Seshasayee
-
ఇన్ఫీ మూర్తిపై మాజీ ఛైర్మన్ ధ్వజం
న్యూఢిల్లీ: దేశీయ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్‌లో రగిలిన బోర్డ్ వివాదం ఇంకా రాజుకుంటూనే ఉంటుంది. తాజాగా వ్యవస్థాపకుడు ఎన్.ఆర్. నారాయణమూర్తిపై సంస్థ మాజీ ఛైర్మన్ ఆర్ శేషసాయి మళ్లీ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ముఖ్యంగా శేషసాయి హయాంలో ఇన్ఫీ పాలనాపరంగా విఫలమైందన్న మూర్తి వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తనపై మూర్తి వ్యక్తిగత దూషణలకు దిగడం, అవాస్తవాలను, అభాండాలను వేయడం సరికాదని వ్యాఖ్యానించారు. పెట్టుబడిదారుల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు పూర్తిగా అసందర్బంగా ఉన్నాయని విమర్శించారు. తాను నిజం చెప్పలేదని ఆరోపించడం సరియైంది కాదన్నారు. తాను ఇన్ఫోసిస్‌కు సంబంధించిన అన్ని విషయాల్లో చాలా నిజాయితీగా వ్యహరించానని శేష సాయి ఒక ప్రకటనలో తెలిపారు. ఆగస్టు 29న జరిగిన పెట్టుబడిదారుల సమావేశంలో మూర్తి , మాజీ చైర్మన్ శేషసాయిపై విమర్శలు చేసిన నేపథ్యంలో స్పందించిన ఆయన ఆ ప్రకటన విడుదల చేశారు. ఇన్ఫోసిస్ బోర్డుకు రాజీనామా చేసి నాటినుంచి బహిరంగంగా ప్రకటనలు చేయడం, రెచ్చగొట్టేలా మాట్లాడటం వంటి వాటికి తాను దూరంగా ఉన్నానన్నారు. తద్వారా కంపెనీ పురోభివృద్ధినీకోరకున్నాననీ, ఈ వివాదాల వల్ల కంపెనీకి ఎలాంటి నష్టం జరగకూడదని తాను భావించానన్నారు. మూర్తి వ్యాఖ్యలు కంపెనీ భవిష్యత్తు మంచిది కాదని హితవు పలికారు. అయితే దీనిపై ఇన్ఫోసిస్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. ఇన్ఫోసిస్ నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నందన్ నీలకేని బాధ్యతలు స్వీకరించిన అనంతరం నారాయణ మూర్తి మంగళవారం, పెట్టుబడిదారు సమావేశంలో మాట్లాడుతూ, శేషసాయి నేతృత్వంలోని బోర్డు మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్ అధిక వేతనం, చెల్లింపులపై అసలు కారణం వివరించడంలో విఫలమైందని అరోపించారు. శేషసాయి నేతృత్వంలో ఇన్ఫీ బోర్డు పాలన అత్యంత దారుణంగా ఉందని, మాజీ సీఎఫ్‌వో రాజీవ్ బన్సల్‌కు భారీగా ముడుపులు చెల్లించారని ఆరోపించారు. కాగా ఇన్ఫోసిస్ సీఎండీగా విశాల్ సిక్కా రాజీనామా, సంక్షోభం ,పీస్‌మేకర్ గా నందన్ నీలేకని రీ ఎంట్రీ, బోర్డుప్రక్షాళన, బోర్డు ఛైర్మన్ శేషాసాయి సహా ,ఇతర బోర్డు సభ్యులు కొంతమంది రాజీనామా చేయడం తెలిసిన సంగతే. -
ఎలాంటి విభేదాలు లేవు-ఇన్ఫీ ఛైర్మన్
ముంబై: ఇన్ఫోసిస్ సంస్థలో ఇటీవల చెలరేగిన విభేదాల నేపథ్యంలో ఎలాంటి సమస్యలు లేవని బోర్డ్ వివరణ ఇచ్చింది. వ్యవస్థాపకులకు బోర్డ్కుమధ్య ఎలాంటి విభేదాలు లేవని ఇన్ఫీ ఛైర్మన్ శేషపాయి స్పష్టం చేశారు. ముఖ్యంగా సంస్థ సీఈవో విశాల్ సిక్కా వేతనం సరియైనదేనని తెలిపారు. అలాగే బోర్డు పారదర్శకతకు, కార్పొరేట్ పాలనకు వచ్చిన ప్రమాదమేమీలేదని వివరణ ఇచ్చారు. అన్ని బోర్డు నిర్ణయాల మేరకు జరిగినట్టు తెలిపారు. ఇది బోర్డువార్ గా చూడొద్దని కోరారు. వ్యవస్థాపకులు వ్యక్తం చేసిన భిన్నాభిప్రాయాలు సంస్థ అభివృద్ధికోసం చేసినట్టుగా భావించాలన్నారు. ఈ సందర్భంగా తమకు అండగా నిలిచిన వాటాదారులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సంస్థలో కార్పొరేట్ నైతికత కు పూర్తిగా కట్టుబడి ఉన్నట్టు హామీఇచ్చారు. ముఖ్యంగా పునీత సిన్హా, ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా ప్రహ్లాద్ నియామకాన్ని పూర్తిగా సమర్ధించుకున్నారు. ఒక మహిళ ప్రొఫెషన్ ను ఆమె జీవిత భాగస్వామి(జయంత్ సిన్హా) వృత్తి ఆధారంగా చూడడం సరియైంది కాదని వ్యాఖ్యానించారు. వారు పూర్తిగా అన్ని రకాల అర్హతలు కలిగి ఉన్నారని చెప్పారు. అలాగే ఈ నియామకాలను ఒక పద్ధతి ప్రకారమే జరిగినట్టు తెలిపారు. వారు బోర్డులో ఉండడం తమకు గర్వకారణం మన్నారు. తమకు పటిష్టమైన ఇంటర్నెల్ ఆడిట్ కమిటీ ఉందని చెప్పారు. ఈ మేరకు బోర్డులో నిర్ణయాలు కూడా తీసుకుంటామని చెప్పారు. ఆర్థిక వ్యవహారాల్లో గోల్డెన స్టాండర్డ్స్ ను పాటిస్తున్నామని తెలిపారు. అలాగే ప్రధానంగా సెవరెన్స్ ప్యాకేజీలపై వచ్చిన ఆరోపణలు బాధ కలిగించాయన్నారు. అయితే కెన్నడీ సహా అన్ని ప్యాకేజీలు కూడా సరియైనవేనని చెప్పుకొచ్చారు. ఇన్పోసిస్ లో నెలకొన్న సంక్షోభంపై నెలకొన్న ఆందోళన నేపథ్యంలో సోమవారం ముంబైలో విలేకరుల సమావేశంలో మాట్లాడిన శేషసాయి ఈ వివరణ ఇచ్చారు. మరోవైపు ఈ సమావేశంలో పాల్గొన్న సీఈవో విశాల్ సిక్కా ఇన్ఫీలో నెలకొన్న ముసలంపై స్పందించారు. తమకు వ్యవస్థాపకులు నారాయణ మూర్తితో హృదయపూర్వక సంబంధాలు ఉన్నాయని విశాల్ సిక్కా పేర్కొన్నారు. ఇన్ఫోసిస్ బోర్డుకు, వ్యవస్థాపకులకు మధ్య విభేదాలు నెలకొన్నట్లు వస్తున్న వార్తలు సరికాదని , బోర్డులో చాలామంది డైరెక్టర్లతో మంచి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చెప్పారు. పటిష్టమైన పునాదితో ఇన్ఫోసిస్ కొనసాగుతోందని విశాల్ సిక్కా స్పష్టం చేశారు. -
ఇన్ఫోసిస్‌లో భారీ మార్పు
భారతీయ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ భారీ మార్పునకు తెరతీసింది. ఇన్నాళ్లూ నాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్‌గా ఉన్న కేవీ కామత్ బ్రిక్స్ డెవలప్మెంట్ బ్యాంకు ప్రెసిడెంట్‌గా నియమితులై.. రాజీనామా చేస్తున్నందున ఆయన స్థానంలో రామస్వామి శేషసాయిని నియమించారు. శేషసాయి నియామకాన్ని కంపెనీ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదించిందని, ఆయన తక్షణం నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అవుతారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. 67 ఏళ్ల శేషసాయి ఇన్ఫోసిస్ బోర్డులో 2011 జనవరి నుంచి ఇండిపెండెంట్ డైరెక్టర్‌గాను, ఆడిట్ కమిటీకి ఛైర్‌పర్సన్‌గాను వ్యవహరిస్తున్నారు. శేషసాయిని తన వారసుడిగా ఎంచుకోవడం ద్వారా బోర్డు చాలా సరైన నిర్ణయం తీసుకుందని కేవీ కామత్ అన్నారు. ఆయన అనుభవం కంపెనీకి అన్నిరకాలుగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లుగా ఇన్ఫోసిస్‌కు సేవలందించిన కామత్‌కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ విశాల్ సిక్కా కృతజ్ఞతలు తెలిపారు. అలాగే శేషసాయికి ఆహ్వానం పలికారు.