Sense
-
ఇంద్రియాలతో జాగ్రత్త !
రుషిరుణం తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం సరిపోతుంది. కానీ పితృరుణం, దేవరుణం తీరాలంటే గృహస్థాశ్రమ స్వీకారం తప్పదు. పితరుణం అంటే... తండ్రి మనకు ఒక జన్మనిచ్చాడు... సరే... దీని వెనుక ఉన్న తాత్వికత ఏమిటి ? ఇప్పుడు మన శరీరానికి ఒక పేరుంది. వచ్చేటప్పుడు ఆ పేరుతో భూమి మీదకు రాలేదు. వచ్చిన తరువాత పెద్దలు పేరు పెట్టారు. కానీ ఈ జీవుడు ఇప్పుడుకాదు సనాతనంగా అలా వస్తూనే ఉన్నాడు. ఎన్ని శరీరాలు ΄పోందాడో!!! ఎన్ని వదిలాడో !!! పునరపి జననం పునరపి మరణం/పునరపి జననీ జఠరే శయనం/ఇహ సంసారే బహుదుస్తారే/కపయా పారే పాహి మురారే. ఇలా మారిపోతున్నప్పుడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుబంధం.. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు... ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు తల్లిదండ్రులు...అలా మారిపోతుంటారు. కానీ చేసిన పాలున్నాయి. అవి అనుభవం చేత పోతాయి. అనుభవం దుఃఖమయం కావాలి. పుణ్యం సుఖరూపంలో పోవాలి. నిజానికి సుఖదుఃఖాలు రెండూ కూడా అనుభవాలే..ఒకటి బాగున్నట్లు ఉంటుంది, మరొకటి బాధపెట్టినట్లుంటుంది. మొత్తానికి పుణ్యమో ΄ాపమో క్షయమయిపోతుండాలి. అది మానసికంగా అనుభవించడం కుదరదు. శరీరం ఉంటే తప్ప దుఃఖాన్ని అనుభవించడం కుదరదు. అలాగే సుఖాన్ని కూడా అనుభవించడం వీలు కాదు. కాబట్టి ధర్మానుష్ఠానం చేయాలి అంటే శరీరం ఉండాలి. కాళిదాస మహాకవి అంతటివాడు ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్’ అన్నాడు. జీవుడు ఈ శరీరాన్ని తొడుక్కుని రాలేదనుకోండి. అప్పుడు ఆ జీవుడికి ΄ాపపుణ్యాలు పోగొట్టుకోవడం కుదరదు. అసలుపాపపుణ్యాలు లేవనుకోండి. ఇక శరీరం పోందాల్సిన అవసరమే ఉండదు. ΄ాపం క్షయమై΄ోయి పుణ్యం బాగా సంపాదించుకోవాలి, సుఖంగా ఉండాలనుకుంటే దానికి శరీరం తప్పనిసరి.కాబట్టి శరీరం అనేది అత్యంత ప్రధానం. దీనిని జీవుడు పోందాడు అంటే... అది తల్లిదండ్రుల మహోపకారం. వాళ్ళిద్దరి అనుగ్రహంగా ఈ శరీరం లభించింది. అంటే తండ్రి ఏబాటలో ప్రయాణించాడో కొడుకు కానీ, కూతురు కానీ అదేబాటలో ప్రయాణించాలి. అంటే వేరొకరికి జన్మనివ్వాలి. సంతానం పెరగాలి. అయితే ఇక్కడ ఒక ధర్మసంక్లిష్టత వస్తుంది. సంతానాన్ని పోందడం.. అన్నప్పుడు కామం సహజంగా శరీరంలో పోటమరిస్తుంది. ఈ విషయంలో విశంఖలత్వం పనికిరాదు. అది ధర్మంచేత కట్టుబడాలి. అది చేయనప్పుడు ఇంద్రియాలు ఎప్పుడు కాటేస్తాయో తెలియదు.గడ్డిలో నడుచుకుంటూ పోతున్నాం. అనుకోకుండా కాలు అక్కడున్న పోము పడగపై పడింది. మిగిలిన శరీరంతో అది కాలును చుట్టేసింది. అది మనల్ని కాటువేయలేదు.. కారణం ... దాని తల మన కాలి కింద ఉంది కనుక. కాటువేయలేదు కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాం ... అనుకుంటూ ప్రశాంతంగా ఉండగలమా ? ఎప్పుడు ΄ాదం తొలిగితే అప్పుడు కాటేయడానికి ΄ాము కాచుకుని ఉంటుంది. దీని బారినుంచి ఎప్పుడు తప్పుకుందామా అని మనం చూస్తుంటాం. మనం కానీ, అది కానీ క్షేమంగా మాత్రం లేము, ఉత్కంఠ అటూ ఉంది.. ఇటూ ఉంది. మన ఇంద్రియాలు కూడా అంతే. కాలుకింద ΄ాము తల అణిగి ఉన్నట్లు అణిగి ఉంటాయి. సమయం చూసి కాటేస్తాయి. వాటిని నిగ్రహించడం అంత తేలిక కాదు. బౌద్ధవాణి -
నాన్స్టాప‘బుల్స్’ : ఒక్కరోజే రూ.44,898 కోట్లు సంపాదించారు!
ముంబై: స్టాక్ మార్కెట్ సరికొత్త రికార్డులను సృష్టిస్తూ పరుగులు పెడుతోంది. దేశ ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా ఉండటం, విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల పరంపర కొనసాగడం ర్యాలీకి తోడ్పడ్డాయి. సూచీలు నాలుగోరోజూ ఇంట్రాడే, ముగింపులోనూ సరికొత్త రికార్డ్లను నమోదు చేశాయి. ఉదయం సెన్సెక్స్ 299 పాయింట్ల లాభంతో 65,504 వద్ద, నిఫ్టీ 84 పాయింట్లు పెరిగి 19,407 వద్ద మొదలయ్యాయి. తొలి గంటలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడంతో సూచీలు కొంతమేర అమ్మకాల ఒత్తిడికి లోనయ్యాయి. అయితే కనిష్ట స్థాయిల వద్ద కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు తిరిగి లాభాల్లోకి మళ్లాయి. బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగాల్లో అధికంగా కొనుగోళ్లు జరిగాయి. ఇంట్రాడేలో వరుసగా నాలుగోరోజూ సెన్సెక్స్ 468 పాయింట్లు పెరిగి 65,673 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు బలపడి 19,434 కొత్త జీవితకాల గరిష్టాలను నమోదు చేశాయి. చివరికి సెన్సెక్స్ 274 పాయింట్ల లాభంతో 65,479 వద్ద ముగిసింది. ఈ సూచీకిది వరుసగా అయిదోరోజూ లాభాల ముగింపు. నిఫ్టీ మార్కెట్ ముగిసేసరికి 66 పాయింట్లు బలపడి 19,389 వద్ద స్థిరపడింది. లార్జ్ క్యాప్ షేర్లతో పాటు చిన్న, మధ్య తరహా షేర్లకూ డిమాండ్ నెలకొంది. ఫలితంగా బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు 0.22%, 0.05 % చొప్పున లాభపడ్డాయి. ఇంధన, ఆటో, కన్జూమర్, కమోడిటీ, టెలికం షేర్లు నష్టపోయాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.2,134 కోట్లు ఈక్విటీ షేర్లు కొన్నారు. సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.785 షేర్లు అమ్మేశారు. డాలర్ మారకంలో రూపాయి 11 పైసలు బలపడి 82.02 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. అయిదురోజుల్లో రూ.7.90 లక్షల కోట్లు సెన్సెక్స్ వరుస రికార్డుల ర్యాలీతో ఇన్వెస్టర్ల సంపద జీవితకాల గరిష్టానికి చేరుకుంది. గడిచిన అయిదు రోజుల్లో ఈ సూచీ 2,500 పాయింట్లకు పైగా బలపడటంతో బీఎస్ఈ ఎక్సే్చంజీలో రూ.7.90 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. మంగళవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.44,898 కోట్లను ఆర్జించారు. దీంతో ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్ఈ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ జీవితకాల రికార్డు స్థాయి రూ.2,98.57 లక్షల కోట్లకు చేరింది. మార్కెట్లో మరిన్ని సంగతులు ♦ ఫ్రోజెన్ మాంసం ఎగుమతిదారు హెచ్ఎంఏ ఆగ్రో ఇండస్ట్రీస్ షేరు లిస్టింగ్ నిరాశపరిచింది. ఇష్యూ ధర(రూ.585)తో పోలిస్తే బీఎస్ఈలో 5% ప్రీమియంతో రూ.615 వద్ద లిస్టయ్యింది. తొలి సెషన్లో 15% ర్యాలీ రూ.670 స్థాయికి చేరింది. ఆఖరికి 0.04% స్వల్ప నష్టంతో రూ.584.75 వద్ద ఫ్లాటుగా ముగిసింది. ♦ ఐడీఎఫ్సీ విలీనానికి బోర్డు ఆమోదం తెలపడంతో ఐడీఎఫ్సీ ఫస్ట్ బ్యాంక్ 4% నష్టపోయి రూ.79 వద్ద స్థిరపడింది. అయితే ఐడీఎఫ్సీ షేరు మాత్రం 6 శాతం పెరిగి రూ.116 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. చివరికి 2% పెరిగి రూ.111 వద్ద స్థిరపడింది. -
‘న్యూసెన్స్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)
-
కూలిన మార్కెట్, 12వేల దిగువకు నిఫ్టీ
సాక్షి, ముంబై: అంతర్జాతీయ ప్రతికూల సంకేతాలకు తోడు, కరోనా భయాలతో దేశీయంగా అమ్మకాల వెల్లువతో కీలక సూచీ సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా కుప్పకూలింది. అటు మరోకీలక సూచీ నిఫ్టీ కూడా ప్రధాన మద్దతు స్థాయి 12000 దిగువకు చేరింది. ప్రస్తుతం సెన్సెక్స్ 337 పాయింట్లుపతనమై 40715 వద్ద, నిఫ్టీ 111 పాయింట్లు నష్టపోయి 11935 వద్ద కొనసాగుతోంది. దాదాపు అన్ని రంగాలు నష్ట పోతున్నాయి. భారతి ఇన్ఫ్రాటెల్, యస్ బ్యాంకు, టాటా మోటార్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, ఓఎన్జీసీ టాప్ లూజర్స్‌గా కొనసాగుతున్నాయి. మరోవైపు బీపీసీఎల్, జీ ఎంటర్ టైన్మెంట, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, ఐషర్ మోటార్స్, గెయిల్, టీసీఎస్ లాభపడుతున్నాయి.ఆఖరి గంట ట్రేడింగ్ కీలకం కానుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండస్ ఇండ్ బ్యాంక్, యస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ నష్టాలతో నిఫ్టీ బ్యాంకు 1.38 శాతం నష్టపోయింది. అలాగే సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఎజిఆర్) బకాయిలను టెలి కమ్యూనికేషన్ విభాగానికి (డాట్) కొంత చెల్లింపులు చేశాయి. అయినా ఇన్వెస్టర్ల ఆందోళన నేపథ్యంలో వోడాఫోన్ ఐడియా 15 శాతం కుప్పకూలగా, భారతి ఎయిర్టెల్ 4 శాతం నష్టంతో కొనసాగుతోంది. కాగా చైనాలో వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా వైరస్ దాదాపు 1900 మందిని బలితీసుకోగా, 72వేలమందికి ఈ వ్యాధి సోకింది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన కొనసాగుతోంది. దీనికి తోడు నూతన సంవత్సర సెలవు విరామం తర్వాత కర్మాగారాలు తిరిగి ప్రారంభించడంలో ఆలస్యం కావడంతో అంతర్జాతీయంగా సెంటిమెంట్ దెబ్బతింది. మరోవైపు ఈ వారం ట్రేడింగ్ 4 రోజులే కొనసాగనుంది. శివరాత్రి సందర్భంగా శుక్రవారం మార్కెట్లకు సెలవు కావడం గమనార్హం. చదవండి : వేలాడుతున్న హెచ్1బీ కత్తి! -
లాభాల జంప్
సాక్షి, ముంబై: దేశీయస్టాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమైనాయి. ఆరంభంలోనే సెన్సెక్స్ లాభాల సెంచరీ సాధించింది. దాదాపు అన్ని సెక్టార్లు గ్రీన్‌లో కొనసాగుతున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్ , ఫార్మా, రియల్టీ, మెటల్, ఆటో లాభాల్లోనూ ఉన్నాయి. సిప్లా, లుపిన్, ఎంఅండ్ఎం, వేదాంతా, యాక్సిస్ బ్యాంక్, ఎయిర్టెల్, సన్ ఫార్మా, హిందాల్కో, బీపీసీఎల్, బజాజ్ ఫైనాన్స్ లాభపడుతున్నాయి. అటు యూపీఎల్, ఓఎన్జీసీ, కోల్ ఇండియా, పవర్‌గ్రిడ్, టెక్ మహీంద్రా, విప్రో, ఐవోసీ, అదానీ పోర్ట్స్ తదితర షేర్లు కూడాలాభాల్లోనే. అటు కరెన్సీ మార్కెట్లో రూపాయి బాగా పుంజుకుంది.డాలరు మారకంలో 32పైసలు ఎగిసింది. -
గొర్రెల బాధను తెలుసుకునేందుకు....
కాలిఫోర్నియా: మనుషుల్లో బాధను వ్యక్తం చేయడానికి హావభావాలతోపాటు మాటలు ఉంటాయి. మాటలురాని మూగ జంతువులు తాము అనుభవిస్తున్న బాధను ఎలా వ్యక్తం చేస్తాయి? వాటి అరుపులు, ముఖ హావాభావాల్లో వచ్చే తేడాను బట్టి వాటి బాధను అర్థం చేసుకోవచ్చు. ఇంతవరకు జరుగుతున్నది అదే. గొర్రెలాంటి మూగజీవుల ముఖాల భావాలను బట్టి వాటి శారీరక బాధను గుర్తించేందుకు కాలిఫోర్నియా యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు కృత్రిమ మేథస్సును సృష్టించారు. శారీరక బాధను అనుభవిస్తున్నప్పుడు గొర్రె కళ్లు చిన్నగా ముడుచుకుపోతాయి. చెక్కిళ్లు గట్టిగా బిగుసుకుంటాయి. చెవులు ముందుకు ముడుచుకుపోతాయి. పెదవులు కిందకు వచ్చి వెనక్కి బిగుసుకుంటాయి. ముక్కు రంధ్రాలు ‘వీ’ ఆకారంలోకి మారుతాయి. ఈ ఐదు మార్పుల ద్వారా వాటిని బాధను అర్థం చేసుకోవచ్చు. సాధారణ గొర్రె ముఖాలతో ఈ ఐదు రకాల మార్పులను పోల్చి వాటిని బాధను కృత్రిమ మేథస్సు గుర్తిస్తుంటుంది. బాధ తీవ్రతను కూడా తెలియజేయగలదు. కెమేరా ముందు గొర్రె ముఖాలున్నప్పుడు వాటి బాధను ఫొటోల ద్వారా ఏఐ గుర్తించవచ్చు. మరి పక్కకో, వెనక్కో ఉన్నప్పుడు ఎలా గుర్తించాలి? అదే అంశంపై ఇప్పుడు పరిశోధకులు దృష్టిని సారించారు. ఈ పరిశోధనల్లో కూడా విజయం సాధిస్తే గొర్రెల బాధను త్వరగా గుర్తించి వాటిని పశువైద్య శాలలకు తీసుకెళ్లడానికి వీలవుతుంది. -
భూకంపాల్ని డాల్ఫిన్స్ ముందే గ్రహిస్తాయా..?
-
సెన్స్ ఆఫ్ ప్లేస్!
ఊరో, పల్లెటూరో, నగరమో, మహా నగరమో, అరణ్యమో, నది పరీవాహకమో...ఏదైతేనేం....ప్రతి ప్రదేశానికి తనదైన ‘సారం’ ఉంటుంది. ఆ సారాన్ని వెలికితీయడం అనేది మన కళ్ల మీదే ఆధారపడి ఉంటుంది. ఆ కళ్లకు ‘లెన్స్’ తోడైతే ఆ అనుభవం, ఆనందమే వేరు! నేషనల్ జాగ్రఫిక్ మ్యాగజైన్ ‘లెన్స్’కు పని చెబుతుంది. సారాన్ని ఆవిష్కరించమని చెబుతుంది. గత ఇరవై అయిదు సంవత్సరాలుగా ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్ మ్యాగజైన్’ ఫొటో కాంటెస్ట్ నిర్వహిస్తుంది. చేయితిరిగిన ఫొటోగ్రాఫర్లతో పాటు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఫొటోలలో ప్రపంచ భౌగోళిక అందం కళ్లకు కడుతుంది. 2013 ఫొటోకాంటెస్ట్లో ప్రపంచవ్యాప్తంగా 15, 500 మంది ఫొటోగ్రాఫర్లు పాల్గొన్నారు. ‘‘విజేతలను ఎంపిక చేయడం ప్రతి సంవత్సరం కష్టమైన పనే’’ అంటాడు ‘నేషనల్ జాగ్రఫిక్ ట్రావెలర్’ మాగజైన్ ఎడిటర్ ఇన్ చీఫ్ కెయిత్ బెలో. ఆయన అన్న మాట అక్షరాల నిజమే మరి. ‘ఎంపిక’ కోసం ‘ఎంపిక’ చేయాల్సిందేగానీ ఏ ఫొటో కూడా తక్కువ తినలేదు. భౌగోళిక వైవిధ్యాన్ని ప్రదర్శించడంలో దేని ప్రత్యేకత దానిదే. ‘‘ఫొటోల నాణ్యత, కొత్తదనం గతంతో పోలిస్తే బాగుంటుంది. ఒకేసారి ఇన్ని అద్భుతమైన ఫొటోలను చూడడానికి రెండు కళ్లు చాలవేమో’’ అంటాడు సంతోషంగా బెలో. పోటీని నాలుగు విభాగాలుగా విభజించారు. ఒకటి: ట్రావెల్ పోట్రాయిట్స్, రెండు: ఔట్‌డోర్ సీన్స్, మూడు: సెన్స్ ఆఫ్ ప్లేస్, నాలుగు: స్పాంటేనియస్ మూమెంట్స్. వేలాది ఫొటోల్లో నుంచి న్యాయనిర్ణేతలు ఏడు ఫొటోలను ఎంపిక చేసి చివరికి అందులో నుంచి మూడింటిని ఎంపిక చేస్తారు. మరో ఫొటోను పాఠకులు ఎంచకుంటారు. మీరు చూస్తున్న ఫొటోలు న్యాయనిర్ణేతలు, పాఠకులు మెచ్చినవి.