'తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది' | 67 republic day celebration in secunderabad parade ground | Sakshi
Sakshi News home page

'తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది'

Published Tue, Jan 26 2016 11:29 AM | Last Updated on Sun, Sep 3 2017 4:21 PM

67 republic day celebration in secunderabad parade ground

హైదరాబాద్ : ప్రత్యేక రాష్ట్ర సాధన ద్వారా తెలంగాణ ప్రజల కల సాకారమైందని రాష్ట్ర గవర్నర్ నరసింహన్ తెలిపారు. తెలంగాణ శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. అవినీతిరహిత పాలనే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం అని నరసింహన్ స్పష్టం చేశారు. మంగళవారం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 67వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనం జరిగాయి.

ఈ సందర్భంగా జాతీయ జెండాను నరసింహన్ ఎగురవేశారు. త్రివిధ దళాల గౌరవ వందనాన్ని గవర్నర్ స్వీకరించారు. అనంతరం నరసింహన్ మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్తోపాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. పరేడ్ గ్రౌండ్స్లోని అమరవీరుల స్తూపానికి సీఎం కేసీఆర్ నివాళులర్పించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement