scheme works
-
టిడ్కో ఇళ్ల పథకాన్ని బాబు ప్రభుత్వం గాలికొదిలేసింది
-
చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు పునః ప్రారంభం
-
Dalit Bandhu: కారు... లేకుంటే ట్రాక్టరు!
సాక్షి, హైదరాబాద్: దళితబంధు యూనిట్ ఏర్పాటుపై లబ్ధిదారులు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒకేసారి రూ.10 లక్షలు బ్యాంకు ఖాతాలో జమ కాగా, ఆ నిధితో ఎలాంటి వ్యాపారం చేయాలనే దానిపై స్పష్టత లేక అయోమయంలో పడ్డారు. యూనిట్ ప్రతిపాదనలు సంబంధిత కమిటీల ద్వారా జిల్లా కలెక్టర్‌కు సమర్పించాల్సి ఉంటుంది. కలెక్టర్ ఆమోదించిన తర్వాత యూనిట్ సంబంధిత వస్తువులు, పరికరాల కొనుగోలుకు అనుమతి లభిస్తుంది. అనంతరం లబ్ధిదారు ఖాతా నుంచి నగదును చెక్కురూపంలో విక్రేత ఖాతాకు బదిలీచేస్తారు. పథకాన్ని పారదర్శకంగా, పక్కాగా అమలు చేసేవిధంగా ప్రభుత్వం ఈ మేరకు నిబంధనలు విధించింది. దళితబంధు కింద హూజూరాబాద్ శాసనసభ నియోజకవర్గంతోపాటు ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో ఇప్పటివరకు 18,064 మంది బ్యాంకుఖాతాల్లో నగదు జమచేశారు. ఈ క్రమంలో సగానికిపైగా లబ్ధిదారులు కొత్త యూనిట్లకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించగా, ఇందులో అత్యధికులు కార్లు, ట్రాక్టర్లు కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. దాదాపు 8 వేల ప్రతిపాదనల్లో 5,440 మంది కారుగానీ, ట్రాక్టర్గానీ కొనుగోలు చేస్తామని చెప్పారు. కొందరు కార్లు కొని అద్దెకు ఇచ్చుకుంటామని తెలపగా, మరికొందరు క్యాబ్రంగంలో పనిచేస్తామని వివరించారు. వ్యవసాయపనుల కోసం ట్రాక్టర్లు కొనుగోలు చేసుకుని సొంతంగా నడిపిస్తామని వివరించారు. కార్లు, ట్రాక్టర్లకు డిమాండ్ ఉన్నప్పటికీ, ఒకేచోట పెద్దసంఖ్యలో వాహనాలుంటే వాటికి పనిదొరికే అవకాశాలు తగ్గుతాయనే అభిప్రాయం అధికార వర్గాల్లో కనిపిస్తోంది. దీంతో పరిమితసంఖ్యలోనే ఇలాంటి యూనిట్లకు అవకాశం ఇవ్వాలని అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కార్లు, ట్రాక్టర్లు మాత్రమే కాకుండా ఇతర డిమాండ్ ఉన్న రంగాలపై అవగాహన కల్పించాలని భావిస్తున్నారు. ఈ మేరకు ఉన్నతాధికారులకు దళితబంధు నోడల్ అధికారులు సూచనలు చేస్తున్నారు. చదవండి: హైదరాబాద్‌లో భారీ వర్షం.. హై అలర్ట్ -
కేంద్రం ప్రభుత్వం కొత్త పోటీ.. 15 లక్షలు గెలుచుకునే అవకాశం!
సాక్షి, వెబ్‌డెస్క్ : దేశ ప్రజలకు కేంద్ర ఆర్థిక శాఖ ఆసక్తికరమైన పోటీ పెట్టింది. తాము ప్రవేశపెట్టిన కొత్త పథకానికి అనువైన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించిన వారికి భారీ బహుమతులు ఇస్తామని ప్రకటించింది. ఈ పోటీకి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి ఆగస్టు 15లోగా కేంద్రం ఇటీవల మౌలిక సదుపాయల కల్పన కోసం డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్‌కి ఆమోదం తెలిపింది. ఇప్పుడీ డీఎఫ్ఐ... తీరు తెన్నులు, లక్ష్యాలను స్ఫూరించేలా ఈ పథకానికి పేరు, ట్యాగ్‌లైన్, లోగోలను సూచించాలని కేంద్ర ఆర్థిక శాఖ కోరింది. ఆగస్టు 15వ తేది సాయంత్రం 5:30 గంటల్లోగా తమ ఎంట్రీలను పంపించాలని తెలిపింది. బహుమతులు ఈ పోటీలో ఒక్కో విభాగంలో మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ. 5 లక్షల వంతున మొత్తం రూ. 15 లక్షలు బహుమతిగా అందిస్తామని పేర్కొంది. రెండో స్థానంలో నిలిచిన వారికి రూ. 3 లక్షలు, మూడో స్థానంలో నిలిచిన ఎంట్రీలకు రూ. 2 లక్షల వంతున బహుమతులు అందివ్వనున్నారు. ఇలా పంపండి దేశ సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రజలందరికీ తేలికగా అర్థం అయ్యేలా, పలకడానికి సులువుగా ఉండేలా డీఎఫ్ఐకి సంబంధించిన పేరు, ట్యాగ్‌లైన్, లోగోలు ఉండాలని తెలిపింది. పేరు, ట్యాగ్‌లైన్, లోగో డిజైన్లు రూపొందించిన వారు https://www.mygov.in/task/name-tagline-and-logo-contest-development-financial-institution లింక్ ద్వారా కేంద్రానికి ఎంట్రీలను పంపివ్వాల్సి ఉంటుంది. డీఎఫ్ఐ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డెవలప్మెంట్ యాక్ట్ 2021 ద్వారా డెవలప్మెంట్ ఫైనాన్షియల్ ఇన్సిస్టిట్యూషన్ (డీఎఫ్ఐ)కి ఆమోదం తెలిపింది. డీఎప్ఐ ద్వారా దేశంలో మౌలిక సదుపాయాల కల్పన, మెరుగు పరచడం కోసం భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టాలని నిర్ణయించింది. సుమారు 1.11 లక్షల కోట్ల వ్యయంతో 7,000 ప్రాజెక్టులు చేపట్టబోతుంది. ఈ పథకం ద్వారా దేశ రూపురేఖలు మారిపోతాయని కేంద్రం చెబుతోంది. .@FinMinIndia in association with @mygovindia is announcing a contest to crowdsource the name, tagline and logo of the new Development Financial Institution. Cash prizes of up to Rs 5 lakh in each category! Last date for entries is 15.08.2021. https://t.co/uK5AojlWlB (1/2) — NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021 The setting up of a Development Financial Institution was announced by Finance Minister Smt @nsitharaman in Budget 2021-22. Both Houses of Parliament passed the National Bank for Financing Infrastructure and Development (NaBFID) Bill 2021 in March 2021. (2/2) pic.twitter.com/8AFa26Bdxf — NSitharamanOffice (@nsitharamanoffc) July 28, 2021 -
పురుషోత్తపట్నం పథకం పనుల అడ్డగింత
సీతానగరం (రాజానగరం) : పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ పనులను రామచంద్రపురం రైతులు అడ్డుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటలకు భూములు ఇచ్చిన రైతు దుగ్గిరాల చిరంజీవిరావు భూమిలో పొక్లెయిన్‌తో పైప్‌లైన్ పనులు ప్రారంభించారు. పైప్‌లైన్‌కు కాలువను తవ్వుతుండగా రైతులు, మహిళలు అడ్డుకున్నారు. రైతులు కోడేబత్తుల ప్రసాదరావు, కోడేబత్తుల రమాదేవి, కరుటూరి రజనీ, నున్న గంగాలక్ష్మి, విజయ్‌కుమార్ చౌదరి, మండ వెంకటరామారావు, సుశీశ్వర్లు తదితరులతో మహిళలు తరలివచ్చారు. పనులు ఆపకపోవడంతో పొక్లెయిన్‌కు అడ్డుగా బైఠాయించారు. ప్రాణాలు పోయినా సరే పనులు అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. సంతకాలు చేయకుండా భూములను బలవంతంగా తీసుకుని, పనులు చేయడం ఎంతవరకూ సమంజసమని రైతులు ప్రశ్నించారు. భూములను ఇచ్చేది లేదంటూ నినదించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. 2013 భూసేకరణ చట్టం అమలు చేసి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. అంతవరకు భూములలో పనులు చేయనిచ్చేది లేదని రైతులు తెలిపారు. దీంతో పనులను నిలిపివేశారు. భూముల్లోకి వెళ్లనీయరా? పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకానికి బలవంతంగా తీసుకున్న భూములపై మీకేంటి అధికారం, భూములలోకి వెళ్లనీయరా అంటూ వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి నిలదీశారు. సీతానగరం వచ్చిన ఆమె విలేకరులతో మాట్లాడుతూ భూసేకరణ సంతకాలు చేయని రైతుల భూములలోకి రైతులు వెళ్ళకుండా అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. 2013 భూసేకరణ చట్టం కింద పరిహారం అందించాలని, సంతకాలు చేసిన వారికి, చేయని వారికి వేర్వేరుగా పరిహారం ఇవ్వడం సరికాదన్నారు. ఆదివారం సీతానగరం బస్టాండ్ సెంటర్ నుంచి అఖిలపక్షంతో రైతులు పాదయాత్రగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం వద్దకు వెళతామని, బలవంతంగా తీసుకున్న భూములలో కూర్చుంటామని హెచ్చరించారు. రైతులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ స్పందించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు డాక్టర్ బాబు, వలవల వెంకట్రాజు, చల్లమళ్ల సుజీరాజు, శివ, అను, అభి, సుంకర నరసింహరావు, పాపారావు తదితరులు పాల్గొన్నారు. -
పునాదుల్లోనే పులకుర్తి
అధికారంలోకి వచ్చిన వెంటనే పులకుర్తి ఎత్తిపోతల పనులు పూర్తి చేయిస్తాం. కరువును పారదోలి రైతులను ఆదుకుంటాం. - పాదయాత్ర సమయంలో గూడూరు, సి.బెళగల్ మండల కేంద్రాల్లో రైతులకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ ఇది. టీడీపీ అధికారంలోకి వచ్చి రెండు నెలలు కావస్తోంది. పులకుర్తి ఎత్తిపోతల పథకాన్ని పట్టించుకునే వారు కరువయ్యారు. కర్నూలు రూరల్: పాలకుల నిర్లక్ష్యంతో కోడుమూరు నియోజకవర్గంలో పులకుర్తి ఎత్తిపోతల పథకం పనులు మందుకు సాగడం లేదు. శంకుస్థాపన చేసి ఏడాది దాటిపోయిన ఈ పథకం పునాదులకే పరిమిత మయింది. తుంగభద్ర దిగువ కాలువ పరిధిలోని టెయిల్‌పాండ్ కాలువ అయిన కర్నూలు బ్రాంచ్ కెనాల్ కింద ఉన్న 23 వేల ఎకరాలకు సాగు నీరు అందడం లేదు. ఈ భూములకు సాగు నీరు అందించాలనే ఉద్దేశంతో దివంగత నేత శిఖామణి 2006 మార్చిలో జిల్లాకు వచ్చిన అప్పటి సీఎం వైఎస్సార్ దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్సార్ సానుకూలంగా స్పందించడంతో పులకుర్తి ఎత్తిపోతల పథకం చేపట్టేందుకు 2006 మే నెల 11వ తేదీన నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి సర్వే ఉత్తర్వులు వచ్చాయి. అయితే శిఖామణి మరణంతో ఆ పథకం పనులు సాగలేదు. గత ఏడాది జూన్ నెలలో హడావుడిగా కోడుమూరులో ఉన్న దిగువ కాలువ సబ్‌డివిజన్ ఆఫీస్ అవరణంలోనే శంకుస్థాపన చేసి శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పంపింగ్ స్టేషన్ పనులు పునాదులతో నిలిచిపోయాయి. శంకుస్థాపనకు ముందే భూసేకరణ చేయాల్సి ఉన్నా నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకోలేదు. దీంతో పథకం నిర్మాణానికి అడ్డంకులు ఏర్పడతున్నాయి. ఈ పథకం నుంచి సి.బెళగల్ చెరువుకు తుంగభద్ర జలాలు అందనున్నాయి. ఈ చెరువు కింద ఉన్న సుమారు 1250 ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. ఈ పథకం ద్వారా గుండ్రేవుల దగ్గర వాటర్ పంపింగ్ స్టేషన్ నుంచి పులకుర్తి సమీపంలోని రిజర్వాయర్కి నీటిని సరఫరా చేయాల్సింది. ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..పులకుర్తి ఎత్తిపోతల పథకం పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. భూ సేకరణే అసలు సమస్య పులకుర్తి ఎత్తిపోతల పథకం నిర్మాణానికి 2013 జూన్ నెలలో శంకుస్థాపన చేశారు. రిజర్వాయర్, పైపు లైన్ల కోసం అవసరమైన 122ఎకరాల భూసేకరణ జరుగాల్సింది. ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. భూసేకరణకు ప్రభుత్వ నిబంధనల మార్పు వల్లే అనుమతులు రావడం లేదు. - ఆర్.నాగేశ్వర్రావు, నీటిపారుదలశాఖ పర్యవేక్షక ఇంజనీర్