇద్దరికీ చిన్న చూపే. ప్రఫూల్ ఉద్యోగం నుంచి ఇంటికి రాగానే.. ‘‘ఎన్నాళ్లిలా ఉంటావ్? ఇంకో పెళ్లి చేసుకోవచ్చుకదా.. ’ అంటూ తల్లి నస పెడుతుంటుంది. జీతం డబ్బుల్లో చాలా దాచుకుంటూ సొంతంగా ఇల్లు తీసుకొని విడిగా ఉండాలనుకుంటుంది. ఈ విషయం తెలిసి తండ్రి ‘‘ఎందుకూ.. ఒంటరిగా అయితే బాయ్‌ఫ్రెండ్స్‌ను పిలిపించుకోవచ్చనా?’’ అంటూ అవమానపరుస్తుంటాడు. తల్లిదండ్రుల అనుమానాలు, అవమానాలు, అంచనాల నుంచి విముక్తి పొందాలనుకుంటుంది ప్రఫూల్. స్వతంత్రంగా బతకాలనుకుంటుంది. లాస్ వేగస్.. ఆ క్రమంలోనే లాస్ వేగాస్‌లో కజిన్ బ్యాచ్‌లరేట్ పార్టీ ఉండడంతో వెళ్తుంది. అక్కడ ఆమెను ఓ క్లబ్‌కు తీసుకెళ్తాడు ఓ ఫ్రెండ్. బాకర్ట్ గేమ్‌లో డబ్బులు గెల్చుకుంటుంది. ఎంజాయ్ చేస్తుంది. కాసినోకు వెళ్తుంది. బకార్ట్లో సహకరించిన అదృష్టం కాసినోలో వెక్కిరిస్తుంది. గెలుచుకున్నదంతా పోతుంది. అక్కడితో ఆగకుండా బ్యాంక్లోఉన్న సేవింగ్స్‌నూ పెడ్తుంది. అవీ పోతాయ్. తిరిగి అట్లాంటా వెళ్లిపోతుంది. బ్యాంక్‌లో ఉండాల్సిన డిపాజిట్ లేకపోవడంతో ఇల్లు లోన్ కోసం పెట్టుకున్న దరఖాస్తు రిజెక్ట్ అవుతుంది. ఆర్థిక సహాయం కోసం తండ్రిని అభ్యర్థిస్తుంది. ‘‘ఈ పిచ్చి పనులన్నీ మానుకుని సమీర్ (సోహమ్ షా.. తండ్రి చూసిన ఇంకో సంబంధం)ను చేసుకో’’ అంటూ ఒత్తిడి చేస్తాడు. ససేమిరా అనుకుని ఆఖరిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మళ్లీ వేగస్ వెళుతుంది. కాసినోలో అప్పులిచ్చేవాడు తారసపడ్తాడు. తాకట్టుగా డ్రైవింగ్ లైసెన్స్‌ను పెట్టి డబ్బు తీసుకుంటుంది. వాటినీ పోగొట్టుకుంటుంది. లిప్‌స్టిక్ బ్యాండిట్.. మళ్లీ అట్లాంటా వెళ్లిపోయి తండ్రితో చెప్తుంది సమీర్‌ను కలుస్తానని. కలుస్తుంది కాని ఎలాంటి ఆసక్తీ చూపదు. అయితే సమీర్‌కు ప్రఫూల్ అంటే ఇష్టం ఏర్పడుతుంది. ఈలోపు కజిన్ పెళ్లి వస్తుంది. ఆ పెళ్లిలో అప్పులవాడు డబ్బు కట్టమని ఫోన్ చేసి బెదిరిస్తుంటాడు. ఇంటికి లోన్ వస్తే అవి కట్టేద్దామనుకుంటుంది. కాని లోన్ క్యాన్సల్ కావడంతో ఏం చేయాలో పాలుపోదు. మెల్లగా చిల్లర దొంగతనాలకు అలవాటు పడుతుంది. ఆ అలవాటు బ్యాంక్ దోచేందుకు ప్రోత్సహిస్తుంది. బ్యాంక్‌కు వెళ్లి ‘‘డబ్బులు ఈ బ్యాగ్‌లో పెట్టండి లేదంటే బాంబు పేలుస్తా’’ అని లిప్‌స్టిక్‌తో రాసిన నోట్‌ను క్యాషియర్‌కు చూపిస్తుంది. భయపడి డబ్బు సర్దేస్తారు బ్యాగ్‌లో. ఇదేదో బాగుంది అని వరుసగా ఇంకో రెండు బ్యాంక్‌లను దోచేస్తుంది. ఆ క్రమంలోనే మరో బ్యాంక్‌ను ఎంచుకుంటుంది. అదే ఫక్కీలో లిప్‌స్టిక్ నోట్ చూపిస్తుంది. అయితే మేనేజర్ నీ పేరేంటి అని అంటూ మాటల్లో పెడ్తాడు. తడబడ్డ ప్రఫూల్.. సిమ్రన్ అని చెప్తుంది. కారణం అప్పటికే వాళ్ల అమ్మ వల్ల ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమాను కొన్ని పదులసార్లు చూడ్డం వల్ల. పైగా ఆ సినిమాలోని లాస్ట్ సీన్.. ‘‘జా సిమ్రన్ జా.. జీలే అప్నీ జిందగీ’’ అనే డైలాగ్ ప్రఫూల్కి చాలా ఇష్టం. దాంతో ఆ పేరు చెప్తుంది. కాని మేనేజర్ ఆమె గురించి పోలీసులకు ఇన్ఫామ్ చేస్తున్నాడని తెలుసుకుని తప్పించుకుని ఇంకో బ్యాంక్‌కు వెళ్తుంది. అప్పటికే ఆమె ‘సిమ్రన్.. ది లిప్‌స్టిక్ బ్యాండిట్’ పేరుతో మోస్ట్‌వాంటెడ్ క్రిమినల్‌గా మారుతుంది. మూడు, నాలుగు బ్యాంక్‌లను దోచుకున్నా అప్పుల వ్యక్తికి కట్టాల్సిన డబ్బు జమకాదు. దాంతో ఇంకొంత వ్యవధి ఇవ్వమని ప్రాధేయపడుతుంది. ఒప్పుకోడు. ఇంకోవైపు సమీర్ అంటే ఇష్టం ఏర్పడి పెళ్లికి సరే అంటుంది ప్రఫూల్. ఈలోపే ఇంకో సమస్య చుట్టుకుంటుంది ఆమెను. హోటల్లో పనిచేస్తుండగా అప్పుల వాళ్లు ఆమె మీద దాడి చేస్తారు. ఆమె పాత బాయ్‌ఫ్రెండ్, ఆ హోటల్ మేనేజర్ (మైక్) ప్రఫూల్ హోటల్ లాకర్లో భద్రపర్చుకున్న డబ్బు (బ్యాంక్ రాబరీ మనీ) మీద కన్నేసి దొంగలిస్తాడు. ఆ విషయం తెలిసి తన డబ్బు తనకు తిరిగి ఇచ్చేయమని అడుగుతుంది ప్రఫూల్. ఇవ్వనంటాడు. అతన్ని కొట్టి సస్పెండ్ అవుతుంది. ఈ గొడవలో అప్పుల వాళ్లకు ప్రఫూలే లిప్‌స్టిక్ బ్యాండిట్ అని అర్థమవుతుంది. దాంతో ఇంకో పెద్ద బ్యాంక్‌కు కన్నం వేయమని పిస్టల్‌ను కూడా ఇస్తారు ప్రఫూల్‌కు. సరెండర్.. వీటన్నిటితో విసిగిపోయి.. ఇక దాంట్లోంచి బయటకు రాలేననుకుని తాను చేసిన దొంగతనాల గురించి సమీర్‌కు చెప్పి తనను వదిలేయమంటుంది ప్రఫూల్. తండ్రికి తెలిసి కూతురి చెంప ఛెళ్లుమనిపించి ఇంట్లోంచి వెళ్లిపొమ్మంటాడు. స్నేహితురాలి దగ్గరకు వెళ్లి ఆ రాత్రి తలదాచుకుంటుంది. అయితే తెల్లవారి తనకు లోన్ రిజెక్ట్ చేసిన బ్యాంక్‌కు కన్నం వేసి డబ్బు దొంగలిస్తుంది. ఇదిలా ఉండగా.. ప్రఫూల్ దొంగ అని తెలిసినా ప్రేమను చంపుకోని సమీర్ ఆమె అప్పులవాళ్లకు కట్టాల్సిన 50 వేల డాలర్ల డబ్బును ప్రఫూల్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తాడు. గ్రహించిన ప్రఫూల్ అతన్ని ఒంటరి ప్రదేశంలో కల్సుకుని తనను వదిలేసి ఇంకో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకొమ్మని చెప్తుంది. అదంతా కాదు.. ముందు పోలీసులకు లొంగిపో అంటాడు సమీర్. తండ్రి నుంచి ఫోన్ వస్తుంది క్షమించమని. ఇంటికి బయలుదేరుతుంది. పోలీసుల నిఘా ఉండడం వల్ల ఇంటి దగ్గర పోలీసులు చుట్టుముడ్తారు. తప్పించుకుంటుంది ప్రఫూల్. చేజింగ్ మొదలవుతుంది. తర్వాత సరెండర్ అవుతుంది. తప్పించుకోవాలనే ఉద్దేశం లేదని, తమింటి దగ్గర అందరూ భారతీయులే కావడం వల్ల అక్కడ దొరికిపోవడం ఇష్టం లేకే అంత దూరం వచ్చినట్టు చెప్తుంది. వచ్చేసరికి పోలీసులు ఆమె కారును చుట్టుముడ్తారు. సరెండర్ అయిపోతుంది. పదినెలలు జైలు శిక్ష పడుతుంది. ఇదీ బాంబ్‌షెల్ బ్యాండిట్కు ప్రతీకగా వచ్చిన ‘ది లిప్‌స్టిక్ బ్యాండిట్’ సిమ్రన్ సినిమా కథ. – శరాది -
తప్పు తనది కాదు మిలార్డ్!
కౌర్ కథా చిత్రం అమ్మ, నాన్న పట్టించుకోకపోతే పిల్లలు ఏమౌతారు? క్రిమినల్స్ అవుతారు. సినిమాకు కథ కూడా అవుతారు. సందీప్ కౌర్ ప్రస్తుతం యు.ఎస్.జైల్లో ఉంది. కోర్టు ఆమెకు విధించిన 66 నెలల శిక్ష పూర్తయ్యే వరకు కౌర్‌కు మరో లైఫ్ లేదు. ఆమె చేసిన నేరం.. బ్యాంక్ రాబరీ. ఆమె తల్లిదండ్రులు చేసిన నేరం.. ఆమెను పట్టించుకోకపోవడం. మరీ ఎక్కువగా పట్టించుకోవడం కూడా పట్టించుకోకపోవడమే. చండీఘర్‌లోని ఒక చక్కటి సంప్రదాయ కుటుంబంలో 1989 నవంబర్ 11న పుట్టింది కౌర్. ఏడేళ్ల వయసులో తల్లి, తమ్ముడు, ఆ పిల్ల.. యు.ఎస్. వెళ్లిపోయారు. కౌర్ తండ్రికి అక్కడ ఉద్యోగం. నో మొబైల్స్, నో టెలివిజన్, నో ఫ్రెండ్స్ అని ముందే చెప్పేశాడు పిల్లలిద్దరికీ. అలా ఈ అక్కాతమ్ముడు సొంత ఇంట్లోనే ఒంటరివారైపోయారు. 2001లో ట్విన్ టవర్స్‌పై దాడుల తర్వాత స్కూల్లోనూ ఒంటరివారయ్యారు. అంతా అనుమానంగా చూసేవారు.. వీళ్లేదో ఆ ఉగ్రవాదుల పిల్లలన్నట్లు! అవమానాలు భరించలేక ఇద్దరూ స్కూల్ మానేశారు. షేర్లు కౌర్‌కి 14 ఏళ్లు వచ్చాయి. ఓ రోజు తల్లి జబ్బున పడితే హాస్పిటల్లో చేర్పించారు. అక్కడ తన తల్లికి నర్సులు ప్రేమగా సేవలు అందించడం చూసి, తను కూడా నర్స్ అవ్వాలని కౌర్ నిర్ణయించుకుంది. నర్సింగ్ కోర్సులో చేరింది. 19 ఏళ్లకు నర్సింగ్ లైసెన్స్ సంపాదించింది. ఆ తర్వాత కాలిఫోర్నియా రాజధాని శాక్రమెంటోలో నర్సింగ్ డిగ్రీ కోర్సులో చేరింది. ఆ సమయంలోనే స్టాక్ మార్కెట్లో డబ్బుని ఇన్వెస్ట్ చేసింది. ఎవరో చెప్పారు, షేర్ల ధర పెరిగితే లైఫ్ టర్న్ అవుతుందని. తక్కువ ధరలో ఉన్నప్పుడు కౌర్ కొన్న షేర్లు ఊహించని విధంగా పెరిగాయి. వెంటనే వాటిని అమ్మేసింది. కౌర్‌కు వచ్చిన లాభం 2 లక్షల డాలర్లు. ఇండియన్ కరెన్సీలో సుమారు ఒక కోటీ పాతిక లక్షల రూపాయలు! గ్యాంబ్లింగ్ 21వ బర్త్‌డే అంటే యు.ఎస్.కల్చర్‌లో.. వెరీ స్పెషల్ బర్త్‌డే. ఇరవై ఒక్క ఏళ్ల వయసులో కౌర్‌కు అది ఇంకా స్పెషల్ బర్త్‌డే. అప్పటికే కోటీశ్వరురాలు మరి! అమన్‌దీప్ కౌర్ కజిన్. అతడు బర్త్‌డే పార్టీకి వచ్చి, విషెస్ చెప్పి, కేక్ తినిపించి మరీ ఓ ఐడియా చెప్పాడు. ‘‘లాస్ వెగాస్ వెళ్దాం. అక్కడే కేసినోలు ఉంటాయి. ఒక ఆట ఆడితే జీవితానికి సరిపడా డబ్బు వచ్చేస్తుంది’’ అని అన్నాడు. నిజానికి అప్పటికే ఆ అమ్మాయి దగ్గర జీవితానికి సరిపడా డబ్బు ఉంది. కానీ ఇంకా కావాలని కోరుకుంది. తొలి జూదంలో కౌర్ 4 వేల డాలర్లు కొట్టేసింది! అది కిక్ ఇచ్చింది. డబ్బు పెట్టడం మొదలు పెట్టింది. దబ్బు వస్తోంది, పోతోంది. వస్తోంది. పోతోంది. చివరికి అంతా పోయింది. మిగిలింది.. ‘లక్కీ గ్యాంబ్లర్’ అన్న పేరొక్కటే. ‘‘లక్కీ గ్యాంబ్లర్కు ఒక్కోసారి ఇలానే జరుగుతుంది. మళ్లీ పెట్టండి. మళ్లీ వస్తుంది’’ అని తోటి జూదగాళ్లు మంట రాజేశారు. ఎక్కడి నుంచి వస్తుంది మళ్లీ పెట్టడానికి? అప్పు చేసింది కౌర్. అదీ పోయింది! అప్పులవాళ్లు వెంటపడ్డారు. అడ్రస్ మార్చేసింది. తను ఉంటున్న కాలిఫోర్నియా స్టేట్‌లోనే.. వెగాస్ నుంచి యూనియన్ సిటీకీ గుట్టు చప్పుడు కాకుండా మారిపోయింది. అప్పుల్ని ఎగ్గొట్టడం ఆమె ఉద్దేశం కాదు. కష్టపడి సంపాదించి ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చేయాలనుకుంది. అందుకోసం నర్సుగా చేరింది. ఓవర్ టైమ్ డ్యూటీ చేస్తోంది. రాబరీ ఓ రోజు అకస్మాత్తుగా ఇద్దరు ఆగంతకులు దారి కాచి కౌర్‌ను అటకాయించారు. ‘‘నువ్వు కట్టాల్సిన 35 వేల డాలర్లను రెండురోజుల్లో కట్టకపోతే నీ అంతుచూస్తాం’’ అన్నారు. ‘‘నేను కట్టలేను’’ అంది కౌర్. ‘‘మాకు అనవసరం. బ్యాంకు దోపిడీ చేస్తావో, ఇళ్లలో దొంగతనాలు చేస్తావో.. ఏదైనా చేసి డబ్బు తెచ్చివ్వు’’ అన్నారు. ఓ గన్ కూడా ఆమె చేతిలో పెట్టబోయారు. కౌర్ ఉలిక్కిపడి, చెయ్యి వెనక్కు లాగేసుకుంది. కానీ విధి ఆమెను ముందుకు తోసింది. సరిగ్గా వారం తర్వాత ‘బ్యాంక్ ఆఫ్ వెస్ట్’లో రాబరీ జరిగింది. అది కౌర్ చేసిన రాబరీ. 21,200 డాలర్లను కొల్లగొట్టి ఎస్కేప్ అయింది. తర్వాత ఒక బ్యాంకులో 1,978 డాలర్లు, ఇంకో బ్యాంకులో 8 వేల డాలర్లు దోచుకుంది. చివరికి సెయింట్ జార్జి సిటీలోని యు.ఎస్.బ్యాంక్‌లో దోపిడీ చేస్తూ పోలీసులకు పట్టుబడింది. కౌర్‌కు కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. 2 లక్షల 50 వేల డాలర్ల ఫైన్ కట్టమంది. ‘‘తను ఒక్క డాలర్ కూడా కట్టలేదు మిలార్డ్’’ అన్నాడు ఆమె లాయర్. అంతే కాదు, ‘తనకు అన్నేళ్ల జైలు శిక్ష వెయ్యడం కూడా న్యాయం కాదు మిలార్డ్’’ అన్నాడు. న్యాయమూర్తి భృకుటి ముడిచాడు. ‘‘ఏ?’’ అన్నాడు. ‘‘మీలార్డ్.. కౌర్ అమ్మానాన్న ఆ అమ్మాయిని పట్టించుకోలేదు. ఆమె పెంపకం సరిగా జరగలేదు’’ అని చెప్పాడు లాయర్. జడ్జి కన్విన్స్ అయ్యాడు. శిక్షాకాలాన్ని 66 నెలలకు తగ్గించాడు. అంటే ఐదేళ్లా ఆరునెలలు. అమ్మ, నాన్న పట్టించుకోకపోతే పిల్లలు ఏమౌతారు? క్రిమినల్స్ అవుతారు. సినిమాకు కథ కూడా అవుతారు. నిన్న రిలీజ్ అయిన బాలీవుడ్ చిత్రం ‘సిమ్రాన్’.. కౌర్ కథే. అందులో కౌర్‌గా కంగనా రనౌత్ నటì ంచారు. సందీప్ కౌర్ బ్యాంక్ రాబరీ కేసులో ప్రస్తుతం శిక్ష అనుభవిస్తున్న ఎన్నారై -
'బందిపోటు బాంబు'కు 66 నెలల జైలుశిక్ష
'బందిపోటు బాంబు' అని పేరున్న సందీప్ కౌర్ అనే భారత సంతతి మహిళకు అమెరికాలోని కాలిఫోర్నియాలో 66 నెలల జైలు శిక్ష విధించారు. నాలుగు బ్యాంకులను దోచుకున్నట్లు ఆమెపై ఆరోపణలున్నాయి. ఆమెకు శిక్ష తగ్గించాలని కౌర్ తరఫు న్యాయవాది చేసిన విజ్ఞప్తిని కోర్టు పట్టించుకోలేదు. 2014 వేసవి సమయంలో ఆమె ఈ బ్యాంకు దోపిడీలకు పాల్పడినట్లు చెబుతున్నారు. కౌర్ వయసు తక్కువని, ఆమె బాగా చదువుకుందని, ఇంతకుముందు ఎలాంటి నేరచరిత్ర కూడా లేదని న్యాయవాది విన్వర్డ్ వాదించారు. ఆమె సంప్రదాయ భారతీయ కుటుంబంలో పుట్టిందని, అనుకోకుండా ఉచ్చులో చిక్కుకుందని అన్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లిని కాదని, అమెరికా వచ్చేసి తన బోయ్‌ఫ్రెండును పెళ్లి చేసుకుంది. కానీ ఆ పెళ్లి మూణ్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. స్టాక్ మార్కెట్లో కొంత సంపాదించాక, లాస్ వెగాస్‌లో జూదానికి అలవాటు పడిపోయి, అప్పుల్లో మునిగిపోయింది. జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె ప్రవర్తన బాగుందని, ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండేదని లాయర్ అన్నారు. బ్యాంకు దోపిడీలకు వెళ్లినప్పుడు కనీసం తుపాకులు కూడా తీసుకెళ్లేది కాదని చెప్పారు. అయితే.. జడ్జి మాత్రం ఆ వాదనతో ఏకీభవించలేదు. కౌర్‌కు 66 నెలల జైలుశిక్ష విధించారు. దాంతోపాటు, నాలుగు దోపిడీల్లో సంపాదించిన 25 లక్షల రూపాయలను తిరిగి కట్టాలని కూడా ఆదేశించారు. దోపిడీల సమయంలో బాంబులతో బ్యాంకును పేల్చేస్తానంటూ బెదిరించడం వల్లే ఆమెకు 'బందిపోటు బాంబు' అనే పేరు వచ్చిందని ఎఫ్‌బీఐ వర్గాలు తెలిపాయి.