sensitive
-
సరిహద్దులు సురక్షితం.. కానీ కొంత సున్నితం
న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో వాస్తవాదీన రేఖ(ఎల్ఏసీ) వెంబడి భారత్–చైనా సరిహద్దుల్లో పరిస్థితులు ప్రస్తుతం సాధారణంగా, స్థిరంగానే ఉన్నప్పటికీ, కొంత సున్నితమైనవేనని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే చెప్పారు. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలాంటి సవాలు ఎదురైనా గట్టిగా తిప్పికొట్టడానికి మన సైనిక దళాలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఉన్నతస్థాయి సన్నద్ధతను పాటిస్తున్నాయని వెల్లడించారు. తగినన్ని సైనిక రిజర్వ్ దళాలు సరిహద్దుల్లో మోహరించాయని పేర్కొన్నారు. సరిహద్దుల్లో భద్రతాపరమైన వైఫల్యాలు తలెత్తకుండా పటిష్ట చర్యలు చేపట్టామని స్పష్టం చేశారు. సైనిక దినోత్సవం నేపథ్యంలో జనరల్ మనోజ్ పాండే గురువారం మీడియాతో మాట్లాడారు. సరిహద్దు వివాదం సహా ఇతర అంశాలకు పరిష్కారం కనుగొనడానికి భారత్, చైనా మధ్య సైనిక, దౌత్యవర్గాల స్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని వెల్లడించారు. ఇక భారత్, పాకిస్తాన్ సరిహద్దుల్లో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) వెంబడి చొరబాట్లను కట్టడి చేస్తున్నామని తెలిపారు. జమ్మూకశీ్మర్‌లో హింసాకాండ తగ్గుముఖం పట్టిందని, రాజౌరీ–పూంచ్ సెక్టార్లో మాత్రం హింసాత్మక సంఘటనలు కొంతమేరకు పెరిగాయని వివరించారు. సరిహద్దుకు అవతలివైపు ఉగ్రవాద సంస్థలు చురుగ్గా కార్యకలాపాలు సాగిస్తున్నాయని చెప్పారు. జమ్మూకశీ్మర్‌లో కాల్పుల విరమణ కొనసాగుతోందన్నారు. సరిహద్దు అవతలి వైపు నుంచి భారత్‌లోకి ఆయుధాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా జరగకుండా పటిష్టమైన యాంటీ డ్రోన్ వ్యవస్థను తీసుకొచ్చినట్లు తెలిపారు. ఇండియా–మయన్మార్ సరిహద్దులో.. రెండు దేశాల నడుమ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకొనే దిశగా భూటాన్–చైనా మధ్య కొనసాగుతున్న చర్చలపై జనరల్ మనోజ్ పాండే స్పందించారు. ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్నామని చెప్పా రు. భూటాన్‌తో భారత్‌కు బలమైన సైనిక సంబంధాలు ఉన్నాయని గుర్తుచేశారు. ఇక ఇండియా–మయన్మార్ సరిహద్దులో పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉందని అంగీకరించారు. అక్కడి పరిస్థితిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని అన్నారు. -
పాక్‌కు భారత రహస్యాలు చేరవేస్తున్న కానిస్టేబుల్ అరెస్టు
న్యూఢిల్లీ: దాయాది పాకిస్తాన్‌కు భారత్ భద్రత పరమైన విషయాలను చేరవేస్తున్న ఒక బీఎస్ఎఫ్ కానిస్టేబుల్‌ను గుజరాత్‌లోని గాంధీనగర్‌లో యాంటీ టెర్రరిస్ట్ స్వ్కాడ్ (ఏటీఎస్)పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. కాగా, జమ్ముకశ్మీర్ రాజౌరీకి చెందిన మహమ్మద్ సజ్జద్ అనే వ్యక్తి బీఎస్ఎఫ్లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో కొంతకాలంగా భారత్ భద్రతపర రహస్యాలను ఫోన్ మెసెజ్ ద్వారా పాక్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు బీఎస్ఎఫ్లో చేరక ముందు 46 రోజులు పాక్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇతను డబ్బుల కోసం భారత్ సున్నిత అంశాలను దాయాది పాక్‌కు చేరవేస్తున్నాడని ఏటీఎస్ డిప్యూటి ఎస్పీ చవ్దా తెలిపారు. Gujarat: BSF constable Mohammad Sajjad held from Gandhinagar for allegedly passing sensitive information to Pakistan "A resident of J&K's Rajouri, he went to Pakistan& stayed there for 46 days before joining BSF. He used to send information on WhatsApp," says ATS Dy SP BM Chavda pic.twitter.com/3sUQIoVoNy — ANI (@ANI) October 25, 2021 చదవండి: భర్త పోస్టులకు మరో మహిళ లైక్‌లు .. చిర్రెత్తుకొచ్చిన ఆ భార్య.. -
ఏకగ్రీవాలపై నిమ్మగడ్డ మరో వివాదాస్పద నిర్ణయం
సాక్షి, అనంతరపురం: ఆంధ్రప్రదేవ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలో గతంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవం అయిన ప్రాంతాలను హైసెన్సిటివ్ ఏరియాలుగా ప్రకటించారు. పంచాయతీ ఎన్నికల్లో వీటిని సున్నితమైన ప్రాంతాలుగా గుర్తించారు. ఈ వివాదస్పద నిర్ణయంపై మీడియా నిమ్మగడ్డను ప్రశ్నించిగా.. సమాధానం చెప్పకుండా దాటవేశారు. (చదవండి: నిమ్మగడ్డ తీరు: నాడు అలా.. నేడు ఇలా.. ) అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘రాష్ట్ర సిబ్బందిపై పూర్తి విశ్వాసం ఉంది. అత్యవసరమైతేనే కేంద్ర బలగాలు కావాలని కోరాం. రాష్ట్ర సిబ్బందితోనే పంచాయతీ ఎన్నికలు జరుపుతాం. ఏకగ్రీవాలపై గవర్నర్‌కు కొన్ని రాజకీయ పార్టీలు ఫిర్యాదు చేశాయి. ఏకగ్రీవాలు గతంలో ఉన్నాయి.. ఇప్పుడు ఉన్నాయి. ఏకగ్రీవాలన్నీ తప్పు అని చెప్పట్లేదు. మీడియాలో యాడ్స్ ఇవ్వటం వల్లే సమాచార అధికారులకు నోటీసులు ఇచ్చాం. బలవంతపు ఏకగ్రీవాలు ఉండకూదన్నదే మా ఉద్దేశ్యం. ఏపీ పంచాయతీ యాప్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తాం’’ అని తెలిపారు. ఇక సమావేశం అనంతరం విలేకరుల ప్రశ్నలకు నిమ్మగడ్డ సమాధానం చెప్పకుండా వెళ్లిపోవడం గమనార్హం. -
సెన్సార్ల తయారీలో నూతన టెక్నాలజీ
సింగపూర్: సెన్సార్ల తయారీలో కొత్త టెక్నాలజీని సింగపూర్ శాస్త్రవేత్తలు రూపొందించారు. నూతన టెక్నాలజీ ద్వారా 'సూపర్ సెన్సిటీవ్ మ్యాగ్నటిక్ సెన్సార్'లను తయారు చేసినట్లు సింగపూర్ నేషనల్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇప్పటివరకు వాడుతున్న సెన్సార్ల కంటే 200 రెట్లు సున్నితత్వం గల సూపర్ సెన్సార్లు ఎంతో ప్రభావవంతంగా పనిచేయనున్నట్లు తెలిపారు. కొత్త సాంకేతికతతో పరిమాణంలో చిన్నవిగా, తక్కువ ఖర్చులో సెన్సార్లు తయారు చేయడానికి వీలవుతుంది. ఎలక్ట్రానిక్, సమాచార సాంకేతిక, బయోటెక్నాలజీ రంగంలో విరివిగా ఉపయోగించే సెన్సార్లలో ఇప్పటివరకు సిలికాన్, ఇండియమ్ యాంటీమోనైడ్ అనే పదార్థాలను ఉపయోగిస్తుండగా సూపర్ మ్యాగ్నటిక్ సెన్సార్లలో గ్రాఫిన్, బోరాన్ నైట్రైడ్లను వాడారు. కొత్త సెన్సార్ల తయారీతో వినియోగ వ్యాపార రంగంలో కీలకమైన ముందడుగు పడిందని సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ శాస్త్రవేత్త కలోన్ గోపీనాథన్ తెలిపారు.