sarika cremations
-
సారిక కేసు దర్యాప్తు వేగవంతం
వరంగల్ : అనుమానాస్పద స్థితిలో ముగ్గురు పిల్లలతో పాటు మృతి చెందిన సారిక కేసు దర్యాప్తును పోలీసులు వేగవంతం చేశారు. కాంగ్రెస్ సీనియర్ నేత సిరిసిల్ల రాజయ్య నివాసాన్ని మరోసారి ఫోరెన్సిక్స్ నిపుణులు, పోలీసులు శుక్రవారం పరిశీలించారు. సారికతో పాటు ముగ్గురు చిన్నారుల సజీవ దహనమైన ఘటనలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే కీలకంగా మారనుంది. సారిక ఆత్మహత్య చేసుకుందా లేక హత్యకు గురయ్యిందా అనే అంశం నిర్ధారించడంలో ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికే ముఖ్యమని చెప్పొచ్చు. దీంతో పోస్టుమార్టం నిర్వహించిన సమయంలో వెలుగు చూసిన అంశాలు, మృతదేహాల భాగాలను హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించనున్నారు. వీటిని పరిశీలించాక ఫోరెన్సిక్ నిపుణులు నివేదిక పంపిస్తే తప్ప సారిక, ఆమె కుమారులది హత్యా, ఆత్మహత్యా అనేది ధృవీకరించడం సాధ్యం కాదని పోలీసులతో పాటు వైద్య వర్గాలు పేర్కొంటున్నాయి. ఇక సారికతో పాటు ముగ్గురు చిన్నారులు మంగళవారం రాత్రి తీసుకున్న భోజనంలో ఏమైనా మత్తు పదార్థాలు కలిశాయా అనే కోణంలోనూ పోస్టుమార్టం సందర్భంగా నిపుణులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కాగా నలుగురి మృతికి కారణమైన భారీ మంటలు ఎలా వ్యాపించాయనేది ఈ కేసులో మిస్టరీగా మారింది. హన్మకొండ రెవెన్యూ కాలనీలోని రాజయ్య స్వగృహంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన సజీవ దహనం ఘటనకు సంబంధించి నాలుగు మృతదేహాలకు గురువారం ఉదయం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. -
కన్నీటి ’సారిక’లు!
-
కన్నీటి ’సారిక’లు!
పోచమ్మమైదాన్: అశ్రునయనాల మధ్య వరంగల్‌లో మాజీ ఎంపీ రాజయ్య కోడలు సారిక, మనవళ్ల అంత్యక్రియలు ముగిశాయి. విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో నగరంలోని పోతన శ్మశాన వాటికలో దహన సంస్కారాలు చేశారు. గురువారం మధ్యాహ్నం ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తరుున తర్వాత ఆస్పత్రి నుంచి శ్మశాన వాటిక వరకు అంతిమయాత్ర నిర్వహించారు. మహిళలు, స్థానికులు పెద్దఎత్తున పాల్గొన్నారు. రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి.. కాంగ్రెస్ నుంచి సస్పెండ్ చేయాలి అని నినదించారు. సాయంత్రం 5.15 గంటలకు సారిక చితికి తల్లి లలిత నిప్పంటించారు. తర్వాత అభినవ్, శ్రీయాన్, అయాన్ మృతదేహాలను ఖననం చేశారు. మనవళ్లను ఖననం చేశాక లలిత బిగ్గరగా రోదిస్తూ కుప్పకూలిపోయింది. అంత్యక్రియలలో సారిక సోదరి అర్చన, కుటుంబ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్రోజు భిక్షపతి, మహిళా సంఘం నేతలు పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ వద్ద సారిక తల్లిని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ పరామర్శించారు. సారిక మృతిపై సీబీఐ విచారణ చేరుుంచాలని ఆయన డిమాండ్ చేశారు. -
సారిక చితికి నిప్పంటించిన తల్లి
-వరంగల్‌లోనే రాజయ్య కోడలు, మనువళ్లు అంత్యక్రియలు -అంత్యక్రియలు నిర్వహించిన విశ్వబ్రాహ్మణులు -భారీగా తరలివచ్చిన మహిళలు, స్థానికులు -రాజయ్యకు వ్యతిరేకంగా నినాదాలు పోచమ్మమైదాన్ : వరంగల్ నగరంలోని పోతన స్మశాన వాటికలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, మనువళ్లు అభినవ్, శ్రీయాన్, అయాన్ మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించారు. విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో పోతన స్మశాన వాటికలో అంత్యక్రియలు చేశారు. ఎంజీఎం ఆస్పత్రిలో మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆస్పత్రి నుంచి స్మశానవాటిక వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. ఈ అంతిమ యాత్రలో మహిళలు, స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజయ్య కుటుంబాన్ని కఠినంగా శిక్షించాలి... కాంగ్రెస్ పార్టీ నుంచి రాజయ్యను సస్పెండ్ చేయాలి అంటూ నినాదాలు చేశారు. మానవత్వం కలిగిన వారందరూ ఆ నలుగురుకి ఆత్మ బంధువులు అయ్యారు. కుతురు సారికకు తల కొరివి పెట్టేందుకు కుండ పట్టుకుని అంతమయాత్రలో తల్లి లలిత సాగుతుంటే అందరూ దుఃఖసాగరంలో మునిగిపోయారు. సాయంత్రం సారిక చితికి తల్లి లలిత నిప్పు అంటించారు. తరువాత అభినవ్, శ్రీయాన్, అయాన్ మతదేహాలను ఖననం చేశారు. మనువళ్లను ఖననం చేశాకా లలిత బిగ్గరగా రోధిస్తూ కుప్పకూలిపోయింది. అత్యక్రియలలో సారిక సోదరి అర్చన, కుటుంబ సభ్యులు, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏర్రోజు బిక్షపతి, సోల్లేటి కష్ణమాచార్యులు, కట్ట ఈశ్వరాచారి, చిట్టిమల్ల రమేశ్ బాబు, కలకోట భాస్కరచారి, గన్నోజు జగన్, కర్ణకంటి కమార్, కొక్కోండ రవి, శ్రీరాముల సతీష్, బెజ్జంకి విశ్వనాథం, సత్యనారాయణ, బండ్ల సురేందర్, మహిళా సంఘం నాయకురాలు ఇందిర పాల్గొన్నారు. అంతకుముందు ఎంజీఎం ఆస్పత్రి మార్చురీ వద్ద సారిక తల్లిని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షుడు మంద కష్ణమాదిగ పరామర్శించారు. సారిక మతిపై సీబీఐ చేత విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు.