Secunderabad Parade Ground
-
Sep 17: అటు సోనియా.. ఇటు అమిత్ షా?
సాక్షి, హైదరాబాద్: ఈసారి సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాజకీయాలు జాతీయస్థాయిలో చర్చకు కేంద్ర బిందువు కానుంది. కాంగ్రెస్-బీజేపీలు పోటాపోటీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమయ్యాయి. కాంగ్రెస్ తుక్కుగూడలో.. బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో పెద్ద ఎత్తున జనంతో సభలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాయి. తుక్కుగూడ సభకు కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ హాజరవుతారని పార్టీ ప్రకటించగా.. పరేడ్‌గ్రౌండ్‌లో విమోచన దినోత్సవ వేడుకలకు కిందటి ఏడాదిలాగే అమిత్ షా హాజరయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల 17వ తేదీన కాంగ్రెస్ భారీ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించింది. పది లక్షల మంది ఈ సభకు హాజరు అవుతారని కాంగ్రెస్ పార్టీ ముందస్తుగానే ప్రకటించింది. తుక్కుగూడను అందుకు వేదికగా ఎంచుకుంది. ఆ తేదీ, అంతకు ముందు రోజు నగరంలో సీడబ్ల్యూసీ సమావేశాలు జరగబోతున్నాయి. సోనియా గాంధీ సైతం తుక్కుగూడ సభకు హాజరు కానున్న నేపథ్యంలో.. ఈ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటోంది తెలంగాణ పీసీసీ. అయితే.. కాంగ్రెస్ తుక్కుగూడ సభకు పోటీగా బీజేపీ సైతం నగరంలో సభను ప్లాన్ చేసింది. పరేడ్ గ్రౌండ్‌లోనే తెలంగాణ విమోచన దినోత్సవం వేడుకలను కిందటి ఏడాది తరహాలోనే కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించాలని.. ఈ క్రమంలో భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. వీలైనంత ఎక్కువ జనసమీకరణ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకేరోజు.. అదీ తెలంగాణ విమోచన దినోత్సవం. ఈ దినం రాగానే హైదరాబాద్ నగరంలో పోటాపోటీగా కాంగ్రెస్, బీజేపీ కార్యక్రమాలకు పోటీ పడుతుండడం.. రాజకీయ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇరు పార్టీలు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాన్నే లక్ష్యంగా చేసుకుంటాయనేది ఊహించిందే అయినప్పటికీ.. పరస్పర విమర్శలు ఏ స్థాయిలో ఉంటాయనేది చర్చనీయాంశంగా మారిందిప్పుడు. ఇదీ చదవండి: ఎటూ తేలలేదు.. 100 సీట్లలో ఒక్కో పేరే! -
ప్రధాని పర్యటన..బొగ్గు గనుల్లో కార్మికుల నిరసన
-
ప్రజల ఆశలకన్నా మిన్నగా తెలంగాణ పురోగతి
సాక్షి, హైదరాబాద్: అన్ని వర్గాల ప్రజల ఆశలను నెరవేరుస్తూ తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తోందని గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ తెలిపారు. అన్ని వర్గాల అభివృద్ధి, అభ్యున్నతే ధ్యేయంగా మానవీయ విలువలతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని గవర్నర్ నరసింహన్ శుక్రవారం సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ‘‘ఎందరివో ఆశయాలు, ఆకాంక్షల ఫలితంగా 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మూడున్నరేళ్ల కిందట ఇదే వేదిక నుంచి గణతంత్ర దినోత్సవ సందేశం ఇచ్చాను. ప్రగతి పయనంలో తెలంగాణ రాష్ట్రం సవాళ్లను, అడ్డంకులను అధిగమిస్తుందని చెప్పాను. ఇప్పుడు సంతోషంగా, గర్వంగా ప్రకటిస్తున్నాను. ప్రజలు ఆశించినదానికంటే మిన్నగా తెలంగాణ రాష్ట్రం పురోగతి సాధించింది. మనం గమ్యంగా భావిస్తున్న బంగారు తెలంగాణ సాధన త్వరలోనే సాకారమవుతుంది’’ అని నరసింహన్ తెలిపారు. ప్రజల సంక్షేమం విషయంలో రాజీలేని విధంగా తన ప్రభుత్వం వ్యవహరిస్తోందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం, వ్యవసాయ, పారిశ్రామిక రంగాల అభివృద్ధి కోసం బృహత్తరమైన సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు. సంక్షేమ కార్యక్రమాల కోసం ప్రభుత్వం ఏటా రూ. 40 వేల కోట్లు ఖర్చు చేస్తోందని తెలిపారు. విద్యుత్ ఉత్పత్తిలో అనూహ్య పురోగతి... కరెంటు సరఫరా విషయంలో తెలంగాణ అనూహ్య పురోగతి సాధించిందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన సమయంలో 6,574 మెగా వాట్లుగా ఉన్న విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ప్రస్తుతం 14,845 మెగావాట్లకు చేరిందని, 28 వేల మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల నిర్మాణం కొన సాగుతోందన్నారు. ‘‘నా ప్రభుత్వ సరైన విధానం, వ్యూహం, ఉద్యోగుల అంకితభావమైన విధి నిర్వహణతో రాష్ట్రం ఏర్పడిన ఆరు నెలల్లోనే కరెంటు కోతలు లేకుండా చేశాం. 2018 జనవరి ఒకటి నుంచి నాణ్యమైన కరెంటును వ్యవసాయానికి ఉచితంగా నిరంతరం సరఫరా చేస్తున్నామని గర్వంగా చెబుతున్నాం.’’ అని గవర్నర్ చెప్పారు. బీసీలకు తోడ్పాటు... మానవ వనరులను పూర్తిస్థాయిలో, సమర్థంగా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తున్నామని, రూ. 5 వేల కోట్లతో 75 శాతం సబ్సిడీపై యాదవ, కురుమలకు మేకలు, గొర్రెల పంపిణీ చేయాలని నిర్ణయించామని గవర్నర్ తెలిపారు. 1.50 కోట్ల గొర్రెలను 7.61 లక్షల మంది యాదవ, కుర్మలకు పంపిణీ చేయనున్నామని, ఇప్పటికే 40 లక్షల గొర్రెలను పంపిణీ చేశామన్నారు. మత్స్యకారులు, చేనేత కార్మికులు, నాయీ బ్రాహ్మ ణులు, రజకులు, గీత కార్మికులు, విశ్వబ్రాహ్మణుల కోసం వివిధ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. కేజీ టు పీజీకి అడుగులు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందించే దిశగా ఇప్పటికే అడుగులు పడ్డాయని గవర్నర్ నరసింహన్ తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల కోసం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 542 రెసిడెన్షియల్ స్కూళ్లు ప్రారంభమయ్యా యన్నారు. పరిపాలనా సంస్కరణల్లో భాగంగా కొత్త జిల్లాలు, మండలాలు, పోలీస్ స్టేషన్ల ఏర్పాటు చేసిన ప్రభుత్వం గ్రామ పంచాయతీలుగా గిరిజన తండాల మార్పిడికి చర్యలు తీసుకుంటోందని గవర్నర్ వివరించారు. ప్రభుత్వ ప్రణాళికతో పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పన పెరిగిందని, టీఎస్ ఐపాస్‌తో ఇప్పటికే 6,070 పరిశ్రమలకు అన్ని రకాల అనుమతులు వచ్చాయని, కొత్త పరిశ్రమలతో ఇప్పటికే 1.18 లక్షల కోట్ల పెట్టుబడులు, రెండు లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ వేడుకల్లో శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. లాభసాటి వ్యవసాయానికి చర్యలు.. వ్యవసాయం, సంప్రదాయ వృత్తులను లాభసాటిగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిందని, సాగును లాభ సాటిగా మార్చేందుకు ఇప్పటికే చర్యలు చేపట్టిందని గవర్నర్ నరసింహన్ తెలిపారు. 2018–19 నుంచి వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుందని చెప్పారు. రైతులకు పెట్టుబడి ఖర్చుల కోసం రెండు సీజన్లలో కలిపి ఎకరానికి రూ. 8 వేల చొప్పున ఇవ్వనున్నామన్నారు. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు అవసరమైన అన్ని చర్యలను ప్రభుత్వం తీసుకుంటోందని, సాగునీటిశాఖకు ప్రతి ఏటా రూ. 25 వేల కోట్లను కేటాయిస్తోందని గవర్నర్ తెలిపారు. అసలైన భూ యజమానులకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. మొదటి దశ కింది గ్రామీణ ప్రాం తాల్లోని భూరికార్డుల ప్రక్షాళన పూర్తయ్యిందన్నారు. -
రేపు పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ బహిరంగ సభ
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ నిర్వహించనుంది. ఈ సభకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలపై కేసీఆర్ ఈ సభలో పలు కీలక అంశాలను ప్రస్తావించనున్నారని సమాచారం. అయితే ఈ సభ ఏర్పాట్లను తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ నేటి మధ్యాహ్నం పరేడ్ గ్రౌండ్స్‌లో దగ్గరుండి పర్యవేక్షించనున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం జనవరి 31తో ముగియనుంది. రేపు సాయంత్రం 4.00 గంటలకు టీఆర్ఎస్ బహిరంగ సభ ప్రారంభం కానుంది. -
'తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది'
-
'తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది'
హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ ప్రజల కల సాకారమైందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అవినీతిరహిత పాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని నరసింహన్ స్పష్టం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ జెండాను నరసింహన్ ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. అనంతరం నరసింహన్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్స్‌లోని అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు. -
నో యువర్ ఆర్మీ
-
దారులు.. వాహనబారులు
బహిరంగ సభకు వచ్చిన వాహనాలు 5001 పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ సిటీబ్యూరో: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సోమవారం జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభకు తరలివచ్చిన వాహనాలతో ట్రాఫిక్ స్తంభించింది. తెలంగాణ జిల్లాల నుంచి ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం వరకూ వాహనాలు నగరంలోకి వస్తూనే ఉన్నాయి. మధ్యాహ్నం నుంచే సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలు రద్దీగా మారాయి. సాధారణ ట్రాఫిక్‌ను రూట్ మళ్లించినా ఇబ్బందులు తప్పలేదు. కార్యకర్తల వాహనాలకు నిజాం కళాశాల, పీజీ కాలేజ్, మల్లారెడ్డి గార్డెన్స్, సీఎంఆర్ స్కూల్ గ్రౌండ్, ఆశీష్ గార్డెన్, ధోబీఘాట్, రైల్వే డిగ్రీ కళాశాల, ఎన్టీఆర్ స్టేడియం, పబ్లిక్ గార్డెన్, నెక్లెస్‌రోడ్డులో పార్కింగ్ పాయింట్లు కేటాయించారు. బహిరంగ సభకు ఆర్టీసీ బస్సులు, స్కూల్, కళాశాల బస్సులు 3001, కార్లు, డీసీఎం, జీపులు 2000 వచ్చాయి. 5001 వాహనాలను పార్కింగ్ చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. కొంత మంది డ్రైవర్లకు వారికి కేటాయించిన పార్కింగ్ పాయింట్లు తెలియకపోవడంతో ఇష్టం వచ్చినట్లు వాహనాలు మళ్లించారు. విద్యాసంస్థలకు వేసవి సెలవులు ఉండడంతో కొంత ఉపశమనం లభించింది. అంబులెన్స్‌లు వెళ్లేందుకు నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అష్ట దిక్కుల్లో.. మహబూబ్‌నగర్ వైపు నుంచి వచ్చిన వాహనాలతో మెహదీపట్నం, మాసాబ్‌ట్యాంక్, బేగంపేట, రసూల్‌పురాలో ట్రాఫిక్ స్తంభించింది. జహీరాబాద్ రూట్లో వచ్చిన వాహనాలతో కూకట్పల్లి, అమీర్‌పేట, బేగంపేట, పీజీ కాలేజ్ రహదారులు రద్దీగా మారాయి.మెదక్,నర్సాపూర్ ప్రాంతాల నుంచి వచ్చిన వాహనాలతో బోయిన్పల్లి జంక్షన్, తాడ్‌బండ్, బాలమ్రాయ్ రహదారులు కిక్కిరిశాయి.కరీంనగర్ హైవే మీదుగా వచ్చిన వాహనాలతో శామీర్‌పేట్, బొల్లారం, కార్ఖానా, ఎన్సీసీ గేట్, డైమండ్ పాయింట్, ధోబీఘాట్, ఇంపీరియల్ గార్డెన్ ప్రాంతాలు వాహనాలతో నిండి పోయాయి.వరంగల్ హైవే మీదుగా వచ్చిన వాహనాలతో ఉప్పల్, తార్నాక, మెట్టుగడ్డ, సంగీత్, రైల్వే డిగ్రీ కాలేజ్, ఆర్సీసీ గ్రౌండ్స్, సీఎస్ఐ, పీజీ కాలేజ్, కీస్ హైస్కూల్, ఓపెన్ గ్రౌండ్, ఎల్‌అండ్‌ఓ పీఎస్ వద్ద ట్రాఫిక్ సమస్య ఏర్పడింది.విజయవాడ హైవే మీదుగా వచ్చిన వాహనాలతో ఎల్బీనగర్ రింగ్‌రోడ్డు, మలక్ పేట్, ఛాదర్‌ఘాట్, ఎంజే మారె ్కట్, నాంపల్లి, తెలుగుతల్లి ఫ్లైవర్ వరకు స్వల్పంగా ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. లోయర్ ట్యాంక్‌బండ్, కవాడిగూడ, బైబిల్ హౌస్ వద్ద రద్దీ నెలకుంది. సభకు బస్సులు..ప్రయాణికులకు తిప్పలు సిటీబ్యూరో : టీఆర్ఎస్ సభకు నగరంలోని వివిధ డిపోలకు చెందిన సుమారు 500 బస్సులను తరలించారు. నగరంతో పాటు పరిసర జిల్లాలకూ సిటీ బస్సులు నడిచాయి. దీంతో నగరంలోని పలు రూట్లలో బస్సులు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. కిక్కిరిసిన హబ్సిగూడ.. హబ్సిగూడ: హబ్సిగూడ చౌరస్తా నుంచి తార్నాక మెట్టుగూడ వరకు నాలుగు కిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ ఎక్కడికక్కడే నిలిచిపోయింది. టీఆర్ఎస్ కార్యకర్తలతో పాటు ప్రయాణికులు సైతం తీవ్ర ఇబ్బందులు గురయ్యారు. -
నిఘా వలయం..
సాక్షి, సిటీబ్యూరో: గణతంత్ర దినోత్సవం.. కేంద్ర నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో సిటీ పోలీసులు అప్రమత్తమయ్యారు. తనిఖీలు ముమ్మరం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ మైదానానికి మూడంచెల భద్రత కల్పించారు. వేడుకలు జరిగే ఈ మైదానాన్ని బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేపట్టాయి. నగరంలోనూ అణువణువూ గాలింపు చర్యలు చేపట్టారు. స్పెషల్ బ్రాంచ్, కౌంటర్ ఇంటెలిజెన్స్, ఇంటెలిజెన్స్ అధికారులు సున్నిత ప్రాంతాలపై దృష్టి సారించారు. రైల్వే స్టేషన్లు, బస్సు స్టేషన్లలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. లాడ్జీలు, హోటళ్లు, సినిమా థియేటర్ల వద్ద ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. రౌడీషీటర్లు, అనుమానిత ఉగ్రవాదులపై నిఘా పెట్టారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగర శివార్లలోనూ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్తీలు, కాలనీల్లో పెట్రోలింగ్‌ను మరింత పెంచారు. నిఘా నీడలో పరేడ్ మైదానం.. గణతంత్ర వేడుకలు జరిగే పరేడ్ మైదానం చుట్టూ పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. అదనపు పోలీసు కమిషనర్లు అంజనీకుమార్, స్వాతిలక్రా, జాయింట్ పోలీసు కమిషనర్ నాగిరెడ్డి తదితరులు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. వేడుకలకు హాజరయ్యేవారిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేసిన తర్వాతే మైదానంలోకి అనుమతిస్తారు. గ్రౌండ్లోకి బ్యాగ్‌లు, కెమెరాలు, టిఫిన్ బాక్స్‌లు తీసుకురావద్దని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి ప్రజలకు సూచించారు. మైదానం చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనాలు పార్కింగ్ చేసే ప్రదేశాల్లో సైతం నిఘాను పెంచారు. గ్రౌండ్ చుట్టూ మొబైల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. అనుమానిత వస్తువులు, కొత్త వ్యక్తులపై నిఘా పెట్టారు. * టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి, అదనపు డీసీపీ కోటిరెడ్డి ఆధ్వర్యంలో లాడ్జీలు, హోటళ్లు, సినిమా థియేటర్ల వద్ద మూడు రోజులుగా ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. కొత్త వ్యక్తులు ఎవరైనా కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఆయా కూడళ్ల వద్ద మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు. * సినిమా థియేటర్లు, షాపింగ్ మాల్స్ యాజమాన్యాలను అప్రమత్తం చేశారు. అన్ని ఠాణాల పరిధిలో మైత్రి, శాంతి కమిటీలతో ఇన్స్పెక్టర్లు, ఏసీపీలు సమావేశాలు నిర్వహించారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులకు ఎప్పటికప్పుడు విలువైన సమాచారం వస్తుండడంతో ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నారు. * ఐటీ కారిడార్‌లో మాదాపూర్ డీసీపీ కార్తికేయ అక్కడి షాపింగ్ మాల్స్, ఐటీ కంపెనీలు, సినిమా థియేటర్ల సెక్యూరిటీ గార్డులతో కూకట్‌పల్లిలో ఆదివారం ప్రత్యేక సమావేశం నిర్వహించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించారు. * నగర డీసీపీలు డాక్టర్ రవీందర్, వెంకటేశ్వరావు, కమలాసన్‌రెడ్డి, సుధీర్‌బాబు, సత్యనారాయణ తమ జోన్ల పరిధిలో రోడ్లపై మార్చ్‌పాస్ట్ చేయించారు. ఫుట్ పెట్రోలింగ్‌ను సైతం చేపట్టారు. రద్దీ మార్కెట్ సెంటర్లలో తనిఖీలు చేశారు. కార్డన్ సర్చ్, డెకాయి ఆపరేషన్లు నిర్వహించారు. ఎలాంటి సంఘటనలు జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. -
భారీ ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు