satyadevudu
-
పేటలోకి ఎంట్రీ
‘మిర్చి, అత్తారింటికి దారేది, అఆ, నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ తదితర చిత్రాల్లో క్యారెక్టర్ నటిగా కీలక పాత్రలు చేసి, మెప్పించారు నదియా. ఆమె మరో పవర్ఫుల్ రోల్లో కనిపించనున్నారని సమాచారం. నితిన్ హీరోగా రూపొందనున్న ‘పవర్‌పేట’లో ఓ కీలక పాత్రకు నదియాని సంప్రదించారట. ఈ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని తెలిసింది. ‘ఛల్ మోహన్ రంగ’ చిత్రం తర్వాత హీరో నితిన్, దర్శకుడు కృష్ణచైతన్య కాంబినేషన్లో తెరకెక్కనున్న చిత్రం ఇది. ఇందులో కీర్తీ సురేష్ కథానాయికగా నటించబోతున్నారని తెలిసింది. నటుడు సత్యదేవ్ ఓ కీలక పాత్ర చేయనున్నారు. కథరీత్యా ఇందులో నితిన్ మూడు గెటప్స్‌లో కనిపిస్తారు. నితిన్ లుక్స్ కోసం హాలీవుడ్ మేకప్‌మేన్‌ని తీసుకోబోతున్నారట టీమ్. ఈ చిత్రం రెండు భాగాల్లో విడుదలవుతుందనే ప్రచారం జరుగుతోంది. -
సత్యదేవుడి వార్షికాదాయం రూ.122.59 కోట్లు..
అన్నవరం: తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి దేవస్థానానికి 2016-17 ఆర్థిక సంవత్సరానికి రూ.122 కోట్ల 59 లక్షల 79 వేల 867 ఆదాయం వచ్చినట్లు చైర్మన్ రాజా ఐవీ రోహిత్, ఈఓ కె.నాగేశ్వరరావు తెలిపారు. దేవస్థానంలో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు. 2015-16 సంవత్సర ఆదాయం రూ.118.95 కోట్లతో పోల్చితే రూ.3.60 కోట్లు మాత్రమే పెరుగుదల నమోదైందన్నారు. నోట్ల రద్దు తదితర కారణాలతో ఆదాయం ఆశించినంతగా పెరగలేదన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. దేవస్థానానికి వచ్చిన ఆదాయంలో రూ.23.33 కోట్లు వ్రత విభాగం ద్వారానే వచ్చింది. మొత్తం ఆదాయంలో ఇదే సింహభాగం. కాగా, సత్యదేవుని నిత్యాన్నదాన పథకానికి 2016-17లో రూ.2.99 కోట్ల విరాళాలు వచ్చాయి. దీంతో నిత్యాన్నదాన ట్రస్ట్ మొత్తం విరాళాలు రూ.33.98 కోట్లకు పెరిగాయి. ఈ విరాళాలపై ఈ ఏడాది రూ.2.53 కోట్ల వడ్డీ రాగా, ఇతర విరాళాలు రూ.56 వేలు వచ్చాయి. ఈ మొత్తంతో 10.83 లక్షల మంది భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. -
కన్నులపండువగా తెప్పోత్సవం
పంపానదిలో హంసవాహనంపై సత్యదేవుని విహారం అన్నవరం: క్షీరాబ్ది ద్వాదశి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాత్రి పంపానదిలో సత్యదేవుని తెప్పోత్సవం కన్నులపండువగా జరిగింది. వేలాదిగా విచ్చేసిన భక్తులు తిలకిస్తుండగా సత్యదేవుడు, అమ్మవార్లను హంసవాహనంపై మూడుసార్లు పంపానదిలో విహరింపజేశారు. మిరుమిట్లు గొలిపే దీపపు కాంతులు, బాణసంచా కాల్పుల మధ్య, పండితుల మంత్రోచ్ఛారణ మధ్య సాగిన ఈ తెప్పోత్సవం భక్తులకు నయనానందాన్ని మిగిల్చింది. ఊరేగింపుగా పంపా తీరానికి స్వామి, అమ్మవార్లు సాయంత్రం ఐదున్నర గంటలకు సత్యదేవుడు, అమ్మవార్లను, క్షేత్రపాలకులు సీతారాములను మేళతాళాలతో ఊరేగింపుగా రత్నగిరి నుంచి పంపానదీ తీరం వద్ద గల దేవస్థానం పవర్‌హౌస్ వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై ఉన్న ప్రత్యేక సింహాసనంపై స్వామి, అమ్మవార్లను, మరోపక్క సీతారాములను ఉంచి పండితులు తులసీధాత్రి, తదితర పూజలు చేశారు. వేదపండితులు చతుర్వేద స్వస్తి, సత్యదేవుడు, అమ్మవార్లకు వేదాశీస్సులు, నీరాజనమంత్రపుష్పాలు అందజేశారు. వేదపండితులు వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. రాత్రి ఏడు గంటలకు మొదలైన తెప్పోత్సవం వేదికపై పూజలందుకున్న సత్యదేవుడు, అమ్మవార్లను రాత్రి ఏడు గంటలకు మేళతాళాల నడుమ ఊరేగింపుగా పంపానదిలోని హంసవాహనం మీదకు తీసుకువచ్చి అక్కడ గల ప్రత్యేక మందిరంలో ఉంచి పూజలు చేశారు. తరువాత పండితుల మంత్రోచ్ఛారణ మధ్య తెప్పోత్సవం ప్రారంభమైంది. హంసవాహనాన్ని పంపా నదిలో తూర్పు దిశగా ప్రయాణించి మూడు సార్లు ప్రదక్షణం చేసింది. ఈ సారి తెప్పపైకి కేవలం వైదిక సిబ్బంది, తెప్ప నడిపే సిబ్బందిని మాత్రమే అనుమతించారు. కారణమేంటో తెలియదు కానీ ఈ సారి తెప్పోత్సవానికి ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు హాజరుకాలేదు. తెప్పోత్సవం చివర్లో మాత్రం కాకినాడ ఎంపీ తోట నరసింహం వచ్చినా దర్శనం చేసుకుని వెళ్లిపోయారు. దేవస్థానం చైర్మ¯ŒS ఐవీ రోహిత్, ఈఓ కే నాగేశ్వరరావు, ఉత్సవాల ఏర్పాట్లు పర్యవేక్షించారు. సుమారు వందమంది పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. -
సత్యదేవుని దర్శించుకున్న మాడభూషి
అన్నవరం : కేంద్ర సమాచార హక్కు చట్టం కమిషనర్ మాడభాషి శ్రీధరాచార్యులు కుటుంబసభ్యులతో కలిసి ఆదివారం ఉదయం రత్నగిరిపై సత్యదేవుని దర్శించుకుని, పూజలు చేశారు. వారికి పండితులు ఆలయమర్యాదలతో స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం వేదపండితులు ఆశీస్సులందజేశారు. స్వామివారి ప్రసాదాలను ఈఓ నాగేశ్వరరావు అందజేశారు.