says
-
అధికారిక బంగ్లాలోకి రాహుల్ ఎంట్రీ.. కీలక వ్యాఖ్యలు..
ఢిల్లీ: పార్లమెంటేరియన్‌గా మళ్లీ గుర్తింపు పొందిన తర్వాత ఢిల్లీలో అధికారిక నివాస భవనాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేటాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఇండియా అంతా నా ఇల్లే అని వ్యాఖ్యానించారు. 2019 నాటి మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసులో రాహల్ గాంధీకి పార్లమెంట్ సభ్యునిగా గుర్తింపు రద్దు అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కేటాయించిన అధికారిక భవనాన్ని ఖాలీ చేయాల్సి వచ్చింది. రాహుల్ గాంధీకి ఇంతకు ముందు ఇచ్చిన తిలక్ లేన్‌లోని బంగ్లా 12నే మళ్లీ ఆయనకు అధికారిక నివాసంగా కేటాయిస్తూ లోక్‌సభ హౌసింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లు జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు తీర్పు అనంతరం ఆయన తన అధికారిక నివాసాన్ని ఏప్రిల్‌లో ఖాలీ చేశారు. కానీ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన సందర్భంగా ఆయన తన పార్లమెంటరీ పదవికి మళ్లీ అర్హత సాధించారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత లోక్‌సభలో ఎంపీ హోదాలో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడడం వల్ల కోల్పోయిన లోక్‌సభ సభ్యత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరిగివచి్చంది. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమాచారం తెలిసిన అనంతరం రాహుల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. తొలుత గాంధీజీ విగ్రహం వద్ద నివాళులరి్పంచి మధ్యాహ్నం ఎంపీగా లోక్‌సభలోకి అడుగుపెట్టారు. ఇదీ చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం -
నర్సింగ్ లో ఏపీ టాప్
-
హైకోర్టు సూచనతోనే సమ్మె విరమించాం
సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా ఆర్టీసీ కార్మికులు 55 రోజులు సమ్మె చేశారని జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామరెడ్డి అన్నారు. హైకోర్టు సూచన మేరకే తాము సమ్మె విరమించామని అన్నారు. శుక్రవారం వీఎస్టీలోని ఎంప్లాయిస్ యూనియన్ కార్యాలయంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కార్మికులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నందుకు ధన్యవాదాలు చెబుతున్నామని అన్నారు. తాము అడిగిన 16 డిమాండ్లను పరిష్కరించాలని కోరుతున్నామన్నారు. ఆర్టీసీలో భవిష్యత్‌లో యూనియన్లు ఉండవని సీఎం చెబుతున్నారని, వ్యవస్థ ఉన్నంత కాలం ట్రేడ్ యూనియన్లు ఉంటాయని చెప్పారు. డిపోలకు ఇద్దరు చొప్పున కార్మికులను నియమిస్తామని చెబుతున్నారని, ఇది రాజ్యాంగం ప్రకారం చెల్లదన్నారు. కార్మికుల ద్వారా ఓటింగ్ పెట్టి నిర్ణయించాలన్నారు. ఈ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జరిగిన సమ్మెలు ఎన్నడూ జరగలేదని, ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా సమ్మెలు జరిగాయన్నారు. లేబర్ కోర్టులో తమకు న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
కుంభకోణంపై శాంసంగ్ క్షమాపణలు
సియోల్: దక్షిణకొరియా ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన వాటాదారులకు క్షమాపణలు చెప్పింది. దేశంలో అతిపెద్దకుంభకోణంలో తమ సంస్థ అధిపతిపైఅవినీతి అభియాగాలు రావడంపై సంస్థ వాటాదారులకు వివరణ ఇచ్చింది. శుక్రవారం జరిగిన కంపెనీ వార్షిక సమావేశంలో అవినీతి కేసులో సంస్థ అధ్యక్షుడు జే ఓలీ అరెస్టు కావడంపై శాంసంగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ క్వాన్ ఓహ్-హ్యున్ వాటాదారులను క్షమాపణ కోరారు. కుంభకోణంలో తాము చిక్కుకున్నందుకు క్షమించాలని కోరారు. విరాళాల రూపంలో తాము ఎలాంటి లంచాలు ఇవ్వలేదని చెప్పారు. కానీ సంస్థ కార్పొరేట్ పాలన మెరుగుకు కట్టుబడి ఉన్నట్టు తెలిపారు. దీంతో హోల్డింగ్ కంపెనీగా మార్చడానికి ఇన్వెస్టర్లనుంచి ఒత్తిడి పెరుగుతోందని కానీ,కార్పొరేట్ నిర్మాణం ఎప్పటికీ మార్చుకోలేమని శుక్రవారం నాటి సమావేశంలో క్వాన్ ప్రకటించారు హోల్డింగ్ కంపెనీ ద్వారా పరిణామాలు ప్రతికూల ప్రభావాలుంటాయని పేర్కొన్నారు. అలాగే శాంసంగ్ గెలాక్సీ నోట్ 7 వైఫల్యంపై కూడా మరోసారి క్షమాపణలు కోరింది. కొత్త టెక్నాలజీ ప్రయోగంలో లోపం తలెత్తినట్టు క్వాన్ వివరించారు. ఈ వైఫల్యాన్ని 6 బిలియన్ డాలర్ల మేర అంచనా వేసినట్టు చెప్పారు. కాగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ కంపెనీ శాంసంగ్ గ్రూప్ చీఫ్ జె.వై. లీని అక్కడి విచారణ అధికారులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు సంస్థ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ చివరికి లీ జైలుకి వెళ్లక తప్పలేదు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయనపై విచారణ కొనసాగనుంది. దక్షిణ కొరియా అధ్యక్షునికి 38 మిలియన్ డాలర్ల లంచం ఇవ్వజూపేందుకు ప్రయత్నించారని లీపై ప్రధాన అభియోగం. రెండు కంపెనీల వివాదానికి సంబంధించి దేశ అధ్యక్షుడి మద్దతు కోసం శాంసంగ్ చీఫ్ లంచాన్ని ఎరగా చూపారని చార్జ్ షీట్ నమోదైంది. అటు ఈ అవినీతి ఆరోపణలు దక్షిణ కొరియాను కుదిపేయడంతో ఆ దేశ అధ్యక్షుడు మహాభియోగాన్ని కూడా ఎదుర్కొన్నారు. దీనిపై తాము కోర్టులోనే తేల్చుకుంటామని శాంసంగ్ వర్గాలు వాదిస్తున్న సంగతి తెలిసిందే. -
వేర్పాటు వాదాన్ని ఎగదోస్తే బుద్ది చెబుతాం
-
సిరిసిల్ల అభివృద్ధికి రూ.2.07 కోట్లు
సిరిసిల్ల : సిరిసిల్ల నియోజకవర్గ అభివృద్ధికి రూ.2.07 కోట్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే, రాష్ట్ర ఐటీ మంత్రి కె.తారకరామారావు మంగళవారం తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి నిధులు(సీడీపీ) ద్వారా మంజూరైన పనుల వివరాలను సిరిసిల్లలోని మంత్రి కేటీఆర్ ఆఫీస్ వర్గాలు వెల్లడించాయి. సిరిసిల్లలోని బార్ అసోసియేషన్ భవనం బ్యాలెన్స్ పని కోసం రూ.10 లక్షలు, పెద్ద మసీద్ సమీపంలోని కమ్యూనిటీ హాల్‌కు రూ. 10 లక్షలు, ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి రూ.10 లక్షలు మంజూరైనట్లు కలెక్టర్ నీతుప్రసాద్ ఆదేశాలు జారీ చేశారు. గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, సిరిసిల్ల మండలాల్లోని 57 పనులకు రూ.1.76 కోట్లు మంజూరైనట్లు ఆఫీస్ వర్గాలు తెలిపాయి. ఇందులో కమ్యూనిటీ హాళ్లు, మహిళా సంఘ భవనాలు, ఆలయాలకు విద్యుత్ లైన్ల నిర్మాణ పనులు ఉన్నాయి. -
పదవిలో కొనసాగాలనుకున్నా- రాజన్
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రస్తుత గవర్నర్ రఘురామ్ రాజన్ పదవీ విరమణకు కేవలం రెండు రోజుల ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను ఆర్బీఐ గవర్నర్ గా కొనసాగాలని అనుకున్నానని కానీ, అది సాధ్యపడలేదని జాతీయ మీడియాతో తెలిపారు. కొన్ని అంసపూర్ణ చర్యల నేపథ్యంలో తాను రెండవసారి గవర్నర్ గా కొనసాగాలని భావించానని తెలిపారు. కానీ అది నెరవేరలేదని తెలిపారు. దీనిపై మరింత వివరించడానికి నిరాకరించిన రాజన్ తన వివాదాస్పద ప్రసంగాలను సమర్థించుకున్నారు. ఐఐటీ ఢిలీలో సహనం గురించి తాను చేసిన వ్యాఖ్యలు ఆలోచనలతో కూడిన ఆర్థిక వ్యవస్థకు సంబంధించినవి ఆయన వివరణ ఇచ్చారు. కొంతకాలం పాటు పబ్లిక్ స్పీక్ కు దూరంగా ఉండాలనుకుంటున్నానని చెప్పారు. తాను నిజానికి దేశంలోని కొన్ని అంశాలపై మరింత అవగాహన పెంచుకోవాలనుకుంటున్నానీ, దీనికోసం దేశం చుట్టి రావాలనుకుంటున్నానని చెప్పారు. ఊర్జిత్ కు తాను సలహాలు ఇవ్వాల్సి అవసరం లేదన్నారు. అతనిమీద తనకు విశ్వాసం ఉందన్నారు. ప్రస్తుత అన్ని విషయాలపై ఆయనకు వివరించాననీ, ఆయన ధోరణి ఆయకుందని రాజన్ చెప్పారు. ఇపుడిక మళ్లీ అకాడమీకి వెళ్లాల్సిన సమయం వచ్చిందన్నారు. చాలాకాలం దూరంగా ఉన్న పరిశోధన, బోధన రంగానికి వెళ్లాలన్నారు. అక్కడ ఎన్నాళ్లు అన్నదే ప్రశ్న అని రాజన్ వ్యాఖ్యానించారు. అలాగే ఆగస్టులో ద్రవ్యోల్బణం మరింత దిగి వస్తుందన్నారు. జులై నెలలో ఇది అంతకంటే ఎక్కువే (6.07 శాతం) ఉంది. 6 శాతం కంటే తక్కువే ఉంచాలన్నదే తన లక్ష్యమనీ, అది సాధించాకే తన పదవీకాలం ముగిసిందని రాజన్ తెలిపారు. కాగా ఈనెల (సెప్టెంబర్) 4వ తేదీన రాజన్ పదవీ కాలం ముగియనుంది. ఆర్ బీఐ నూతన గవర్నర్ గా ఉర్జిత్ పటేల్ నియమితులైన సంగతి తెలిసిందే. -
నితీశ్ పగటి కలలు మానుకో
న్యూఢిల్లీ: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ చేసిన 'బీజేపీ రహిత భారత్' వాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. బీజేపీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేన్ మాట్లాడుతూ నితీశ్ కుమార్ పగటి కలలు కంటున్నారని విమర్శించారు. 'బీజేపీ రహిత భారత్' అని అనడానికి నితీష్ కు ఉన్న విశ్వసనీయత ఏమిటని ఆయన ప్రశ్నించారు. బీజేపీతో 17 ఏళ్లపాటు మిత్రపక్షంగా కొనసాగినప్పుడు 'బీజేపీ ముక్త భారత్' నినాదం గుర్తుకు రాలేదా అని ఎద్దేవా చేశారు. 'ఒక ప్రాంతీయ పార్టీ నాయకుడు తెంగించి మాట్లాడిన మాటలు'గా నితీశ్ వాఖ్యలను ఆయన అభివర్ణించారు. నితీశ్ తన పరిధిలో తానుంటే మంచిదని సూచించారు. జేడీయూ ఒక ప్రాంతీయ పార్టీ అని, అది బిహార్‌లలోని మొత్తం సీట్లలో ఎప్పుడూ పోటీ చేయలేదని అన్నారు. అలాంటి పార్టీ జాతీయస్థాయిలో క్రియాశీలంగా వ్యవహరించాలనుకోవడం అవివేకమే అవుతుందన్నారు. జనతాదళ్ యునైటెడ్ పార్టీలోనే ఐక్యత లేదని షానవాజ్ ఎద్దేవా చేశారు. నితీశ్ తన ఇంటిని ముందు చక్కదిద్దుకోవాలని సలహా ఇచ్చారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఆర్ఎస్ఎస్, బీజేపేతర శక్తులన్నీ ఒక తాటిపైకి రావాలని ఇటీవల నితీశ్ వాఖ్యానించిన సంగతి తెలిసిందే. ఆర్ఎస్ఎస్ భారతదేశ ఆత్మ అని, ఆత్మ లేని ఇండియా ఎలా సాధ్యమని ఆ సంస్థ నాయకుడు రాకేష్ సిన్హా వాఖ్యానించారు. -
55 వేల గ్రామాలకు మొబైల్ సౌకర్యం లేదు
భారతదేశంలో మొబైల్ కనెక్టివిటీ అందుబాటులో లేని గ్రామాలు ఇంకా ఉన్నట్లుగా ప్రభుత్వం వెల్లడించింది. 55,669 గ్రామాలు సెల్యులార్ కనెక్టివిటీకి దూరంగా ఉన్నట్లు లోక్‌సభలో కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. సెప్టెంబర్ నెలాఖరు నాటికి గ్రామాలు, పట్టణాల్లో టెలి సాంద్రత స్థాయి 48.79 శాతం నుంచి 152.36 శాతం వద్ద ఉన్నట్లుగా ఆయన వెల్లడించారు. దేశంలో మొత్తం 5,97,608 గ్రామాలుండగా 5,41,939 గ్రామాల్లో ఇప్పటికే మొబైల్ సేవలు అందుబాటులో ఉన్నాయని, మిగిలిన 55,669 గ్రామాల్లో నెట్వర్క్ అందుబాటులో లేనట్లు ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి వివరించారు. అన్ని ప్రాంతాల్లో మొబైల్ కనెక్టివిటీ ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అయితే టెలికాం సేవలకు డిమాండ్ ఉన్నా.. ధర విషయం సున్నితంగా మారిందని ఆయన చెప్పారు. ఇటీవల గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల కొనుగోలు సామర్థ్యాన్ని బట్టి కూడా టెలి సాంద్రతను గుర్తించాల్సి వస్తోందని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వినియోగదారుల కొనుగో శక్తిలో తేడాలు ఉండటంవల్ల... సాంద్రతలో కూడ భారీ మార్పులు కనిపిస్తున్నట్లు మంత్రి శంకర ప్రసాద్ తెలిపారు. నేషనల్ టెలికం పాలసీ ద్వారా 2017 నాటికి 70శాతం, 2020 నాటికి వంద శాతం గ్రామీణ ప్రాంతాల్లో టెలి సాంద్రతను పెంచే లక్ష్యంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని, టెలికమ్యూనికేషన్ సేవలను మెరుగు పరిచేందుకు ఇప్పటికే అనేక చర్యలు చేపడుతున్నామన్నారు. 3,567.58 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 2,199 మొబైల్ టవర్లను వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల్లో ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. 2015 నవంబర్ 30 నాటికి సుమారు 1,134 మొబైల్ టవర్లు ప్రసారం ప్రారంభించాయని మంత్రి రవి శంకర్ ప్రసాద్ తెలిపారు. -
చంద్రబాబు వల్లే విభజన తిప్పలు
నూజివీడు, న్యూస్‌లైన్ : కాంగ్రెస్ పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇవ్వడం వల్లనే తెలుగుజాతి రెండుగా చీలిపోయే పరిస్థితి వచ్చిందని వైఎస్సార్ సీపీ నూజివీడు సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు విమర్శించారు. ఆదివారం ఆయన ‘న్యూస్‌లైన్’తో ప్రత్యేకంగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఇవ్వడానికి సిద్ధమవుతున్న నేపథ్యంలో తమ పార్టీ సమైక్యాంధ్రకు కట్టుబడి 17మంది ఎమ్మెల్యేలతో రాజీనామాలు చేయించిందని చెప్పారు. తెలంగాణ ప్రాంతంలో పార్టీ దెబ్బతింటుందని తెలిసినా, వెనుకబడిన ప్రాంతాలన్నీ అభివృద్ధి చెందాలంటే సమైక్యాంధ్రే మేలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఇవేమీ పట్టకుండా కొత్త రాజధాని నిర్మాణానికి నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఇవ్వాలంటూ ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా మాట్లాడి సీమాంధ్ర ద్రోహిగా మారాడన్నారు. ఏ మోహం పెట్టుకుని యాత్ర మొదలెట్టారు.. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని నిలబెట్టేందుకు పుట్టిన పార్టీ అని ఊకదంపుడు ప్రసంగాలు ఇచ్చే టీడీపీ నాయకులు, రాష్ట్ర విభజనకు అంగీకారం ఎలా తెలిపారని ప్రతాప్ ప్రశ్నించారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని సోనియాగాంధీ పాదాల వద్ద తాకట్టుపెట్టి, మరల సీమాంధ్రలో ఏ మోహం పెట్టుకుని చంద్రబాబు యాత్ర చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ఇలాంటి ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్న రాజకీయ నాయకుడిని ఈ రాష్ట్ర ప్రజలు ఎప్పుడూ చూసిఉండరన్నారు. తమ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ, అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి స్పీకర్ ఫార్మాట్‌తో తమ పదవులకు రాజీనామా చేస్తే, టీడీపీ ఎంపీలు మాత్రం రాజీనామాలు చేయకుండా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. దీన్నిబట్టి వారికి రాష్ట్రం సమైక్యంగా ఉండేలా చూడాలన్న చిత్తశుద్ధి ఏమాత్రం లేదన్నారు. సీమాంధ్రలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు వెంటనే రాజీనామాలు చేసి సోనియాగాంధీపై ఒత్తిడి తీసుకువస్తేనే విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారన్నారు. వారు సోనియా ఇంటి చుట్టూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా ఉపయోగం ఉండదన్నారు. అసలు ఎంపీలు, మంత్రులు రాజీనామా చేస్తారా, లేదా అనే విషయాన్ని సీమాంధ్ర ప్రజలకు తేల్చిచెప్పాలన్నారు. చేతగాని దద్దమ్మల్లా వ్యవహరిస్తున్న వారిని ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. ఎలాంటి నాయకత్వం లేకుండానే నేడు సీమాంధ్రలోని ప్రజలు గత నెల రోజులుగా ఉద్యమంలో పాల్గొని సమైక్యాంధ్రే కావాలని నినదిస్తున్నారని గుర్తుచేశారు. -
కాంగ్రెస్ తన నిర్ణయాన్ని వెల్లడి స్తే బాగుండేది - వెంకయ్య
-
విజయకేతనం