sheeps to yadavs
-
గొల్ల కుర్మల్ని ధనవంతుల్ని చేయడమే లక్ష్యం
సాక్షి, సిరిసిల్ల : పాడి-పంట బాగుంటేనే రైతు అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. సోమవారం సిరిసిల్ల పట్టణంలోని కళ్యాణ లక్ష్మి గార్డెన్స్‌లో రాష్ట్రస్థాయి రెండో విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి ప్రారంభించారు. ఇందులో భాగంగా లబ్దిదారులకు కేటీఆర్ 30 యూనిట్ల గొర్రెలను పంపిణీ చేశారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గతేడాది 60 లక్షల గొర్రెల పంపిణీ జరిగిందని, గొల్ల కుర్మలను ధనవంతులుగా మార్చాలనే ఉద్దేశంతోనే కేసీఆర్ ఈ పథకాన్ని ప్రారంభించారన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఆహార శుద్ధి పరిశ్రమలను ఏర్పాటు చేసి మాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేయబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. గొర్రెలు రీసైక్లింగ్ చేయకుండా ప్రభుత్వానికి సహకరించాలన్నారు. యాభైఏళ్ల కాంగ్రెస్‌పాలనలో ఒరిగిందేమీ లేదు యాభైఏళ్ల కాంగ్రెస్‌పాలనలో ఒరిగిందేమీ లేదని కేటీఆర్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనులే ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని, రానున్న రోజుల్లో తెలంగాణలో హరిత, నీలి, గులాబి, శ్వేత విప్లవాలు రాబోతున్నాయని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 వేల చెరువులు నిండి నీలి విప్లవం రాబోతుందని కేటీఆర్ తెలిపారు. -
గొర్రె చెవికి పోగులు.. ప్రభుత్వం చెవిలో పువ్వులు!
నారాయణపేట రూరల్ (మహబూబ్ నగర్) : వెనకబడిన కులాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం కురుమ యాదవులకు అందించిన సబ్సిడీ గొర్రెల పథకం నీరుగారుతుంది. లొసుగులను అడ్డం పెట్టుకుని అధికారులతో కుమ్ముక్కై పాత గొర్రెలనే సబ్సిడీ కింద కొనుగోలు చేస్తున్నట్లు చూయించి గొర్రె చెవుకు పోగులు వేసి ప్రభుత్వం చెవిలో పువ్వులు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆదివారం కర్ణాటక రాష్ట్రానికి ఆరు వాహనాల్లో గొర్రెలు పోయినట్లు స్థానికులు చెబుతున్నారు. కొల్లంపల్లి, ధన్వాడ, మరికల్‌తోపాటు పలువురు మేత కోసం గుంటూరు, కరీంనగర్, విజయవాడ ప్రాంతాలకు గొర్రెలను తీసుకువెళ్తారు. అయితే ఇటీవల గొర్రెల పథకంలో రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ నిర్ణయించడంతో వెటర్నరీ డాక్టర్లు వాటిని పూర్తి చేయడం కత్తిమీద సాములా మారింది. పైగా పెద్ద మొత్తంలో గొర్రెలు అవసరం ఉండటంతో పలుచోట్ల రోజుల తరబడి ఎంపీడీఓ, తహసీల్దార్‌తో కలిసి బృందాలు పర్యటించి పరిశీలించిన అందుకు తగిన గొర్రెలు దొరకలేదు. ఈ మేరకు గొల్ల కురుమలతో అధికారులు మాట్లాడుకుని రాత్రికి రాత్రి అక్కడికి తరలించి కర్ణాటకలోని వ్యక్తులతో కొనుగోలు చేసినట్లు పత్రాలు సృష్టించి అక్కడి వ్యక్తుల అకౌంట్లోకి డబ్బులు బదిలీ చేయిస్తున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేట శివారులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 గొర్రెలు మృతిచెందిన సంఘటనకు సంబంధించి లోతుగా పరిశీలిస్తే కర్ణాటకకు మేత పేరుతో తీసుకువెళ్తున్నట్లు తెలిసింది. వాస్తవానికి ప్రమాదం జరిగిన సమయంలో 20 గొర్రెలు ఊపిరి ఆడక చనిపోతే రికార్డులో మాత్రం 8 గొర్రెలుగా నమోదు చేశారు. గొర్రెల తరలింపు వ్యవహారంలో లోతుగా విచారణ చేస్తే నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. -
గొర్రెలకు ఏం తెలుస్తుంది గొర్రెల విలువ: కేసీఆర్
సిద్దిపేట: మూడేళ్లలో గొర్రెలపై తెలంగాణ యాదవులు, కురుమలు రూ.25వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తారని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఈ విషయం చాలామంది గొర్రెలకు (పరోక్షంగా విపక్షాలను ఉద్దేశిస్తూ) అర్థంకాదని విమర్శించారు. 2024నాటికి తెలంగాణ బడ్జెట్ 5కోట్లకు చేరుతుందని అన్నారు. మంగళవారం సిద్దిపేటలో పర్యటనలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గం కొండపాకలో గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించారు. డోలు వాయించి కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి హరీష్‌రావు, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈసందర్భంగా 825 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లు కేసీఆర్ అందజేశారు. ఒక్కో లబ్దిదారుడికి 20 గొర్రెలు, ఒక పొట్టేలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రంలో మొత్తం 7 లక్షల 18వేల మందికి కోటిన్నర గొర్రెలను పంపినీ చేస్తాం. మూడేళ్లలో వీటి ద్వారా 25 వేల కోట్ల ఆదాయం వస్తుంది. గొర్రెలకు వైద్యం కోసం 1962 టోల్ ఫ్రీ నెంబర్ కేటాయిస్తున్నాం. 2024నాటికి తెలంగాణ బడ్జెట్ 5లక్షల కోట్లకు చేరుతుంది. రైతులకు నీళ్లు, కరెంట్, పెట్టుబడి ప్రభుత్వమే ఇస్తుంది. ఎకరాకు రూ.4వేల ఎరువులు పెట్టుబడిగా ఇస్తాం. గ్రామీణ తెలంగాణ వికాసమే మా లక్ష్యం. కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతాం. విపక్షాలు ప్రాజెక్టులను అడ్డుకోవడమే పనిగా పెట్టుకున్నాయి. వచ్చే ఏడాది జూన్‌కల్లా కొండపాకకు గోదావరి నీళ్లు వస్తాయి’ అని కేసీఆర్ అన్నారు.