secret enquiry
-
సోషల్ మీడియాలో అన్నీ షేర్ చేసుకుంటున్నారా? మీకంటూ ప్రైవేట్ లైఫ్ లేదా?
ఇంటి గుట్టు లంకకు చేటు అని సామెత. అంటే ఇంట్లో ఉండవలసిన సమాచారాన్ని అవతలి వారికి చేరవేయడం వల్ల అది ఆ ఇంటికంతటికీ అనర్థదాయకం అన్నమాట. జీవితంలో ప్రతి ఒక్కరికి ఎంతో కొంత గోప్యత ఉండాలి. అది పాటించకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దాన ధర్మాల విషయంలో కూడా కుడి చేతితో చేసిన దానం ఎడమ చేతికి తెలియనివ్వ కూడదనేవారు. మూడోకంటికి తెలియకుండా అని కూడా తరచు వాడేవారు. గోడకు చెవులుంటాయి కనుక కాస్త చూసుకుని మాట్లాడటం మంచిది అనేవారు. జీవితాన్ని కనీసం కొంతవరకైనా గోప్యంగా ఉంచుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం. ఇప్పుడున్నంత ఓపెన్‌గా ఒకప్పుడు ఉండేది కాదు ఏ విషయమైనా. దురదృష్టవశాత్తూ సోషల్ మీడియా చొచ్చుకు వచ్చినప్పటి నుంచి అంతా బహిరంగమే అయిపోయింది. చిన్నవారి నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని పబ్లిక్‌గా మార్చేసుకుంటున్నారు. ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రైవసీని కోల్పోతున్నారు. దానివల్ల చిక్కుల్లో పడుతున్నారు. గోప్యత అంటే..? గోప్యత అంటే ఏదయినా ఒక ముఖ్యమైన సమాచారాన్ని రహస్యంగా ఉంచడం లేదా బహిర్గతం చేయకుండా ఉండటం. గోప్యత అనేది కేవలం ఆ సమాచారాన్ని బయటకు పొక్కకుండా రహస్యంగా ఉంచే చర్య. పాటించడం ఎలా? రహస్య విషయాలను చర్చిస్తున్నప్పుడు ఎవరూ వినలేదని నిర్ధారించుకోండి. పనిని సాధించడానికి అవసరమైన కనీస సమాచారాన్ని మాత్రమే భాగస్వామ్యం చేయండి. కొంతమంది నిపుణులు... వైద్యులు, న్యాయవాదులు, అకౌంటెంట్లతో సహా వారి వృత్తిపరమైన స్థానం ద్వారా వ్యక్తులు లేదా సంస్థల గురించి సమాచారాన్ని పొందుతారు. ఉదాహరణకి వైద్యులకు వారి రోగుల పరిస్థితులు, చికిత్సల వివరాలు తెలుసు ∙న్యాయవాదులకు వీలునామాలు, కోర్టు కేసుల వివరాల గురించి తెలుసు, వాటిలో కొన్ని చట్టం ద్వారా రక్షించబడవచ్చు; ∙ట్యాక్స్ కన్సల్టెంట్లు తమ ఖాతాదారుల పన్ను, ఆదాయం గురించి తెలుసుకుంటారు. ఇవన్నీ తమకు తెలిసినప్పటికీ ఆయా వృత్తి నిపుణులు తరచు వృత్తిపరమైన ప్రవర్తనా నియమావళితో ΄ాటు అధికారిక చట్టపరమైన అవసరాలకు కట్టుబడి ఉంటారు. ఉండాలి కూడా. ఎందుకు అవసరం? మానసిక ఆరోగ్యానికి, వ్యక్తి ఎదుగుదలకు చాలా ముఖ్యమైన వాటిలో గోప్యత కూడా ఒకటి.. ఎవరినైనా విశ్వసించడం లేదా వారికి రహస్యాలు చెప్పడం అనేది గోప్యతను బయట పెట్టుకోవడమే. ఎందుకంటే గోప్యత అంటే రహస్యంగా ఉంచవలసిన సమాచారం. దీనిని బహిరంగ పరచుకోవడం అంటే తమకు తామే నష్టాన్ని కొని తెచ్చుకోవడమే! జీవితాన్ని గోప్యంగా ఉంచుకున్నప్పుడు ఆలోచనలు, భావాలు, అనుభవాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించే అవకాశం లభిస్తుంది. ఇది మన విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. మన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడానికి సాయపడుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది! వ్యక్తిగత జీవితాన్ని గోప్యంగా ఉంచుకోవడం వల్ల ప్రశాంతత, స్థిరత్వం లభిస్తాయి. ఇవి మనల్ని మనం అర్థం చేసుకోవడంలో సహాయపడతాయి. మనలోని నెగటివ్ ఆలోచనల నుంచి ఉపశమనం పొందుతాము. ఇది మన మనోధైర్యాన్ని, స్థైర్యాన్ని పెంచి జీవితాన్ని సానుకూలం చేస్తుంది. జీవితాన్ని కాస్తంత గోప్యంగా ఉంచుకున్నప్పుడు మనలోని సున్నితత్వాన్ని మనం అనుభవిస్తాం. దీనివల్ల మన ఆలోచనలు, భావాలు మనతోనే కనెక్ట్ అవుతాయి. ఇది ఇతరుల పట్ల సున్నితంగా వ్యవహరించడానికి సహాయపడుతుంది. మన చుట్టూ ఉన్న వారిని అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. వ్యాపారంలో, ఉద్యోగంలో గోప్యత పాటించడం వల్ల స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మన జీవితాన్ని మనమే నిర్ణయించుకోవచ్చు. మనపై ఎవరూ పెత్తనం చెలాయించడానికి అవకాశం ఉండదు. దీనివల్ల ఆత్మవిశ్వాసం బలపడుతుంది. మానసిక ఆరోగ్యం, ఎదుగుదల బాగుంటుంది. గోప్యత లోపించిన మన ప్రార్థనలు, దానధర్మాలు, ఉపవాస దీక్షలు వ్యర్థమే అని చెప్పవచ్చు. అవి ఈనాడు బహిరంగ ప్రచార వేదికలయ్యాయి, వాటివల్ల బోలెడు పేరు ప్రఖ్యాతులైతే వస్తాయేమో కాని వాటి అసలు ఫలాలు, ఆశీర్వాదాలు మాత్రం లభించవు. ఇతరులకు ఒక చేతితో చేసే సహాయం, మరో చేతికి తెలియకూడదని, అదంతా రహస్యంగా జరగాలని మతగ్రంథాల ఆదేశం. మనం మన పొరుగువారికి, పేదలకు చేసే సహాయం లేదా ధర్మం ఎంత రహస్యంగా ఉంటే దానివల్ల దేవుని ఆశీర్వాదాలు మనకు అంత ధారాళంగా ప్రతిఫలంగా లభిస్తాయని బైబిల్ చెబుతుంది. ఇది ఏ మతంలోనైనా వర్తిస్తుంది. చివరగా... గోప్యంగా ఉండమన్నారు కదా అని వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు మీ జబ్బులను మాత్రం గోప్యంగా ఉంచకండి. డాక్టర్ల వద్ద అన్నీ చెప్పుకోవడం మంచిది. -
పుదుచ్చేరిలో నకిలీ ఏటీఎం ముఠా అరెస్ట్
సాక్షి, చెన్నై: పుదుచ్చేరి కేంద్రంగా నకిలీ ఏటీఎం కార్డుల్ని తయారుచేస్తున్న ముఠా సభ్యుల్ని కేరళ పోలీసులు ఆదివారం అరెస్ట్ చేశారు. ఈ ముఠా సామాన్యుల నుంచి కొల్లగొట్టిన మొత్తం రూ.100 కోట్లకు పైగానే ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ముఠాలో పుదుచ్చేరికి చెందిన ఎన్ఆర్ కాంగ్రెస్, అన్నాడీఎంకే నేతలు ఉండటం రాజకీయంగా ప్రకంపనలు రేపుతోంది. కేరళలోని ఓ పబ్‌లో గతవారం చోటుచేసుకున్న ఓ గొడవలో పుదుచ్చేరికి చెందిన ఓ యువకుడి వద్ద భారీ సంఖ్యలో నకిలీ ఏటీఎం కార్డులు లభ్యమయ్యాయి. దీంతో పుదుచ్చేరి పోలీసుల సహకారంతో కేరళ పోలీసులు రహస్య విచారణ చేపట్టారు. అనంతరం ఈ ముఠాలో కీలకంగా వ్యవహరిస్తున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఉద్యోగి జయచంద్రన్, డా.ఆనంద్, చెన్నైకు చెందిన శ్యామ్, కమల్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఎన్ఆర్ కాంగ్రెస్ నేత సత్య, అన్నాడీఎంకే నేత చంద్రోజీలు ఈ ముఠాకు నేతృత్వం వహిస్తున్నట్లు విచారణలో తేలింది. వీరు విదేశాల నుంచి తెప్పించిన అత్యాధునిక పరికరాల సాయంతో బ్యాంక్ ఖాతాల్లోని నంబర్లను ట్రాప్‌చేసి నకిలీ ఏటీఎం కార్డుల్ని సృష్టించేవారని పోలీసులు తెలిపారు. అలాగే స్వైపింగ్ యంత్రాలు వాడే షాపు యజమానులతో చేతులు కలిపి ఖాతాదారుల వివరాలు తస్కరించేవారని, ఇందుకోసం 10 శాతం కమీషన్లు ఇచ్చేవారన్నారు. -
సాయినాథ్ ఆత్మహత్యపై దర్యాప్తు
ఫోన్‌కాల్ డేటా పరిశీలిస్తున్న పోలీసులు హైదరాబాద్: కళాశాలలో సీనియర్ల వేధింపులు తట్టుకోలేక బీటెక్ విద్యార్థి సాయినాథ్ (18) ఆత్మహత్య చేసుకున్న ఘటనపై హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపట్టారు. సాయినాథ్ ఫోన్ కాల్ డేటా పై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం వరంగల్ జిల్లా కాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకున్న సమయం వరకు సాయినాథ్ ఎవరితో మాట్లాడింది.. అసలు అతడి సెల్‌ఫోన్ ఎక్కడుంది అనే వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీఐ డి.వి రంగారెడ్డి, ఎస్సై వెంకటేశ్‌లు సాయినాథ్ ఉన్న కొంపల్లిలోని రామ్ రితేశ్ బాయ్స్ హాస్టల్‌కి వచ్చి అక్కడి విద్యార్థులను సాయినాథ్ గురించి ఆరా తీశారు. సాయినాథ్ తమతో ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసుల విచారణలో వారు వెల్లడించారు. ఆగస్టు 17న సాయినాథ్ అన్నయ్య రఘునాథ్ వచ్చి హాస్టల్లో చేర్పించారని హాస్టల్ నిర్వాహకురాలు అర్చన తెలిపింది. సీఎంఆర్, మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్ కళాశాలలకు చెందిన 102 మంది విద్యార్థులు తమ హాస్టల్లో ఉంటున్నట్లు తెలిపింది. సీసీ కెమెరాలు ఇటీవల ఏర్పాటు చేశామని, అవి పని చేయడం లేదని, సాయినాథ్ ఇప్పటి వరకు తాను వచ్చి, వెళ్లే సమయాలను ఎప్పుడు ఎంట్రీ బుక్‌లో రాయలేదని పేర్కొంది. స్నేహితులకు చెప్పే సాయినాథ్ శుక్రవారం గది నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి ఆదివారం వచ్చాడనే విషయం తనకు తెలియదని విచారణలో వెల్లడించింది. మరోవైపు సాయినాథ్ ఆత్మహత్యపై పలువురు విద్యార్థులను పోలీసులు రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గురువారం మేడ్చల్‌లోని సీఎంఆర్ కళాశాలలో సీనియర్ విద్యార్థులను విచారించనున్నట్లు సమాచారం. -
సాయినాథ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం
కుత్బుల్లాపూర్: సీనియర్ల వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థి సాయినాథ్(18) మృతిపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. పేట్ బషీరాబాద్, మేడ్చల్ పోలీసులు సంయుక్తంగా విచారణ చేపడుతున్నారు. రెండు రోజులుగా కళాశాలకు సెలవులు కావడంతో పోలీసులు సాయినాథ్ వినియోగించిన సెల్‌ఫోన్ కాల్‌డేటాపై దృష్టి సారించారు. ఆగస్టు 28 నుంచి మంగళవారం ఖాజీపేట రైల్వే స్టేషన్ సమీపంలో ఆత్మహత్య చేసుకునే వరకు ఎవరితో మాట్లాడింది.. అసలు సెల్‌ఫోన్ ఎక్కడుందన్న మిస్టరీపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. బుధవారం పేట్ బషీరాబాద్ ఏసీపీ అశోక్‌కుమార్ నేతృత్వంలో సీఐ డి.వి. రంగారెడ్డి, ఎస్సై వెంకటేశ్‌లు కొంపల్లిలో ఉన్న రామ్ రితేష్ బాయ్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థులను ఆరా తీశారు. డబుల్ బెడ్ రూంలో రఘవీర్, హర్షిత్, రణవీర్, శ్రీధర్, మూర్తి, హర్షిల్లాలతో పాటు సాయినాథ్ ఉంటున్నాడు. అందరితో కలివిడిగా ఉండే అతడు తమకు ఎలాంటి విషయాలు చెప్పలేదని పోలీసులతో వారు వెల్లడించారు. మొత్తం 102 మంది హాస్టల్లో ఉంటున్నారని, అందులో సీఎంఆర్, మల్లారెడ్డి, సెయింట్ మార్టిన్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఉన్నారని సమాచారం. స్నేహితులకు చెప్పి శుక్రవారం గది నుంచి బయటకు వెళ్లాడని, తిరిగి ఆదివారం వచ్చాడన్న విషయం తమకు తెలియదని హాస్టల్ నిర్వాహకులు పోలీసులకు చెప్పినట్లు తేలింది. దీనిపై ఇప్పటికే పలువురు విద్యార్థులను రహస్యంగా విచారిస్తున్నట్లు తెలిసింది. గురువారం మేడ్చల్‌లో ఉన్న సీఎంఆర్ కళాశాలలో సీనియర్లను విచారించనున్నారు. మంగళవారం రాత్రి హాస్టల్లో సాయినాథ్ చనిపోయే ముందు రాసిన నోట్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు.