Senior residency doctors
-
1,458 ‘సీనియర్ రెసిడెంట్’ల నియామకానికి నోటిఫికేషన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ మెడికల్, డెంటల్ బోధనాస్పత్రుల్లో 1,458 సీనియర్ రెసిడెంట్(ఎస్ఆర్) డాక్టర్ల నియామకానికి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్(డీఎంఈ) నోటిఫికేషన్ ఇచ్చింది. గత నెలలోనే ఎస్ఆర్ల నియామకానికి డీఎంఈ నోటిఫికేషన్ జారీ చేసింది. అయితే ఆ నోటిఫికేషన్లో కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పీజీ చదివిన వారికి అవకాశం కల్పించారు. ఆ నోటిఫికేషన్ను రద్దు చేసి ప్రైవేట్ వైద్య కళాశాలల్లో చదివిన వారికీ అవకాశం కల్పిస్తూ మరో నోటిఫికేషన్ ఇచ్చారు. శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించారు. ఈ నెల 10వ తేదీ రాత్రి 12 గంటల వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే వీలుంది. 45 ఏళ్ల లోపు వయసుండి, ఏపీ స్థానికత కలిగి ఉండి పీజీ/డెంటల్ డిగ్రీ చదివి ఏపీ మెడికల్/డెంటల్ కౌన్సిల్లో రిజిస్ట్రార్ వైద్యులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. జ్టి్టp://ఛీఝ్ఛ.్చp.nజీఛి.జీn ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు ఎస్ఆర్లుగా సేవలు అందించాల్సి ఉంటుంది. సూపర్ స్పెషాలిటీ సీనియర్ రెసిడెంట్కు రూ.85 వేలు, స్పెషాల్టీ సీనియర్ రెసిడెంట్కు రూ.70 వేలు, సీనియర్ రెసిడెంట్(పీజీ)కు రూ.65 వేల చొప్పున గౌరవ వేతనం ఉంటుంది. పీజీ తుది పరీక్షల్లో వచ్చిన(థియరీ, ప్రాక్టికల్స్)మార్కుల్లో మెరిట్ ప్రామాణికంగా, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఎంపికలు చేపడతారు. అత్యధికంగా ఎమర్జెన్సీ మెడిసిన్లో 144, జనరల్ మెడిసిన్లో 101, జనరల్ సర్జరీ విభాగంలో 101 ఖాళీలున్నాయి. పాథాలజీలో 88, అనాటమీలో 85, ఫార్మకాలజీలో 80, గైనకాలజీలో 69, అనస్థీషియాలో 56, పీడియాట్రిక్స్లో 56, ఆప్తమాలజీలో 56 ఖాళీలున్నాయి. ఇలా మొత్తంగా 49 విభాగాల్లో 1,458 ఎస్ఆర్ పోస్టులు భర్తీ కానున్నాయి. -
జూడాల ఆందోళన.. జీవో కాపీల దహనం
తిరుపతి కార్పొరేషన్ : ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబరు 107 ప్రతులను జూనియర్ డాక్టర్లు దాహనం చేశారు. జూనియర్ డాక్టర్లు చేపడుతున్న సమ్మెలో భాగంగా రెండవ రోజైన మంగళవారం రుయాలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిం చారు. వీరికి సీనియర్ రెసిడెన్సీ డాక్టర్లు మద్దతు పలికారు. జూడాలు రుయా ప్రధాన కార్యాలయం నుంచి ర్యాలీగా ఎస్వీ మెడికల్ కళాశాల ఆడిటోరియం వరకు చేరుకున్నారు. అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదలు చేశారు. మెడికల్ కళాశాల సిల్వర్ జూబ్లీ పైలాన్ వద్దకు చేరుకున్న జూనియర్ డాక్టర్లు 107 జీవో నెంబరును తగలబెట్టారు. జూడా ప్రధా న కార్యదర్శి ఇజాజ్ మాట్లాడుతూ వైద్య వృత్తి ఉనికికే ప్రమాదకరంగా మారిన ప్రభుత్వ తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. రూరల్ సర్వీసుకు తాము ఎంత మా త్రమూ వ్యతిరేకం కాదని, అయితే తమ ను శాశ్వత వైద్యులుగా నియమిస్తే పేదలకు అంకిత భావంతో సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రూరల్ సర్వీసు చేయాలంటే అక్కడ రెసిడెన్సీ, నెలనెలా సరైన వేతనాలు, ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా ఉండాలని స్పష్టం చేశారు. మరి అవి ఏవీ ఏర్పాటు చేయకుండానే సర్వీసు చేయమంటే ఎలా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఇవి ఏవీ చేయనప్పుడు తమ చేత రూ.20 లక్షల బాండును ఎందుకు బలవంతంగా తీసుకుంటున్నారో సమాధానం చెప్పాలన్నారు. పైగా మంత్రి వ్యాఖ్యలు అప్రజాస్వామ్యం గా ఉన్నాయని, ఉద్యమాలను హేళన చేస్తే జూడాల సత్తా ఏమిటో చూపిస్తామన్నారు. ఇప్పటికైనా మంత్రి వ్యాఖ్యలు వె నక్కి తీసుకోవాలని, లేకుంటే నేటి నుం చి అత్యవసర సేవలను బంద్ చేసేం దుకు వెనకాడబోమని స్పష్టం చేశారు.