వీడి యోకాన్ డీ2హెచ్‌తో షెమారూ జట్టు
హైదరాబాద్: షెమారూ ఎంటర్టైన్మెంట్ సంస్థ యాడ్స్‌లేని నిరంతర భక్తి ప్రసారాలను అందించే ‘డీ2హెచ్ దర్శన్’ చానల్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురావడం కోసం వీడియోకాన్ డీ2హెచ్‌తో జతకట్టింది. డీ2హెచ్ దర్శన్‌లో టెంపుల్ టూరిజం, శ్లోకాలు, వేదాలు, భజనాలు, కథలు, పవిత్ర గ్రంథాలు, పండుగలు తదితర వాటికి సంబంధించిన విషయాలు ప్రసారం అవుతాయని, దీని వల్ల వినియోగదారులు హిందూ ధర్మం గురించి లోతుగా తెలుసుకోవచ్చని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.
ఒక్కో రోజు ఒక్కో దేవునికి ప్రీతిపాత్రమైందని.. ఆ రోజు ఆ దేవుడికి సంబంధించిన విషయాలను ప్రత్యేకంగా తెలియజేస్తామని, అలాగే పండుగ రోజుల్లో ఆ పండుగ విశిష్టతలను వివరిస్తామని పేర్కొంది. ఈ చానల్ ను వినియోగదారులు నెలకు రూ.30ల ప్రీమియం చెల్లించి వీడియోకాన్ డీ2హెచ్లో 481 నెంబర్లో చూడొచ్చని తెలిపింది.