satyaprasad
-
కాకినాడలో విజయం ‘కేక’.. భంగపడ్డ టీడీపీ
కాకినాడ: కాకినాడ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా వైఎస్సార్సీపీ బలపరిచిన 17వ వార్డు కార్పొరేటర్ చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టార్) అత్యధిక మెజారీ్టతో విజయకేతనం ఎగురవేశారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో బుధవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి, జాయింట్ కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ ప్రత్యేక సమావేశంలో డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ జరిగింది. కౌన్సిల్ ఎక్స్ అఫిషియో సభ్యులు మంత్రి కురసాల కన్నబాబు, సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డితోపాటు 35 మంది కార్పొరేటర్లు సమావేశానికి హాజరయ్యారు. చేతులెత్తే పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా వైఎస్సార్ సీపీ బలపరిచిన చోడిపల్లి సత్యప్రసాద్‌కు 25 మంది కార్పొరేటర్లు అనుకూలంగా ఓటు వేశారు. ఆయన అభ్యర్థిత్వాన్ని వాసిరెడ్డి రామచంద్రరావు ప్రతిపాదించగా ఎంజీకే కిషోర్ బలపరిచారు. టీడీపీ తరఫున పలివెల రవి అనంతకుమార్‌ను ఆ పార్టీ కార్పొరేటర్ ఒమ్మి బాలాజీ ప్రతిపాదించగా మేయర్ సుంకరపావని బలపరిచారు. పలివెల రవికి మద్దతుగా 10 మంది చేతులెత్తి ఓటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో 25 ఓట్లు దక్కించుకున్న చోడిపల్లి ప్రసాద్ నగరపాలక సంస్థ రెండో డిప్యూటీ మేయర్‌గా ఎన్నికైనట్టు జేసీ లక్ష్మీశ ప్రకటించారు. ఫారమ్ ఏ, బీలలోనూ టీడీపీ వైఫల్యం టీడీపీలో అవగాహన రాహిత్యం మరోసారి బయటపడింది. 24 గంటల ముందు విప్‌జారీ చేయాల్సి ఉండగా చివరి నిమిషంలో లేఖను ఎన్నికల అధికారికి అందజేశారు. దీనిపై ఎన్నికల అధికారి స్పందిస్తూ నిబంధనల ప్రకారం 24 గంటల ముందుగా లేఖ ఇవ్వనందున విప్ చెల్లదని స్పష్టం చేశారు. పార్టీ అభ్యరి్థకి సంబంధించిన ఇతర వివరాలతో కూడిన లేఖ ఒరిజనల్ ఇవ్వకుండా నకలు ఇచ్చినందున తిరస్కరిస్తున్నట్టు స్పష్టం చేశారు. ఉదయాన్నే పోటీలో నిలవడం, పత్రాలన్నీ గందరగోళంగా ఉండడం, పార్టీ తీరుతో వ్యతిరేకించి మరో అభ్యరి్థకి మద్దతుగా నిలవడం వంటి సంఘటనలు టీడీపీ అనైక్యతను బయటపెట్టాయి. మేయర్ అవగాహనా రాహిత్యం డిప్యూటీమేయర్ ఎన్నికలో మేయర్ సుంకరపావని ఆవగాహన రాహిత్యం బయటపడింది. నాలుగేళ్లపాటు మేయర్‌గా ఉన్నా కౌన్సిల్ నిబంధనలు, ఎన్నికల ప్రక్రియపై ఆమెకు అవగాహన కొరవడిన తీరుచూసి కార్పొరేటర్లు ముక్కున వేలేసుకున్నారు. ఎన్నిక సందర్భంలో మేయర్‌గా తనకు ప్రత్యేక స్థానం కేటాయించాలని ఎన్నిక అధికారిని పట్టుబట్టారు. నిబంధనల ప్రకారం ఎన్నికల అధికారి అధ్యక్షత వహిస్తారని, మిగిలినవారంతా కింద వరుస క్రమంలో కూర్చోవాలని ఆయన నిబంధనలను వివరించాల్సి వచ్చింది. అలాగైతే తాను నిలబడే ఉంటానంటూ చేసిన వ్యాఖ్యానం కార్పొరేటర్లను, అధికారులను విస్మయపరిచింది. సమర్థతకు దక్కిన ‘డిప్యూటీ’ పీఠం కాకినాడ: ప్రజా సమస్యలపై, కార్పొరేషన్ చట్టాలపైన సంపూర్ణ అవగాహన కలిగిన సమర్థుడైన వ్యక్తికి ఉప మేయర్ పదవి దక్కడం జిల్లా ప్రగతికి శుభపరిణామమని వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడలో డిప్యూటీ మేయర్ ఎన్నిక పూర్తయిన అనంతరం ఎమ్మెల్యే ద్వారంపూడితో కలిసి బుధవారం విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కార్పొరేటర్లంతా ఐక్యతతో ఉండి అభివృద్ధి కోసం ఒక అవగాహన కలిగిన ప్రసాద్మాస్టార్ వంటి వ్యక్తిని ఎన్నుకున్న తీరు భవిష్యత్‌కు శుభసూచికమని పేర్కొన్నారు. కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ బీసీ వాడబలిజ వర్గానికి చెందిన వ్యక్తికి రాజకీయంగా మంచి ప్రాధాన్యత లభించిందని, ఇందుకు సహకరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు చెప్పారు. 35 మంది కార్పొరేటర్లతో గతంలో అధికారంలో ఉన్న పార్టీ చోడిపల్లిని గుర్తించకపోయినా సీఎం గుర్తించి డిప్యూటీమేయర్గా చేశారన్నారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు, మేయర్ సుంకర పావని తీరును వ్యతిరేకిస్తూ అంతా ఒక్కటై ఐక్యత కనబరిచారని ద్వారంపూడి పేర్కొన్నారు. ఉప మేయర్‌గా ఎన్నికైన చోడిపల్లి ప్రసాద్ మాట్లాడారు. ఉప మేయర్ జీవిత వివరాలు పేరు : చోడిపల్లి సత్యప్రసాద్ (ప్రసాద్ మాస్టారు) వయసు : 56 చదువు : బీఏ, బీఈడీ నేపథ్యం : 1995 నుంచి రెండుసార్లు కౌన్సిలర్‌గా, రెండుసార్లు కార్పొరేటర్‌గా నాలుగుసార్లు వరుస విజయాలు. తండ్రి చోడిపల్లి రామం 1982లో కౌన్సిలర్‌గా పోటీ చేసి స్వల్ప మెజార్టీతో ఓటమి. చిన్నాన్న హనుమంతరావు స్వాతంత్య్ర సమరయోధులు. నాలుగుసార్లు గెలిచినా వనమాడి అవకాశం దక్కనీయలేదు. వాడబలిజలకు దక్కిన అవకాశం డిప్యూటీ మేయర్ ఎన్నికలో వాడబలిజలకు సముచిత గౌరవం దక్కింది. కాకినాడ చరిత్రలో ఇదొక మంచి పరిణామమంటూ రాజకీయవర్గాల్లో చర్చ సాగుతోంది. దాదాపు 40వేల మంది మత్స్యకారులు ఉన్న కాకినాడలో 50శాతం వాడబలిజలు ఉన్నారు. ఇన్నాళ్ల రాజకీయ చరిత్రలో గతంలో ఎప్పుడూ ఈ వర్గానికి గుర్తింపు దక్కిన దాఖలా లేదు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కొద్దినెలల క్రితమే అగి్నకుల క్షత్రియ వర్గానికి చెందిన బంధన హరికి రాష్ట్రస్థాయి కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు. ఇప్పుడు వాడబలిజలకు డిప్యూటీమేయర్ దక్కింది. మత్స్యకార వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించిన టీడీపీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు తన హయాంలో ఈ వర్గాలు రాజకీయంగా ఎదగకుండా అణగదొక్కే ప్రయతి్నంచారనే విమర్శలున్నాయి. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి చొరవతో వాడబలిజకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి డిప్యూటీమేయర్ కట్టబెట్టేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం ద్వారా ఆ వర్గానికి వైఎస్సార్ సీపీ ఎలాంటి ప్రాధాన్యతనిస్తోందో చెప్పకనే చెప్పింది. బెడిసికొట్టిన చివరి క్షణ నిర్ణయం కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు దూరంగా ఉంటామని తొలుత ప్రకటించిన టీడీపీ చివరి నిముషంలో తన వైఖరిని మార్చుకుని పోటీలో నిలబడింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబుకు పార్టీ అధినేత నుంచి గట్టిగా మందలింపురావడతో పోటీ చేయాలని అప్పటికప్పుడు నిర్ణయం తీసుకున్నారు. వనమాడి వ్యవహారశైలి, నియంతృత్వ పోకడలపై అసంతృప్తిగా ఉన్న అనేక మంది టీడీపీ కార్పొరేటర్లు వ్యతిరేకంగా ఓటు చేయడంతోపాటు మరికొంత మంది సమావేశానికి హాజరుకాలేదు. -
గుండెపోటుతో తండ్రి మృతి... ఆగిన కుమార్తె పెళ్లి
మదనపల్లె: తెల్లవారితే తన కుమార్తె పెళ్లి... ఇంతలోనే పెళ్లి కుమార్తె తండ్రి గుండెపోటుతో మృత్యు ఒడికి చేరాడు. దీంతో ఆ యువతి వివాహం ఆగిపోయింది. ఈ ఘటన గురువారం చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణంలో చోటుచేసుకుంది. గుండ్లూరు వీధికి చెందిన సత్యప్రసాద్ స్థానిక ప్రభుత్వ జీఆర్టీ హైస్కూల్లో సీనియర్ అసిస్టెంటుగా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య కృష్ణవేణి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మొదటి కుమార్తె సత్యప్రియకు శుక్రవారం ఉదయం ఆరు గంటలకు పెళ్లి జరగాల్సి ఉంది. ఇల్లంతా పెళ్లిసందడితో కళకళలాడుతోంది. వంటావార్పు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇంతలోనే గురువారం సాయంత్రం సత్యప్రసాద్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే సత్యప్రసాద్ కన్నుమూశారు. దీంతో పెళ్లి వేడుక తాత్కాలికంగా నిలిచిపోయింది. -
ఇప్పుడు వీస్తున్న గాలి!
కొత్త కలాలు కథా సాహిత్యం వందేళ్ళ మైలురాయిని దాటి జీవనదిలా ప్రవహిస్తూనే ఉంది. భండారు అచ్చమాంబతో మొదలైన మహిళా కథాసారస్వతం ఎప్పటికప్పుడు కొత్తపుంతలు తొక్కుతూనే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త రచయిత్రులతో కథాసాహిత్యం వర్తమాన వాస్తవికతని అందిపుచ్చుకుంటోంది. తద్వారా తెలుగు కథ సుసంపన్నం అవుతూనే ఉంది. గత ఐదేళ్ళలో తెలుగు కథలు మొదలెట్టిన మహిళా కథకులని పరిశీలిస్తే కనీసం ఇరవై పైచిలుకు రచయిత్రులు తెలుగు కథా సాహిత్యంలోకి కొత్తగా అడుగుపెట్టారనిపిస్తుంది. వారిలో ఇంతవరకు మనం ఎరగని కొత్త స్వరాల్ని వినిపించినవాళ్ళు ఉన్నారు. ఇంతవరకు రాని కొత్త కథాంశాలని రాసినవాళ్లు ఉన్నారు. పాత కథలను కొత్తగా చెప్పేవాళ్ళు, తెలిసిన కథలలోనే కొత్తకోణాలని చూసినవాళ్ళు ఉన్నారు. స్థూలంగా చూస్తే ఈ కథకులందరిలో కనపడుతున్న సామ్యం వాళ్ళు ప్రతిబింబిస్తున్న వర్తమాన సామాజిక వాస్తవికత. ఈ వర్తమాన వాస్తవికతలోనే ఎంతో క్లిష్టత ఉంది. ప్రపంచీకరణ నేపథ్యంలో సామాజిక, రాజకీయ, ఆర్థిక, వ్యవహారిక కారణాలు ప్రతి జీవితంలోకి అనివార్యంగా ప్రవేశిస్తున్నాయి. ఇవి మనుషుల మధ్య (ముఖ్యంగా స్త్రీ- పురుష) సంబంధాలలో ఎన్నో రకాల మార్పులకీ, కొండకచో స్పర్థలకీ కారణం అవుతున్నాయి. స్త్రీవాద దృక్కోణంలో నుంచి చూస్తే పితృస్వామ్య అవశేషాల తాకిడీ ఇంతకు ముందు ఎరుగని కొత్త రూపాలలో దాడి చేస్తున్నది. ఇలాంటి వ్యవస్థను ప్రతిబింబిస్తున్న కథలు ఈతరం రచయిత్రులు అందుకోవడం స్పష్టంగా కనిపిస్తోంది. పురుషాధిక్యాన్ని ఎదిరించి నిలిచిన భార్యని, తనపై టెక్నాలజీ సాయంతో నిఘా పెట్టిన సహచరుణ్ణి తిరస్కరించే అమ్మాయిని ఒకే కథలో ఇమిడ్చి ‘వైదేహీ మైథిలోయం’ రాశారు సాయిపద్మ. ఇల్లు అనే కలను నిజం చేసుకునేందుకు రెండు దేశాలలో విడివిడిగా ఉంటూ టెక్నాలజీ సాయంతో పలకరించుకునే జంట ‘దో దీవానే దో షహర్ మే’ను ఆసక్తిగా పరిచయం చేస్తారు పూర్ణిమ తమ్మిరెడ్డి. తెలిసీ తెలియని వయసులోని ప్రేమ- వైవాహిక జీవితంపైన చూపించే ప్రభావాన్ని కథగా మలిచారు రాధ మండువ ‘గౌతమి’ కథలో. మనకు బాగా తెలిసిన కథల్లోనే మనకు తెలియని, అంత సులభంగా గ్రహింపుకి రాని సున్నితమైన కోణాన్ని పరిచయం చేసే రచనలు కొంతమంది రచయిత్రులు చేస్తున్నారు. ‘రంగ పిన్ని ఆకాశం’ కథలో సంసారంలో హింస కొత్త పరిష్కారాన్ని సూచిస్తూనే, సంసారంలో స్త్రీకి ఉండాల్సిన పర్సనల్ స్పేస్ గురించి ప్రస్తావించారు సాయిపద్మ. ఒక సాధారణమైన ప్రేమకథ ముగిసిపోయేటప్పుడు ఆ ముగింపు పలకడంలోనూ మగవాడు ఆధిక్యతని ప్రదర్శిస్తున్నాడా అంటూ కొత్త కోణాన్ని పరిచయం చేసే అపర్ణ తోట కథ ‘ప్రేమకథ రిఫైన్డ్’ కూడా అలాంటిదే. నవతరం రచయిత్రులలో కనపడుతున్న మరో విశేషం శైలీశిల్పాల మీద ప్రత్యేకమైన శ్రద్ధ. పూర్ణిమ తమ్మిరెడ్డి కథలలో ‘ైమై లవ్ లైఫ్.లై’ కథ పేరుకు తగ్గట్టే ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కథ. కథలో సన్నివేశాలలో కొన్నింటిని ప్రోగ్రామింగ్ కోడ్ రాసినట్లు రాయడం ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది. ‘విచ్ ఆర్ బిచ్‘ అనే పేరుతో ఇదే రచయిత్రి రాసిన మరో కథ కూడా ప్రత్యేకంగా ఉంటుంది. స్వాతికుమారి బండ్లమూడి ‘ఆదివారం ప్లాట్‌ఫామ్ బెంచ్ మీద’ కథ మార్మికంగా సాగే మ్యూజింగ్స్లా ఉంటుంది. ఇదే రచయిత్రి రాసిన ‘వాంగ్మూలం’లో గాఢమైన కవితాత్మక వాక్యాలు అలరిస్తాయి. అయితే రచయిత్రులు కేవలం స్త్రీ సమస్యలకే పరిమితం కావడం లేదు. సామాజిక సమస్యలను, సంబంధాలను కూడా తమదైన కోణంలో వ్యాఖ్యానిస్తున్నారు. రాధిక పేరుతో కథలు రాస్తున్న హరితాదేవి మతతత్వ శక్తులను నిరసిస్తూ ‘ఆయుధం’ వంటి కథ రాశారు. పురాణపాత్ర అయిన శిఖండిని తీసుకుని ‘భీష్మ... నాతో పోరాడు’ అనే కథ ఆసక్తి కలిగిస్తుంది. ఇది థర్డ్ జెండర్ మీద చర్చ పెట్టిన కథ. విజయ కర్రా రాసిన ‘అమ్మ కడుపు చల్లగా’ కథ దాతృత్వానికి వెనకాడడం అనే చిన్న అంశం చుట్టూ అల్లిన మంచి కథ. బత్తుల రమాసుందరి ‘నమూనా బొమ్మ’లో ఎదుటివారిపై చూపించే జాలి కూడా మన అహాన్ని తృప్తి పరచడానికే అంటూ కొత్తకోణాన్ని చూపిస్తారు. ఒక తాగుబోతు దృష్టికోణం నుంచి జీవిత కథ చెప్పడానికి ప్రయత్నించారు రాధ మండువ ‘తాగుబోతు’ కథలో. ఇంకా కవిత.కె, రమా సరస్వతి వంటి కొత్తగళాలు ఎన్నో. మొత్తంగా చూస్తే కొత్తతరం రచయిత్రులు తమ రాకడతో భవిష్యత్ కథలపైన కోటి ఆశలను కలిగిస్తూ ఉన్నారు. అధ్యయనం, సాధన, స్వీయ అంచనా వీరిని కథాసాహిత్యంలో కొనసాగేలా చేస్తాయని ఆశిద్దాం. - అరిపిరాల సత్యప్రసాద్ 9966907771 -
జర్నీ 2 హిమాలయాలు
ఆకాశాన్ని తాకే శిఖరాలు. పాపాయి కాళ్ల మువ్వల పట్టీల చప్పుడులా... ఆ శిఖరాలను ఒరుసుకుని గలగల పారే సెలయేర్లు. వాటిని తాకుతూ దూదిపింజల్లా తేలిపోయే వెండి మేఘాలు. మేఘాల మధ్యలోంచి నేలను పలకరించే సూర్యుడు. ఒక్కసారి ఊహించుకోండి! ఊహే ఇంత అద్భుతంగా ఉంటే... ఇంతటి అందాన్ని తన అణువణువునా నింపుకొన్న హిమాలయాలు ఇంకెంత అద్భుతమో కదా! అలా అబ్బురం చెందే... ఫొటోగ్రాఫర్ సత్యప్రసాద్ ఆ సమోన్నత శిఖరాలను తన కెమెరాలో పొదివి పట్టాడు. ‘షంగ్రి లా ది మిస్టిక్ ల్యాండ్‌స్కేప్’ పేరుతో హైదరాబాదీల కోసం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేవాడు. గోథెజంత్రమ్లో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ ఈ నెల 19 వరకు కొనసాగుతుంది. స్వర్గసీమ... ‘2004లో మొదటిసారి హిమాలయాలకు వెళ్లాను. మొదటిసారి హిమాలయాలను చూసినపుడు నా ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. అక్కడున్న మైదానాలు, స్వచ్ఛమైన గాలి, చె ట్లు, వాతావరణం, తొలిసంధ్య ఇలా ప్రతీది అణువణువు పులకించిపోయేలా ఉంటుంది. అది మొదలు ఈ పదేళ్లలో ఎన్నిసార్లు హిమాలయాలకు వెళ్లానో నాకే తెలియదు. వె ళ్లిన ప్రతిసారి అదే ఆనందం, ఏదో తెలియని ఉద్వేగం. మానస సరోవరం, లడఖ్, స్పితి, హిమాచల్ ప్రదేశ్‌తో పాటు ఎన్నో ప్రాంతాలు తిరిగాను. వెళ్లిన ప్రతి చోటా నా కెమెరాకు పని దొరికేది. ఎన్ని ప్రాంతాలు చూసినా నాకు అత్యంత ఇష్టమైనది లడఖ్. అదొక స్వర్గసీమ’ అంటున్నాడు ఫొటోగ్రాఫర్ సత్యప్రసాద్. ఎస్.శ్రావణ్‌జయ / ఫొటోలు: దయాకర్ -
హిమగిరి సొగసులు..
కెమెరా క్లిక్‌మంటే ఒక సన్నివేశం దగ్గరగా కనిపిస్తుంది.. ఒక మనిషిని అందంగా చూపిస్తుంది. అయితే అదే కెమెరా ఫ్లాష్ ప్రకృతి ఒడిలో పడితే.. వచ్చే అవుట్‌పుట్.. ఇదిగో ఇలా అదిరిపోయేలా ఉంటుంది. ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న వెంకటగిరి రాయల్ ఫ్యామిలీకి చెందిన సత్యప్రసాద్ యాచేంద్ర. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కమిటీలో జోనల్ హెడ్‌గా వ్యవహరిస్తున్న ఆయనకు చిన్నప్పటి నుంచి ఫొటోగ్రఫీ అంటే ఇష్టం. తండ్రి మదన్‌గోపాల్ యాచేంద్రకు ఉన్న ఫొటోగ్రఫీ హాబీ సత్యప్రసాద్‌ను ల్యాండ్‌స్కేప్ ఫొటోగ్రఫీలో ల్యాండ్‌మార్క్‌లా నిలబడేలా చేసింది. ఆయన కెమెరా కన్నుగీటిన ఎన్నో ప్రకృతి దృశ్యాల్లో ఇదీ ఒకటి. ఈ ఛాయాచిత్రం గురించి ఆయన మాట ల్లోనే.. చిన్నప్పటి నుంచి సరదాగా ఫొటోలు తీసే అలవాటుంది. హిమాల య టూర్ వెళ్లాక నాలో సిసలైన ఫొటోగ్రాఫర్ బయటకు వచ్చాడు. 2004, 05, 07, 08 సంవత్సరాల్లో జమ్మూ కాశ్మీర్‌లోని లడఖ్, హిమాచల్‌ప్రదేశ్, సిక్కిం, టిబెట్‌లో పర్యటించాను. లడఖ్‌లోని ప్రక ృతి సోయగం నన్ను కట్టిపడేసింది. మంచు దుప్పటి కప్పుకున్న గిరులు, తరులను చూడగానే నా మనసు పులకరించింది. ఉషాకిరణాలు పరచుకున్న మంచుకొండలు.. వాటి పాదాల చెంతనే ఉన్న కొలనులో ప్రతిబింబించడం అద్భుతం. ఓ రెండు రోజులు ఆ ఏరియా అంతా చుట్టేశాను. టిబెట్‌లోని మానస సరోవరంలో భానుకిరణాల ఆలింగనంతో హిమన్నగం బంగారు పూత పూసుకున్నట్లు కనిపించింది. అప్పటి నుంచి ల్యాండ్‌స్కేప్ ఫొటోలు తీయాలనే సంకల్పం బలపడింది. లడఖ్ దారిలో.. లడఖ్‌లోని పంగాంగ్సో సరస్సు చాలా ఫేమస్. ఈ సరస్సు 1/3వ వంతు భారత్‌లో, 2/3వ వంతు టిబెట్‌లో ఉంటుంది. దీన్ని మరోసారి చూసేందుకు 2008 జూలై 6న ఇద్దరు స్నేహితులతో కలసి బయల్దేరా. ఈసారి ఆ సరస్సు అందాలను మరింత అందంగా నా కెమెరాలో బంధించాలని నిర్ణయించుకున్నా. అయితే ఈ సరస్సుకు వె ళ్లే దారిలో ఉన్న పగల్ నాలా (మంచు కరగడం వల్ల వచ్చే నీటి కాలువ) ప్రవాహం ఉధృతంగా ఉండటంతో మా ప్రయాణానికి బ్రేక్‌పడింది. సాయంత్రం వరకు చుట్టుపక్కల ఉన్న స్పాట్స్ కవర్ చేశాం. మలి సంధ్య వేళలో ఓ అద్భుత దృశ్యం కనిపించింది. అస్తమిస్తున్న భానుడి కిరణాలు సోకి బంగారు వర్ణంలో మెరిసిపోతున్న గిరుల వరుసను క్షణం ఆలస్యం చేయకుండా నా కెమెరాతో క్లిక్ చేశా. ఆ ఫొటో ప్రింట్ తీసి చూసుకున్న క్షణం ఎప్పటికీ మరచిపోలేను. అంత లవ్లీగా వచ్చింది మరి. టెక్నికల్‌గా... అన్ని ఫొటోల్లాగే దీన్ని తీశాను. అయితే అప్పుడే తగ్గుతున్న లైటింగ్.. పల్చటి మబ్బులు పరచుకున్న ఆకాశం.. సూర్యకిరణాల ఫోకస్.. ఫొటోకు జీవాన్నిచ్చాయి. ఫోర్‌గ్రౌండ్, బ్యాక్‌గ్రౌండ్ ఈ ఫొటోకి హైలైట్. ఈ ఫొటో చూస్తే మొదట మన చూపు నీటి లో తేలియాడుతున్న గడ్డి మేటల నుంచి మొదలై అల్లంత దూరాన ఉన్న పర్వతాల వరకూ వెళ్తుంది. లైట్ అండ్ షాడో కలర్ కనబడుతుంది. ఈ ఫొటో కోసం నేను వాడిన కెమెరా నికాన్-డి-300. లెన్స్ 18 టు 200. సూపర్ వైడ్ జూమ్ 10 టు 20 మీటర్లు. వన్ ఆఫ్ ది బెస్ట్స్.. లడఖ్‌లోని పంగాంగ్సో సరస్సు ఫొటో మాత్రమే కాదు, దీంతోపాటు లడఖ్, హిమాచల్, సిక్కింలలో క్లిక్ చేసిన మిగిలినవన్నీ నా కెరీర్లో వన్ ఆఫ్ ది బెస్ట్స్‌గా నిలిచినవే. ఈ ఫొటో చూసినప్పుడల్లా నాటి జ్ఞాపకాలు మళ్లీ కళ్లముందు కదలాడుతుంటాయి. ఈ ఫొటోలు www.sathyaprasad yachendra.com, www.facebook.com/sathyaprasad.yachendra లో చూడవచ్చు. ప్రజెంటర్: వాంకె శ్రీనివాస్ -
పెళ్లంటే అతడికి ఎగ'తాళి'
గుంటూరు : మొదట్లో ప్రేమంటాడు.. నువ్వు లేనిదే బతకలేనంటాడు.. నిన్నే పెళ్లాడతానంటూ నమ్మిస్తాడు.. ఈ తంతగాన్ని ఒక్కరితో ఆపకుండా పలువురు యువతులను ఇదే విధంగా ట్రాప్ చేసి వారి జీవితాలతో చెలగాటమాడుతున్న ఓ మృగాడి నైజం గుంటూరు జిల్లాలో సోమవారం వెలుగు చూసింది. పెళ్లిని ఎగ‘తాళి’ చేస్తూ తన వాంఛలు తీర్చుకునేందుకు లెసైన్స్లా వాడుకుంటున్నాడు. ఫేస్బుక్లో ఛాటింగ్ ద్వారా యువతులను ఆకర్షించి పెళ్లి చేసుకుని సంతానం కలిగిన తరువాత వదిలించుకునే ప్రయత్నాలు చేస్తాడు. ఆ మృగాడి మోసానికి బలై చిత్రహింసలు అనుభవించిన ఓ మహిళ తన ఇద్దరు ఆడపిల్లలతో గుంటూరు రూరల్ ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను కలిసి తనకు న్యాయం చేయాలంటూ వేడుకుంది. బాధితురాలు ఎస్పీకి తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటక రాష్ట్రం, మైసూరు జిల్లా, పిరియా పట్టణానికి చెందిన అంబిక పదో తరగతి పూర్తికాగానే 14 ఏళ్ల వయసులో గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జూపూడి గ్రామానికి చెందిన పంతగాని సత్యప్రసాద్‌తో ప్రేమలో పడింది. తల్లిదండ్రులు వారించినా వినకుండా 1999 మే ఐదో తేదీన పొన్నూరు వచ్చి బీబీసీ చర్చిలో వివాహం చేసుకుంది. జూపూడిలో కాపురం పెట్టిన సత్యప్రసాద్ అంబికను చిత్రహింసలకు గురిచేసేవాడు. అంబికను తీవ్రంగా కొట్టి ఇద్దరు ఆడపిల్లలను సైతం పస్తులుంచేవాడు. 2008 వరకూ భర్తతో కలిసి ఉన్న అంబిక ఉద్యోగ నిమిత్తం భర్త బెంగుళూర్ వెళ్లినా తాను మాత్రం జూపూడిలోనే ఉంది. అక్కడ చిక్‌మంగుళూరుకు చెందిన కవిత అనే యువతిని పెళ్లి చేసుకున్నట్లు అంబికకు ఫోన్ చేసి చెప్పడంతో నిర్ఘాంతపోయింది. తనకు వారసుడు కావాలని నీకు ఇద్దరూ ఆడపిల్లలే పుట్టడంతో మరో పెళ్లి చేసుకున్నానని తనకు ఫోన్ చేయవద్దంటూ హెచ్చరించాడు. కవితతో కొన్నేళ్ళు కాపురం చేసిన సత్యప్రసాద్‌కు మళ్ళీ ఆడ పిల్లే పుట్టడంతో ఆమెను కూడా వదిలేసి జూపూడికి వచ్చేశాడు. అంబిక తిరిగి భర్తతో కలిసి కొన్నాళ్లు కాపురం చేసింది. మూడో భార్యతో దేశం దాటేందుకు యత్నం.. తీరు మార్చుకోని సత్యప్రసాద్ ఫేస్బుక్లో చాటింగ్ ద్వారా ఇవాంజిలిన్ అనే అమ్మాయిని మోసగించి పెళ్లి చేసుకున్నాడు. అప్పటి నుంచి విడాకులు ఇవ్వమంటూ అంబికను రోజూ చిత్రహింసలకు గురిచేస్తున్నాడు. భర్త హింస తట్టుకోలేక తల్లిదండ్రులైనా ఆదరిస్తారనే ఆశతో కర్నాటక వెళ్లింది. వారు ఇంటిలోకి కూడా రానివ్వలేదు. చేసేది లేక ఇద్దరు ఆడ పిల్లలతో జూపూడికి వచ్చింది. మూడో భార్య ఇవాంజిలిన్తో కలిసి దేశం విడిచి వెళ్లేందుకు పాస్‌పోర్ట్ తీసుకున్నాడని అంబిక పేర్కొంది. తల్లిదండ్రులు, భర్త తనను వదిలించుకోవాలని చూస్తుండటంతో రోడ్డుపాలయ్యానని విలపించింది. భర్తపై చట్టప్రకారం చర్యలు తీసుకుని తనలాగా మరే ఆడపిల్ల జీవితం బలి కాకుండా కాపాడాలని కోరింది. స్పందించిన ఎస్పీ వెంటనే చర్యలు తీసుకోవాలంటూ పొన్నూరు పోలీసులను ఆదేశించారు.