sanjeev rao
-
మాజీ ఎమ్మెల్యే సంజీవరావు కన్నుమూత
సాక్షి, వికారాబాద్ అర్బన్: వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే బి.సంజీవరావు (67) గుండెపోటుతో మంగళవారం మృతిచెందారు. హైదరాబాద్ చింతల్‌బస్తీలోని తన నివాసంలో సోమవారం రాత్రి ఛాతీనొప్పి రావడంతో ఆయన్ను కుటుంబీకులు నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు రావడంతో మృతిచెందారు. ఆయనకు భార్య మధురవేణి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యామంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ మెతుకు ఆనంద్, కాలె యాదయ్య, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆస్పత్రిలో సంజీవరావు మృతదేహానికి నివాళులర్పించారు. ఉన్నత ఉద్యోగం వదిలి.. వికారాబాద్ జిల్లా గేట్‌వనంపల్లి గ్రామానికి చెందిన బేగరి కమలమ్మ, దేవదాస్‌కు సంజీవరావు మొదటి సంతానం. సంజీవరావు బీఎస్సీ అగ్రికల్చర్ చదివారు. గ్రూప్–2 ఉద్యో గం సాధించి ఏఓగా బాధ్యతలు చేపట్టారు. రాజకీయాలపై ఆసక్తితో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి 1994లో వికారాబాద్ అసెంబ్లీకి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వికారాబాద్ మున్సిపల్ చైర్మన్‌గా, ధారూర్ జెడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. టీడీపీ, వైఎస్సార్సీపీలో పనిచేశారు. 2014లో ఎన్నికల సమయం లో టీఆర్ఎస్ పార్టీలో చేరి వికారాబాద్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2018 ఎన్నికల నాటికే సంజీవరావు అనారోగ్యానికి గురవడంతో పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వలేదు. అప్పటి నుంచి టీఆర్ఎస్లో ఉన్నా పార్టీ కార్యక్రమాల్లో అంతగా పాల్గొనలేదు. కాగా, వికారాబాద్ జిల్లా నవాబుపేట మండలం గేట్‌వనంపల్లిలో బుధవారం మధ్యాహ్నం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, సంజీవరావు ఆకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్‌రెడ్డి సంతాపం ప్రకటిస్తూ, సంజీవరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజీనామా
సాక్షి, వికారాబాద్ : ఎన్నికల వేళ టీఆర్ఎస్ పార్టీకి ఊహించని పరిణామాలు ఎదురవుతున్నాయి. వికారాబాద్ తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు గులాబీ పార్టీకి గుడ్‌బై చెప్పి పార్టీ నేతలకు షాకిచ్చారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి రాజీనామా చేసి 24 గంటల కూడా కాకముందే మరోనేత పార్టీని వీడడం గులాబీ శ్రేణుల్లో కలకలం రేపుతోంది. మంత్రి పట్నం మహేందర్ రెడ్డి తీరు నచ్చకనే తాను పార్టీకి రాజీనామా చేసినట్లు సంజీరావు బుధవారం తెలిపారు. తాను నమ్మిన వారే నట్టేటముంచారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి వికారాబాద్ నుంచి గెలిచిన సంజీవరావుకు ఈసారి టీఆర్ఎస్ టికెట్ నిరాకరించింది. టీఆర్ఎస్ తరుఫున మెతుకు ఆనంద్‌ను బరిలో నిలిపింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంజీవరావు పార్టీ కార్యాక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఐతే ఈ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తున్న చంద్రశేఖర్‌కి మద్దతు ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు. విశ్వేశ్వరరెడ్డి బాటలోనే ఆయన కూడా నడుస్తారనే వార్తలు వినివిస్తున్నా.. ఆయన మాత్రం ఏపార్టీలో చేరబోయేది ఇంకా వెల్లడించాల్సి ఉంది. టీఆర్ఎస్ కీలకంగా భావిస్తున్న ఈ ఎన్నికల్లో పార్టీ నేతల వరుస రాజీనామాలతో గులాబీ దళం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. -
సెల్ టవర్ దిగిన సంజీవరావు
-
సెల్ టవర్ దిగిన సంజీవరావు
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ... గుంటూరు జిల్లా పెదకాకానిలో సెల్ టవర్ ఎక్కిన ఎం. సంజీవరావు ఎట్టకేలకు మెత్తబడ్డారు. జిల్లా కలెక్టర్ హామీ ఇవ్వడంతో సంజీవరావు ఆదివారం రాత్రి సెల్ టవర్ దిగాడు. దీంతో ఆయన కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలనే డిమాండ్ చేస్తూ సంజీవరావు శనివారం పెదకాకానిలోని ఓ సెల్‌టవర్‌పైకి ఎక్కారు. గుంటూరు సీతానగరంకు చెందిన మామిళ్లపల్లి సంజీవరావు ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక రాష్ట్ర హోదా ఇవ్వాలని శనివారం ఉదయం పెదకాకాని పోలీసుస్టేషన్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో రోడ్డు పక్కనే ఉన్న సెల్‌టవర్‌పైకి ఎక్కాడు. పోలీసులు అతడిని కిందకు దించేందుకు నిన్న రాత్రి నుంచి ప్రయత్నించినా అతడు కిందకి దిగలేదు. నిన్న రాత్రి 9 గంటల సమయంలో మంచినీళ్లతో ఓ నలుగుర్ని పైకి పంపించారు. ఆ నలుగురు పది అడుగుల ఎత్తుకి ఎక్కగానే, అంతకంటే పైకి వస్తే తాను దూకేస్తానని సంజీవరావు బెదిరించాడు. దాంతో పోలీసుల సూచన మేరకు మంచినీళ్లను అతడికి సమీపంలో ఉంచి ఆ నలుగురు కిందకు దిగిపోయారు. ఆదివారం సాయంత్రం వరకు కూడా సంజీవరావు తన పట్టును వీడలేదు. సంజీవరావు ఓ వేళ కిందకు దూకితే అతడ్ని కాపాడేందుకు పోలీసులు వలలు ఏర్పాటు చేశారు. కానీ జిల్లా కలెక్టర్ ప్రత్యేక హోదా విషయంపై కేంద్రంతో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో సంజీవరావు కిందకి దిగారు. -
హాస్టళ్లలో అవినీతి
నిజామాబాద్ క్రైం : విద్యార్థుల సొమ్మును వార్డెన్లు నొక్కేస్తున్నారు. సరుకులు కొనుగో లు చేయకుండానే బిల్లులు చూపి నిధులు కాజేస్తున్నారు. విద్యార్థులకు భోజనం వడ్డించకుండానే మెనూ అమలు చేశామని లెక్కలు చూపి డబ్బులు మింగేస్తున్నారు. బోధన్‌లోని బీసీ, ఎస్సీ హాస్టళ్ల లో ఈ వ్యవహారాన్ని ఏసీబీ బట్టబయలు చేసింది. ఈ విషయమై ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు శుక్రవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తమకు అందిన ఫిర్యాదు మేరకు హాస్టళ్లపై దాడి చేసి వివరాలు సేకరించామన్నారు. ఆయన తెలిపిన వివరాలిలా ఉన్నాయి. బోధన్‌లోని ఎస్సీ హాస్టల్ వార్డెన్ రచన కుమారి హాస్టల్‌కు అవసరమయ్యే సరుకులను బోధన్‌తోపాటు జిల్లా కేంద్రంలోని సుభాష్‌నగర్ సిద్ధివినాయక కిరాణ జనరల్ స్టోర్స్‌లో కొనుగోలు చేసినట్లు రికార్డులు తయారు చేశారు. కిరాణ దుకాణం స్టాంప్‌ను తయారు చేసుకున్నారు. సరుకుల కొనుగోలు రిజిస్టర్లో స్టాంప్ వేసి కిరాణ దుకాణం యజమాని సంతకాన్ని ఫోర్జరీ చేస్తున్నారు. వాటి ఆధారంగా ప్రతి నెలా బిల్లులు తయారు చేసి పంపేవారు. షాప్ పేరుపై డీడీ వచ్చేది. దానిని కిరాణ దుకాణం యజమాని తన ఖాతాలో జమ చేసుకొని, ఒకశాతం కమిషన్ తీసుకొని మిగిలిన డబ్బులను వార్డెన్‌కు ఇచ్చేవారు. హాస్టల్ వార్డెన్ భర్త తాళ్లపల్లి దేవన్కుమార్గౌడ్ కిరాణ షాపు యజమాని నుంచి ప్రతినెల బిల్లులు తీసుకువెళ్లేవారు. ఇలా తొమ్మిది నెలల్లో రూ. 2 లక్షల 4 వేల బిల్లులు డ్రా చేశారు. మరోవైపు హాస్టల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం పెట్టేవారు కాదు. అడిగినంత భోజనం పెట్టకపోవడం, భోజనంలో కోడిగుడ్డు ఇవ్వకపోవడం చేసేవారు. విద్యార్థుల హాజరు లేకున్నా.. విద్యార్థులు అందరూ హాజరైనట్లు నకిలీ సంతకాలు చేసేవారు. ఆమె అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవారు. వాచ్‌మన్ శ్రీపతి నిత్యం మద్యం సేవిస్తారు. అలాగే హాస్టల్‌కు వచ్చేవారు. శుక్రవారం తాము హాస్టల్‌కు వెళ్లే ఒక గంట ముందు నీళ్లు రావడం లేదని ఫిర్యాదు చేసిన ఇద్దరు విద్యార్థులను చెప్పులతో కొట్టారని, ఈ విషయమై వారు తమకు ఫిర్యాదు చేశారని డీఎస్పీ సంజీవ్‌రావు తెలిపారు. వాచ్‌మన్‌కు వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు నిర్వహించగా ఆయన మద్యం సేవించి ఉన్నట్లు రిపోర్టు వచ్చిందన్నారు. బీసీ హాస్టల్లో.. బోధన్ పట్టణంలోని బీసీ హాస్టల్ వార్డెన్ ముత్యాల చంద్రశేఖర్ సిద్ధివినాయక కిరాణ, జనరల్ స్టోర్స్ నుంచి ఏకంగా బిల్లు బుక్కే తీసుకువెళ్లాడు. ముందుగా తాను హాస్టల్ విద్యార్థుల భోజనానికి కావాల్సిన సరుకులను సొంత డబ్బులతో కొనుగోలు చేసినట్లు బిల్లులు పెట్టేవాడు. ఆ బిల్లుల ఆధారంగా వార్డెన్ చేతికే డబ్బులు వచ్చేవి. ఇలా ముత్యాల చంద్రశేఖర్ రూ. లక్షా 57 వేలు కాజేశాడని ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు తెలిపారు. తాము హాస్టల్‌ను తనిఖీ చేసిన రోజు 106 మంది విద్యార్థులకుగాను 75 మందే ఉన్నారని పేర్కొన్నారు. అయితే వంద మంది విద్యార్థులు హాజరైనట్లు రిజిస్టర్లో సంతకాలు పెట్టారన్నారు. ఇలా గైర్హాజరైన విద్యార్థుల తాలూకు భోజనం బిల్లులనూ వార్డెన్లు నొక్కేస్తున్నారని డీఎస్పీ పేర్కొన్నారు. మెస్ కమిటీ అంటే తెలియదు ప్రతి హాస్టల్లో ముగ్గురు విద్యార్థులతో కూడిన మెస్ కమిటీ ఉండాలి. ఈ కమిటీ హాస్టల్ విద్యార్థులకు వండి, వడ్డించే ఆహార పదార్థాలు, సరుకులను నిత్యం పరిశీలించాలి. అయితే బోధన్‌లోని ఎస్సీ, బీసీ హాస్టళ్లలో మెస్ కమిటీలే లేకపోవటం విడ్డూరంగా ఉందని డీఎస్పీ సంజీవ్‌రావు పేర్కొన్నారు. మెస్ కమిటీ గురించి విద్యార్థులను అడిగామని, అలాంటి కమిటీ గురించి తమకు తెలియదని వారు పేర్కొన్నారని తెలిపారు. ప్రతి నెల హాస్టల్‌ను సందర్శించే జిల్లా ఉన్నతాధికారులు సైతం హాస్టల్లో అంతా బాగానే ఉందని రిజిస్టర్లో సంతకం చేసి వెళ్తుండటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. బీసీ, ఎస్సీ హాస్టళ్ల వార్డెన్లపై కేసులు నమోదు చేశామని, వారి అవినీతిపై జిల్లా ఉన్నతాధికారుల నిర్లక్ష్యంపై సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖల ఉన్నతాధికారులకు నివేదికలు పంపిస్తామని తెలిపారు. -
ఏసీబీపైనే నిఘా పెట్టారు
సాక్షి, నిజామాబాద్: అవినీతిలో ఆరితేరినవారు ఏసీబీ కదలికలపైనే నిఘా పెట్టారని ఏసీబీ డీఎస్పీ సంజీవ్‌రావు పేర్కొన్నారు. ముఖ్యంగా సబ్‌రిజిస్ట్రార్, రవాణాశాఖ వంటి కార్యాలయాల్లో పనిచేసేవారు ఏసీబీ కదలికలను గమనిస్తూ అవినీతికి పాల్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. మంగళవారం ఏసీబీ కార్యాలయంలో అవినీతి నిరోధానికి సంబంధించి న పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లంచం అడిగిన అధికారులను ఏసీబీకి పట్టించేందుకు గ్రామీణులే ఎక్కువగా ముందుకొస్తున్నారన్నారు. పట్టణ, నగరవాసులు మాత్రం ఏసీబీని ఆశ్రయించేందుకు అంతగా ఉత్సాహం చూపడం లేదన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయాల్లో నిత్యం లక్షల రూపాయలు లంచంగా చేతులు మారుతున్నప్పటికీ ఏ ఒక్కరూ స్పందించకపోవడంపై విచారం వ్యక్తం చేశారు. అవినీతిపై సమరం చేసేందుకు ప్రజలు ఏసీబీ అనే ఆయుధాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 7 నెలలు.. 33 కేసులు రేంజ్ పరిధిలో ఏడు నెలల్లో 33 కేసులు నమోదు చేశామని సంజీవ్‌రావు తెలిపారు. ఇందులో ఎనిమిది కేసులు మెదక్ జిల్లాలో, 25 కేసులు నిజామాబాద్ జిల్లాలో నమోదయ్యాయని వివరించారు. ఈ కేసుల్లో మొత్తం 38 మందిని అరెస్టు చేశామన్నారు. ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలుండే పోలీసు, రెవెన్యూ వంటి శాఖల్లోని లంచగొండులపైనే ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. అక్రమాస్తులు కలిగిన వారిపై.. ఆదాయానికి మించి ఆస్తులు కలిగిన అవినీతి అధికారులపై కూడా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చని డీఎస్పీ తెలిపారు. అవినీతిపరుల ఆస్తుల వివరాలను తమకు తెలియజేయాలని సూచించారు. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏసీబీ టోల్‌ఫ్రీ నెంబర్ 155361కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలపైనా.. ఏసీబీని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కార్యాచరణ రూపొందించామని డీఎస్పీ తెలిపారు. ఎన్జీఓలు, యువజన సంఘాలు, విద్యా సంస్థల ద్వారా ఏసీబీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళతామన్నారు. కేవలం రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోనే కాకుండా, కేంద్ర ప్రభుత్వ శాఖల్లోని అవినీతిపరులపైనా తమకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. సీబీఐ, ఐటీ వంటి శాఖల సమన్వయంతో వారిపై కేసుల నమోదుకు కృషి చేస్తామని వివరించారు. -
రైల్వే టీటీఈని కొట్టి చంపిన ఇద్దరు ప్రయాణికులు
ఎమ్మిగనూరు : రైల్లో నీటి కోసం జరిగిన చిన్న వివాదం ముదిరి ఓ రైల్వే టీసీ ట్రావెలింగ్ టిక్కెట్ ఎగ్జామినర్) మరణానికి దారితీసింది. బుధవారం అర్థరాత్రి 12.45 గంటల సమయంలో కర్నూలు జిల్లా మంత్రాలయం (తుంగభద్ర) రైల్వే స్టేషన్లో ఈ సంఘటన చోటు చేసుకుంది. చెన్నై నుంచి షిర్డీకి వెళుతున్న ఈ రైలు (నెం.22601)లో ధర్మవరం నుంచి వాడి ప్రాంతం వరకూ విధుల నిర్వహణ బాధ్యత టీసీ సంజీవయ్య (55)ది. ఏసీ కోచ్‌లో నీరు లేదంటూ రాత్రి 12.30 గంటల సమయంలో పలువురు ప్రయాణికులు టీసీతో వాగ్వాదానికి దిగారు. తుంగభద్ర రైల్వేస్టేషన్లో నీరు తెప్పిస్తానని... అప్పటి వరకు ఓపిక పట్టాలని టీసీ వారికి సూచించారు. రైలు తుంగభద్రకు చేరుకున్న సమయంలో సంజీవయ్య కిందకు దిగి స్టేషన్ లోపలికి వెళుతుండగా కొందరు ప్రయాణికులు మూకుమ్మడిగా దాడి చేసి చితకబాదారు. దాంతో టీసీ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు అనంతపురం జిల్లా ధర్మవరం వాసి. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు ప్రయాణికులు వంశీకృష్ణ , అమ్రేష్బాబులను రైల్వే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే టీటీఈ తమను రూ. కోటి రూపాయిలు డిమాండ్ చేశాడనే నెపంతోనే చంపామాంటూ నిందితులిద్దరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
చెన్నై-షిర్డీ ఎక్స్‌ప్రెస్‌లో దారుణం