Sashikiran
-
మేజర్ తీసినందుకు గర్వంగా ఉంది: నిర్మాతలు అనురాగ్, శరత్
‘‘మేజర్’లాంటి గౌరవప్రదమైన సినిమా తీశాం. దేశమంతా మంచి పేరు వచి్చంది. ఈ సినిమాకు టైటిల్స్ చివర్లో పడతాయి. అప్పటివరకు ప్రేక్షకులు కూర్చొని ఉన్నారంటేనే సినిమా సక్సెస్ అయినట్లు లెక్క’’ అన్నారు నిర్మాతలు అనురాగ్, శరత్. అడివి శేష్ హీరోగా శశికిరణ్ తిక్క దర్శకత్వం వహించిన చిత్రం ‘మేజర్’. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమా ఈ నెల 3న విడుదలైంది. ఈ సందర్భంగా చిత్రనిర్మాతలు అనురాగ్, శరత్ మాట్లాడుతూ– ‘‘మాకు ఛాయ్ బిస్కట్, ఏ ప్లస్ ఎస్ మూవీస్ అనే నిర్మాణ సంస్థలు ఉన్నాయి. ఫస్ట్ షో మార్కెటింగ్ ఏజెన్సీ ద్వారా 200 సినిమాలు మార్కెటింగ్ చేశాం. ‘మేజర్’ తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని అడివి శేష్ చెప్పాడు. నమ్రతగారికి కూడా ఈ కథ నచ్చడంతో మాతో భాగమయ్యారు. ‘మేజర్’ని తెలుగు, హిందీలోనే తీద్దామనుకున్నాం. కేరళలో ఉండే సందీప్ తల్లిదండ్రులను కలిశాక మలయాళంలోనూ డబ్ చేశాం. సందీప్ తల్లిదండ్రులకు రాయల్టీ ఇవ్వడానికి మేం రెడీగా ఉన్నా వారు తిరస్కరించారు. ఆర్మీలో చేరాలనుకున్నవారికి తగిన సపోర్ట్‌గా నిలిచేలా మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ ఫౌండేషన్ అనే సోషల్ మీడియా వేదిక నెలకొల్పాలనుకున్నాం. అదే మేం వారి తల్లిదండ్రులకు ఇచ్చే రాయలీ్ట. ‘రైటర్ పద్మభూషణ్, మేం ఫేమస్’ సినిమాలు నిర్మించాం. తొట్టెంపూడి వేణు లీడ్ రోల్లో ఓ సినిమా, సూర్య అనే కొత్త కుర్రాడితో ఓ సినిమా చేస్తున్నాం’’ అన్నారు. -
గూఢచారి దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్
అడివి శేష్ హీరోగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గూఢచారి. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాతో శశికిరణ్ దర్శకుడిగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనూ ఘన విజయాన్ని అందుకున్న ఈ యువ దర్శకుడు తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను ఓ బిగ్ బ్యానర్లో చేయనున్నాడట. యంగ్ హీరోలతో క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్లో పెట్టిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో శశికిరణ్ తన తదుపరి చిత్రాన్ని చేయనున్నాడు. ఈ బ్యానర్లో తెరకెక్కిన శైలజా రెడ్డి అల్లుడు వినాయక చవితి కానుకగా రిలీజ్‌కు రెడీ అవుతుండగా నితిన్ హీరోగా వెంకీ కుడుముల (ఛలో ఫేం) దర్శకత్వంలో నాని హీరోగా గౌతమ్ తిన్ననూరి(మళ్ళీరావా ఫేం) దర్శకత్వంలో సినిమాలు సెట్స్‌మీదకు రానున్నాయి. వీటితో పాటు శశికిరణ్ చిత్రానికి కూడా ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే శశికిరణ్ దర్శకత్వంలో నటించబోయే హీరో ఎవరనేది వెల్లడించనున్నారు. -
నాన్న తిరిగి వస్తారనుకున్నాం...
హైదరాబాద్ : 'ఇది నిజంగా మాకు షాకింగ్. నాన్న తిరిగి వస్తారనుకున్నాం. మలేరియానే కదా తగ్గిపోద్దనుకున్నాం...ఇలా మనిషిని తినేస్తుందనుకోలేదు' అని ఎంఎస్ నారాయణ కుమార్తె శశికిరణ్ కన్నీటి పర్యంతమయ్యారు. అభిమానుల సందర్శనార్థం నాన్న భౌతికకాయాన్ని ఫిల్మ్ ఛాంబర్లో ఉంచుతామని, అనంతరం ఇంటికి తరలిస్తామన్నారు. అనారోగ్యంతో కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎంఎస్ నారాయణ శుక్రవారం ఉదయం మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎంఎస్ నారాయణ ఆరోగ్యం విషమంగా ఉందంటూ గురువారమే వార్తలొచ్చాయి. అయితే ఆయన కోలుకుంటున్నారని కుటుంబసభ్యులు చెప్పడంతో... అభిమానులు కూడా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. కానీ ఇంతలోనే చేదువార్త. గుండెపోటు కారణంగా వెంటిలేటర్ సాయంతో వైద్యం అందుకుంటున్న ఎంఎస్ తుదిశ్వాస విడిచారంటూ కొద్దిసేపటి క్రితమే కిమ్స్ వైద్యులు ధృవీకరించారు. ఈ వార్తతో సినీ అభిమానులు, హాస్య ప్రియులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సంక్రాంతికి భీమవరం వెళ్లిన ఎంఎస్‌కు అక్కడ ఫుడ్ పాయిజన్ అయ్యిందనే వార్తలొచ్చాయి. ఆ తర్వాత విషాహారం కారణంగానే ఆయన ఆస్పత్రి పాలయ్యారని కూడా చెప్పారు. అయితే కుటుంబ సభ్యులు ఆయన్ను హైదరాబాద్‌కి తీసుకొచ్చిన తర్వాత... ఆయనకు గుండెనొప్పి రావడంతో కిమ్స్ లో మూడు స్టంట్స్ వేసినట్టు కూడా చెప్పారు. దీంతో ఆయన అనారోగ్యానికి విషాహారం కారణం కాదని తేలింది. ఎంఎస్ నారాయణ మృతితో తెలుగు సినీ పరిశ్రమకు ఒక గొప్ప హాస్యనటుడు దూరమయ్యారు. దశాబ్దాలుగా నవ్వులు పంచిన ఎమ్మెస్ ఆ నవ్వుల్నే మిగిల్చి వెళ్లిపోయారు.