secuderabad
-
వైభవంగా లష్కర్ బోనాలు...రంగం భవిష్యవాణి !
-
Cantonment MLA: కంటోన్మెంట్‌పై చెరగని ముద్ర వేసిన సాయన్న..
సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి అయిదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సాయన్న ఇక్కడ తనదైన ముద్ర వేశారు. అందరికీ తలలో నాలుకలా.. అజాత శత్రువుగా.. వివాద రహితుడిగా ఆయనకు ఎంతో పేరుంది. ఆదివారం మధ్యాహ్నం కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతి చెందారనే వార్తతో నియోజకవర్గ పరిధిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సీఎం కేసీఆర్ సహా పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు నివాళులు అరి్పంచారు. బ్యాంక్ క్లర్కు ఉద్యోగం నుంచి ఎమ్మెల్యే స్థాయి దాకా సాగిన సాయన్న రాజకీయ ప్రస్థానం ఇలా సాగింది.. నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం వాల్వాపూర్లో జన్మించిన సాయన్న.. నగరంలోని న్యూసైన్స్ కాలేజీలో బీఎస్సీ, అనంతరం ఎల్ఎల్బీ చేశారు. 1978లో సిండికేట్ బ్యాంకులో క్లర్క్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌తో పాటు 1986లోనే రాజకీయాల్లోకి వచి్చన ఆయన.. 1986 బల్దియా ఎన్నికల్లో దోమలగూడ నుంచి కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం మళ్లీ సికింద్రాబాద్ ఆర్పీ రోడ్డులోని సిండికేట్ బ్యాంకులో చేరారు. 1994లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి టీడీపీ అభ్యరి్థగా టికెట్ దక్కడంతో చివరి నిమిషంలో బ్యాంకు ఉద్యోగానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత వరుసగా 1999, 2004 ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయ్యారు. 2009లో నియోజకవర్గాల పునరి్వభజనతో కంటోన్మెంట్ పరిధిలోని మల్కాజిగిరి, అల్వాల్, ఓల్డ్ బోయిన్పల్లి వంటి ప్రాంతాలు వేరే నియోజకవర్గాల్లోకి మారిపోయాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి పి.శంకర్రావు చేతిలో 4,183 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పటికీ, సాయన్న తన విలక్షణ నైజంతో కంటోన్మెంట్ ఓటర్ల అభిమానాన్ని చూరగొన్నారు. కంటోన్మెంట్ బోర్డు సభ్యులెవరూ తనకు అండగా నిలవకపోయినప్పటికీ ఓటర్లను తనవైపు తిప్పుకోవడంలో ఆయన వ్యక్తిత్వం కీలకమైంది. 2018లో టీఆర్ఎస్ అభ్యరి్థగా భారీ మెజారిటీతో గెలిచి అయిదోసారి ఎమ్మెల్యే అయ్యారు. సాయన్నకు మంత్రి పదవి లభిస్తుందని అభిమానులు ఆశించినప్పటికీ ఆ కోరిక నెరవేరలేదు. నిరాడంబరుడు.. వివాద రహితుడు.. మొదటిసారిగా 1986లో ముషీరాబాద్ నియోజకవర్గం దోమలగూడ డివిజన్ నుంచి టీడీపీ కార్పొరేటర్ అభ్యరి్థగా పోటీ చేసిన సాయన్న ఓడిపోయారు. అనంతరం సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు. దోమలగూడ డివిజన్ అనంతరం కవాడిగూడ డివిజన్‌గా రూపాంతరం చెందింది. 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి కవాడిగూడ కార్పొరేటర్‌గా సాయన్న కుమార్తె లాస్య నందిత గెలుపొందారు. అయిదు పర్యాయాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సాయన్న సౌమ్యుడు, నిరాడంబరుడు, వివాదరహితుడు మాత్రమే కాక స్నేహశీలి, హాస్యచతురుడు. అందరితో కలుపుగోలుగా ఉండే సాయన్న మంచి భోజన ప్రియుడు. వెరైటీ వంటకాలంటే ఇష్టం. సినిమాలు, వినోదకార్యక్రమాలపై ఆసక్తి. సినిమాల గురించి చర్చించేవారు. రాజకీయాల్లో ఉన్నా అజాత శత్రువుగా పేరుపొందారు. అన్నా అని వస్తే.. నేనున్నా అనేవారు.. అయిదు సార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన సాయన్న విలక్షణమైన వ్యక్తిత్వంతోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. బ్యాంకు ఉద్యోగి అయిన సాయన్న రాజకీయాల్లోనూ పక్కా లెక్కలతో ఉండేవారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచే నియోజకవర్గంలోని ప్రజలతో ప్రత్యక్ష సంబంధాలు ఏర్పరచుకున్నారు. తన వద్దకు వచ్చే ప్రతి ఒక్కరితో వ్యక్తిగత అనుబంధం కలిగి ఉండేవారు. నియోజకవర్గం పరిధిలోని సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో దాదాపు ప్రతిసారీ సాయన్న వ్యతిరేక పారీ్టల అభ్యర్థులే గెలిచే వారు. 1997 బోర్డు ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు ఒక్కరు మాత్రమే గెలిచినప్పటికీ, 1999 ఎన్నికల్లో సాయన్న విజయం సాధించారు. తిరిగి 2004లో సాయన్న ఎమ్మెల్యేగా ఉండగానే 2006, 2008లోనూ బోర్డు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లోనూ ఒక్క టీడీపీ అభ్యర్థి కూడా గెలవలేదు. 2015లోనూ టీడీపీ అభ్యర్థులకు బోర్డులో ప్రాతినిధ్యమే దక్కలేదు. బోర్డు సభ్యులు తాము వేరే పారీ్టల్లో కొనసాగుతున్నప్పటికీ, ఎమ్మెల్యే ఎన్నికల్లో మాత్రమే సాయన్న గెలుపు కోసం పనిచేసే వారని తెలుస్తోంది. ప్రత్యర్థి పారీ్టల్లోని నేతలతోనూ సాయన్న సన్నిహితంగా ఉండే వారు. రాజకీయాలతో సంబంధం లేకుండా అన్నా అంటూ తనను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికీ తన వంతు సహకారం అందించే వారు. ఇక మిలిటరీ అధికారుల పెత్తనం మితిమీరి ఉండే కంటోన్మెంట్లో కాలనీలు, బస్తీలకు చెందిన ప్రజలకు అండగా నిలిచేవారు. ప్రతి కాలనీ, బస్తీ పెద్దలతో నిత్యం టచ్‌లో ఉండేవారు. ఎన్నికల్లో ఆయా కాలనీ సంక్షేమ సంఘాలు, కాలనీ ప్రతినిధులు పారీ్టలకు అతీతంగా సాయన్న గెలుపు కోసం పనిచేసే వారు. ఈ నేపథ్యంలోనే సాయన్న అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ముఠా గోపాల్‌తో ఎంతో అనుబంధం ప్రస్తుత ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, సాయన్న చిరకాల మిత్రులు. ఇద్దరూ ఒకేసారి రాజకీయ అరంగేట్రం చేశారు. 1986 కార్పొరేటర్ ఎన్నికల్లో అప్పటి జవహర్‌నగర్ డివిజన్ నుంచి టీడీపీ అభ్యరి్థగా పోటీ చేసిన ముఠా గోపాల్ గెలుపొందారు. ఆ తర్వాత టీడీపీలో ఉన్నంత కాలం ముఠాగోపాల్ ఆశించిన ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ టికెట్ మిత్రపక్షాలకు కేటాయించేవారు. దీంతో టీడీపీలో ఉన్నంతకాలం గోపాల్‌కు ఎమ్మెల్యే అయ్యే అవకాశం దక్కలేదు. బీఆర్ఎస్లో చేరాక 2018 ఎన్నికల్లో ముషీరాబాద్ ఎమ్మెల్యేగా గెలిచారు. ముషీరాబాద్ నియోజకవర్గంతో సాయన్న, గోపాల్‌కు ఎంతో అనుబంధం ఉంది. హైదరాబాద్ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా ముఠాగోపాల్ మూడుసార్లు, సాయన్న ఒక పర్యాయం పనిచేశారు. సాయన్న హయాంలోనే ప్రస్తుత జిల్లా టీడీపీ కార్యాలయ నిర్మాణం జరిగింది. హుడా డైరెక్టర్‌గానూ ఆయన పని చేశారు. చదవండి: ఆ నిబంధన వర్తించదు.. కంటోన్మెంట్‌కు ఉప ఎన్నిక లేనట్టే! -
నిన్న జరిగినా ఘటనకు మేం బాధ్యులం కాదు
-
బోనాల జాతర
-
దర్భంగా పేలుడు కేసులో ఉగ్ర కుట్ర..!
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దర్భంగా పేలుడు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. ఈనెల 17న బీహార్‌లోని దర్భంగా రైల్వేస్టేషన్లో పార్సిల్ పేలిన సంగతి తెలిసిందే. ఈ ఘటన వెనక ఇండియన్ ముజాహిద్దీన్(ఐఎం) హస్తం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ క్రమంలో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ఇప్పటికే హైదరాబాద్‌లో ఉంటున్న ఇద్దరిని అరెస్ట్ చేసింది. నిందితులైన అన్నదమ్ములు ఇమ్రాన్, నాసిర్ బిహార్ నుంచి కొన్నాళ్ల క్రితం హైదరాబాద్‌కు వచ్చారు. సికింద్రాబాద్ స్టేషన్ నుంచి పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలు తరలించారు. ఈ క్రమంలో అధికారులు సికింద్రబాద్ స్టేషన్లో అన్నదమ్ముల సీసీఫుటేజ్‌ని సేకరించారు. వీరు ఈ నెల 15న సోఫియాన్ పేరు మీద పార్శిల్ బుక్ చేశారు. ఇక నిందితులు దర్భంగా రైలును పేల్చేయాలని కుట్ర పన్నారని.. తద్వారా భారీ మొత్తంలో ప్రాణ, ఆస్తి నష్టం కలిగించాలని భావించినట్లు అధికారులు తెలిపారు. అర్షద్ కోసం ఎన్ఐఏ అధికారులు గాలింపు చర్యలు ప్రారంభిచారు. అతడు దర్భంగా రైల్వే స్టేషన్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నెల 17న బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్లో పార్సిళ్లు దింపుతుండగా పేలుడు జరిగిన సంగతి తెలిసిందే. దుస్తుల మధ్యలో ఉంచిన చిన్న సీసా నుంచి తొలుత పొగలు వచ్చి తర్వాత పేలుడు జరిగింది. దర్యాప్తులో ఈ దుస్తుల పార్సిల్ సికింద్రాబాద్‌లో బుక్ చేసినట్లు గుర్తించి ఇక్కడి నుంచీ దర్యాప్తు మొదలుపెట్టారు. ఇందులో ఉగ్రకుట్ర ఉన్నట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఢిల్లీ ఎన్ఐఏకు కేసు బదిలీ చేశారు. తెలంగాణ పోలీసులు, బిహార్, యూపీ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ఏటీఎస్) సిబ్బంది వీరికి సహకరిస్తున్నారు. ఈ కేసులో రెండు రోజుల క్రితమే ఉత్తరప్రదేశ్ ఏటీఎస్ పోలీసులు శామిలీ జిల్లాలోని ఖైరానా అనే ఊర్లో మహ్మద్ హజీ సలీమ్ ఖాసీం, మహ్మద్ కాఫిల్ అనే తండ్రీకొడుకులను అదుపులోకి తీసుకున్నారు. ఆదివారం హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో ఇమ్రాన్, నాసిర్ అనే ఇద్దరు అన్నదమ్ముల్ని అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ అధికారులు విచారణ కోసం ఢిల్లీ తీసుకెళ్లారు. వీరిద్దరూ ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారేనని, చాలాకాలంగా హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో అద్దెకు ఉంటూ రెడీమేడ్ దుస్తులు విక్రయిస్తున్నారని తేలింది. చదవండి: ముంబై నుంచి తీసుకెళ్తేనే.. స్టేట్మెంట్ ఇస్తా -
‘కొత్త’ మోజు... ‘పాత’కు బూజు!
సాక్షి, సిటీబ్యూరో: నగర ట్రాఫిక్ కమిషనరేట్‌లో గురువారం భేటీ అయిన రహదారి భద్రత కమిటీ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సమావేశంలో కూలంకషంగా చర్చించిన వాటిలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కొన్ని కొత్త ప్రతిపాదనలు రూపొందించే అంశాలు ఉన్నాయి. అయితే ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న వాటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉంది. కీలక ప్రాంతాల్లో అవసరమైన ప్రత్యామ్నాయాల అన్వేషణ, ఉన్న రోడ్లలోనే స్వల్ప మార్పులు చేయడం, వాడుకలో లేని వాటిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా ట్రాఫిక్ ఇబ్బందులకు చెక్ చెప్పడానికి ప్రయత్నాలు చేయాల్సి ఉంది. ముం దుకు సాగని ప్రతిపాదనల్లో కీలకమైనవి ఇవీ... మలక్‌పేటలో ‘మూడో మార్గం’... నగరంలోని అత్యంత కీలకమైన, క్లిష్టమైన మార్గాల్లో దిల్సుఖ్నగర్–చాదర్‌ఘాట్ ఒకటి. ఈ రూట్లో మలక్‌పేట రైల్వే స్టేషన్ వద్ద ఉన్న (ఆర్యూబీ) అనునిత్యం ట్రాఫిక్ జామ్స్‌కు కారణంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం అక్కడ ఉన్న రెండు మార్గాలకు తోడుగా కనీసం మరోటి నిర్మించాలని దాదాపు నాలుగేళ్ల క్రితం నుంచి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. అనేకసార్లు భేటీ అయిన రైల్వే, ట్రాఫిక్, మెట్రో రైల్ అధికారులు ఎప్పటికప్పుడు త్వరలో పని మొదలంటూ ప్రకటిస్తూ వచ్చారు. అయితే ఇన్నే ళ్లు గడిచినా ఇప్పటి వరకు అక్కడ కనీసం శంకుస్థాపన కూడా జరగలేదు. ఫలితంగా రద్దీ వేళల్లో ఈ మార్గంలో ప్రయాణించాలంటూ వాహనచోదకులు నరకం చవిచూస్తున్నారు. మహాత్మాగాంధీ బస్ స్టేషన్ సైతం దీనికి సమీపంలోనే ఉండటంతో పండుగల సీజన్లో బాధలు వర్ణనాతీతం. విమానాశ్రయం ‘మీదుగా’ రహదారి... బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి వెళ్లాలంటే ప్రస్తుతం సికింద్రాబాద్ మీదుగా వెళ్లాల్సిందే. దాదాపు 18 ఏళ్ల క్రితం బేగంపేట నుంచి బోయిన్‌పల్లికి ఓ షార్ట్‌కట్ రూట్ ఉండేది. బేగంపేట పోలీసుస్టేషన్ దాటిన ఎడమవైపు తిరిగి ఎయిర్ ఇండియా ఆఫీస్ మీదుగా వెళ్లే ఈ దారి దాదాపు 80 అడుగుల వెడల్పు ఉండేది. ఆపై ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఈ మార్గాన్ని స్వాధీనం చేసుకుంది. బేగంపేట–సికింద్రాబాద్ మార్గం నిత్యం రద్దీతో నరకాన్ని చూపిస్తుంటుంది. విమానాశ్రయం శంషాబాద్‌కు తరలిపోవడంతో పాత మార్గాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నించాలని దాదాపు ఐదేళ్ల క్రితం ట్రాఫిక్ అధికారులు భావించారు. అప్పట్లోనే రెండు దఫాలుగా స్థానిక అధికారులతో కలిసి సర్వే నిర్వహించారు. ప్రాథమిక దశలోనే ఈ ప్రక్రియకు బ్రేక్ పడింది. ఇది సాకారమైతే బేగంపేట నుంచి బోయిన్పల్లి వైపు వెళ్లే వారి ప్రయాణ దూరం దాదాపు 6 కిమీ మేర తగ్గడంతో పాటు ట్రాఫిక్ జామ్స్ అధిగమించవచ్చు. సికింద్రాబాద్ స్టేషన్ వద్ద స్కైవాక్... కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2011లో ‘ప్రాజెక్ట్ 100 డేస్’ ప్రకటించారు. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో సమస్యల పరిష్కారానికి రైల్వేస్టేషన్ వద్ద స్కైవాక్ నిర్మించాలని అధికారులు నిర్ణయించారు. కీలకమైన కో–ఆర్డినేషన్ కమిటీ ఆయా ప్రాంతాల్లో పర్యటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ కేంద్రంగా రెండు వైపులా ఉన్న బస్టాండ్ల వరకు స్కైవాక్ నిర్మించాలని క్షేత్రస్థాయి పర్యటన తర్వాత నిర్ణయించింది. వీటి నిర్మాణం వల్ల రోడ్డుకు అడ్డంగా పాదచారులు నడవటం, ఎక్కడపడితే అక్కడ రోడ్డు దాటడం, చిరు వ్యాపారుల ఆక్రమణలు తదితర సమస్యలు శాశ్వతంగా తొలగుతాయని యోచించారు. కనీసం సమీపంలోని ఈ మూడు ప్రాంతాల మధ్య తొలివిడతగా స్కైవాక్‌లు ఏర్పాటు చేయాలని భావించారు. ఇప్పటికీ ఈ ప్రతిపాదనలు ఫైళ్లల్లోనే మగ్గుతున్నాయి. -
‘తెలంగాణ బిడ్డను.. ఆంధ్రా కోడలిని’
హైదరాబాద్: నరేంద్ర మోదీ వంటి ప్రధాని దొరకడం మన అదృష్టమని బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా భారతీయ జనతా యువ మోర్చా(బీజేవైఎం) భవిష్యత్తు కార్యాచరణను ఖరారు చేసేందుకు సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ‘విజయ లక్ష్యం 2019 యువ మహాధివేశన్’ పేరుతో యువ సమ్మేళనాన్ని నిర్వహించింది. బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనం మహాజన్ అధ్యక్షతన జరిగిన ఈ సమ్మేళనానికి నిన్న(శనివారం) కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆదివారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూనమ్ మహాజన్ మాట్లాడుతూ.. పతంగి పట్టుకుని కారు నడుపుతున్న వారి మధ్యలోకి అమిత్ షా లాంటి సింహం రావడంతో భయపడుతున్నారని వ్యాఖ్యానించారు. తాను తెలంగాణ బిడ్డను, ఆంధ్రా కోడలినని తెలిపారు. 2018 తెలంగాణ ఎన్నికల్లో గెలుపు ద్వారా 2019లో మోదీ విజయం సంపూర్ణం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆమె తెలుగులో కూడా ప్రసంగించారు. పప్పూ వెంట కొంత మంది మూర్ఖులు ఉన్నారని పరోక్షంగా రాహుల్ గాంధీ గురించి ప్రస్తావించారు. ప్రతీ పోలింగ్ బూత్‌లో కమలం విజయం సాధించాలని ఆకాంక్షించారు. 2019లో విజయ లక్ష్యమే మన సంకల్పమని, ఈ సమ్మేళనం ఉద్దేశ్యం కూడా అదేనన్నారు. డిసెంబర్ 11న తెలంగాణలో కమలోదయం జరగనుందని జోస్యం చెప్పారు. -
సినిమాహాల్లో యువతిపై అత్యాచారం
-
హైదరాబాద్: సినిమాహాల్లో యువతిపై అత్యాచారం
సాక్షి, హైదరాబాద్ : ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని నమ్మించి సినిమాకు తీసుకుని వెళ్లి థియేటర్లోనే అత్యాచారానికి ఒడిగట్టాడు నిందితుడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి... జనగాం జిల్లా నర్మెట్ట గ్రామానికి చెందిన కే భిక్షపతి (23) జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సికింద్రాబాద్ ప్రాంతానికి చెందిన (19) యువతి ఇంటర్ పూర్తి చేసుకుని ఇంట్లోనే ఉంటుంది. భిక్షపతికి రెండు నెలల క్రితం ఆ యువతితో ఫేస్బుక్లో పరిచయం ఏర్పడింది. జగద్గిరిగుట్టలో ఉండే చెల్లి దగ్గరకు బిక్షపతి తరచుగా వస్తుంటాడు. ఇలా రెండు మార్లు నగరానికి వచ్చి ఇద్దరు కలుసుకున్నారు. గత నెల 28వ తేదీన నగరానికి వచ్చిన భిక్షపతి ఇద్దరు కలిసి బయటకు వెళ్లి వచ్చారు. 29వ తేదీ మరోమారు ఇద్దరు కలిసి ఇందిరాపార్కుకు వెళ్లి మధ్యాహ్నం సికింద్రాబాద్ పాస్‌ఫోర్ట్ ఆఫీస్ వద్ద ఉండే ప్రశాంత్ థియేటర్లో సినిమా చూసేందుకు వచ్చారు. థియేటర్లో మొత్తం 70 మంది ప్రేక్షకులు మాత్రమే ఉన్నారు. ఇదే అదనుగా నిందితుడు ఆ యువతిపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ యువతికి రక్తస్రావం అయింది. వెంటనే ఆ యువతి ఇంట్లో ఉండే తల్లిదండ్రులకు సమాచారం అందించింది. కుటుంబ సభ్యులతో కలిసి మార్కెట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో స్వీట్ ఫెస్టివల్
-
పాఠశాలలో అగ్ని ప్రమాదం
బొల్లారంలోని సాదన మందిర్ సమీపంలో హింది విద్యాలయా పాఠశాలలో ఆదివారం మద్యాహ్నం మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన మంటలను ఆర్పివేశారు. పాఠశాలలో ఉన్న అల్మారా తో పాటు. గది పైకప్పు పూర్తిగా కాలిపోయింది. కొంత కాలంగా ఈ పాఠశాల మూతబడి ఉండడంతో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు. ప్రమాదానికి గల కారణం తెలియరాలేదు. -
రెండు గంటల్లో గుండె మార్పిడి
సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో అరుదైన గుండె మార్పిడి శస్త్రచికిత్స జరిగింది. శస్త్రచికిత్సను రెండు గంటల్లోనే పూర్తి చేయడం, అతి చిన్న కోతతోనే ఆపరేషన్ పూర్తి చేయడం, బాధితురాలు వారం రోజుల్లోనే కోలుకోవడం.. ఇలా అన్నీ ఇందులో విశేషాలే.తూర్పుగోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన వెంకట రమ్య (25) కొంత కాలంగా గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతోంది. ఇటీవల ఆమెకు వైద్య పరీక్షలు చేసిన సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి హృద్రోగ నిపుణుడు గోపాలకృష్ణ గోఖలే.. గుండె మార్పిడి శస్త్రచికిత్స చేయాలని సూచించారు. దీంతో గుండె దాతల కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ నెల 15వ తేదన రోడ్డు ప్రమాదానికి గురై బ్రెయిన్ డెడ్ స్థితిలో ఉన్న ఒక 19 ఏళ్ల యువకుడి గుండెను దానం చేసేందుకు అతడి కుటుంబ సభ్యులు అంగీకరించడంతో.. జీవన్‌దాన్ సిబ్బంది ఈ విషయాన్ని యశోద ఆస్పత్రికి తెలియజేశారు. వెంటనే లక్డీకాపూల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 16వ తేదీన ఆపరేషన్ నిర్వహించి యువకుడి నుంచి గుండెను వేరుచేశారు. అదే సమయంలో రమ్యకు శస్త్రచికిత్స చేసేందుకు అంతా సిద్ధం చేశారు. ఈ విషయంలో ట్రాఫిక్ పోలీసులు గతంలోలాగే అమోఘమైన పాత్ర పోషించారు. లక్డీకాపూల్ నుంచి సికింద్రాబాద్‌కు అత్యంత తక్కువ సమయంలో గుండెను తరలించారు. రెండు గంటల్లోనే శస్త్రచికిత్స కూడా చేశారు. శస్త్రచికిత్స పూర్తయినే రెండు గంటల్లో సాధారణ రక్తప్రసరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ శస్త్రచికిత్సలో వైద్యులు గోపాలకృష్ణ గోఖలే, విశ్వనాథ్, దిలీప్రాఠీ, సుబ్రమణ్యం, సుధాకర్, మాధవ్, సాయిచంద్ర పాల్గొన్నారు. శస్త్రచికిత్స విజయవంతమైన సందర్భంగా యశోద చైర్మన్ జీవీ రావు మాట్లాడుతూ.. ప్రపంచస్థాయి వైద్య సేవలకు ఇది వేదిక అని స్పష్టమైందన్నారు. -
పసిగుండెల్లో ‘సైకో’ కత్తి
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: ఆ చిన్నారి కళ్లల్లో మామయ్య పెళ్లికి వెళ్తున్నానన్న ఆనందం.. కాసేపట్లో రైలెక్కుతానన్న ఉత్సాహం.. మాటల్లో చెప్పలేనంత సంతోషం.. హాయిగా ఆడుతోంది.. లేడి పిల్లలా పరుగులు పెడుతోంది.. అంతలోనే ఎక్కడ్నుంచి వచ్చాడో ఆ కర్కశుడు.. అన్నెంపున్నెం తెలియని ఆ పసిపాపను అమాంతంగా ఎత్తుకుపోయాడు.. వెంట తెచ్చుకున్న రెండు కత్తులతో దారుణంగా పొడిచి ఫ్లాట్‌ఫామ్‌పై పడేశాడు..! అమ్మ చేతిలో అందంగా ముస్తాబైన ఆ గారాలపట్టి కొద్ది గంటలకే నాన్న ఒడిలో ప్రాణాలు విడిచింది!! అప్పటివరకు తమ కళ్లముందే ఆడిపాడిన చిన్నారిని రక్తపు మడుగులో విగత జీవిగా చూసిన వారి గుండెలు తరుక్కుపోయాయి. మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో అందరూ చూస్తుండగానే ఈ హృదయవిదారక ఘటన చోటుచేసుకుంది. మెదక్ జిల్లా సిద్దిపేటకు చెందిన తేలు శ్రీనివాస్, సోనూ దంపతులకు ఇద్దరు కూతుళ్లు. ప్రియదర్శిని (07), సింథియా (02). ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులు ఉపాధి కోసం కొద్ది సంవత్సరాల క్రితమే హైదరాబాద్ వచ్చి ముషీరాబాద్ గంగపుత్ర కాలనీలో స్థిరపడ్డారు. శ్రీనివాస్ ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా.. సోను ఆంధ్ర మహిళా సభలో స్పీచ్ థెరపిస్ట్‌గా ఉద్యోగం చేస్తోంది. ప్రియదర్శిని స్థానిక సెయింట్ మార్టిన్స్ పాఠశాలలో ఫస్ట్‌క్లాస్ చదువుకుంటోంది. షోలాపూర్‌లో మేనమామ కుమారుడి వివాహం కోసం శ్రీనివాస్ తన కూతురు ప్రియదర్శిని, తల్లి సత్తెమ్మతో మంగళవారం మధ్యాహ్నం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు వచ్చాడు. తల్లి, కూతురును పదో నంబర్ ప్లాట్‌ఫామ్ వద్ద ఉంచి తాను బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లాడు. 2.54 గంటలకు బయలుదేరాల్సిన రాజ్‌కోట్ ఎక్స్‌ప్రెస్ టికెట్ కొనుగోలు చేస్తున్నాడు. అప్పటి వరకు నాయనమ్మ సత్తెమ్మ వద్దే కూర్చున్న ప్రియదర్శిని ఆడుకుంటూ అటుఇటూ తిరుగుతోంది. వచ్చిపోయే రైళ్లను చూస్తూ కేరింతలు కొడుతోంది. ఇంతలోనే ఉన్మాది అక్కడకు వచ్చి ప్రియదర్శినిని ఎత్తుకొని కొంతదూరం పరుగెత్తాడు. రెండు కత్తులతో చిన్నారిపై ఎనిమిది సార్లు పొడిచి కింద పడేశాడు. చిన్నారికి తలపై రెండుచోట్ల, మెడ వెనుక భాగంలో బలమైన గాయాలయ్యాయి. రక్తపు మడుగులో ప్లాట్‌ఫామ్‌పై విలవిల్లాడుతున్న ప్రియదర్శిని చుట్టూ రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకుని ఉన్మాది గెంతులు వేశాడు. ఆ సైకోను ఆపడం ఎవరివల్లా కాలేదు. అక్కడే విధులు నిర్వహిస్తున్న ఆర్పీఎఫ్ కానిస్టేబుల్ హరిప్రసాద్ అడ్డుకునే ప్రయత్నం చేసినా.. ఆయనపైనా కత్తులతో దాడి చేసేందుకు యత్నించాడు. చివరికి ప్రియదర్శిని నానమ్మ సత్తెమ్మ కేకలు విని.. ఇద్దరు రైల్వే కూలీలు, మరికొందరు ప్రయాణికులు సైకోను బంధించి చితకబాది పట్టుకున్నారు. టికెట్ కౌంటర్ నుంచి వచ్చిన శ్రీనివాస్.. బిడ్డ రక్తపు మడుగులో పడి ఉండడం చూసి గుండెలు పగిలాయి. వెంటనే కూతురుని ఆటోలో గాంధీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేశాడు. కానీ ఆ చిన్నారి మార్గం మధ్యలోనే నాన్న ఒడిలో కన్నుమూసింది. ప్రేమ వివాహం చేసుకుని ఎనిమిదేళ్లుగా సరదాగా సాగిపోతున్న శ్రీనివాస్, సోను జీవితంలో ఈ ఘటన తీరని విషాదాన్ని నింపింది. తమ పాప ఇక లేదన్న విషయాన్ని దంపతులు జీర్ణించుకోలేకపోతున్నారు. పొంతన లేని సైకో మాటలు.. రైల్వే పోలీసులు సైకోను గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ విచారణలో ఒక్కోసారి ఒక్కో మాట చెప్పాడు. తన ది చిత్తూరు జిల్లా పుత్తూరు అని, పేరు కోల కరణ్‌కుమార్ (26) అని చెప్పాడు. తనకు ఎయిడ్స్ సోకిందని, కుటుంబీకులు వెలివేసిన కారణంగానే ఏం చేయాలో అర్థం కాక చిన్నారిని గాయపరిచానని ఒకసారి, తమ ఇంటిపక్కన ఇలాంటి అమ్మాయే ఉండేదని అలాంటి అమ్మాయి నాకెందుకులేదన్న నెపంతో చంపేశానని మరోసారి చెప్పాడు. ఇతడు ఉదయం 11 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకున్నట్టు సమాచారం. పుత్తూరు నుంచి సోమవారం అరకొణ ప్యాసింజర్ రైల్లో విజయవాడకు చేరిన కరణ్‌కుమార్ మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో హైదరాబాద్ చేరినట్టు తెలుస్తుంది. కరణ్కుమార్కు హెచ్ఐవీ సోకిన విషయం తన స్నేహితులకు తెలిసి హేళన చేస్తున్న క్రమంలోనే.. నగరానికి చేరుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్టు పోలీసులు వివరాలు సేకరించారు. చంపుతాననడం అతడి అలవాటు.. విజయపురం, న్యూస్‌లైన్: సైకో కరణ్‌కుమార్ చిత్తూరు జిల్లా వాసి. విజయపురం మండలం పన్నూరుకు చెందిన వ్యవసాయ కూలీ గోవిందస్వామి కుమారుడు. అతనికి చాలా కాలంగా మతిస్థిమితం లేదు. ఒకప్పుడు తెలివైన విద్యార్థి. ప్రేమించిన అమ్మాయికి ప్రాణాంతకమైన వ్యాధి ఉందని తెలియడంతో ఉన్మాదిలా మారాడు. కత్తి చేతిలో పట్టుకుని చంపుతానంటూ ఊళ్లో వాళ్లను బెదిరించేవాడు. బంధువులు అతనికి ఆరు నెలలు చెన్నైలో చికిత్స చేయించారు. తర్వాత ఇంట్లోనే బంధించి ఉంచేవారు. ఆరోగ్యం కుదుటపడడంతో పుత్తూరులోని ఎస్ఆర్ఎస్ డిగ్రీ కళాశాలలో మొదటి సంవత్సరంలో చేరాడు. గతంలో అతని వెంట ఎప్పుడూ ఇద్దరు వ్యక్తులు కాపలా ఉండేవారు. అయితే ఈ మధ్య అతని ప్రవర్తన బాగానే ఉండడంతో వాళ్లు అతన్ని ఒంటరిగా వదిలేశారు. రెండు రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన కుమార్ తర్వాత కనిపించలేదు. -
సికింద్రాబాద్‌లో బస్సు బీభత్సం, 8మందికి గాయాలు
-
సికింద్రాబాద్‌లో బస్సు బీభత్సం, 8మందికి గాయాలు
సికింద్రాబాద్ : విజయవాడలో ఓ కారు బీభత్సం సృష్టించిన ఘటన మరవక ముందే అటువంటి ఘటననే మరొకటి చోటు చేసుకుంది. సికింద్రాబాద్‌లో బుధవారం ఓ ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. గణేష్ టెంపుల్ వద్ద ఆర్టీసీ బస్సు బ్రేకులు ఫెయిలై పాదచారుల పైకి దూసుకు వెళ్లింది. ఈ సంఘటనలో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. బస్సు డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.