Sarannavarathri celebrations
-
పండగ వేళ : దేశ వ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు
-
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం వైఎస్ జగన్
-
పండగ వేళ : ఆరవరోజు లక్ష్మీదేవిగా అవతారం
-
విజయవాడ : ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-
పండగ వేళ : మూడవ రోజు గాయత్రీ అలంకారంలో అమ్మవారు
-
దసరా ఉత్సవం.. మూడు వేల మందితో భద్రత పటిష్టం
సాక్షి, విజయవాడ: ఈ నెల 7 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించే శరన్నవరాత్రి మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు తెలిపారు. భక్తులు ప్రశాంతంగా అమ్మవారిని దర్శించుకునేందుకు పోలీస్ శాఖ నుంచి అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. రోజూ పది వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేలా దేవదాయ, రెవెన్యూ, కార్పొరేషన్, నీటిపారుదల శాఖ, దేవస్థాన అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులతో సమన్వయం చేస్తున్నామన్నారు. దర్శనానికి వచ్చే భక్తులు తప్పని సరిగా కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. 10 ఏళ్ల లోపు చిన్నారులు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు దర్శన అనుమతి లేదని స్పష్టం చేశారు. భవానీ మాలధారణతో వచ్చే భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు ఏర్పాటు చేయలేదన్నారు. ఘాట్లలో స్నానాలకు అనుమతి లేదని, జల్లు స్నానాలను సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాటు చేశామని వివరించారు. క్యూలైన్ల వద్ద భద్రతా ఏర్పాట్లు.. ►కెనాల్ రోడ్డులోని వినాయకుడి గుడి నుంచి ప్రారంభమయ్యే భక్తుల క్యూలైన్.. ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి గుడికి చేరుకుంటుందన్నారు. ►అమ్మవారి దర్శనం అనంతరం భక్తులు అర్జున వీధి మీదుగా కెనాల్ రోడ్డుకు చేరుకోవాలన్నారు. ►కుమ్మరిపాలెం వైపు నుంచి వచ్చే భక్తులు హెడ్‌వాటర్ వర్క్స్ ఎదురుగా గుడికి ఆనుకుని టోల్ గేట్ వరకు క్యూలైన్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ►నవరాత్రి విధుల్లో మూడు వేల మంది పోలీసు సిబ్బందిని నియమిస్తున్నట్లు సీపీ తెలిపారు. నిఘా పక్కా.. చోరీలు జరుగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. డ్రోన్, సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామని, అల్లరి మూకలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నామని చెప్పారు. సమస్యలు ఎదురైతే 100 లేదా 7328909090 నంబర్లకు ఫోన్ చేసి సహాయం పొందాలని కోరారు. భక్తుల సౌకర్యార్థం కమాండ్ కంట్రోల్‌రూం, వన్‌టౌన్, భవానీపురం పోలీస్ స్టేషన్లతో పాటు రైల్వే, బస్ స్టేషన్, పోలీస్ కమిషనరేట్ కార్యాలయం, స్టేట్ గెస్ట్‌హౌస్ ప్రాంతాల్లో పోలీస్ సమాచార కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మోడల్ గెస్ట్ హౌస్, పోలీస్ కంట్రోల్ రూం వద్ద 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూంను ఏర్పాటు చేశామన్నారు. వాహనాల పార్కింగ్ ప్రాంతాలు.. విధుల్లో ఉండే పోలీస్ సిబ్బంది వాహనాలను మోడల్ గెస్ట్ హౌస్ వెనుక పార్క్ చేసుకోవాలన్నారు. భక్తులు కార్లను పద్మావతి ఘాట్ గాంధీజీ మున్సిపల్ హైస్కూల్, రాజీవ్ గాంధీ కూరగాయల మార్కెట్, టీటీడీ ఖాళీ ప్రదేశం, పున్నమీ ఘాట్, భవానీ ఘాట్ల వద్ద, ద్విచక్ర వాహనాలను ఇరిగేషన్ పార్క్, గద్ద బొమ్మ(కేఆర్ మార్కెట్), లోటస్ అపార్ట్మెంట్ల వద్ద పార్కింగ్ చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్ వైపు నుంచి భక్తులతో వచ్చే బస్సులు భవానీఘాట్, పున్నమీ ఘాట్‌లో, విశాఖపట్నం గుంటూరు వైపు నుంచి బస్సులు పున్నమీ ఘాట్‌లో పార్కింగ్ చేసుకోవాలని కోరారు. మూలా నక్షత్రం నాడు.. ఈ నెల 11న మూలా నక్షత్రం రోజు రాత్రి 11 గంటల నుంచి 12 రాత్రి 11 గంటల వరకు కేఆర్ మార్కెట్ వైపు వెళ్లే బస్సులను బస్టాండ్, పీసీఆర్, చల్లపల్లి బంగ్లా, ఏలూరు లాకులు, బీఆర్టీఎస్ రోడ్డు, బుడమేరు వంతెన, పైపుల రోడ్, సితార, గొల్లపూడి జంక్షన్, ఇబ్రహీంపట్నం మీదుగా మళ్లిస్తున్నట్టు చెప్పారు. ప్రకాశం బ్యారేజ్, సీతమ్మవారి పాదాలు, పీసీఆర్ విగ్రహం, ఘాట్ రోడ్డు, కుమ్మరిపాలేనికి ఇరువైపులా వాహనాలను అనుమతించబోమని సీపీ తెలిపారు. వాహనాల మళ్లింపు ఇలా.. ►ఉత్సవాల సమయంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ తెలిపారు. ►విజయవాడ,ఇబ్రహీంపట్నం మధ్య రాకపోకలు సాగించే వాహనాలను సీతమ్మవారి పాదాలు, పీఎస్ఆర్ విగ్రహం, ఘాట్ రోడ్, స్వాతి జంక్షన్ మార్గాల్లో అనుమతించమన్నారు. ఈ వాహనాలు కనకదుర్గా ఫ్లై ఓవర్ మీదుగా రాకపోకలు సాగించాలన్నారు. ►కుమ్మరిపాలెం నుంచి అమ్మవారి గుడి వైపు వచ్చే వాహనాలు గుప్తాసెంటర్, చెరువు సెంటర్, సితార సెంటర్, స్వాతి సెంటర్ నుంచి ఫ్లై ఓవర్ మీదుగా వెళ్లాలన్నారు. ►సీతమ్మవారి పాదాల నుంచి గుడికి చేరుకునే వాహనాలు గద్దబొమ్మ, కేఆర్ మార్కెట్, పంజా సెంటర్, గణపతిరావు రోడ్డు, చిట్టినగర్ సొరంగం మీదుగా ప్రయాణించాలని సూచించారు. మాట్లాడుతున్న మంత్రి వెలంపల్లి, చిత్రంలో ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీ మోహన్, కలెక్టర్, సీపీ తదితరులు సమన్వయంతో విజయవంతం చేద్దాం ►ఉత్సవ ఏర్పాట్లపై మంత్రి వెలంపల్లి సాక్షి, ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): అన్ని శాఖలు సమన్వయంతో పనిచేస్తూ.. దసరా ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించాలని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ జె.నివాస్ అధ్యక్షతన బ్రాహ్మణవీధిలోని దేవస్థాన పరిపాలనా భవనంలో సమావేశం జరిగింది. ఉత్సవాల ఏర్పాట్లు ఏ దశలో ఉన్నాయనే వివరాలను దేవస్థాన ఇంజినీరింగ్ అధికారులు మంత్రికి, దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్‌కు వివరించారు. వైభవంగా నిర్వహించాలి.. అనంతరం మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ దేవస్థానం తరఫున చేపట్టిన పనులు త్వరతిగతిన పూర్తి చేసి, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. భక్తులకు మంచినీరు, పారుశుద్ధ్యం, ప్రసాదాల కౌంటర్లు తదితరాల ఏర్పాటులో అలసత్వం వద్దన్నారు. ఉత్సవాలను గతంలో కంటే వైభవంగా నిర్వహించాలని సూచించారు. సమావేశంలో దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణులతో పాటు పలువురు రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. -
స్వర్ణకవచాలంకృత రూపంలో దుర్గాదేవి
సాక్షి, విజయవాడ: ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారు స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మవారికి నగర సీపీ బత్తిన శ్రీనివాసులు, దుర్గగుడి ఈవో సురేష్ బాబు దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్న 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి, శనివారం నుంచి మల్లేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిస్తున్నారు. అలాగే పదేళ్లలోపు పిల్లలకు, 60ఏళ్లు పైబడిన వారికి దర్శనానికి అనుమతి నిరాకరిస్తున్నారు. అలాగే కేశఖండన, ఘాట్ల వద్ద స్నానాలు నిషేధం విధించారు. (ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రులు) మూల నక్షత్రం(అక్టోబర్ 21) రోజున తెల్లవారుజమున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. 24వ తేదీ అమ్మవారిని రెండు అలంకారాలలో భక్తులు దర్శంచుకోనున్నారు. ఉదయం దుర్గాదేవిగా, మధ్యాహ్నం నుంచి మహిసాసురమర్ధని దేవిగా అలంకరిస్తారు. 25వ తేదీ (విజయదశమి) రోజున దుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. శరన్నవరాత్రి వైభవం - మొదటి రోజు ఆశ్వయుజు శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు శరన్నవరాత్రులుగా మనం జరుపుకునే దసరా ఉత్సవాలలో శక్తి స్వరూపిణి అయిన దుర్గామాతను వివిధ రూపాలలో ప్రత్యేక విధి విధానాలతో పూజిస్తాం. ప్రథమంగా పాడ్యమి నాడు బెజవాడ కనకదుర్గమ్మని స్వర్ణకవచాలంకారంతో షోడశోపచారాలతో పూజిస్తారు. ఆ రోజు చేమంతి పూలను వినియోగిస్తారు. దుర్గా అష్టోత్తర నామాలతో పూజ చేసి, పులిహోరను నివేదించి అమ్మను స్తుతిస్తారు. దేవీస్తుతి: సర్వ మంగళమాంగల్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్య్రమ్బకే దేవి నారాయణి నమోస్తుతే ఈ నవరాత్రి వ్రతం చేయువారు ఉదయం సాయంత్రం విధివిధానాలతో పూజించాలి. నవరాత్రులలో ఇంటికి వచ్చే ముత్తయిదువులకు యధాశక్తి తాంబూలం సమర్పించుకోవాలి. ఈ వేళ శ్రీశైల భ్రమరాంబికను శైలపుత్రిగా అలంకరిస్తారు. శ్లోకం: ప్రథమా శైలపుత్రీచ, ద్వితీయ బ్రహ్మచారిణి, తతీయ చంధ్రఘంటేతి, కూష్మాండేతి చతుర్థకీ, పంచమా స్కంద మాతేతి, షష్టా కాత్యాయనేతిచ, సప్తమా కాళరాత్రీచ, అష్టమాచాతి భైరవీ, నవమా సర్వసిద్ధిశ్చాత్నవదుర్గా ప్రకీర్తితా’’. – డా. దేవులపల్లి పద్మజ (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ఇంద్రకీలాద్రిపై నేటి నుంచి శరన్నవరాత్రులు
సాక్షి, విజయవాడ/ ఇంద్రకీలాద్రి: పవిత్ర కృష్ణానది తీరంలో అపర భూకైలాసంగా వెలుగొందుతున్న ఇంద్రకీలాద్రిపై శనివారం నుంచి అంగరంగవైభవంగా దసరా శరన్నవరాత్రులు ప్రారంభకానున్నాయి తొలిరోజు శ్రీ స్వర్ణకవచాలంకృతదుర్గా దేవిగా ‘అమ్మ’ దర్శనమివ్వనున్నారు. పూర్వం మాధవవర్శ అనే రాజు ధర్మనిరతికి మెచ్చి కీలాద్రిపై జగజగ్జనిగా అవిర్భవించింది. ఇంద్రుడు జగజ్జనని దర్శించుకోవడంతో ఇంద్రకీలాద్రిగా భక్తులు పూజలు అందుకుంటోంది. స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా తొలిరోజు పూజ అందుకుంటుంది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు కావాల్సిన ఏర్పాట్లును దేవస్ధానం అధికారులు చేస్తున్నారు. శనివారం ఉదయం జరిగే స్నప్నభిషేకం, బాలభోగనివేదన, అనంతరం ఉదయం 9 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి ఇస్తారు. కోవిడ్ నిబంధనలు తూచాతప్పకుండా పాటిస్తూ రాత్రి 8 గంటలకు దేవాలయాన్ని మూసివేస్తారు. ప్రతినిత్యం 10వేలమంది భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి, శనివారం నుంచి మల్లేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తులకు అనుమతిçస్తున్నారు. మూలనక్షత్రం(ఆక్టోబర్ 21) రోజున తెల్లవారుజమున 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తుల్ని దర్శనానికి అనుమతిస్తారు. 24వ తేదీ అమ్మవారిని రెండు అలంకారాలలో భక్తులు దర్శంచుకోనున్నారు. ఉదయం దుర్గాదేవిగా, మ«ధ్యాహ్నం నుంచి మహిసాసురమర్ధని దేవిగా అలంకరిస్తారు. 25వ తేదీ (విజయదశమి) రోజున దుర్గాదేవి శ్రీరాజరాజేశ్వరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు, అనంతరం పూర్ణాహుతి, సాయంత్రం హంసవాహనంపై గంగ పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి వారు కృష్ణానదిలో విహరిస్తారు. పట్టువ్రస్తాలు సమర్పించిన సీపీ ఇంద్రకీలాద్రి (విజయవాడ పశ్చిమ) : దసరా ఉత్సవాలను పురస్కరించుకుని నగర పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు దంపతులు శనివారం అమ్మవారిని పట్టువస్త్రాల ను సమర్పించారు. అమ్మవారి ఆలయానికి చేరుకున్న సీపీ దంపతులను, ఇతర పోలీసు అధికారులను ఈవో ఎంవీ. సురేష్‌బాబు సాదరంగా స్వాగతం పలికారు. దసరా ఉత్స వాలలో ప్రతి ఏటా నగర పోలీసు శాఖ నుంచి అమ్మవారికి పట్టువ్రస్తాలను సమర్పించడం ఆనవాయితీ. అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించిన అనంతరం సీపీ, ఇతర పోలీసు అధికారులను అర్చకులు ఆశీర్వచనం అందచేశారు. అనంతరం ఆలయ ఈవో పోలీసు అధికారులకు అమ్మవారి ప్రసాదాలను అందచేశారు. కార్యక్రమంలో వెస్ట్ ఎసీపీ సుధాకర్, వన్‌టౌన్ సీఐ వెంకటేశ్వర్లు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. దుర్గమ్మ సన్నిధానానికి పట్టువస్త్రాలను తీసుకువస్తున్న పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు దంపతులు వన్‌టౌన్ పీఎస్‌లో.. వన్‌టౌన్ (విజయవాడ పశ్చిమ): ప్రతిరోజూ రౌడీలు, నేరాలు, దర్యాప్తులంటూ బిజీబిజీగా దర్శనమిచ్చే నగర పోలీసులు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా మారిపోయారు. దుర్గమ్మకు పూజలు చేస్తూ యావత్ పోలీసు కుటుంబాలు వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఆధ్యాత్మిక భావనతో గడిపారు. దుర్గమ్మ దసరా ఉత్సవాల ముందు రోజున పోలీసు శాఖ నుంచి అమ్మవారికి పట్టుచీర, పసుపు కుంకుమలను సమర్పించడం గడిచిన ఏడెనిమిది సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఈ ఏడాది కూడా ఆ తంతు మరింత వైభవంగా నిర్వహించాలని పోలీసు కమిషనర్ నిర్ణయించి ఆ మేరకు అధికారును ఆదేశించారు. రాష్ట్రం విడిపోయిన తరువాత కొత్త రాజధానిగా నూతన హంగులు సమకూరిన తరుణంలో ఈ విధమైన ఉత్సవానికి తెరలేపడంతో పోలీసు సిబ్బంది సైతం అత్యంత ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ప్రతిఏటా వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో దసరా ఉత్సవాలను నిర్వహించడం ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో దుర్గమ్మ కొలువు తీరి ఉండటంతో అమ్మవారి సన్నిధిలో జరిగే దసరా ఉత్సవాల్లో పోలీసులు ప్రధాన పాత్ర పోషించడం తదితర కారణాల రీత్యా స్టేషన్ ప్రాంగణంలోనూ కలశాన్ని ఏర్పాటు చేసి నిత్యం భారీగా పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. శుక్రవారం రాత్రి పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు వన్‌టౌన్ పోలీసు స్టేషన్‌కు చేరుకొని అక్కడ ప్రతి ఏటా నిర్వహించే విధంగా రావిచెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు, ఏసీపీలు నగరంలోని సీఐలందరూ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా మహిళా పోలీసు అధికారులందరూ సివిల్ డ్రస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కార్యక్రమానికి హాజరయ్యారు. తొలుత స్థానిక సీఐ వెంకటేశ్వర్లు దంపతులు స్టేషన్లో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని మేళతాళాలతో ప్రాంగణంలో ఉన్న రావిచెట్టు వద్ద తీసుకువచ్చి పూజలు నిర్వహించారు. నేటి అలంకారం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి మాతర్మే మధుకైటభఘ్ని మహిషప్రాణాపహోరోద్యమే హేలానిర్మిత ధూమ్రలోచన వదే హేచండముండార్ధిని.. నిశ్శేషీకృత రక్తబీజ దనుజే.. నిత్యే.. నిశుంభావహే శుంభధ్వంసిని సంహరాశు దురితం దుర్గే– నమస్తే అంబికా.. దసరా మహోత్సవాలలో మొదటి రోజైన ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి శనివారం అమ్మవారిని స్వర్ణ కవచాలంకృత శ్రీదుర్గాదేవిగా అలంకరిస్తారు. పూర్వం మాధవవర్మ అనే మహారాజు ధర్మనిరతికి మెచ్చి అమ్మవారు(దుర్గాదేవి) విజయవాటికాపురి లో కనకవర్షం కురిపించింది. అప్పటి నుంచి అమ్మవారిని కనకదుర్గగా కొలవబడుతూ దసరా మహోత్సవాలలో తొలిరోజున స్వర్ణకవచాలంకృత దుర్గాదేవిగా అలంకరించడం జరుగుతుంది. అమ్మవారి దర్శనంతో సకల దారిద్రాలు నశించడంతో పాటు శుభదాయకం, ఆనందదాయకం, ఐశ్వర్యప్రదాయ కమని భక్తుల నమ్మకం... –ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ) -
దేవీ అలంకారాలు
ఆశ్వయుజ శుద్ధ సప్తమి, మంగళవారం, 16–10–2018 నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖ చక్ర గదా హస్తే మహాలక్ష్మీ నమోస్తుతే‘‘ శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు మహాలక్ష్మిగా దర్శనమిస్తుంది. మంగళప్రదమైన దేవత ఈ మహాలక్ష్మి. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో రాక్షస సంహారం చేయటం అద్భుత ఘట్టం. మూడు శక్తుల్లో ఒక శక్తి అయిన మహాలక్ష్మి అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనే రాక్షసుడిని సంహరించింది. లోకస్థితికారిణిగా ధన, ధాన్య, ధైర్య, విజయ, విద్య, సౌభాగ్య, సంతాన, గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మీ సమష్టి రూపమైన అమృత స్వరూపిణిగా దుర్గమ్మ ఈ రోజు మహాలక్ష్మీదేవిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఈ తల్లిని దర్శించడం వలన భక్తులకు ఐశ్వర్యం, విజయం ప్రాప్తిస్తాయి. అంగరంగ వైభవం... దుర్గమ్మ ఉత్సవాలు ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం నిత్య కళ్యాణం పచ్చతోరణంగా భాసిల్లుతూ ఉంటుంది. నిత్యం వేద మంత్రోచ్చారణల మధ్య పూజలు జరుగుతాయి. ఇక దసరా ఉత్సవాల్లో భాగంగా కన్నులపండువగా జరిగే నగరోత్సవం చూడటానికి రెండు కళ్లూ చాలవు. దుర్గామల్లేశ్వరస్వామి వార్లకు దసరా ఉత్సవాలలో జరిగే నగరోత్సవం ప్రత్యేక ఆకర్షణగా మారింది. తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఎంతటి ప్రాచుర్యం పొందాయో అదే తరహాలో దుర్గమ్మ దసరా ఉత్సవాలలో నగరోత్సవం అంతటి ప్రాచుర్యాన్ని పొందింది. కేరళ వాయిద్యాలు, పంచవాయిద్యాలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, మహిళా భక్త బృందం కోలాటాలు, వేద పండితుల మంత్రోచ్చారణలతో నగరోత్సవం కన్నుల పండువగా జరుగుతుంది. నగరోత్సవంలో ఆలయ అధికారులతో పాటు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారి నామస్మరణతో ముందుకు సాగుతారు. దసరా ఉత్సవాలు జరిగే సమయంలో ప్రతి రోజు సాయంత్రం 6 గంటలకు మల్లేశ్వరస్వామి వారి ఆలయం నుంచి ప్రారంభమయ్యే నగరోత్సవం... అర్జున వీధి, కనకదుర్గనగర్, విజయేశ్వర ఆలయం, ఘాట్ రోడ్డు మీదుగా దుర్గమ్మ సన్నిధికి చేరుతుంది. నగరోత్సవంలో పాల్గొనేందుకు ప్రముఖులందరూ ఆసక్తిని కనబరుస్తారు. మూడేళ్ల కిందట ప్రారంభించిన నగరోత్సవం నానాటికీ అంగరంగ వైభవంగా జరుగుతోంది. చైత్రమాస బ్రహ్మోత్సవాలలో వాహన సేవలు ప్రతి ఏడాది చైత్రమాస బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి. 9 రోజుల పాటు జరిగే ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకో వాహనంపై ఆది దంపతులు నగర పుర వీధుల్లో విహరిస్తారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న ఆది దంపతులు వెండి గజ వాహనం, రావణ వాహన సేవ, నంది వాహన సేవ, సింహ వాహన సేవ, వెండి రథోత్సవంపై వాహన సేవ జరుగుతాయి. ఇక ప్రతి ఉగాది పర్వదినాన్ని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్లు వెండి రథంపై దుర్గగుడి నుంచి ఊరేగింపుగా నగర పుర వీధుల్లో విహరిస్తారు. – ఎస్.కె. సుభానీ (ఇంద్రకీలాద్రి), విజయవాడ -
దేవీ అలంకారాలు
ఆశ్వయుజ శుద్ధ షష్ఠి, సోమవారం, 15–10–2018 నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూ్దతాఖిల వంశ పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాలేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ శరన్నవరాత్రి మహోత్సవాలలో కనకదుర్గమ్మవారు అన్నపూర్ణాదేవి అలంకారంలో దర్శనమిస్తుంది. ఈ తల్లి అన్నాన్ని ప్రసాదించే మాతృమూర్తి. అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలోని బంగారుపాత్రలో అమృతాన్నం ఉంటుంది. వజ్రాలు పొదిగిన గరిటెతో తన భర్త అయిన ఈశ్వరునికే ఆ అన్నాన్ని భిక్షగా అందించే అంశం అద్భుతం. సర్వ పుణ్య ప్రదాయకం. లోకంలో జీవుల ఆకలిని తీర్చటం కన్నా మిన్న ఏదీ లేదు. అందుకే అన్ని దానాల కంటె అన్నదానం గొప్పదంటారు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న దుర్గమ్మను దర్శించి తరించి, అన్నాదులకు లోపం లేకుండా, ఇతరులకు అన్నదానం చేసే సౌభాగ్యాన్ని పొందడమే ఈ అవతార ప్రాశస్త్యం. -
శ్రీలలితాత్రిపుర సుందరీ దేవిగా దుర్గమ్మ
విజయవాడ : ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆరవ రోజు అమ్మవారు శ్రీ లలితాత్రిపుర సుందరీ దేవిగా భక్తులకు దర్శనమివ్వనున్నారు. విశేష అలంకార భూషితురాలై చేతిలో చెరకు గడతో భక్తులకు కనువిందు చేయనున్నారు.