ఢిల్లీ: పార్లమెంటేరియన్‌గా మళ్లీ గుర్తింపు పొందిన తర్వాత ఢిల్లీలో అధికారిక నివాస భవనాన్ని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాహుల్ గాంధీకి కేటాయించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. ఇండియా అంతా నా ఇల్లే అని వ్యాఖ్యానించారు. 2019 నాటి మోదీ ఇంటి పేరు వ్యాఖ్యల కేసులో రాహల్ గాంధీకి పార్లమెంట్ సభ్యునిగా గుర్తింపు రద్దు అయిన విషయం తెలిసిందే. అనంతరం ఆయనకు కేటాయించిన అధికారిక భవనాన్ని ఖాలీ చేయాల్సి వచ్చింది.
రాహుల్ గాంధీకి ఇంతకు ముందు ఇచ్చిన తిలక్ లేన్‌లోని బంగ్లా 12నే మళ్లీ ఆయనకు అధికారిక నివాసంగా కేటాయిస్తూ లోక్‌సభ హౌసింగ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రెండేళ్లు జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు తీర్పు అనంతరం ఆయన తన అధికారిక నివాసాన్ని ఏప్రిల్‌లో ఖాలీ చేశారు. కానీ సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టు స్టే విధించిన సందర్భంగా ఆయన తన పార్లమెంటరీ పదవికి మళ్లీ అర్హత సాధించారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రాహుల్ గాంధీ దాదాపు నాలుగు నెలల తర్వాత లోక్‌సభలో ఎంపీ హోదాలో అడుగుపెట్టారు. పరువు నష్టం కేసులో రెండేళ్లు జైలు శిక్ష పడడం వల్ల కోల్పోయిన లోక్‌సభ సభ్యత్వం సుప్రీంకోర్టు ఉత్తర్వులతో తిరిగివచి్చంది. రాహుల్ సభ్యత్వాన్ని పునరుద్ధరిస్తూ లోక్‌సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ సమాచారం తెలిసిన అనంతరం రాహుల్ పార్లమెంట్‌కు చేరుకున్నారు. తొలుత గాంధీజీ విగ్రహం వద్ద నివాళులరి్పంచి మధ్యాహ్నం ఎంపీగా లోక్‌సభలోకి అడుగుపెట్టారు.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీపై అనర్హత వేటు: సుప్రీం కోర్టు తీర్పు ఎఫెక్ట్.. లోక్‌సభ స్పీకర్ కీలక నిర్ణయం
Comments
Please login to add a commentAdd a comment