SFC
-
రక్షణలో ‘ఆత్మనిర్భరత’ దిశగా బీడీఎల్
సాక్షి, హైదరాబాద్: అత్యాధునిక సీకర్ ఫెసిలిటీ సెంటర్(ఎస్ఎఫ్సీ)లో ఆకాశ్ క్షిపణి కోసం ఉత్పత్తి చేసిన తొలి రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్ఎఫ్) సీకర్ను డీఆర్డీవోకు భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్) అప్పగించింది. భూమి మీది నుంచి గాలిలోకి, గాలి లో నుంచి గాలిలోకి మిస్సైల్స్‌ను ప్రయోగించినప్పుడు లక్ష్య సాధన కోసం ఉపయోగించే క్లిష్టమైన టెక్నాలజీ కలిగిన ఇంటెన్సివ్ సబ్ సిస్టమ్‌నే సీకర్‌గా పేర్కొంటారు. ఈ రేడియో ఫ్రీక్వెన్సీ సీకర్ను డిఫె న్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) రీసెర్చ్ సెంటర్ ఇమారత్‌లో రూపొందించగా, బీడీఎల్ కంచన్‌బాగ్ యూనిట్లో కొత్తగా ఏర్పాటు చేసిన ఎస్ఎఫ్సీలో ఉత్పత్తి చేశారు. కంచన్‌బాగ్ యూనిట్లో బుధవారం జరిగిన కార్యక్రమంలో బీడీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎ. మాధవరావు తొలిæ ఆర్ఎఫ్ సీకర్ను డీఆర్డీఓ చైర్మ న్, కార్యదర్శి డాక్టర్ సమీర్ వి కామత్‌కు అందజేశారు. దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగు ఈ సందర్భంగా కామత్ మాట్లాడుతూ బీడీఎల్‌లో సీకర్ ఫెసిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఆర్ఎఫ్ సీకర్ ఉత్పత్తి రంగంలో భారత్ స్వయం ప్రతిపత్తిని సాధించి, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని సాకారం చేయడంలో దోహదపడుతుందన్నారు. బీడీఎల్ సీఎండీ మాధవరావు మాట్లాడుతూ ఈ విజయం దేశ రక్షణ సామర్థ్యాలలో ముందడుగని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్త యు.రాజాబాబు, డీఆర్డీఎల్ శాస్త్రవేత్త, డైరెక్టర్ జి.ఎ. శ్రీనివాసమూర్తి, ఆర్సీఐ డైరెక్టర్ అనింద్య బిశ్వాస్, ఎఎస్ఎల్ డైరెక్టర్ బి.వి.పాపారావు, బీడీఎల్ డైరెక్టర్ ఎన్. శ్రీనివాసులు, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ వెన్నం ఉపేందర్, బీడీఎల్ భానూర్ యూనిట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జి.ఆర్.ప్ర«దాన్ (రిటైర్డ్), బీడీఎల్ ఈడీ (కంచన్‌బాగ్) పీవీ రాజా రామ్, బీడీఎల్ జీఎం ఎం. శ్రీధర్‌రావు పాల్గొన్నారు. -
నిధుల కోసం నిరీక్షణ... మూణ్నెళ్లుగా జమకాని ఎస్ఎఫ్సీ ఫండ్
సుభాష్‌నగర్ : గ్రామ పంచాయతీల్లో నిధుల కటకట నెలకొంది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.15 కోట్ల వరకు పెండింగ్‌లో ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నిధులు మరో రూ.30 కోట్లు జమ కావాల్సి ఉంది. ఇటీవల పంచాయతీరాజ్‌శాఖ మంత్రి కూడా రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీలకు రూ.1150 కోట్లు విడుదల చేస్తున్నామని ప్రకటించిన నాటి నుంచి సర్పంచులు నిధుల కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నారు. ఒక్కో నెల పంచాయతీ కార్మికులు, సిబ్బంది జీతాలను కూడా చెల్లించలేని పరిస్థితి నెలకొంది. అప్పులు తెచ్చి అరకొర వేతనాలు చెల్లిస్తున్నారు. వేతనాలకూ ఇబ్బందులు జిల్లావ్యాప్తంగా 530 గ్రామపంచాయతీలు ఉన్నాయి. జనాభా ప్రాతిపదికన ప్రతినెలా స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, 15వ ఆర్థిక సంఘం నుంచి పంచాయతీ ఖాతాల్లో నిధులు జమయ్యేవి. ఈ నిధులతోనే పంచాయతీలో అభివృద్ధి పనులతోపాటు సిబ్బంది, కార్మికుల వేతనాలు, విద్యుత్ బిల్లులు, ఇతరత్ర ఖర్చులు చెల్లించేవారు. ఇప్పటికే అన్ని జీపీల్లో అప్పులు తెచ్చి పనులు కొనసాగిస్తున్నారు. ఒక్కో నెల వేతనాలకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని సర్పంచులు వాపోతున్నారు. తప్పని ఎదురుచూపులు ఎస్ఎఫ్సీ, ఆర్థిక సంఘం నిధులు విడుదలవుతాయని రోజుల తరబడి సర్పంచులు, కాంట్రాక్టర్లు ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సర్పంచులు అప్పులు తెచ్చి కార్మికులు, సిబ్బంది జీతాలు చెల్లిస్తున్నారు. పంచాయతీల్లో చిన్న చిన్న పనులకు కూడా డబ్బులను సర్దుబాటు చేస్తున్నారు. అలాగే గ్రామ పంచాయతీల్లో వివిధ రకాల అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం బిల్లుల కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే చాలా పంచాయతీల్లో అభివృద్ధి పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదు. జీపీ ఖాతాల్లో జమ అయిన నిధులకు కూడా ఫ్రీజింగ్ చేయడంపై సర్పంచులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రెజరీలో ఒక్క చెక్కు కూడా పాస్ కావడం లేదని వాపోతున్నారు. అభివృద్ధి పనుల బిల్లులు సహా పంచాయతీలకు మొత్తం రూ.100 కోట్లకుపైగా రావాల్సి ఉంటుందని వారు పేర్కొంటున్నారు. రాబోయే వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని వెంటనే పంచాయతీలకు నిధులు విడుదల చేయాలని కోరుతున్నారు. పది రోజుల్లో జమయ్యే అవకాశం గ్రామపంచాయతీలకు పది రోజుల్లో నిధులు విడుదల య్యే అవకాశముంది. ఆర్థిక సంఘంతోపాటు, ఎస్ఎఫ్సీ నిధులు కూడా జమ కానున్నాయి. ప్రభుత్వం నుంచి ఈ మేరకు సమాచారం అందింది. సర్పంచులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్న మాట వాస్తవమే. ఈవిషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. – జయసుధ, జిల్లాపంచాయతీ అధికారి రూ.45 కోట్ల బకాయిలు.. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిధుల కోసం సర్పంచ్, ఉపసర్పంచ్ జాయింట్ ఖాతాతో డిజిటల్ టోకెన్ ప్రక్రియను 13 నెలల క్రితమే పూర్తిచేసింది. గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రూ.15కోట్ల వరకు రావాల్సి ఉంది. అలాగే ఎస్ఎఫ్సీ మూడు నెలలుగా జమ చేయడం లేదు. గతేడాదికి సంబంధించి పూర్తిగా విడుదల చేసినా.. ఈ సంవత్సరానికి సంబంధించి ఒక్క రూపాయి విదిల్చలేదు. గతేడాది, ఈయేడాదికి సంబంధించి ఆర్థిక సంఘం, ఎస్ఎఫ్సీ నుంచి మొత్తం రూ.45కోట్ల వరకు జమ కావాల్సి ఉంది. -
నాగ్‌పూర్ టూ విజయవాడ: ఎకనమిక్ కారిడార్‌కు లైన్‌క్లియర్
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నిర్మించనున్న తొలి ఎకనమిక్ కారిడార్‌కు పూర్తిగా లైన్ క్లియర్ అయింది. నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు నిర్మించే ఈ కారిడార్ తెలంగాణ – ఏపీ మధ్య 306 కి.మీ మేర కొనసాగనుంది. ఈ ప్రాజెక్టుకు అవసరమైన మొత్తం రూ.10 వేల కోట్ల ని«ధులకు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ ఆదీనంలోని స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ (ఎస్ఎఫ్సీ) పచ్చజెండా ఊపింది. ఈ రోడ్డును తొమ్మిది ప్యాకేజీలుగా విభజించి టెండర్ల ప్రక్రియ చేపట్టారు. ఇప్పటికే తొలి ఆరు ప్యాకేజీలకు మార్గం సుగమం కావటంతో టెండర్ల ప్రక్రియ దాదాపు పూర్తికాగా, చివరి మూడు ప్యాకేజీలకు తాజాగా ఎస్ఎఫ్సీ ఓకే చెప్పి నిధులు మంజూరు చేసింది. దీంతో తెలంగాణ (మంచిర్యాల) నుంచి విజయవాడకు పూర్తిగా కొత్త (గ్రీన్‌ఫీల్డ్) యాక్సెస్ కంట్రోల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి రంగం సిద్ధమైంది. రెండున్నరేళ్లలో ఈ జాతీ య రహదారి రెడీ అవుతుందని జాతీయ రహదారు ల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) పేర్కొంటోంది. మహారాష్ట్ర–తెలంగాణ–ఆంధ్ర: ఓవైపు పర్యావ రణ అభ్యంతరాలు, మరోవైపు భూసేకరణపై ప్రజల నిరసనలు, అలైన్మెంట్ మార్చాలంటూ రాజకీయ నేతల ఒత్తిళ్లు.. వెరసి ఈ ఎకనమిక్ కారిడార్‌పై ఎన్నో సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటన్నింటినీ తోసిపుచ్చుతూ ఇప్పుడు ఎన్హెచ్ఏఐ రోడ్డు నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ కొత్త జాతీయ రహదారి మూడు రాష్ట్రాల మీదుగా సాగనుంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో మొదలై తెలంగాణలోని ఆసిఫాబాద్–మంచిర్యాల–వరంగల్–ఖమ్మంల మీదుగా ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ వరకు కొనసాగుతుంది. నాగ్‌పూర్ నుంచి తెలంగాణలోని ఆసిఫాబాద్ మీదుగా మంచిర్యాల వరకు ఇప్పటికే ఉన్న రోడ్డును నాలుగు వరసలకు విస్తరిస్తున్నారు. ఇక్కడివరకు పాత రోడ్డు (బ్రౌన్‌ఫీల్డ్ హైవే) కొత్తగా మారుతుందన్నమాట. మంచిర్యాల నుంచి కొత్తగా భూసేకరణ జరిపి పూర్తి కొత్త రోడ్డుగా నిర్మిస్తారు. 45 మీటర్ల వెడల్పుతో నాలుగు వరసలుగా ఈ రోడ్డు నిర్మితమవుతుంది. ప్రస్తుతం హైదరాబాద్ మీదుగా విజయవాడకు ఉన్న రోడ్డు పైనే ఎక్కువ వాహనాలు వెళ్తున్నాయి. దీంతో ఈ రోడ్డు బాగా రద్దీగా మారింది. ఇప్పుడు దీనికి ప్రత్యామ్నాయంగా ఈ కొత్త రోడ్డు అందుబాటులోకి రానున్నందున.. నాగ్‌పూర్ నుంచి వచే ట్రాఫిక్, ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల వాహనాలు దీని మీదుగానే ముందుకు సాగేందుకు వీలవుతుంది. ఈ కొత్త జాతీయ రహదారి కోసం 1,550 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇదీ ప్యాకేజీల స్వరూపం ప్యాకేజీ 1,2,3 మంచిర్యాల నుంచి వరంగల్ వరకు 108.406 కి. మీ నిడివి. వ్యయం రూ.3,440.94 కోట్లు. టెండర్ల ప్రక్రియ పూర్తయింది. మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్‌కు పనులు దక్కాయి. అనుసంధానమయ్యే ప్రధాన పట్టణాలు.. మంచిర్యాల, మంథని, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి, వరంగల్, పర్కాల, ఆత్మకూరు, శాయంపేట, దామెర. ప్యాకేజీ 4, 5, 6 వరంగల్ నుంచి ఖమ్మం వరకు 108.24 కి.మీ నిడివి. వ్యయం రూ.3,397.01 కోట్లు. ప్రస్తుతం టెక్నికల్ బిడ్ మదింపు జరుగుతోంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, ఊరుగొండ, గీసుగొండ, మచ్చాపూర్, సంగెం, నెక్కొండ, పర్వతగిరి, వెంకటయ్యపాలెం. ప్యాకేజీ 7, 8, 9 ఖమ్మం నుంచి విజయవాడ వరకు 89.42 కి.మీ నిడివి. వ్యయం రూ.3,007 కోట్లు. స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ తాజాగా ఈ ప్యాకేజీకే నిధులు మంజూరు చేసింది. ఇక టెండర్లు పిలవాల్సి ఉంది. అనుసంధానమయ్యే ముఖ్య పట్టణాలు.. సిరిపురం, తునికిపాడు, ఆత్కూరు, రెమిడిచెర్ల, దుగ్గిరాలపాడు, జక్కంపూడి. -
ఎంపీటీసీల సమస్యలను పరిష్కరించాలి
మండలి ప్రత్యేక ప్రస్తావనల్లో ఎమ్మెల్సీ పొంగులేటి సాక్షి, హైదరాబాద్: ఎంపీటీసీల సమస్యల పట్ల ప్రభుత్వం స్పందించాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సోమవారం శాసనమండలిలో ప్రత్యేక ప్రస్తావనల సందర్భంగా ఎంపీటీసీల సమస్యలను ఆయన ప్రస్తావిం చారు. రాజ్యాంగం కల్పించిన 29 అధికారాలను బదలాయించి, ఎస్ఎఫ్సీ నుంచి నిధులను మంజూరు చేయాలని కోరారు. మండలిలో ప్రభుత్వ చీఫ్‌విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్ జిల్లాలోని వేయి స్తంభాల గుడి మరమ్మత్తు పనులు వెంటనే పూర్తిచేసేలా ప్రభుత్వం ఆదేశాలివ్వాలన్నారు. విపక్షనేత షబ్బీర్‌అలీ మాట్లాడుతూ.. కామారెడ్డిలోని డైరీ కోర్సులు నిర్వహిస్తున్న డిగ్రీ కళా శాలను పోస్ట్‌గ్రాడ్యుయేషన్ కాలేజీగా అప్‌గ్రేడ్ చేయాలన్నారు. -
ఎస్ఎఫ్సీ ఎందుకు ఏర్పాటు చేయలేదు?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని (ఎస్ఎఫ్సీ) ఏర్పాటు చేయకపోవడంపై ఉమ్మడి హైకోర్టు మంగళవారం ప్రభుత్వ వివరణ కోరింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎస్‌ఎఫ్‌సీని ఏర్పాటు చేయక పోవడాన్ని సవా లు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి గతవారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు సీనియర్ న్యాయవాది సరసాని సత్యంరెడ్డి వాదనలు విని పిస్తూ, రాజ్యాంగంలోని అధికరణ 243(ఐ) ప్రకారం ప్రతి రాష్ట్రం కూడా ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేయడం తప్పని సరని పేర్కొన్నారు. ఎస్ఎఫ్సీ ఏర్పాటుకు 2015లో జీవో జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పటి వరకు దానిని కార్యరూపంలోకి తీసుకురాలేదని వివరించారు. -
నిద్రాణంగా ‘పరిషత్’ వ్యవస్థ!
సాక్షి, హైదరాబాద్: నిధుల్లేవ్.. విధుల్లేవ్.. అధికారాలూ లేవ్.. రెండున్నరేళ్లుగా రాష్ట్రంలో మండల, జిల్లా పరిషత్ వ్యవస్థల దుస్థితి ఇదీ. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో ప్రజలతో నేరుగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు వీస మెత్తు విలువ లేదు. ప్రభుత్వం చేపడుతున్న గ్రామజ్యోతి, ఉపాధిహామీ, ఇందిరాక్రాంతి పథకం కార్యక్రమాల్లోనూ స్థానిక ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేయలేక పోవడం వల్ల, ప్రజల్లో వారిపట్ల ఒక విధమైన చులకనభావం ఏర్పడుతోంది. స్థానిక సంస్థ లకు 29 ప్రభుత్వ విభాగాలపై ఆజమాయిషీ కల్పించాలని, ఈ మేరకు అధికారాలను బదలాయించాలని రాజ్యాంగం చెబుతున్నా, గత రెండున్నరేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం ఆ ఊసే ఎత్తడం లేదు. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 14వ ఆర్ధిక సంఘం నిధులు నేరుగా గ్రామ పంచాయతీలకే అందు తుండటంతో మండల, జిల్లా పరిషత్‌లకు అభివృద్ధి నిధుల్లేకుండా పోయాయి. తెలం గాణలో ఎస్‌ఎఫ్‌సీని గతేడాది ఏర్పాటు చేసినా నేటివరకు దానికి చైర్మన్‌నుగానీ, సభ్యులను గానీ ప్రభుత్వం నియమించలేదు. దీంతో ప్రభుత్వం విడుదల చేసిన నిధులను సర్పం చులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యేలే వారికిష్టమైన రీతిలో అభివృద్ధి పనులకు ఖర్చు చేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఒక్క పైసా కూడా ప్రభు త్వాలు కేటాయించకపోవడంతో మండల, జిల్లా పరిషత్‌లు నిద్రాణంగా మారాయి. ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవులు ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయి. రాష్ట్రంలోని 5,850 మంది ఎంపీటీసీలు, 456 మంది ఎంపీటీసీలకు వేతన బకాయిల నిమిత్తం రూ.18.12 కోట్లు విడుదల చేస్తూ గత అక్టో బర్లో పంచాయతీరాజ్ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసినా ఇంతవరకు అమలుకు నోచుకో లేదు. మరోవైపు మండల పరిషత్‌లకు నిధు ల్లేక ఆయా మండలాల్లో అభివృద్ధి పనులేమీ జరగకపోయినా సిబ్బందికి వేత నాల ఖర్చు మాత్రం తడిసి మోపెడవుతోంది. ఆందోళన బాట పడతాం పరిషత్ వ్యవస్థల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎంపీటీసీలకు, జడ్పీటీసీలకు గుర్తింపు లేకుండా పోయింది. గ్రామ జ్యోతిలో భాగస్వాములను చేస్తామని కరీంనగర్‌సభలో సీఎం ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోయింది. గతంలో ఇందిరాక్రాంతి, ఉపాధిహామీ పథకం సిబ్బంది ఎంపీటీసీల ఆధ్వర్యంలోనే పని చేసేవారు. ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో గ్రామాల్లో పాలన ప్రజా ప్రతినిధుల నుంచి అధికారుల చేతుల్లోకి పోయింది. పరిషత్ వ్యవస్థలపై ప్రభుత్వ ఉదాసీనతకు నిరసనగా త్వరలోనే ఆందోళనబాట పట్టాలని నిర్ణయించాం. – యు. మనోహర్‌రెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం -
15 రోజుల్లోనే అనుమతులు
♦ హెచ్ఎండీఏలో ఆన్లైన్ విధానం ♦ సీఎంతో ప్రారంభించేందుకు సన్నాహాలు ♦ అక్రమాలకు చెక్ పెట్టేందుకు యత్నం సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో వివిధ అనుమతులను ఇకపై ‘ఆన్లైన్’ ద్వారా కేవలం 15 రోజుల్లోనే అందించేందు కు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. దీన్ని సీఎం కేసీఆర్‌తో ప్రారంభించాలని యోచిస్తున్నారు. అవినీ తి, అక్రమాల పుట్టగా అపకీర్తిని మూటగట్టుకొన్న హెచ్ఎండీఏను గాడిలో పెట్టేందుకు ‘ఆన్లైన్ అప్రూవల్’ విధానాన్ని అమల్లోకి తెస్తున్నట్లు కమిషనర్ చిరంజీవులుతెలిపారు. ప్రస్తుతం హెచ్ఎండీఏ వెబ్సైట్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉందన్నారు. ఈ విధానంతో కొత్త లేఅవుట్లు, నూతన భవన నిర్మాణాలు, గోదాములు తదితర వాటికి అనుమతుల కోసం ప్రజలు హెచ్ఎండీఏ ప్రధాన కార్యాల యంలో నేరుగా సంప్రదించాల్సిన అవసరం ఉండదు. అనుమతులు ఇలా.. ఏదైనా అనుమతి కావాలంటే దరఖాస్తుదారు హెచ్ఎండీఏ వెబ్సైట్లోకి వెళ్లి ఆన్లైన్ ద్వారా సిటిజన్ ఫెసిలిటేషన్ సెంటర్ (సీఎఫ్‌సీ)కి దరఖాస్తు చేసుకోవచ్చు. వివిధ దశల్లో అధికారులు పరిశీలిస్తారు. దరఖాస్తుదారు నిర్ణీత ఫీజు (చలాన్)ను ఆన్లైన్ ద్వారా చెల్లించగానే అనుమతి పత్రం అందుతుంది. ఈ ప్రక్రియ 15 రోజుల్లో పూర్తయ్యేలా కమిషనర్ చర్యలు చేపట్టారు. దీనివల్ల అవినీతి, అక్రమాలకు అడ్డుకట్ట పడడంతో పాటు దరఖాస్తుదారుకు తక్కువ సమయంలోనే అనుమతులు చేతికందుతాయి. దరఖాస్తు ఏ పరిశీలన ఏ స్థితిలో ఉందో ఆన్లైన్ ద్వారా తెలుసుకొనే వెసులుబాటు ఉంది. -
కొండెక్కిన టెంకాయ
కొబ్బరికాయలు దేవస్థానం నిర్ణయించిన ధరలకే అమ్మాలని ఆదేశించి, అమలయ్యేలా గట్టి చర్యలు తీసుకుంటాను. అధిక ధరలకు అమ్మితే లెసైన్సు రద్దు చేయడానికి కూడా వెనుకాడను. వ్రతపురోహితులు, అర్చకులు, నాయీ బ్రాహ్మణులు, రజకులు, అధికారులు, ఇతర సిబ్బంది కలిపి దాదాపు వెయ్యిమంది పనిచేస్తున్నారు. వారందరి సంక్షేమానికీ చర్యలు తీసుకుంటాను. ట్రస్టు బోర్డు సమావేశంలో చర్చించి అన్నదానం విస్తరిలో ప్రసాదం పెట్టేలా చూస్తాను. పుష్కరాల సమయంలో భక్తుల సౌకర్యార్థం రూ.కోటితో మరుగుదొడ్లు, స్నానపు గదులు, షామియానాలు ఏర్పాటు చేస్తాం. భక్తుల ఇబ్బందులను తెలుసుకునేందుకు ‘సాక్షి’ చేసిన ప్రయత్నం అభినందనీయం. - ఈరంకి జగన్నాథరావు ఈఓ (ఎఫ్ఏసీ) ఈఓ జగన్నాథరావు : ఏమండీ మీపేరేంటి? ఎక్కడి నుంచి వచ్చారు? వ్రతం, దర్శనం ఎలా జరిగాయి? మీరేమైనా సమస్యలు ఎదుర్కొన్నారా? భక్తుడు : సార్ నా పేరు చలసాని రవీంత్రనాథ్ ఠాగూర్. విశాఖపట్నం నుంచి వచ్చామండి. వ్రతం, దర్శనం బాగానే జరిగిందండి. మీరేమో అధికారిలా ఉన్నారు. ‘సాక్షి’ మైకు పట్టుకున్నారు. ఏమనుకోనంటే ఒక్క సమస్య చెబుతాను.. ఒక్క కొబ్బరికాయ రూ.20 పెట్టి కొనాలంటే ఎలాగో మీరే చెప్పండి. ఇంత దారుణంగా అమ్ముతున్నారే. కొబ్బరికాయ, ఇతర సామగ్రి సెట్టుకు రూ.150 పైనే తీసుకొంటున్నారు. మాలాంటి మధ్యతరగతి వాళ్లకు ఇబ్బంది కదా సార్.. ఏదైనా ధరలు తగ్గించేలా చూడండి. కేశఖండన శాలలో సిబ్బంది రూ.10 డిమాండ్ చేస్తున్నారు. మీరే చర్యలు తీసుకోవాలి. ఈఓ : ఈ విషయం చెప్పినందుకు ధన్యవాదాలు. కొబ్బరికాయలతో పాటు ఇతర వస్తువుల ధరలు నియంత్రిస్తాను. (మరొకరితో) అబ్బాయి నీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? భోజనం క్యూలైన్లో ఉన్నారు కదా, ఏమైనా ఇబ్బందులుంటే చెప్పండి చెప్పండి. భక్తుడు : నాపేరు రామారావు. మాది కడియం సర్. ఇప్పటికే అరగంట నుంచి క్యూలైన్లోనే ఉన్నాం. ఇంత సమయం ఉండాలంటే వృద్ధులు, పిల్లల తల్లులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. ఈఓ : ఏమి చేస్తే ఆ ఇబ్బందులు తొలగిపోతాయో మీరే సూచించండి. అవకాశమున్న మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను. రామారావు : సర్.. వృద్ధులకు, వికలాంగులకు అన్నదానం వద్ద ప్రత్యేక ఏర్పాట్లు చేస్తే బాగుంటుంది. ఈఓ భోజన శాలలో) : బాబూ నీపేరేంటి ? మీదే ఊరు? భోజన ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఆహార పదార్థాలు రుచికరంగా ఉన్నాయా? భక్తుడు: నాపేరు శ్రీనివాస్ సర్. మా ఊరు తుని మండలం తేటగుంట సర్. భోజన ఏర్పాట్లు బాగానే ఉన్నాయి. కానీ ఒక్కటే వెలితి.. గతంలో భోజనం విస్తరాకులో పెట్టేవారు. ఇప్పుడు పెట్టడం లేదు. ఆకులో పెడితే అదో సంతృప్తి సార్.. ఒక్కసారి ఆలోచించండి. ఈఓ : ఇదివరకు ఆకులో ప్రసాదం వేయడం నిజమే. బోర్డు మీటింగ్‌లో నిర్ణయం తీసుకుంటాం.. సరేనా? (మరొకరితో) నీ పేరేమిటి, ఉద్యోగిలా ఉన్నావు, ఏ విభాగంలో పనిచేస్తున్నావు. అన్నదాన సత్రంలో ఏర్పాట్లు ఏమిటి? ఇబ్బందులేంటి? ఉద్యోగి : గుడ్‌మార్నింగ్ సర్ నా పేరు భాస్కరరావు. భోజనశాలలో సూపరింటెండెంట్‌ను. పర్వదినాల్లో భక్తులు ఎక్కువగా వస్తున్నారు. రెండు చోట్ల భోజన సత్రాలు నిర్వహిస్తున్నాం. భక్తులందరికీ ఒకే చోట పెట్టేలా భవనం ఉంటే బాగుంటుంది సర్, ఈఓ : ఏమయ్యా నీపేరేమిటి? భోజనం వద్ద ఏమైనా ఇబ్బందికరంగా ఉందా? భక్తుడు : నా పేరు వెంకటేశ్వరరావు సర్. భోజనం క్యూలైన్లలో ఎక్కువమంది ఉన్నప్పుడు కొందరు ఎండలో ఇబ్బంది పడుతున్నారు సర్. పాత భోజన శాల నుంచి కొత్త భోజనశాలకు మధ్య ఎండలో పిల్లలు మాడిపోతున్నారు సర్. ఈఓ : రెండు చోట్లా భోజన ఏర్పాట్లకు, రెండింటికీ మధ్య షెడ్లు నిర్మించేందుకు చర్యలు తీసుకుంటాం. (మరొకరితో) మీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? సత్యదేవుని వ్రతం, దర్శనం చేసుకున్నారా? ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? భక్తుడు : నాపేరు ఇల్ల సత్యనారాయణండీ. పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం నుంచి వచ్చామండీ. నోములు బాగానే చేసుకున్నాం. దర్శనం కూడా బాగానే అయ్యింది. సౌకర్యాలన్నీ సంతృప్తికరంగా ఉన్నాయి. ఈఓ : మీకు ధన్యవాదాలు. స్వామివారిని మరోసారి దర్శించుకోండమ్మా. (మరొకరితో) మీపేరేంటి స్వామీ? ఎక్కడి నుంచి వచ్చారు? కొండపై సమస్యలేమైనా ఎదుర్కొన్నారా? భక్తుడు : సర్ నాపేరు రాంబాబు. గన్నవరం నుంచి వచ్చాము. భక్తులకు మెట్ల మార్గంలో సరైన తాగునీటి ఏర్పాట్లు లేవు. అంతరాలయ దర్శనానికి రూ.100 టిక్కెట్టు మరీ ఎక్కువ సారూ. సాధారణ దర్శనం చేసుకున్నాం. ఈఓ : ఆ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం ఓకేనా. (ప్రసాదం తయారీ విభాగంలో) నీ పేరేమిటి బాబూ? ఎన్నాళ్ల నుంచి ప్రసాదం సెక్షన్లో పనిచేస్తున్నావు? ప్రసాదం తయారీ, ప్యాకింగ్‌లో ఇబ్బందులున్నాయా? ఉద్యోగి : నమస్కారం సారూ. నా పేరు లింగంపల్లి చిన్నారావండీ. ప్రసాదం ప్యాకరుగా 1986 నుంచి పనిచేస్తున్నాను సర్. ప్రసాదం గతంలో పుల్లల పొయ్యిపై తయారయ్యేది. పాలు వినియోగించే వారు. ఎక్కువకాలం నిల్వ కోసం పాలు వేయడం మానేశారు. ఈఓ : మీకు ఏప్రాతిపదికన వేతనం ఇస్తున్నారు? ఉద్యోగి : అమ్మకం జరిగిన ప్యాకెట్టుపై 35 పైసల చొప్పున ఇస్తే మేమంతా పంచుకుంటున్నామండీ. కమీషన్ పద్ధతి తీసేసి జీతాలివ్వాలని ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నాం. కాస్త పుణ్యం కట్టుకోండయ్యా. ఈఓ : ఎలాగూ ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నామంటున్నారు కదా.. నేను కూడా నా వంతు ప్రయత్నిస్తాలే (మరొకరితో) ఏమయ్యా నీపేరు? ఎన్నాళ్ల నుంచి ప్రసాదం కావిళ్లు మోస్తున్నావు? జీతమెంత? ఉద్యోగి : నాపేరు నంబారు కాగితమ్మ. సుమారుగా 24 ఏళ్లుగా పనిచేస్తున్నా. కమీషన్‌గా నెలకు ప్రసాదం అమ్మకాన్ని బట్టి ఆరేడు వేలు వస్తోందయ్యా. పిల్లలు పెద్దవాళ్లయ్యారు. కుటుంబం గడవడం ఇబ్బందిగా ఉందయ్యా. ఉన్నతాధికారులకు దరఖాస్తు చేసుకున్నామయ్యా.. కమీషన్ పెంచాలయ్యా. ఈఓ : మీ సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తాను. (భక్తురాలితో) అమ్మా మీపేరు? ఎక్కడి నుంచి వచ్చారు? కొండపై మిమ్మల్ని ఎవరైనా డబ్బులు డిమాండ్ చేశారా? భక్తురాలు : నాపేరు కృష్ణవేణి సార్, మాది రాజమండ్రి. వ్రతం, దర్శనం చేసుకున్నాం. ఎక్కడా ఇబ్బంది లేదండీ. - ప్రజెంటర్స్ : లక్కింశెట్టి శ్రీనివాసరావు, పోతుల జోగేష్, తోట చక్రధర్. - ఫొటోలు : గరగ ప్రసాద్ -
ఉసూరుమన్న కసరత్తు
సాక్షి, సంగారెడ్డి: కొండను తవ్వి ఎలుకను పట్టిన చందగా మారింది జిల్లా పరిషత్ యంత్రాంగం తీరు. స్థానిక సంస్థలకు కేటాయించిన నిధుల వినియోగంపై జిల్లా పరిషత్ అధికారులు నిర్వహించిన భారీ కసరత్తు తుస్సుమంది. వివిధ పద్దుల కింద గడిచిన మూడేళ్లలో మంజూరైన వేల పనుల పురోగతిపై అధ్యయనం చేసి అందులో కేవలం 143 పనులు మాత్రమే ప్రారంభానికి నోచుకోలేదని తెలిసి చేతులు దులుపుకుంది. అదే విధంగా 77 పనుల రద్దుకు మాత్రమే సిఫారసు చేసింది. ప్రారంభం కాని పనులను ప్రారంభమైనట్లు, ప్రారంభమైనా పూర్తికాని పనులు పూర్తయినట్లు చూపించి ‘లేని పురోగతి’ని కాగితాలపై చూపించారనడానికి ఈ గణాంకాలు అద్దం పడుతున్నాయి. వెనకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులు(బీఆర్జీఎఫ్), జిల్లా పరిషత్, మండల పరిషత్‌ల సాధారణ నిధుల, రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు(ఎస్ఎఫ్సీ), 13వ ఆర్థిక సంఘం(టీఎఫ్సీ) నిధులతో కింద 2010-11, 2011-12, 2012-13 సంవత్సరాల్లో మంజూరైన పనుల స్థితిగతులపై మరోమారు సమగ్ర నివేదిక అందించాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ జడ్పీ సీఈఓ, పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఎస్ఈలకు ఆదేశించారు. దీంతో వారం రోజులుగా జడ్పీ యంత్రాంగం క్షేత్రస్థాయిలో ఎంపీడీఓలు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ ఈఈల నుంచి సమాచారాన్ని సేకరించి నివేదికలను తయారు చేసింది. ఈ మూడేళ్ల కాలంలో రూ.87.86 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 10,188 పనులు మంజూరైతే అందులో 8,523 పనులు పూర్తయినట్లు తేల్చింది. ఇంకా 1524 పనులు పురోగతిలో ఉండగా 143 పనులు మాత్రమే ఇంకా ప్రారంభానికి నోచుకోలేదని తేల్చింది. వివిధ కారణాల వల్ల కార్యరూపం దాల్చడం సాధ్యం కాని 77 పనుల రద్దుకు సిఫారసు చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా విభాగం(ఆర్డబ్ల్యూఎస్), ఎంపీడీఓల నిర్లక్ష్యానికి క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలు తోడు కావడంతో నిధులు మంజూరైనా ప్రారంభం కాని పనుల సంఖ్య ఎన్నో రేట్లు ఎక్కువ ఉంటుందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. క్షేత్రస్థాయి నుంచి ఎంపీడీఓలు, పీఆర్, ఆర్డబ్ల్యూఎస్ శాఖల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తప్పుడు సమాచారం ఇచ్చి నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రెండు డెడ్లైన్లు గడిచిన మూడేళ్లలో మంజూరై పెండింగ్‌లో పనులన్నింటినీ వచ్చే ఏడాది జనవరి 31 లోగా పూర్తి చేయాలని కలెక్టర్ డెడ్‌లైన్ విధించారు. అదే విధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మంజూరైన పనులను మార్చి 31లోగా పూర్తి చేయాలని గడువు పెట్టారు. అయితే, గడిచిన మూడేళ్లలో మంజూరై పెండింగ్‌లో ఉన్న 1,342 పనులను జనవరి 31లోగా పూర్తి చేస్తామని ఆయా శాఖల అధికారులు సమ్మతం తెలిపారు.