రుషిరుణం తీరడానికి బ్రహ్మచర్య ఆశ్రమం సరిపోతుంది. కానీ పితృరుణం, దేవరుణం తీరాలంటే గృహస్థాశ్రమ స్వీకారం తప్పదు. పితరుణం అంటే... తండ్రి మనకు ఒక జన్మనిచ్చాడు... సరే... దీని వెనుక ఉన్న తాత్వికత ఏమిటి ? ఇప్పుడు మన శరీరానికి ఒక పేరుంది. వచ్చేటప్పుడు ఆ పేరుతో భూమి మీదకు రాలేదు. వచ్చిన తరువాత పెద్దలు పేరు పెట్టారు. కానీ ఈ జీవుడు ఇప్పుడుకాదు సనాతనంగా అలా వస్తూనే ఉన్నాడు.
ఎన్ని శరీరాలు ΄పోందాడో!!! ఎన్ని వదిలాడో !!! పునరపి జననం పునరపి మరణం/పునరపి జననీ జఠరే శయనం/ఇహ సంసారే బహుదుస్తారే/కపయా పారే పాహి మురారే. ఇలా మారిపోతున్నప్పుడు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క అనుబంధం.. తల్లిదండ్రులు, భార్య, పిల్లలు... ఒక్కొక్క జన్మలో ఒక్కొక్కరు తల్లిదండ్రులు...అలా మారిపోతుంటారు. కానీ చేసిన పాలున్నాయి. అవి అనుభవం చేత పోతాయి. అనుభవం దుఃఖమయం కావాలి. పుణ్యం సుఖరూపంలో పోవాలి. నిజానికి సుఖదుఃఖాలు రెండూ కూడా అనుభవాలే..ఒకటి బాగున్నట్లు ఉంటుంది, మరొకటి బాధపెట్టినట్లుంటుంది. మొత్తానికి పుణ్యమో ΄ాపమో క్షయమయిపోతుండాలి. అది మానసికంగా అనుభవించడం కుదరదు.
శరీరం ఉంటే తప్ప దుఃఖాన్ని అనుభవించడం కుదరదు. అలాగే సుఖాన్ని కూడా అనుభవించడం వీలు కాదు. కాబట్టి ధర్మానుష్ఠానం చేయాలి అంటే శరీరం ఉండాలి. కాళిదాస మహాకవి అంతటివాడు ‘శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్’ అన్నాడు. జీవుడు ఈ శరీరాన్ని తొడుక్కుని రాలేదనుకోండి. అప్పుడు ఆ జీవుడికి ΄ాపపుణ్యాలు పోగొట్టుకోవడం కుదరదు. అసలుపాపపుణ్యాలు లేవనుకోండి. ఇక శరీరం పోందాల్సిన అవసరమే ఉండదు. ΄ాపం క్షయమై΄ోయి పుణ్యం బాగా సంపాదించుకోవాలి, సుఖంగా ఉండాలనుకుంటే దానికి శరీరం తప్పనిసరి.
కాబట్టి శరీరం అనేది అత్యంత ప్రధానం. దీనిని జీవుడు పోందాడు అంటే... అది తల్లిదండ్రుల మహోపకారం. వాళ్ళిద్దరి అనుగ్రహంగా ఈ శరీరం లభించింది. అంటే తండ్రి ఏబాటలో ప్రయాణించాడో కొడుకు కానీ, కూతురు కానీ అదేబాటలో ప్రయాణించాలి. అంటే వేరొకరికి జన్మనివ్వాలి. సంతానం పెరగాలి. అయితే ఇక్కడ ఒక ధర్మసంక్లిష్టత వస్తుంది. సంతానాన్ని పోందడం.. అన్నప్పుడు కామం సహజంగా శరీరంలో పోటమరిస్తుంది. ఈ విషయంలో విశంఖలత్వం పనికిరాదు. అది ధర్మంచేత కట్టుబడాలి. అది చేయనప్పుడు ఇంద్రియాలు ఎప్పుడు కాటేస్తాయో తెలియదు.
గడ్డిలో నడుచుకుంటూ పోతున్నాం. అనుకోకుండా కాలు అక్కడున్న పోము పడగపై పడింది. మిగిలిన శరీరంతో అది కాలును చుట్టేసింది. అది మనల్ని కాటువేయలేదు.. కారణం ... దాని తల మన కాలి కింద ఉంది కనుక. కాటువేయలేదు కాబట్టి మనం సురక్షితంగా ఉన్నాం ... అనుకుంటూ ప్రశాంతంగా ఉండగలమా ? ఎప్పుడు ΄ాదం తొలిగితే అప్పుడు కాటేయడానికి ΄ాము కాచుకుని ఉంటుంది. దీని బారినుంచి ఎప్పుడు తప్పుకుందామా అని మనం చూస్తుంటాం. మనం కానీ, అది కానీ క్షేమంగా మాత్రం లేము, ఉత్కంఠ అటూ ఉంది.. ఇటూ ఉంది. మన ఇంద్రియాలు కూడా అంతే. కాలుకింద ΄ాము తల అణిగి ఉన్నట్లు అణిగి ఉంటాయి. సమయం చూసి కాటేస్తాయి. వాటిని నిగ్రహించడం అంత తేలిక కాదు.
బౌద్ధవాణి
Comments
Please login to add a commentAdd a comment