Second hand goods
-
సెకండ్ హ్యాండ్ సంపన్నులు!
ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా ఆడంబర జీవనశైలికి అలవాటుపడి అప్పులపాలైన వాళ్లను ఎంతోమందిని చూస్తుంటాం. అయితే దీనికి భిన్నంగా ఆర్థిక స్థోమత హైలెవెల్లో ఉన్నప్పటికీ నిరాడంబరశైలిని అనుసరించే ధోరణి సంపన్నులలో పెరుగుతోంది. దీనికి ఉదాహరణ షాంగ్ సావెద్ర, అనీ కోల్... మిలియనీర్లు అయిన సావెద్ర, ఆమె భర్త ఇంద్రభవనంలాంటి ఇళ్లెన్నో నిర్మించుకునే ఆర్థిక స్థోమత ఉంది. అయినా సరే ఆ దంపతులు లాస్ ఏంజిల్స్‌లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. వారికి విడి విడిగా కార్లు లేవు. ఇద్దరూ కలిసి సెకండ్ హ్యాండ్ కారును ఉపయోగించుకుంటారు.పిల్లలు సెకండ్‌హ్యాండ్ బొమ్మలతో ఆడుకుంటారు. వృథా ఖర్చుకు దూరంగా ఉంటారు. ‘అఫ్కోర్స్, నేను కూడా లగ్జరీ ఐటమ్స్ చూసి టెంప్ట్ అవుతుంటాను. అయితే తొందరపడకుండా కొద్దిసేపు ఆలోచిస్తాను. వెంటనే కొనేయాలనే ఆలోచన నుంచి బయటపడతాను. మనసు పడ్డాం కాబట్టి కొనడం కాకుండా ఆ వస్తువు నిజంగా మనకు ఎంత అవసరమో అని ఆలోచిస్తే సమస్య ఉండదు’ అంటుంది షాంగ్ సావెద్ర.రీసెర్చర్, పర్సనల్ ఫైనాన్స్ కోచ్ అనీ కోల్ మిలియనీర్. అయితే ఆమె సంపాదనతో పోల్చితే చేసే ఖర్చు చా... లా తక్కువ! ఎన్నో సంవత్సరాల క్రితం కారును అమ్ముకుంది. ఇంట్లో పనివాళ్లు అంటూ ఎవరూ ఉండరు. వంట చేయడం నుంచి జుత్తు కత్తిరించుకోవడం వరకు తానే చేస్తుంది! సెలవు రోజుల్లో ఎంజాయ్ చేయడానికి ఖర్చు అవసరం లేని ఫ్రీ యాక్టివిటీలకు ప్రాధాన్యత ఇస్తుంది. పొదుపునకు ప్రాధాన్యత ఇచ్చే జీవనశైలిని అనుసరిస్తోంది. దుస్తుల నుంచి వస్తువుల వరకు సెకండ్ హ్యాండ్ వాటికి ప్రాధాన్యత ఇస్తోంది. ఈ సంపన్నులది పీనాసితనంగా అనిపించవచ్చుగానీ.. కొద్దిగా ఆలోచించినా అర్థమవుతుంది వారి ఆచరణ ఎంత అనుసరణీయమో. -
సెకండ్ హ్యాండ్ అంటే మజాక్ కాదు!
దేశంలో సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్ ఊహించని వేగంతో విస్తరిస్తోంది. కన్సల్టింగ్ ఫర్మ్ రెడ్‌సీర్ అంచనా ప్రకారం ఆర్థిక సంవత్సరం 26 నాటికి దేశీయంగా సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్ విలువ ఏకంగా 10 బిలియన్ డాలర్ల మార్కును చేరుకోనుంది. ఇక ఫోన్లతో పాటు మొత్తం ఎలక్ట్రానిక్స్‌కి సంబంధించి సెకండ్ హ్యాండ్ మార్కెట్ విలువ 16 శాతం వృద్ధిని నమోదు చేస్తూ ఆర్థిక సంవత్సరం 2026 నాటికి 11 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను చేరుకుంటుందని అంచనా. వాడేసిన ఫోన్లను రిఫర్బిష్డ్ చేసి రీకామర్స్ పేరుతో పలు సైట్లు విక్రయిస్తున్నాయి. అందుబాటు ధరలో ఫోన్లు వస్తుండటంతో వీటిని కొనేవారి సంఖ్య ఇటీవల బాగా పెరిగింది. 2021 లెక్కల ప్రకారం ఫస్ట్ హ్యాండ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విలువ ఇండియాలో 15 బిలియన్ డాలర్లు ఉంది. ఇదే సమయంలో సెకండ్ హ్యాండ్ మార్కెట్ విలువ కూడా భారీగానే ఉంది. ఫలితంగా స్మార్ట్‌ఫోన్ యూజర్ల సంఖ్య దేశంలో 55 కోట్లపైకి చేరుకుంది. రీకామర్స్ రంగం దినదినాభివృద్ధి చెందుతున్న పలు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయని రెడ్‌సీర్ చెబుతోంది. అందులో ముఖ్యమైనవి సెకండ్ హ్యాండ్ ఫోన్ల నాణ్యత కాగా కొనుగోలు చేసేందుకు ఓ వ్యక్తి తీసుకునే సమయం రెండోవదిగా నిలుస్తోంది. వీటితో పాటు ధరల నిర్ణయించే విషయంలో కూడా పారదర్శకత ఉండటం లేదు. ఈ నాణ్యత, ధరల విషయంలో మెరుగుపడితే సెకండ్ హ్యాండ్ ఫోన్ మార్కెట్ మరింత వేగంగా విస్తరించే అవకాశం ఉందని రెడ్‌సీర్ అంచనా వేస్తోంది. చదవండి: సస్పెన్స్‌తో చంపేశారు, ఆ సీక్రెట్‌ను రివిల్ చేసిన సుందర్ పిచాయ్! -
తీరొక్క సంతసం
సాక్షి, కామారెడ్డి: వారమైందంటే.. వారి మనసంతా సంతపైనే! ఆన్లైన్లో ఆర్డరిస్తే తమకు కావాల్సిన వస్తువులు ఇంటిముందు వాలే ఈ కాలంలోనూ అంగడికి ఆదరణ తగ్గలేదు. తీరొక్క వస్తువులకు ముచ్చటైన నెలవు అది. సరుకులు, బట్టలు, చిన్న, పెద్ద వస్తువులు, కూరగాయలు, పశువులు, మేకలు... ఇలా అన్ని రకాలు అక్కడ లభిస్తాయి. ‘అంగడికి పోయి గొంగడి తెస్త ’అన్న సామెత కూడా అట్ల పుట్టిందే. అయితే, ఇప్పుడు స్పెషల్ సంతలు వచ్చేశాయి. కామారెడ్డి అంగడి వాహనాలకు ప్రసిద్ధి. నవీపేట మేకలకు కేరాఫ్‌గా మారింది. బిచ్కుంద పప్పుదినుసులకు ఫేమస్. పిట్లం తలుపుచెక్కల పొట్లంగా మారింది. మద్నూర్ ఎలక్ట్రానిక్ పరికరాలు.. ఇలా పలు చోట్ల ఒక్కోరకం వస్తువుకు ఒక్కో రకం అంగడి నిర్వహిస్తున్నారు. ప్రజల మధ్య ఆత్మీయతకు అంగడి వేదికగా కూడా ఉంటోంది. చుట్టాలు, స్నేహితులు అంగట్లో కలుసుకుంటారు. కష్టసుఖాలు కలబోసుకుంటారు. వారానికోసారి జరిగే అంగడికి తప్పనిసరిగా వెళ్లేవారు చాలామంది ఉంటారు. ఇప్పుడు జనం అవసరాల మేరకు వారంలో రోజుకో చోట అంగడి సాగుతోంది. తలుపుచెక్కలకు కేరాఫ్ పిట్లం కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో నిర్వహించే అంగడి.. ఇంటి దర్వాజాలకు బిగించే తలుపు చెక్కలకు స్పెషల్. వేప, మామిడి చెక్కలు ఇక్కడ లభిస్తాయి. పిట్లం మండలంతోపాటు పొరుగున ఉన్న సంగారెడ్డి జిల్లా నుంచి కూడా ప్రజలు తరలివచ్చి చెక్కలు కొనుగోలు చేస్తుంటారు. కామారెడ్డిలో వాహనాల అంగడి జిల్లా కేంద్రమైన కామారెడ్డి పట్టణంలో కొన్ని దశాబ్దాలుగా ప్రతి గురువారం సాధారణ అంగడి సాగుతోంది. అయి తే, ఇక్కడ ఐదారేళ్లుగా ప్రత్యేకంగా బైకుల అంగడి కూడా సాగుతోంది. కొత్త బస్టాండ్ సమీపంలోని సీఎస్ఐ చర్చి గ్రౌండ్లో ప్రతి గురువారం సెకండ్ హ్యాండ్ బైకుల అంగడి నిర్వహిస్తున్నారు. బాబా అనే ఒక వ్యక్తి ప్రారంభించిన బైకుల అంగడి ప్రతివారం నిరాటంకంగా కొనసాగుతోంది. బైకులతోపాటు కార్లు, ట్రాక్టర్లు, వ్యాన్లు, ఆటోలు కూడా అమ్ముతున్నారు. నవీపేట మేకల సంత నిజామాబాద్ జిల్లా నవీపేట మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం మేకల సంత సాగుతోంది. వారంవారం రూ.కోట్లలో వ్యాపారం నడుస్తోంది. మేకల కొనుగోలుకు రాష్ట్రంలోని ఇతర జిల్లాలతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాం తాల నుంచి కూడా చాలామంది ఇక్కడికి వస్తుంటారు. పప్పుదినుసులకు ఫేమస్ బిచ్కుంద కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలో బుధవారం నిర్వహించే అంగడిలో పప్పుదినుసుల అమ్మకాలు జోరుగా సాగుతాయి. పెసర్లు, బబ్బెర్లు, కందులు, శనగలతోపాటు జొన్నలు, గోధుమలు కూడా భారీగా అమ్ముడవుతాయి. చుట్టుపక్కల మండలాల నుంచి పప్పుదినుసుల కోసం వస్తుంటారు. మద్నూర్ అంగట్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు కామారెడ్డి జిల్లాలో మారుమూలన మహారాష్ట్రకు సరిహద్దుల్లో ఉన్న మద్నూర్ అంగడి ఎలక్ట్రానిక్ ఉపకరణాల అమ్మకాలకు పెట్టింది పేరు. ఇక్కడ విరివిగా ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, సామగ్రి విక్రయిస్తారు. ఇతర ప్రాంతాల నుంచి కొందరు వ్యాపారులు వచ్చి ఫ్యాన్లు, కూలర్లు, స్పీకర్లు, డెక్కులు, మిక్సీలు, గ్రైండర్లు, మైకులు విక్రయిస్తారు. బైకులపై ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకువచ్చి అంగట్లో విక్రయిస్తుంటారు. ధరలు కూడా అందుబాటులో ఉండటంతో వీటి అమ్మకాలకు ఆదరణ కూడా బాగానే ఉంటుంది. -
ఆశకు పోతే నెత్తిన గుడ్డే..
ఆన్లైన్ వ్యాపారం ఇప్పుడు జోరందుకుంటోంది. సరి కొత్త ఉత్పత్తులు మొదలుకుని సెకండ్ హ్యాండ్ వస్తువులు అమ్మే సైట్లు కూడా కోకొల్లలుగా ఉన్నాయి. ఆన్లైన్లో సెకండ్ హ్యాండ్ వస్తువులు, ఉపకరణాల ప్రకటనలు ఆకర్షిస్తుంటాయి. ఎంతో ఖరీదైనవి సగం ధరకే అనే ప్రకటనలకైతే వినియోగదారులు ఇట్టే బుట్టలో పడిపోతుంటారు. అప్రమత్తంగా లేకపోతే తక్కువ ధరకే కొన్న ఆనందం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోవచ్చు. కొత్త చికాకులూ చుట్టుముట్టొచ్చు. * సెకండ్ హ్యాండ్ ఉపకరణాల కొనుగోలుతో చికాకు * దొంగలించిన ఫోన్లను ఆన్లైన్లో విక్రయం * జాగ్రత్తలు తీసుకోకుంటే జేబుకు చిల్లే చిత్తూరు(గిరింపేట): మొదటి సన్నివేశం: చిత్తూరులోని క ట్టమంచికి చెందిన అనిల్ అనే యువకుడు ఆన్లైన్లో ఈ కామర్స్ వెబ్సైట్లో ఓ స్మార్ట్ ఫోన్ ప్రక టన చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ మోడల్ వాస్తవ ధర సుమారు రూ. 40 వేలు. అయితే సగం ధ రకే ఆ ఫోన్‌ను అమ్మకానికి పెట్టడంతో ఏ మాత్రం అనుమానం లేకుండా ప్రకటన ఇచ్చిన వ్యక్తి నుంచి ఆ ఫోన్ కొనుగోలు చేశాడు. ఆ ఫోన్ కు బిల్లు ఇవ్వమని అడిగాడు. ఎక్కడోపోయిందని తిరుపతి వాసిగా చెప్పుకున్న ఆ ప్రకటనదారుడు పేర్కొనడంతో నిజమేనని నమ్మాడు. కానీ, తర్వాత కొన్ని రోజులకు ఆ ఫోన్ అతడి పెద్ద షాకే ఇచ్చింది. రెండో సన్నివేశం: కొత్తగా కొన్న సెకండ్ హ్యాండ్ ఫోన్లో సిమ్‌కార్డు వేసి రెండు రోజుల పాటు వినియోగించాడు. ఆ తర్వాత మూడో రోజు వచ్చిన ఓ ఫోన్ కాల్ అతడికి వణుకు, జ్వరం తెప్పించింది. అది దొంగలించిన ఫోన్ అని, దానిని మర్యాదగా అప్పగించకపోతే కేసు తప్పదని తిరుపతి పోలీసుస్టేషన్ నుంచి ఫోన్ రావడంతో హడలిపోయాడు. వెంటనే తనకు స్మార్ట్ ఫోన్ అమ్మిన వ్యక్తికి కాల్ చేశాడు. కానీ ఆ నంబర్ స్విచ్ఛాఫ్‌లో ఉందని వాయిస్ వినిపించింది. ఆన్లైన్లో తాను చూసిన ప్రకటన కోసం వె తికాడు. కానీ అక్కడ ఆ ప్రకటన లేదు. ఇలా షాక్ మీద షాక్ తగలడంతో చేసేదేమీ లేక తాను ముచ్చట పడి కొన్న సెకండ్ హ్యాండ్ స్మార్ట్ ఫోన్‌ను పోలీసులకు అప్పగించాడు. ప్రకటనదారుడి సెల్ నంబర్ ఆధారంగా అతడి వివరాలు కనుగొనేందుకు యత్నించినా అదీనూ తప్పుడు నంబర్ అని పోలీసుల విచారణలో తేలింది. ఇది ఒక్క అనిల్‌కు ఎదురైన సమస్యే కాదు. జిల్లాలో ఇలా మోసపోతున్న వారు చాలా మందే వున్నారు. ఆన్లైన్లోని కొన్నిసైట్లలో ప్రకటనల ద్వారా విక్రయిస్తున్న సెకండ్ హ్యాండ్ ఫోన్లలో ఎక్కువగా దొంగలించినవే కావడంతో కొన్నవారు ఇలాంటి చేదు అనుభవాలను చవిచూడాల్సి వస్తోంది. సెల్ఫోన్లు చోరీకి గురైతే పోలీసులు తమ వద్ద గల సాఫ్ట్వేర్ ద్వారా (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడె ంటిటీ(ఐఎంఈఐ)నంబరు ద్వారా ఫోన్ ఏ ప్రాంతంలో వుందో ట్రాక్ చేసి గుర్తిస్తారు. కొట్టేసిన ఫోన్లోని సిమ్‌కార్డు తీసేసి విక్రయించినా ఐఎంఈఐ నంబరు వారిని పట్టిస్తోంది. అటువంటి ఫోన్లను కొనుగోలు చేసిన వారు కొత్త సిమ్‌ను అందులో వేసిన వెంటనే పోలీసుల ట్రాకింగ్‌కు చిక్కుతోంది. ఈ క్రమంలో తక్కువ ధరకు ఫోన్ లభించిదంటూ బిల్లులేని ఫోన్లను కొంటే భాదితుల జాబితాలోకి చేరాల్సిందే. ఐఎంఈఐ ప్రత్యేకత * ప్రతి ఫోన్‌కు ఐఎంఈఐ సంఖ్య ఆధార్ సంఖ్యలాగా విశిష్టమైన ది. ఒక ఫోన్‌కున్న సంఖ్య మరొక ఫోన్‌కు ఉండదు. * ఒక వేళ ఫోన్‌ను దొంగలు అపహరించి సిమ్‌కార్డును దానిలోంచి తీసివేసినా పోలీసులు ఆ సంఖ్య ఆధారంగా దొంగలను పట్టుకుంటారు. ఏ పరిధిలో ఫోన్‌ను వినియోగిస్తున్నారనే విషయాన్ని గమనించి పట్టుకునే అవకాశం వుంది. * స్మార్ట్ ఫోన్లలో యాంటీ థెఫ్ట్ సాఫ్ట్‌వేర్‌ను అప్లోడ్ చేసుకుంటే తమ ఖరీదైన ఫోన్లను కాపాడుకోవచ్చు. సాధరణంగా జరిగే పొరపాట్లు * షాపింగ్చేసే సమయంలో ఏమరుపాటుతో సెల్ఫోన్లను పక్కనపెట్టి మరచిపోతుంటారు. * బస్సులో వెళ్లేటప్పుడు నిద్రిస్తున్న సమయంలో దొంగలు తమ పని కానిచ్చేయడమో లేదా జేబు నుంచి పడిపోవడం, తమ స్టాపింగ్ రాగానే సెల్ ఉన్నదీ లేనిదీ గమనించకనే హడావుడిగా దిగి వెళుతుంటారు. * రైలు ప్రయాణాలు చేయాల్సి వచ్చినప్పుడు రిజర్వేషన్ బుకింగ్ కౌంటర్ల వద్ద దరఖాస్తు ఫారాలను పూర్తిచేయడంలో నిమగ్నమై సెల్‌ఫోన్‌ను పక్కన పెట్టి అలాగే వ దలి వెళుతుంటారు. * రైల్వేస్టేషన్లలో సెల్ఫోన్లను చార్జింగ్ పెట్టి దానిని గమనించకుండా వుండడంతో సమయం చూసి వాటి ని కొట్టేస్తున్నారు. * విద్యార్థులు పరీక్ష లకు హాజరయ్యే సమయంలో ఫోన్లను బ్యాగ్‌లలో పెట్టి పరీక్షలకు వెళుతుంటారు. ఆ సమయంలో అవి దొంగతనానికి గురవుతుంటాయి.