sandya rani
-
రామగుండం.. ఎమ్మెల్యే టికెట్ నాదే..
సాక్షి, పెద్దపల్లి: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండడంతో జిల్లాలో అధికార, విపక్ష పార్టీల నేతలు జనం బాట పట్టారు. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ గడప గడపకూ పార్టీ అంటూ వివిధ పేర్లతో చేపడుతున్న కార్యక్రమాలతో జిల్లాలో రాజకీయం వేడెక్కిస్తున్నారు. అయితే రామగుండం నియోజకవర్గంలో మాత్రం ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు.. అధికార పార్టీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడికే పోటాపోటీగా ఎమ్మెల్యే ఆశావహులు రహస్య సమావేశం నిర్వహించి పాదయాత్రలు చేస్తామని ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేతో పాటు, కార్పొరేటర్లు, కార్మిక నాయకులు అభ్యర్థులుగా తమకు తాము ప్రకటించుకొని టికెట్ దక్కించుకునేందుకు ఎవరికి వారే పావులు కదుపుతున్నారు. జిల్లా అధ్యక్షుడికే తప్పని ‘ఇంటి పోరు’ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడిగా పార్టీ శ్రేణులను ఒక్కతాటి పైకి తీసుకవచ్చి, పార్టీని బలోపేతం చేయాల్సిన కోరుకంటి చందర్‌పై ఇంటిపోరును సరిదిద్దలేకపోతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు, కార్యకలాపాలు చేయని ఆశావహులు, ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నేరుగా పాదయాత్రల పేరుతో రంగంలోకి దిగుతుండటంతో రామగుండంలో రాజకీయం రసవత్తరంగా మారింది. సిట్టింగ్‌లకే టికెట్లు అని సీఎం కేసీఆర్ ప్రకటించటంతో ఈసారి తనకే టికెట్ వస్తుందని ఎమ్మెల్యే చందర్ ‘ప్రజాచైతన్య యాత్ర ‘పేరుతో గడప గడపకూ పార్టీ కార్యక్రమాలు, చేసిన అభివృద్ధిని ప్రజలకు తెలియజేసేలా పర్యటిస్తున్నారు.కాగా బీఆర్ఎస్ నుంచి టికెట్ ఆశిస్తున్న పలువురు అభ్యర్థులు ఎమ్మెల్యే కోరుకంటికి వ్యతిరేకంగా రహస్యంగా పలు దఫాలుగా సమావేశమై, కోరుకంటికి తప్ప ఎవరికి టికెట్ ఇచ్చినా గెలిపించుకుంటామని ప్రకటనలు చేశారు. తాజాగా జరిగిన సమావేశంలో ఎమ్మెల్యేకు పోటాపోటీగా శనివారం నుంచి పాదయాత్రలు మొదలు పెట్టి కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకుంటామనడం, ప్రస్తుత ఎమ్మెల్యే గెలుపుకోసం పాటుపడుతామని ప్రకటించకపోవడం హాట్‌టాపిక్‌గా మారింది. అయితే ఎమ్మెల్యే కోరుకంటి మాత్రం ఈ పరిణామాలని్నంటినీ చాలా చిన్నవిగా భావిస్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. ఎమ్మెల్యే టికెట్ తమకే అంటూ ప్రకటించుకున్న నాయకులపై జిల్లా అధ్యక్షుడిగా ఎలాంటి చర్యలకు పూనుకోకుండా ఉదాసీనంగా ఉంటున్నారు. దీంతో ఆశావహులు ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు పార్టీ, ప్రభుత్వ కార్యకలాపాలతో పాటు, స్వచ్ఛంద సంస్థల పేరుతో వేగంగా దూసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ గెలుపే లక్ష్యంగా పాదయాత్ర రామగుండంలో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసేందుకు అరడజనుకు పైగా పేర్లు వినిపిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, సీనియర్ నాయకుడు, కార్పొరేటర్ పాతిపెల్లి లక్ష్మి భర్త పాతిపెల్లి ఎల్లయ్య, టీబీజీకేఎస్ నేత మిర్యాల రాజిరెడ్డి, మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కొలేటి దామోదర్ పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. టికెట్ ఆశిస్తున్నవారంతా తమ తమ సామాజిక వర్గాల బలాలు, బలహీనతలు, ఖర్చులు, పెట్టుబడులను అంచనా వేసుకొని బీఆర్ఎస్ పార్టీ పెద్దలతో తమకున్న పరిచయాలతో పాదయాత్రల పేరిట ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోలేటి దామోదర్ పాదయాత్రలతో కాకుండా సీఎం కేసీఆర్‌తో తనకున్న సాన్నిహిత్యంతో టికెట్ సాధించే పనిలో ఉన్నారు. అధికార పార్టీలో ఇలాంటి వాతావరణం ఉన్నప్పటికీ ఎలాంటి నియంత్రణలు, క్రమశిక్షణ చర్యలు లేకుండా పోయాయి. ఇది అంతర్గత ప్రజాస్వామ్యానికి సంకేతమా లేక అంతర్గత కలహాలకు నిదర్శనమా అర్థం కావడం లేదని సగటు గులాబీ శ్రేణులు ఆందోళన చెందుతున్నారు. నేటి నుంచి ఆశావహుల డివిజన్ బాట గోదావరిఖని(రామగుండం): ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ ఆశావహులు సిద్ధమయ్యారు. శనివారం నుంచి రామగుండం నియోజకవర్గంలో డివిజన్లు, గ్రామాలు, గనులపై పాదయాత్ర నిర్వహించనున్నట్లు మాజీ మేయర్ కొంకటి లక్ష్మీనారాయణ, జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి, టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పాతిపెల్లి ఎల్లయ్య తెలిపారు. ఈమేరకు నాయకులు సమావేశమైన ఈవిషయాన్ని వెల్లడించారు. సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ధ్యేయంగా ప్రజల బాట పట్టినట్లు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అనుసరిస్తున్న తీరుకు వ్యతిరేకంగా, పార్టీకి అనుకూలంగా ప్రచారం నిర్వహించాలని నిర్ణయించినట్లు వివరించారు. బస్తీలు, గ్రామాలు, గనుల బాట చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే ఏకపక్షంగా అనుసరిస్తూ నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని ఆశావహులు పేర్కొన్నారు. -
అందుకే నాట్యంనేపథ్యంలో సినిమా తీశా! – రేవంత్
‘‘కొందరు వ్యక్తులు ఫలానాది తప్పు, ఫలానాది ఒప్పు అంటే వినిపించుకోరు. కానీ కథ ద్వారా చెబితే వింటారు. ‘నాట్యం’ కథ తప్పొప్పులను చెబుతుంది’’ అన్నారు రేవంత్. నాట్యకళాకారిణి సంధ్యారాజు నటించి, నిర్మించిన చిత్రం ‘నాట్యం’. రేవంత్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 22న విడుదల కానుంది. ఈ సందర్భంగా రేవంత్ మాట్లాడుతూ – ‘‘నాకు విఠలాచార్య, కె. విశ్వనాథ్‌గార్లంటే అభిమానం. తెలుగులో మంచి సినిమాలంటే ముందుగా కె. విశ్వనాథ్‌గారు గుర్తుకు వస్తారు. అందుకే దర్శకుడిగా నా తొలి సినిమాను క్లాసికల్ డ్యాన్స్ నేపథ్యంలో తీయాలనుకుని ‘నాట్యం’ తీశాను. నాట్యం అనే ఊరిలోని ప్రజలు కొన్ని మూఢనమ్మకాలను విశ్వసిస్తుంటారు. ఆ ఊరిలోని ఓ నాట్యగురువు వాటిని అనుసరించాల్సిన అవసరం లేదని ప్రజలకు నచ్చజెప్పే ప్రయత్నంలో విఫలమవుతాడు. అయితే ఈ గురువు శిష్యురాలు తన నాట్య కళ ద్వారా ప్రజలను ఎలా చైతన్యవంతులను చేసింది? అన్నదే కథ. శిష్యురాలి పాత్రను సంధ్యారాజు చేశారు. ఈ సినిమాకు మెయిన్ లీడ్‌గానే కాదు.. నిర్మాత, సాంకేతిక నిపుణురాలిగా కూడా సంధ్యారాజు ఎంతో కష్టపడ్డారు. కొన్ని సినిమాటిక్ అంశాలను ‘నాట్యం’ చిత్రంలో పొందుపరిచాను’’ అన్నారు. -
ప్రేమోన్మాదం.. సంధ్యను చంపేశాడు..
సాక్షి, హైదరాబాద్: ఉన్మాది దాడిలో గాయపడ్డ సంధ్యారాణి శుక్రవారం ఉదయం కన్నుమూసింది. గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంధ్యారాణి.. మృత్యువుతో పోరాడి అసువులు బాసింది. ప్రేమించలేదనే అక్కసుతో కార్తీక్ అనే యువకుడు సంధ్యారాణిపై కిరోసిన్ పోసి తగులబెట్టిన విషయం తెలిసిందే. ఆమె మృతి చెందినట్లు గాంధీ ఆసుపత్రి డాక్టర్లు కుటుంబసభ్యులకు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. దక్షిణ మధ్య రైల్వేలో కాంట్రాక్టు పద్ధతిలో ఉద్యోగం చేస్తున్న కార్తీక్ కొన్ని నెలల క్రితం సంధ్యారాణి ఎదుట ప్రేమ ప్రతిపాదన చేశాడు. కుటుంబ భారం తనపై ఉండటంతో అతని ప్రతిపాదనను ఆమె సున్నితంగా తిరస్కరించింది. అయినా తన పంథా మార్చుకోని కార్తీక్ నేరుగా, ఫోన్ ద్వారా వేధింపులు మొదలెట్టాడు. దీంతో కొన్నాళ్లుగా సంధ్యారాణి అతడిని దూరం పెట్టింది. గురువారం సం«ధ్యారాణి, కార్తీక్ మధ్య ఫోన్లో వాగ్వాదం జరిగింది. తనను ప్రేమించకపోతే అంతు చూస్తానంటూ కార్తీక్ బెదిరించగా.. సంధ్యారాణి అతడిని మందలించింది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్న కార్తీక్ అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. సంధ్యారాణి రోజూ విధులు ముగించుకున్న తర్వాత లాలాపేట్ విద్యామందిర్ మీదుగా ఇంటికి నడిచి వెళ్తుంటుంది. గురువారం సాయంత్రం కార్తీక్ కిరోసిన్ డబ్బాతో ఆ ప్రాంతానికి చేరుకుని కాపు కాశాడు. సంధ్యారాణి 6 గంటల ప్రాంతంలో అటుగా రావడం గమనించి.. మరోసారి వేధింపులకు దిగాడు. అతడి ప్రతిపాదనను ఆమె తిరస్కరించడంతో విచక్షణ కోల్పోయి.. వెంట తెచ్చుకున్న కిరోసిన్‌ను ఆమెపై పోశాడు. షాక్‌కు గురైన సంధ్యారాణి వెంటనే తేరుకుని పారిపోవడానికి ప్రయత్నించింది. ఆ ప్రాంతంలో ఎవరూ లేకపోవడంతో జనం ఉండే ప్రాంతానికి పరిగెత్తింది. ఈ లోపే ఆమె వెంట పరిగెత్తిన కార్తీక్ నిప్పుపెట్టాడు. శరీరం కాలుతున్న బాధతో ఆమె హాహాకారాలు చేస్తుంటే కార్తీక్ అక్కడ నుంచి పారిపోయాడు. కాలుతున్న శరీరంతోనే దాదాపు 200 మీటర్లు పరిగెత్తిన సంధ్యారాణి అక్కడ కుప్పకూలిపోయింది. ఇది గమనించిన స్థానికులు ఆమె వద్దకు చేరుకుని నీళ్లుపోసి మంటలార్పి.. పోలీసులు, అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చారు. గాంధీ ఆసుపత్రిలో కాలిన గాయాలతో చికిత్స పొందుతున్న సంధ్యారాణి ఈరోజు ఉదయం ప్రాణాలు విడిచింది. సంధ్య మృతితో ఆమె కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. -
ఈ నెల 10న పెళ్లి జరగాల్సి ఉండగా..
చొప్పదండి(కరీంనగర్ జిల్లా): చొప్పదండి మండల కేంద్రానికి చెందిన సంధ్యారాణి(26) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. ఎవరూ లేని సమయం చూసి ఇంట్లో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. సంధ్యారాణికి ఇటీవలే నిశ్చితార్ధం జరిగింది. ఈ నెల10న పెళ్లి జరగాల్సి ఉండగా.. సంద్యారాణి నాయనమ్మ మృతిచెందడంతో పెళ్లి వాయిదా పడింది. సంధ్యారాణి ఓ ప్రైవేటు స్కూల్లో హిందీ టీచర్‌గా పనిచేస్తోంది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
గిరిజనులకు భూ పంపిణీ
విజయనగరం(పాచిపెంట): విజయనగరం జిల్లా పాచిపెంట పరిధిలోని గిరిజనులకు గురువారం భూ పంపిణీ చేశారు. 12 గ్రామాలకు చెందిన 232 గిరిజన కుటుంబాలకు 425.30 ఎకరాల భూమిని పంపిణీ చేశారు. పంపిణీ చేసిన భూములకు సంబంధించిన పట్టాలను వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే రాజన్నదొర, టీడీపీ ఎమ్మెల్సీ గుమ్మడి సంధ్యా రాణి తహసీల్దార్ కార్యాలయంలో అందజేశారు. -
ఈ సీడర్‌తో అన్నీ కలిసొస్తాయి
గత దశాబ్ద కాలంలో వరి సేద్య పద్ధతుల్లో ఎన్నో విప్లవాత్మక మా ర్పులు చోటుచేసుకున్నాయి. వాటిలో డ్రమ్‌సీడర్ వినియోగం ఒకటి. దీనివల్ల విత్తన మోతాదు, నీటి వినియోగం, చీడపీడల బెడద, పంటకాలం, సాగు ఖర్చు... ఇవన్నీ తగ్గుతాయి. ఒకవేళ డ్రమ్‌సీడర్ అందుబాటులో లేకుంటే మొలకెత్తిన విత్తనాలను చేలో నేరుగా వెదజల్లవచ్చు. ఈ నేపథ్యంలో డ్రమ్‌సీడర్ వినియోగంపై ప్రకాశం జిల్లా దర్శి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ పి.సంధ్యారాణి, శాస్త్రవేత్తలు డాక్టర్ ఓ.శారద, ఎం.సునీల్ కుమార్ అందిస్తున్న సూచనలు... వరి పండించే భూములన్నింటిలోనూ డ్రమ్‌సీడర్‌ను ఉపయోగించవచ్చు. అయితే సమస్యాత్మక నేలలు పనికిరావు. సాధారణ పద్ధతిలో మాదిరిగానే పొలాన్ని తయారు చేయాలి. పొలం లో నీరు నిల్వ ఉండకూడదు. ఒకవేళ నీరు ఎక్కువైతే బయటికి పంపడానికి తగిన ఏర్పాట్లు చేయాలి. వీలైనంత వరకూ పొలా న్ని చదును చేసుకోవాలి. పొలాన్ని చిన్న చిన్న మడులుగా చేసుకుంటే చదును చేయడం, నీరు పెట్టడం తేలికవుతుంది. ఇసుక శాతం ఎక్కువగా ఉన్న నేలల్లో విత్తనాలు వేసే రోజే ఆఖరి దమ్ము చేసి, చదును చేసి, పలచని నీటి పొర ఉండేలా చూసుకోవాలి. ఎలా వేయాలి? రకాన్ని బట్టి ఎకరానికి 10-15 కిలోల విత్తనాలు సరిపోతాయి. కాండం గట్టిగా-వేరు వ్యవస్థ దృఢంగా ఉండి, పడిపోని రకాలైతే బాగా అనువుగా ఉంటాయి. విత్తనాలను ముందుగా 24 గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని గోనెసంచిలో వేసి లేదా వాటిపై గోనెసంచిని కప్పి 24 గంటల పాటు మండె కడితే విత్తనాలు మొలకెత్తుతాయి. వాటిని నీడలో ఆరబెట్టి, ఆ తర్వాతే సీడర్లో నింపాలి. విత్తనాలు వేసేటప్పుడు చేను బురద పదును మీద ఉంటే సరిపోతుంది. సీడర్కు 4 ప్లాస్టిక్ డబ్బాలు, ఒక్కో డబ్బాకు 18 రంధ్రాలు ఉంటాయి. రంధ్రాల మధ్య 2.5-3 సెంటీమీటర్లు, డబ్బాల మధ్య 20 సెంటీమీటర్ల దూరం ఉంటుంది. ఒకసారి సీడర్‌ను లాగితే 8 వరుసల్లో, 20 సెంటీమీటర్ల దూరంలో విత్తనాలు పడతాయి. గింజలు పొలంలో రాలడానికి వీలుగా ప్రతి డబ్బాలో 3/4వ వంతు మాత్రమే విత్తనాలను నింపాలి. సీడర్‌ను నేర్పుగా, ఒకే వేగంతో లాగాలి. విత్తిన 24 గంటల వరకూ నీరు పెట్టకూడదు. కలుపు సమస్య ఎక్కువే తొలి దశలో చేలో నీరు నిలగట్టకుండా, ఆరుతడిగా వరిని సాగు చేయడం వల్ల కలుపు సమస్య ఎక్కువగానే ఉంటుంది. దాని నివారణకు విత్తనాలు వేసిన 2-3 రోజుల్లో ఎకరానికి 200 లీటర్ల నీటిలో లీటరు పెండిమిధాలిన్/400 మిల్లీలీటర్ల ప్రెటిలాక్లోర్/35 గ్రాముల ఆక్సాడయార్జిల్ కలిపి పిచికారీ చేసుకోవాలి. విత్తనాలు వేసిన 20 రోజుల తర్వాత కలుపు సమస్య ఎక్కువగా ఉన్నట్లయితే 200 లీటర్ల నీటిలో 80-100 మిల్లీలీటర్ల బిస్ పైరిబాక్ సోడియం కలిపి పిచికారీ చేయాలి. ఊద ఎక్కువగా ఉంటే 200 లీటర్ల నీటిలో 300-400 మిల్లీలీటర్ల సైహలోఫాప్ బ్యూటైల్‌ను, వెడల్పాటి ఆకులున్న కలుపు మొక్కలు ఎక్కువగా ఉంటే 400 గ్రాముల 2,4-డి సోడియం సాల్ట్‌ను కలిపి పిచికారీ చేసుకోవాలి. కలుపు మొక్కలపై పడేలా మందును పిచికారీ చేయాలి. ఆ సమయంలో చేలో నీరు ఉండకూడదు. పైరు పెరిగే దశలో కూలీలతో కలుపు తీయించాలి. నీరు-ఎరువుల యాజమాన్యం విత్తనాలు వేసినప్పటి నుంచి పైరు పొట్ట దశకు చేరుకునే వరకూ చేను బురద పదును మీద ఉంటే సరిపోతుంది. అప్పటి నుంచి కోతకు వారం పది రోజుల ముందు వరకూ చేలో 2 సెంటీమీటర్ల నీరు నిల్వ ఉండాలి. సిఫార్సు చేసిన భాస్వరం ఎరువు మొత్తాన్నీ దమ్ములోనే వేయాలి. పొటాష్‌ను 2 సమాన భాగాలుగా చేసుకొని దమ్ములో, పైరు 60-65 దశలో (మూడో దఫా నత్రజని ఎరువుతో కలిపి) వేసుకోవాలి. నత్రజని ఎరువును 3 సమాన భాగాలుగా చేసి విత్తిన 15-20 రోజులకు, 40-45 రోజులకు, 60-65 రోజులకు మూడు దఫాలుగా వేసుకోవాలి. ఎన్నో ప్రయోజనాలు డ్రమ్‌సీడర్‌ను వినియోగించడం వల్ల పంట వారం పది రోజుల ముందే కోతకు వస్తుంది. నారుమడి పెంపకం, నాట్లు వేయడం వంటి పనులు ఉండవు కాబట్టి సాగు ఖర్చు ఎకరానికి రూ.3,000 వరకూ తగ్గుతుంది. మొక్కల సాంద్రత సరిపడినంత ఉండడం వల్ల దిగుబడి 10-15% పెరుగుతుంది. తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పంట వేయవచ్చు. ఎకరం పొలంలో విత్తనాలు వేయడానికి 2 గంటలు చాలు. పైగా ఒకరిద్దరు ఉంటే సరిపోతుంది. చీడపీడల తాకిడి కూడా తక్కువగానే ఉంటుంది. కోనోవీడర్ నడిపితే... డ్రమ్ సీడర్‌తో విత్తినప్పుడు, విత్తిన 20-25 రోజులకు చేలో కోనోవీడర్‌ను నడపాలి. దీనివల్ల కలుపు మొక్కలు భూమిలో కలిసిపోతాయి. ఆ తర్వాత చేలో కలుపు ఉన్నా, లేకపోయినా 10 రోజులకు ఒకసారి చొప్పున రెండుసార్లు కోనోవీడర్‌ను తిప్పితే భూమి బాగా కదిలి, వేరు వ్యవస్థకు గాలి-పోషకాల లభ్యత పెరుగుతుంది. పీచు వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. వేరు వ్యవస్థ బలంగా తయారవుతుంది. పిలకలు ఎక్కువ సంఖ్యలో వచ్చి, మొక్క గుబురుగా ఉంటుంది. దిగుబడి పెరుగుతుంది. కోనోవీడర్‌ను నడపడానికి ముందు రోజు సాయంత్రం పొలానికి పలచగా నీరు పెట్టాలి.