Sandhya Raju
-
నా ఇష్టాలని మా నాన్న ఒప్పుకోలేదు..అందుకే పెళ్లి చేసుకొని..!
-
ఆ పవర్ నా బ్లడ్ లోనే ఉంది..!
-
Jr. ఎన్టీఆర్ ని ఇన్వైట్ చేశాను అప్పుడు తను ఒక మాట అన్నాడు..!
-
నా భర్త విషయాలు నేను ఏమీ పట్టించుకోను : సంధ్య రాజు
-
సంధ్యారాజు 'నాట్యం'పై ఏఆర్ రెహమాన్ ప్రశంసలు
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ఇటీవల `నాట్యం` సినిమాలో తన డ్యాన్స్, మరియు నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశారు.. తాజాగా ఉమెన్స్‌డే సందర్భంగా ప్రముఖ రచయిత, ఆస్కార్ అవార్డు గ్రహీత మాయ ఏంజిలో రాసిన ఇంగ్లీష్ పద్యం `ఫినామినల్ ఉమెన్`కు మోడ్రన్ కూచిపూడి క్లాసికల్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ వీడియోను రూపొందించి సోషల్ మీడియాలో విడుదల చేశారు. ఈ ఫినామినల్ ఉమెన్ డ్యాన్స్ వీడియోను ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ ప్రశంసించి తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. ఈ వీడియో ఇప్పటికే మూడు లక్షలకుపైగా వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో విశేష ఆదరణ సొంతం చేసుకుంది. మన తెలుగు అమ్మాయి, క్లాసికల్ డ్యాన్సర్ జాతీయ స్థాయిలో ప్రసిద్ది చెందిన ఏఆర్ రెహమాన్ ప్రశంసలు అందుకోవడం గర్వించదగిన క్షణం. Sandhya Raju / Modern Kuchipudi / Performance Poetry / Maya Angelou's P... https://t.co/oUHeimC2Ai via @YouTube — A.R.Rahman (@arrahman) March 13, 2022 -
ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి ఎంపికైన 'నాట్యం' మూవీ
‘‘డ్యాన్స్, వ్యాపార రంగం నుంచి వచ్చిన మీరు ‘నాట్యం’ లాంటి సినిమాను ఎందుకు చేస్తున్నారు? అని చాలామంది అడిగారు. ‘ఇఫీ’ వేడుకల్లో మా ‘నాట్యం’ సినిమా ప్రదర్శితం కానుండటమే ఆ ప్రశ్నకు సమాధానం. మా చిత్రానికి ఆ అవకాశం రావడం చాలా గర్వంగా ఉంది’’ అని సంధ్యారాజు అన్నారు. ప్రముఖ నృత్య కళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబరు 22న విడుదలైంది. కాగా భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు(ఇఫి) ఈ నెల 20 నుంచి గోవాలో ప్రారంభం కానున్నాయి. తొమ్మిది రోజుల పాటు జరిగే ఈ 52వ ‘ఇఫి’ వేడుకల్లో ఇండియన్ పనోరమ విభాగంలో ‘నాట్యం’ ప్రదర్శితం కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో రేవంత్ కోరుకొండ మాట్లాడుతూ– ‘‘నాట్యం’ సినిమాతో భారతీయ, తెలుగు సంస్కృతులు, సంప్రదాయల గురించి మాట్లాడుకుంటే చాలనుకున్నాం.. కానీ ఇప్పుడు మా చిత్రం ప్రేక్షకులు గర్వపడే తెలుగు సినిమాగా నిలిచింది. మా చిత్రాన్ని కె.విశ్వనాథ్, చిరంజీవి, బాలకృష్ణ, రామ్‌చరణ్, రవితేజ.. వంటి చాలామంది ప్రోత్సహించారు.. ఇందుకు వారికి థ్యాంక్స్’’ అన్నారు. ‘‘నాట్యం’ సినిమా గురించి ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా మాట్లాడుకుంటున్నారు’’ అన్నారు నటుడు కమల్ కామరాజు. నిర్మాతలు ప్రసన్న కుమార్, వి.మోహన్ పాల్గొన్నారు. -
‘నాట్యం’ మూవీపై బాలయ్య రివ్యూ
ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం తొలిరోజే పాజిటివ్ టాక్ని సొంతం చేసుకుంది. తాజాగా ఈ చిత్రాన్ని నట సింహం నందమూరి బాలకృష్ణ వీక్షించారు. (చదవండి: ‘నాట్యం’మూవీ రివ్యూ) అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘నాట్యం చిత్రాన్ని చూశాను. ఇది సినిమా కాదు కళాఖండం. సినిమా అనేది కేవలం వినోదం కోసం కాదు. మరుగున పడిపోతోన్న కళలు, సంస్కృతులకు జీవం పోసి, భావి తరాలకు అందించే ప్రయత్నం చేశారు. దర్శకుడు రేవంత్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. కెమెరామెన్ కూడా ఆయనే కావడంతో సన్నివేశాలను చక్కగా క్యాప్చర్ చేశారు. సినిమాను ఎన్నిసార్లు చుసిన తనివి తీరదు. ఇంత మంచి చిత్రాన్ని అందించిన దర్శకనిర్మాతలకు అభినందనలు’ అన్నారు. ‘నాట్యం’పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు నాట్యం చిత్రంపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంసల జల్లు కురిపించారు. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన ఉప రాష్ట్రపతి.. ట్విటర్ వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘నాట్యకళ గొప్పతనాన్ని ఆవిష్కరిస్తూ కూచిపూడి నృత్యకళాకారిణి శ్రీమతి సంధ్యారాజు ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘నాట్యం’ చక్కని చిత్రం. భారతీయ సంస్కృతిలో కళలకు ఇచ్చిన ప్రాధాన్యతను కళ్ళకు కడుతూ చిత్రాన్ని రూపొందించిన దర్శకుడు రేవంత్ కోరుకొండ, ఇతర నటీనటులకు అభినందనలు’ అని తెలిపారు. -
'నాట్యం' ఫేమ్ సంధ్యారాజు బ్యాక్‌గ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
Natyam Movie Heroine Sandhya Raju Family Background Details: ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వం వహించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఉపాసన,ఎన్టీఆర్, రామ్‌చరణ్, వెంకటేశ్, చిరంజీవి లాంటి ప్రముఖులు నాట్యం చిత్రాన్ని ప్రమోట్ చేయడంతో ఈ సినిమాకు తొలి నుంచే పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది.చదవండి : కృష్ణంరాజు పెద్ద మనసు.. పనిమనిషికి ఖరీదైన బహుమతి అయితే క్షణం తీరిక లేకుండా గడిపే బిగ్ స్టార్స్ ఇంత ప్రత్యేకంగా ఈ సినిమాను ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు? అసలు ఎవరీ సంధ్యారాజు అనే చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇంతకీ ఈమె ఎవరంటే... వేల కోట్లకు అధిపతి, రాంకో సిమెంట్ ఇండస్ట్రీస్ యజమాని అయిన పి.ఆర్.వెంకట రామరాజు పెద్ద కుమార్తెనే సంధ్యారాజు. అంతేకాకుండా సత్యం కంప్యూటర్స్ వ్యవస్థాపకుడు రామలింగరాజు చిన్నకోడలు. సంధ్యారాజు స్వతహాగా కూచిపూడి నృత్యకారిణి. పేరు, ప్రఖ్యాతలున్న కుటుంబంలో పుట్టినా ఆమె స్వయంగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పటివరకు దేశ విదేశాల్లో కలిపి వెయ్యికి పైగా ప్రదర్శనలు ఇచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె రాజు రామ్ కో గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన సంధ్య స్పిన్నింగ్ మిల్స్ అనే సంస్థకు మేనేజింగ్ డైరెక్టర్ పనిచేస్తున్నారు. చదవండి : Natyam Movie Review: ‘నాట్యం’మూవీ రివ్యూ డబ్బుల కోసం ఇలాంటి పనులు చేస్తావా? హీరోయిన్‌పై ట్రోలింగ్ -
Natyam Review: ‘నాట్యం’మూవీ రివ్యూ
టైటిల్: నాట్యం నటీనటులు: సంధ్యారాజు, కమల్ కామరాజు, రోహిత్ బెహాల్, ఆదిత్య మీనన్, శుభలేక సుధాకర్, భానుప్రియ తదితరులు నిర్మాణ సంస్థ : నిశృంకళ ఫిల్మ్ నిర్మాతలు: సంధ్యారాజు దర్శకత్వం : రేవంత్ కోరుకొండ సంగీతం :శ్రవణ్ బరద్వాజ్ సినిమాటోగ్రఫీ : రేవంత్ కోరుకొండ విడుదల తేది : అక్టోబర్ 22, 2021 ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాట్యమే ప్రధానాంశంగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే..? నాట్యం అనే గ్రామానికి చెందిన సితార(సంధ్యారాజు)కు చిన్నప్పటి నుంచి క్లాసికల్ డ్యాన్స్ అంటే పిచ్చి. ఎప్పటికైన గొప్ప నృత్యకారిణి కావాలని, అదే గ్రామంలో కాదంబరి కథను నాట్య రూపంలో చేసి చూపించాలని కలలు కంటుంది. తన గురువు (ఆదిత్య మీనన్)గారికి ప్రియ శిష్యురాలిగా ఉంటూ క్లాసికల్ డ్యాన్స్‌పై పూర్తి పట్టు సాధిస్తుంది. రంగ ప్రవేశం చేసేందుకై కాదంబరి నాట్యం చేయాలనుకుంటుంది. దానికి గురువుగారు ఒప్పుకోరు. ఆ నాట్యం అభ్యసించడానికి ఎవరు ముందుకు వచ్చిన చనిపోతుంటారు. అయినప్పటికీ సితార తన రంగ ప్రవేశానికి ఆ నాట్యమే చేస్తానని పట్టుబడుతుంది. కట్ చేస్తే... సిటీలో ఉండే రోహిత్(రోహిత్ బెహాల్) మంచి వెస్ట్రన్ డ్యాన్సర్. అతను ఓ పనిపై నాట్యం గ్రామానికి వెళ్తాడు. అక్కడ సితారతో పరిచమవుతుంది. రోహిత్ కారణంగా సితార జీవితంలో అనుకోని మలుపులు తిరుగుతాయి. ఆమె చేసిన ఓ పని.. గ్రామస్తుల ఆగ్రహానికి గురిచేస్తుంది.దీంతో సితార ఆ గ్రామం విడిచి సిటీకి వెళ్తుంది. ఆ తర్వాత సితార జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నాయి? ఆమె చిన్నప్పటి నుంచి కలలు కన్న కాదంబరి నాట్య ప్రదర్శన నెరవేరిందా లేదా? అసలు కాదంబరి ఎవరు? ఆమె నేపథ్యం ఏంటి? అనేదే మిగతా కథ. ఎవరెలా చేశారంటే? సితార పాత్రకు పూర్తి న్యాయం చేసింది కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. యాక్టింగ్ పరంగా పర్వాలేదనిపించుకున్నా.. డాన్స్ విషయంలో మాత్రం ఇరగదీసింది. స్వతహాగా ఆమె మంచి క్లాసికల్ డ్యాన్సర్ కావడం సినిమాకు కలిసొచ్చింది. గురువుగారిగా ఆదిత్య మీనన్ తన అనుభవాన్ని మరోసారి తెరపై చూపించారు. ఇక క్లాసికల్ డ్యాన్సర్ హరిగా కమల్ కామరాజు, వెస్ట్రన్ డ్యాన్సర్ రోహిత్‌గా రోహిత్ బెహాల్ తమ అధ్భుత నటన, డాన్స్‌తో మెప్పించారు. ఊరి పెద్దగా శుభలేక సుధాకర్, హీరోయిన్ తల్లిగా భానుప్రియ తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? తెలుగు తెరపై నాట్యప్రధానమైన సినిమాలు అప్పట్లో బాగానే వచ్చేవి. 'స్వర్ణకమలం' 'సాగర సంగమం' . 'ఆనందభైరవి' లాంటి కొన్ని చిత్రాలు ఆ కోవకు చెందినవే. వాటిని ప్రేక్షకులు కూడా బాగానే ఆదరించేవారు. ఒక కమర్షియల్ సినిమాకు వచ్చే పేరు, కలెక్షన్స్ వీటికి కూడా వచ్చేవి. ఈ మధ్య కాలంలో అలాంటి చిత్రాలు రాలేదు. చాలా కాలం తర్వాత నృత్యం ప్రధానంగా ‘నాట్యం’అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూర్తిగా ఒక క్లాసికల్ డ్యాన్స్ కథాంశంతో వచ్చిన సినిమా ఇది. నాట్యంతో కథ చెప్పడం అనే కాన్సెప్ట్ బాగున్నప్పటికీ.. దానిని తెరపై చూపించడంలో కాస్త విఫలమయ్యాడు దర్శకుడు రేవంత్ కోరుకొండ. నేటి జనరేషన్‌కి తగ్గట్టుగా కమర్షియల్ ఎలిమెంట్స్‌ని యాడ్ చేసినప్పటికీ.. ఆకట్టుకునే విధంగా స్క్రీన్ ప్లేను రాసుకోలేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. అలాగే సంధ్యారాజు, రోహిత్‌ల ప్రేమను ఎలివేట్ చేసే బలమైన సీన్స్ కూడా లేవు. పస్టాఫ్ అంతా సింపుల్‌గా సాగినా.. ఇంటర్వెల్ ఇంటర్వెల్ సీన్ మాత్రం సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. అయితే సెకండాఫ్ మొత్తాన్ని ఎమోషనల్‌గా నడిపించే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కానీ అది వర్కౌట్ కాలేదనిపిస్తుంది. కాదంబరి ప్లాష్ బ్యాక్ తో పాటు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు కూడా సినిమా స్థాయిని పెంచేలా ఉంటాయి. చివరి 20 నిమిషాలు సినిమాకు హైలెట్. ఇక ఈ సినిమాకి ప్రధాన బలం శ్రవణ్ బరద్వాజ్ సంగీతం. పాటలతో పాటు అద్భుత నేపథ్య సంగీతాన్ని అందించాడు. పాటలు తెచ్చిపెట్టినట్లుగా కాకుండా కథలో భాగంగా సాగుతాయి. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై ఇంకాస్త దృష్టిపెట్టాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
నాట్యం హీరోయిన్ సంధ్యారాజ్ లేటెస్ట్ ఫోటోస్
-
‘చిరంజీవి, రామ్ చరణ్ వల్ల మా జీవితమే మారిపోయింది’
‘సినిమా పరిశ్రమ గురించి బయట ఏవేవో అంటారు. ఇక్కడ పాలిటిక్స్, నెగెటివిటీ ఎక్కువ ఉంటుందని అంటారు. కానీ ఇక్కడ చాలా మంచి వారున్నారు. మంచి కంటెంట్‌తో వస్తే ఆదరిస్తారు. పెద్ద స్టార్స్ కూడా చిన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. అలా చిరంజీవి, రామ్ చరణ్ మాకు టైం కేటాయించడం వల్ల మా జీవితమే మారిపోయింది’అన్నారు ప్రముఖ కూచిపూడి డ్యాన్సర్ సంధ్యారాజు. ఆమె ప్రధాన పాత్రల్లో నటిస్తూ నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సందర్భంగా సంధ్యారాజు నాట్యం సినిమా గురించి చెప్పిన విశేషాలు ఆమె మాటల్లోనే.. ►చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం. ప్రతీ రోజూ నాకు నాట్యం గురించి ఆలోచనలే ఉంటాయి. సినిమా ద్వారా ఇంకా దగ్గరకు రావొచ్చనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పాం. చాలా రీచ్ అయింది. అప్పుడు సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది. అందుకే ఈ సినిమాను తీశాను. ►నాకు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచం గురించి తెలీదు. నా ధ్యాస అంతా ఎప్పుడూ కూడా నాట్యం మీదే ఉండేది. నాట్య ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కే విశ్వనాథ్ వంటి వారు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు కదపడం కాదు.. దాని ద్వారా ఓ కథను చెప్పడం అనే మా దర్శకుడి ఆలోచన ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ నాట్యం ద్వారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించొచ్చు. పాత కాలంలో నాట్యం అనేది కూడా ఓ సినిమాలాంటిదే. ►నాట్యం చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తాం. క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపిస్తాం. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి? అని ఇలా రెండు మూడు ట్రాక్‌లు జరుగుతూ ఉంటాయి. నాట్యం అనేది ఊరి పేరు. దాని చుట్టూ ఉండే మూఢ నమ్మకాలు కూడా సినిమాలో ఉంటాయి. కమర్షియల్ సినిమాలానే ఉంటుంది. ►మంచి కంటెంట్ ఎక్కడ తీసినా అందరికీ రీచ్ అవుతుంది. మనం వేరే వాళ్లను కాపీ చేస్తే అది కాపీలానే ఉంటుంది. మనలోని యూనిక్ పాయింట్‌ను తీస్తే అందరూ ప్రశంసిస్తారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఈ సినిమాను చూశారు. అభినందించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఐదు నిమిషాలే సినిమా చూస్తాను అని అన్నారు. కానీ సినిమా మొదలైన తరువాత.. పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు. ఆ తరువాత నన్ను సత్కరించారు. ► చిరంజీవి ఇంకా మా సినిమా చూడలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా.. వ్యాపార రంగం నుంచి నేను రావడం, ఇలా సినిమా తీయడం, నటించడం ఆయనకు బాగా నచ్చింది. మా టీజర్ ఆయన చూశారు. బాగా నచ్చింది. మమ్మల్ని ప్రశంసించారు. ► చిన్నప్పుడు అందరి తల్లిదండ్రుల్లానే నన్ను కూడా రకరకాల క్లాసులకు పంపించారు. పదేళ్లప్పుడు వెంపటి చినసత్యం గారి శిక్షణను చూసి అక్కడే ఉండిపోయాను. నా జీవితాన్ని కళలకే అంకితం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కామర్స్ చదువు, ఫ్యాక్టరీలు చూసుకో అని ఇంట్లోవాళ్లు చెప్పారు. కానీ మనసంతా కూడా నాట్యం మీదే ఉండిపోయింది. కానీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నన్ను నిరుత్సాహపరచలేదు. పెళ్లి తరువాత కూడా మెట్టింట్లో వాళ్లంతా కూడా నన్ను ఎంకరేజ్ చేశారు. ► క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా డిజైన్ చేశాం. దాని కోసం మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. స్టోరీకి తగ్గట్టుగా కొరియోగ్రఫినీ చేశాం. కానీ ఆ పాటతో పాటుగా స్టోరీ కూడా ముందుకు వెళ్తుంది. రొహిత్ పూర్తిగా వెస్ట్రన్ డ్యాన్సర్. అలా అన్ని రకాల డ్యాన్సులు ఇందులో ఉంటాయి. ► నిర్మాతగా, నటిగా వ్యవహరించడం చాలా కష్టంగా అనిపించింది. ప్రొడక్షన్ టీం, లొకేషన్ టీం, అన్ని డిపార్ట్మెంట్లతో కలిసి పని చేస్తూ వచ్చాను. అలా హీరోయిన్లా ఎక్కడా ఉండలేకపోయాను. సినిమాను పూర్తి చేసి థియేటర్‌కు పట్టుకురావడం చాలా కష్టంగా అనిపించింది. ► నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు జనాలు మెచ్చుకుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అలానే ఈ సినిమాను జనాలు చూసి ఆదరిస్తే.. ఇంకా ఇలాంటి సినిమాలు చేసేందుకు మాకు ప్రొత్సాహానిచ్చినట్టు అవుతుంది. ► నాట్యం ప్రధానంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి చాలా ఆదరణ వచ్చింది. ఎంతో మంది ఫోన్ చేసి అభినందించారు. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మా జీవితాలు మారిపోయానని అన్నారు. అలా అప్పుడు మాకు ఈ సినిమా మీద ధైర్యం వచ్చింది. ► నాట్య ప్రదర్శన ఇవ్వడానికి తెర ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. కెమెరా ముందు ఎలా ఉండాలనేది దర్శకుడు ముందే చెప్పారు. కథ, పాత్ర, ఆ మాటలు అర్థం చేసుకుని నటించాలి. కెమెరా కేవలం మన మొహాలను మాత్రం క్యాప్షర్ చేయదు. మనలోని భావాలను కూడా పట్టేస్తుంది. కెమెరాకు ఆ శక్తి ఉంది. ► మళయాలంలో యూటర్న్ సినిమాను చేశాను. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక నాట్యం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. వేరే సినిమాల్లో అవకాశం వచ్చినా చేస్తాను. కానీ కమర్షియల్ చిత్రాలను చేయను. డబ్బులు ఎక్కువగా ఇస్తారు కదా? అని ఏది పడితే అది చేయను. ఆ హీరోతో చేస్తే మార్కెట్ పెరుగుతుందనే స్ట్రాటజీలతో సినిమాలు చేయను. మంచి కథ, పాత్ర వస్తే చేస్తాను. జాతీయ అవార్డు సాధించే సత్తా ఉన్న పాత్రలు వేస్తాను. అమ్మాయిలకు లీడ్ కారెక్టర్స్ చేయాలనిపించే పాత్రలే చేస్తాను. ► మా గురువు వెంపటి చినసత్యం గారు చేసినట్టు చేస్తే చాలు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఆ తరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నాట్యాన్ని చేశారు. ఇప్పుడు ఈ తరానికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.