Shortage of labor
-
యాంత్రీకరణకు పొగాకు రైతుల మొగ్గు
దేవరపల్లి: కూలీల కొరత తీవ్రం కావడంతో రైతులు వ్యవసాయంలో యాంత్రీకరణ వైపు మొగ్గు చూపుతున్నారు. యాంత్రీకరణను ప్రభుత్వం ప్రోత్సహించి రాయితీలు కల్పించడంతో ఎక్కువ మంది రైతులు సాగులో మెషీన్ల సాయంతో లబ్ధిపొందుతున్నారు. పొగాకు సాగుకు కూలీల సమస్య ఏర్పడడంతో పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంతం రైతులు యంత్రాల సాయం తీసుకుంటున్నారు. దీనిలో భాగంగా పొగాకు క్యూరింగ్ విధానంలో మార్పులు తీసుకొస్తున్నారు. సాధారణంగా తోటలోని పొగాకు రెలిసి బ్యారన్ వద్దకు తీసుకువచ్చి కర్రలకు అల్లి బ్యారన్లో ఉంచి క్యూరింగ్ చేస్తారు. ఈ విధానం వల్ల ఉత్పత్తి వ్యయం పెరగడంతో పాటు కూలీల సంఖ్య ఎక్కువ అవసరం. ఈ విధానానికి స్వస్తి పలకడానికి విదేశాల్లో అవలంభిస్తున్న నూతన టెక్నాలజీని తీసుకువచ్చారు. జర్మనీలో రైతులు ఏర్పాటు చేసిన లూజ్‌లీఫ్ బ్యారన్లను పరిశీలించిన అధికారులు ఆంధ్రప్రదేశ్‌లో అమలు చేస్తున్నారు. రెండు సంవత్సరాలుగా బ్రెజిల్ నుంచి పరికరాలను దిగుమతి చేసుకుని జిల్లాలోని గోపాలపురం, యర్నగూడెంలో బ్యారన్లు నిర్మించారు. సుమారు రూ.9 లక్షల వ్యయంతో బ్యారన్ నిర్మించి ప్రయోగాత్మకంగా క్యూరింగ్ చేశారు. దీనివల్ల మంచి ఫలితాలు రావడంతో ఐటీసీ భాగస్వామ్యంతో ఈ ఏడాది గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో 14 యూనిట్ల నిర్మాణం చేపట్టారు. వీటిని పొగాకు క్యూరింగ్‌కు మాత్రమే కాకుండా మల్టీపర్పస్ యూనిట్లుగా వినియోగిస్తున్నారు. చిట్యాలలో 4 యూనిట్ల నిర్మాణం మల్టీపర్పస్ యూనిట్ ఖరీదు రూ.9 లక్షలుగా ఉంది. ఐటీసీ రూ.3 లక్షలు, పొగాకు బోర్డు రూ.3 లక్షలు ఇస్తుండగా, రైతు వాటాగా రూ.3 లక్షల వ్యయంతో నిర్మిస్తున్నారు. గోపాలపురం మండలంలోని చిట్యాలలో ఈ ఏడాది 4 యూనిట్లు నిర్మిస్తున్నారు. పొగాకు క్యూరింగ్‌తో పాటు కొబ్బరి, మొక్కజొన్న, అల్లం, పసుపు వంటి పంటలు డ్రై చేస్తున్నారు. 2,500 కొబ్బరి కాయలు ఒకేసారి డ్రై చేస్తున్నారు. దీనికి 30 గంటల సమయం పడుతుంది. 25 క్వింటాళ్ల మొక్కజొన్న గింజలను 12 గంటల్లో డ్రై చేస్తున్నారు. శీతాకాలం, వర్షాకాలంలో యూనిట్ బాగా ఉపయోగపడుతుంది. డ్రై చేసిన పంటను గిట్టుబాటు ధర వచ్చే వరకు నిల్వ చేసుకోవచ్చని రైతులు అంటున్నారు. మల్టీపర్పస్ యూనిట్ల వల్ల రైతుకు 50 శాతం ఖర్చు తగ్గుతుంది. కూలీల అవసరం ఉండదు. పొగాకు రైతులకు ఇది ఉపయోగకరంగా ఉంటుంది. సాధారణ పద్థతిలో రెండు బ్యారన్లు క్యూరింగ్ చేసే పొగాకును లూజ్‌లీఫ్ బ్యారన్లో ఒకేసారి చేయవచ్చు. సాధారణ పద్ధతికి, లూజ్‌లీఫ్ బ్యారన్లో క్యూరింగ్ చేసే విధానానికి బ్యారన్‌కు సుమారు రూ.1.50 లక్షల తేడా వస్తుందని రైతులు తెలిపారు. బ్యారన్‌కు రెండు క్వింటాళ్లు పొగాకు ఆదా అవుతుంది. ఆటో ప్యానల్ బోర్డు ఏర్పాటు లూజ్‌లీఫ్ బ్యారన్‌కు ఆటో ప్యానల్ బోర్డు ఏర్పాటు చేశారు. క్యూరింగ్‌లో టెంపరేచర్ హెచ్చు తగ్గులను బోర్డులోని సెన్సార్ పరికరం సరి చేసుకుంటుంది. ఒకేసారి 1200 నుంచి 1300 కిలోల పొగాకు క్యూరింగ్ అవుతుంది. రైతులకు అన్ని విధాలుగా ఉపయోగం పొగాకు క్యూరింగ్ కోసం ఏర్పాటు చేసిన లూజ్ లీఫ్ బ్యారన్లు మల్టీపర్పస్ యూనిట్లుగా ఉపయోగపడుతున్నాయి. పొగాకు క్యూరింగ్‌తో పాటు డ్రయర్‌గా ఉపయోగిస్తున్నాం. కొబ్బరి, మొక్కజొన్న, పసుపు, అల్లం వంటి పంటల్ని డ్రై చేసి నిల్వ ఉంచుతున్నాం. కూలీల సమస్యను అధిగమించమించడంతోపాటు పంట నాణ్యత బాగుంటుంది. బ్యారన్‌కు ఏడాదికి రెండు క్వింటాళ్లు పొగాకు ఆదా అవుతుంది. – గద్దే శ్రీనివాస్, యర్నగూడెం -
నిర్మాణ కార్మికులు దొరకట్లేదు!
మియాపూర్‌లోని ఓ ప్రాజెక్ట్ నిర్మాణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. కారణం, నిధుల్లేక కాదు.. లేబర్ దొరక్క! సార్వత్రిక ఎన్నికలని వెళ్లిన కార్మికులు తిరిగి రావట్లేదనేది కాంట్రాక్టర్ వాదన. పోనీ, స్థానిక లేబర్స్‌తో పనులను చక్కబెట్టేద్దామంటే? నైపుణ్య సమస్య! .. ఇది కేవలం ప్రైవేట్ డెవలపర్లే కాదండోయ్.. హౌసింగ్ ఫర్ ఆల్, కేసీఆర్ 2 బీహెచ్‌కే వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా కార్మికుల కొరతను ఎదుర్కొంటున్నాయి. ఫలితంగా గృహాల నిర్మాణం ఆలస్యమవుతున్నాయి. సాక్షి, హైదరాబాద్: ప్రస్తుతం దేశీయ నిర్మాణ రంగంలో 5 కోట్ల మంది కార్మికులున్నారు. ఇందులో నైపుణ్యమున్న కార్మికులు 2 కోట్ల లోపే. పస్తుతం 6.42 లక్షల మంది సివిల్ ఇంజనీర్లు, 65 వేల మంది ఆర్కిటెక్ట్‌లు, 18 వేల మంది ప్లంబర్లు అందుబాటులో ఉన్నారు. 2022 నాటికి ఈ రంగంలో 8.3 కోట్ల మంది కార్మికులు అవసరం ఉంటుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. కార్మికులతో పాటూ ప్లానర్స్, ఇంజనీర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, సర్వేయర్స్, ఆర్కిటెక్ట్స్ వంటి అన్ని విభాగాల్లోనూ మానవ వనరుల అవసరం ఉంది. ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్‌లో 70–75 వేల మంది నిర్మాణ కార్మికులుంటారు. గతంలో ఒంగోలు, శ్రీకాకుళం ప్రాంతాల కార్మికులు హైదరాబాద్ నిర్మాణ రంగంలో పనిచేసేవాళ్లు. కానీ, ప్రభుత్వ ఉచిత పథకాల కారణంగా చాలా వరకు కార్మి కుల వలస తగ్గిపోయింది. దీంతో బిహార్, మహారాష్ట్ర, కోల్‌కతా, వెస్ట్ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, అస్సాం, ఒరిస్సా రాష్ట్రాల కార్మికుల మీద ఆధారపడాల్సి వస్తుంది. కార్మికుల ధరలివే: రోజుకు మేస్త్రీకి రూ.700–900, లేబర్ (మగవారికి) రూ.450–500, ఆడవాళ్లకు 300–350, షటరింగ్కు చ.అ.కు రూ.12–14, రాడ్ బెండింగ్ టన్నుకు రూ.6,000. ఎందుకు తగ్గిపోయారంటే? ► ద్వితీయ, తృతీయ శ్రేణి ప్రాంతాల్లోనే నిర్మాణ పనులు జరుగుతుండటంతో మెట్రో నగరాలకు కార్మికుల వలస తగ్గింది. ► సార్వత్రిక ఎన్నికల కని వెళ్లిన కార్మికులు తిరిగి పనులకు రాకపోవటం. ► కార్మికుల్లో కష్టపడే తత్వం తగ్గిపోవటం. గ్రామీణ, పట్టణాల్లోని యువత ప్రధాన నగరాల్లో మేస్త్రీలు, కార్పెంటర్లుగా పనిచేయడానికి ఇష్టపడకపోవటం. ► వేతన అసమానతలు, కఠినమైన పని షెడ్యూల్డ్స్, ప్రసూతి సెలవులు లేకపోవటం. ప్రతికూల వాతావరణ పరిస్థితులు. ► కనీస అవసరాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే తీరుస్తుండటం. ► ఉచిత విద్య, నిరుద్యోగ భృతి, పింఛన్లు, బీమా, ఇల్లు ప్రభుత్వమే అందిస్తుండటం. కార్మికుల కొరతతో ఏమవుతుందంటే? ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న కార్మికులు, అరకొర పనిముట్లతో పూర్తి స్థాయిలో నిర్మాణ పనులను చేయలేరు. ► కొనుగోలుదారులకు ఇచ్చిన గడువులోగా ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాదు. నిర్మాణం నాణ్యత దెబ్బతింటుంది. ► కార్మికులు, నిర్మాణ వ్యయం పెరుగుతుంది. కాబట్టి దాని ప్రభావం కంపెనీ కార్యకలాపాల మీద పడుతుంది. అంతిమంగా స్థిరాస్తి ధరలు పెరుగుతాయి. ► కంపెనీలకు నైపుణ్యమున్న మానవ వనరుల నియామకం, శిక్షణ భారంగా మారుతుంది. టెక్నాలజీనే సరైన మందు.. నిర్మాణ పనుల్లో సాంకేతికతను వినియోగించడం ద్వారా కార్మికుల కొరతను అధిగమించవచ్చు. 80 శాతం కార్మికుల కొరతను టెక్నాలజీ భర్తీ చేస్తుంది. ఉదాహరణకు హై రైజ్ భవనాల్లో మైవాన్ టెక్నాలజీ, ప్రీ–కాస్ట్‌తో వాల్స్, కాలమ్స్, బీమ్స్ల ఏర్పాటు, రోబోటిక్స్‌తో పెయింటింగ్ వంటివి. నిర్మాణ పనుల్లో సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించేందుకు, ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం కూడా ముందుకురావాలి. పన్ను రాయితీలు, ప్రోత్సాహకాలను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు. డెవలపర్ల సంఘాలతో కలిసి ప్రభుత్వం కార్మికులకు నైపుణ్య శిక్షణతో పాటూ పూర్తి స్థాయి పనిముట్లను సమకూర్చాలని సూచిస్తున్నారు. చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు చుక్కలే.. హై రైజ్ భవనాలు, ఒకే రకమైన గృహ సముదాయాలకు, కమర్షియల్ ప్రాజెక్ట్‌లకు మైవాన్ షటరింగ్ టెక్నాలజీ కరెక్ట్. చిన్న ప్రాజెక్ట్‌లకు ఈ టెక్నాలజీని వినియోగించలేం. ఎందుకంటే డెవలపర్లకు వ్యయం భారంగా మారుతుందని ఓ డెవ లపర్ తెలిపారు. నైపుణ్యమున్న కార్మికుల కొరత కారణంగా 100 మంది పనిచేయాల్సిన చోట 20 మంది మాత్రమే ఉంటున్నారని పేర్కొన్నారు. 7–8 అంతస్తుల్లోపు నిర్మాణాలు చేపట్టే 85 శాతం చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు కార్మికులు దొరక్క ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్అండ్డీ అవసరం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేకపోవటంతో పెద్ద ప్రాజెక్ట్‌లకు అందుబాటులో ఉన్నంత సులువుగా, సౌకర్యవంతంగా చిన్న, మధ్య స్థాయి డెవలపర్లకు అందట్లేదు. ఐఐటీ, ఐఐఎం వంటి సంస్థలు మేనేజ్మెంట్తో పాటూ నిర్మాణ సాంకేతికత మీద కూడా పరిశోధనలు చేయాల్సిన అవసరముంది. – ఇంద్రసేనా రెడ్డి, ఎండీ, గిరిధారి హోమ్స్ ప్రీ–కాస్ట్ గృహాల మీద అవగాహన కల్పించాలి ప్రధాన నగరంలో ప్రీ–కాస్ట్ తయారీ యూనిట్లను నెలకొల్పి.. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకు ఉత్పత్తులను సరఫరా చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం, డెవలపర్ల సంఘాలు ముందుకురావాలి. ప్రీ–కాస్ట్ గృహాల అన్ని రకాల వాతావరణ పరిస్థితులు తట్టుకోవనో లేదా నాణ్యత విషయంలోనో ప్రజల్లో ఉన్న అపోహను తొలగించాలి. ఇందుకోసం డెవలపర్ల సంఘాలు, ప్రభుత్వం విస్తృతస్థాయిలో ప్రచారం చేయాలి. – సీ రామచంద్రా రెడ్డి, జనరల్ సెక్రటరీ, క్రెడాయ్ రెరా, జీఎస్టీ, బినామీ ట్రాన్స్యాక్షన్ యాక్ట్ వంటి చట్టాలతో దేశంలో రియల్టీ లావాదేవీలు పారదర్శకత, వేగం, జవాబుదారీతనం పెరిగింది. దీంతో ఎన్ఆర్ఐ వ్యక్తిగత పెట్టుబడులు, ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) ఇన్వెస్ట్మెంట్స్ పెరుగుతున్నాయి. బెంగళూరు, ముంబై, చెన్నై, పుణె, హైదరాబాద్, ఢిల్లీ–ఎన్సీఆర్ వంటి ప్రధాన నగరాల్లో ఆఫీస్ స్పేస్, మాల్స్, గ్రేడ్–ఏ ఆఫీస్‌లు, కో–వర్కింగ్ ప్రాపర్టీలకు డిమాండ్ ఉంది. -
పసుపు తవ్వే పరికరం ఇదిగో..!
తయారు చేసుకున్న తొంబరావుపేట రైతు శాస్త్రవేత్తలు..10 రోజులు తవ్వే పసుపును ఈ పరికరంతో ఒక్క రోజులోనే పూర్తి పసుపును సాగు చేసే రైతులు, పసుపు తవ్వకం సమయంలో కూలీలు దొరక్క చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం తొంబరావుపేట గ్రామానికి చెందిన పసుపు రైతులు తమ సమస్యలకు తామే తగిన పరిష్కారాలు వెతుక్కుంటున్నారు. గత జూలైలో పసుపు విత్తే సమయంలో కూడా కూలీల కొరత నేపథ్యంలో తమకు అవసరమైన విధంగా పసుపు వేసే పరికరాన్ని తయారు చేసుకున్నారు (దీనిపై ‘సులువుగా పసుపు విత్తే పరికరం’ కథనాన్ని 2017 జూలై 11న ‘సాగుబడి’లో ప్రచురించాం). అదే వరుసలో.. ట్రాక్టర్‌కు బిగించి పసుపు తవ్వే పరికరాన్ని తాజాగా రూపొందించుకోవడం విశేషం. బెడ్ పద్ధతికి అనువుగా నూతన పరికరం.. ఈ అధునాతన పసుపు తవ్వే పరికరాన్ని మినీ ట్రాక్టర్‌కు వెనుక జోడించి ఉపయోగించవచ్చు. బెడ్ పద్ధతిలో సాగు చేసిన పసుపు పంటకు ఇది మరింతగా ఉపయోగపడుతుంది. బెడ్ల మధ్య 18 అంగుళాలు, సాళ్ల మధ్య 12 అంగుళాల దూరం ఉంటుంది. ఒక బెడ్‌పై రెండు లైన్ల పసుపు మొక్కలు ఉంటాయి. పసుపు పక్వానికి వచ్చి ఆకులు పసుపు వర్ణానికి మారిన తర్వాత, రైతులు పసుపు ఆకును కోస్తారు. ఆ తర్వాత పసుపు తవ్వడానికి మినీ ట్రాక్టరుకు ఈ పరికరాన్ని జోడించి ఉపయోగిస్తున్నారు. పసుపు తవ్వకానికి నాలుగు రోజులు ముందు పొలమంతా సాగు నీటిని పారగట్టడం తప్పని సరి. ఈ పరికరం పసుపు సాళ్లలో వెళ్లినప్పుడు పసుపు పైకిలేచి తిరిగి అందులోనే ఉంటుంది. దీనివల్ల పసుపు ఎండిపోకుండా ఉంటుంది. పరికరం ద్వారా తవ్విన తర్వాత కూలీలు వచ్చినప్పుడు కొమ్ములను విరుచుకోవచ్చు. పసుపు తవ్వినందుకు ట్రాక్టర్ కిరాయిగా ప్రస్తుతం గంటకు రూ. 800 వరకు తీసుకుంటున్నారు. భూమి ఎత్తు పల్లాలు లేకుండా ఉంటే తవ్వకం తొందరగా పూర్తవుతుంది. కొంతమంది రైతులు ఇటీవల పెద్ద ట్రాక్టర్‌కు సైతం ఇలాంటి పరికరాన్ని రూపొందిస్తున్నారు. రైతులందరం కలిసి తయారుచేసుకున్నాం.. పసుపు విత్తడానికి, తవ్వడానికి మా ఊర్లో కూలీలు దొరకడం లేదు. దీంతో, యువ రైతులందరం కలిసి ఆలోచించాం. దాంతో, ఒక్కొక్కరు తమ అనుభవాలను చెప్పడంతో, దాని ప్రకారం ట్రాక్టర్‌కు బిగించి పసుపు విత్తే పరికరాన్ని గతంలో తయారు చేశాం. ఇప్పుడు పసుపు తవ్వే పరికరాన్ని రూపొందించాం. దీంతో, రోజుల తరబడి చేసే పనులను ఒకే రోజులో చేయగలుగుతున్నాం. పెద్ద ట్రాక్టర్‌కు కూడా బిగించే పరికరాన్నీ సిద్ధం చేస్తున్నాం. – ఏలేటి రాజిరెడ్డి(94942 72409), తొంబరావుపేట, జగిత్యాల జిల్లా ఒక కూలీ ఖర్చుతోనే అరెకరం పసుపు తవ్వాను.. ఈ నూతన పరికరం ద్వారానే తన ఎకరం తోటలో వేసిన పసుపును తవ్వాను. అంతకుముందు కూలీలతో తవ్వించినప్పుడు పసుపు కొమ్ములు చెడిపోయేవి. ఎకరం పసుపు తవ్వకానికి కూలీలు దొరక్క దాదాపు 10 రోజులు పట్టేది. ఈ పరికరం రావడంతో ఒక రోజు తవ్వి, మరో రోజు కొమ్ములు విరవడంతో పని తేలికైంది. ఒక కూలీ ఖర్చుతోనే అర ఎకరం పసుపు తవ్వాను. – నల్ల రవి(95535 25623), తొంబరావుపేట, మేడిపల్లి మం., జగిత్యాల జిల్లా – పన్నాల కమలాకర్ రెడ్డి, జగిత్యాల అగ్రికల్చర్, సాక్షి -
బెల్లం అల్లమే!
కామారెడ్డి: బెల్లం ఉత్పత్తిలో కామారెడ్డి ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు ఉండేది. విశాఖ జిల్లా అనకాపల్లి తరువాతి స్థానంలో కామారెడ్డి ప్రాంతం నిలిచేది. అప్పట్లో ఏటా కామారెడ్డి డివిజన్లో 60 వేల ఎకరాల నుంచి 70 వేల ఎకరాల వరకు చెరకు పంట సాగయ్యేది. వందలాది లారీలలో బెల్లం గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక వంటి రాష్ట్రాలకు తరలిపోయేది. చెరకు పంట నరికివేతకు ముందే రైతులు క్రషర్లను, పొయ్యిలను రెడీ చేసుకునేవారు. ఏ ఊరికి వెళ్లినా వందలాది క్రషర్లు నడిచేవి. రాత్రి, పగలు తేడా లే కుండా రైతులు క్రషర్ల వద్ద పనుల్లో నిమగ్నమయ్యేవారు. బెల్లం తయారు చేసిన రైతులే గాక బెల్లం వ్యాపారులు కూ డా ఎన్నో లాభాలు ఆర్జించేవారు. ఇ దంతా గతం. ఇప్పుడు బెల్లం పేరెత్తితే చాలు పెదవి విరుస్తున్నారు. చెరకు సాగు నుంచి మొదలుకొంటే బెల్లం త యారీదాకా అన్ని రకాల పెట్టుబడు లు భారీగా పెరిగాయి. దానికనుగు ణంగా ధరలు పెరుగకపోవడంతో రై తులు బెల్లం తయారీపై ఆసక్తి చూపడం లేదు. ముఖ్యంగా కరెంటు, కూలీల కొరత వంటి సమస్యలతో రైతులు బెల్లం తయారీకి దూరమయ్యారు. ఏటా దీపావళి వరకు బెల్లం ముద్దలు మార్కెట్‌కు చేరేవి. ఈసారి ఇప్పటిదాకా ఒక్క ముద్ద కూడా మార్కెట్‌కు వచ్చిన దాఖలాలు లేవు. ఏం జరిగిందంటే కామారెడ్డి ప్రాంతంలో గాయత్రి షుగర్ ఫ్యాక్టరీ వచ్చిన తరువాత బెల్లం తయారీకన్నా చెరకును ఫ్యాక్టరీకి పంపడానికే రైతులు ఆసక్తి చూపారు. అయితే ఫ్యాక్టరీలో సమయానికి పర్మిట్లు దొరక్క, కూలీల కొరతలు ఏర్పడడం వంటి కారణాలతో రైతులు బెల్లం తయారుకు మొగ్గుచూపినా, మార్కెట్లో బెల్లానికి సరైన ధరలు లభించడం లేదు. కామారెడ్డి ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే నల్లబెల్లంపై 2000 సంవత్సరంలో తెలుగుదేశం ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావంతో బెల్లం ధరలు పడిపోయి తయారీకి బ్రేకులు పడ్డాయి. ఆంక్షలపై బెల్లం రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. 2001లో భిక్కనూరులో బెల్లం రైతుల ఆందోళనలు తీవ్రరూపం దాల్చి పోలీసు లాఠీ చార్జి చేయడంతో, కోపోద్రిక్తులైన రైతులు పోలీసు వాహనాలను, బస్సులను ధ్వంసం చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. 40 మంది వరకు రైతులను జైలుకు పంపించారు. వైఎస్ఆర్ వచ్చాక ఆంక్షల ఎత్తివేత 2004లో డాక్టర్ రాజశేఖరరెడ్డి తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తరువాత బెల్లంపై ఆంక్షలను ఎత్తివేశారు. మళ్లీ గత రెండుమూడేళ్ల నుంచి బెల్లంపై అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి. వరంగల్, కరీంనగర్ జిల్లాలలో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు బె ల్లం లారీలను సీజ్ చేసిన సంఘటనలతో బెల్లం ధర లు పడిపోయాయి. ఇటీవల కూడా బెల్లం లారీలను పట్టుకోవడంతో వ్యాపారులు, రైతులు సీఎం కేసీఆర్ ను కలిసి విన్నవించారు. ఆంక్షలు లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. అయితే ఎప్పుడు ఏమవుతుందో తెలియని పరిస్థితులలో వ్యాపారులు కూడా ధైర్యం చేయడం లేదు. ఇదే సమయంలో పగ లు, రాత్రీ తేడా లేకుండా కష్టపడి ఇబ్బందులపాల య్యేకన్నా బెల్లం తయారీకి దూరం కావడమే నయమన్నట్టు రైతులు చెరకును ఫ్యాక్టరీకి తరలిస్తున్నారు. ఇప్పుడు కామారెడ్డి డివిజన్లో 20 వేల ఎకరాలకు మించి చెరకు పంట సాగు కావడం లేదు. భారీగా పెరిగిన ఖర్చు ఏడాది పంటైన చెరకు సాగుకు అయ్యే ఖర్చులతో పాటు బెల్లం తయారీలోనూ ఖర్చులు భారీగా పెరి గాయి. చెరకు పంట సాగుకు ఎకరానికి రూ. 45 వేల నుంచి రూ. 50 వేల వరకు ఖర్చవుతుంది. బెల్లం తయారీకి ఎకరాకు రూ. 25వేల వరకు ఖర్చవుతుం ది. మొత్తంగా ఎకరాకు రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో బెల్లం క్వింటాలుకు రూ. 2,550 ధర పలుకుతోంది. ఎకరాకు 250 ముద్దల బెల్లం తయారవుతుంది. ఒక్కో ముద్ద తయారీకి రూ. వంద ఖర్చ వుతుంది. బెల్లం 35 క్వింటాళ్ల వరకు అవుతోంది. అమ్మడం ద్వారా రూ.90 వేల ఆదాయం వస్తోంది. ఖర్చులకు రూ. 80 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం కష్టపడితే ఎకరాకు రూ. 10 వేలకు మించి మిగలడం లేదు. ఒకవేళ ఆంక్షల ప్రభావంతో ధర పడిపోతే అసలుకే నష్టం జరిగే ప్రమాదం ఉంది. ఆదాయం, ఖర్చులను లెక్కలేసుకుంటున్న రైతులు బెల్లం తయారీ కన్నా చెరకును ఫ్యాక్టరీకి తరలించడమే ఉత్తమమని ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం ఫ్యాక్టరీలో టన్నుకు రూ. 2,600 ఇస్తున్నారు. చెరకు నరకడం, రవాణా ఖర్చులకు టన్నుకు రూ. 600 పోయినా రూ. 2 వేలు మిగులుతుంది. ఎకరాకు 30 టన్నుల నుంచి 35 టన్నుల వరకు దిగుబడి వస్తే రూ. 80 వేలు వస్తుంది. అందులో నరకడం, రవాణా ఖర్చులు, పెట్టుబడులవి మొత్తంగా కలిపితే రూ. 60 వేల పెట్టుబడి అవుతుంది. తద్వారా ఎకరాకు ఎలాం టి రిస్కు లేకుండా రూ. 20 వేల నుంచి రూ. 25 వేల వరకు ఆదాయం వస్తుందని రైతులు అంటున్నారు. అదే బెల్లం తయారీ చేస్తే మిగులు ఏమోగాని నష్టా లు తప్పవని, అందుకే బెల్లం తయారీకి దూరమయ్యామని రైతులు అంటున్నారు. చెరకు పంట సాగు చేసే రైతులకు ప్రభుత ్వం భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉంది. బెల్లం తయారీపై ఉన్న ఆంక్షలు ఎత్తివేసి, మద్దతు ధర కల్పించినపుడు రైతులు కొంత ముందుకు వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వాలు ఆ దిశగా కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
కొండెక్కనున్న గణేశుడు..
- ముడిసరుకు ధరల పెరుగుదలతో - తగ్గనున్న విగ్రహాల తయారీ - గిట్టుబాటు లేకపోవడంతో - మూతపడిన పలు తయారీ కేంద్రాలు - కూలీల కొరత కూడా కారణమే.. సాక్షి, ముంబై: ఈ ఏడాది గణేశ్ విగ్రహాల ధరలు సుమారు 20-25 శాతం పెరిగే అవకాశాలున్నాయి. విగ్రహాల తయారీకి వినియోగించే ముడిసరుకులు, రంగులు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, ఇనుప చువ్వలు తదితర సామగ్రి ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ధరలు పెరిగిన దృష్ట్యా ఈ ఏడాది విగ్ర హాల ఉత్పత్తి కూడా తగ్గించినట్లు తయారీదారులు పేర్కొన్నారు. దీంతో మార్కెట్లో సరుకు కొరత ఏర్పడి ధరలు విపరీతంగా పెరిగే అవకాశముందని వ్యాపారులు అంటున్నారు. గత ఏడాది గణపతి విగ్రహాల తయారీకి ఉపయోగించే 35 కే జీల బంకమట్టి సంచి రూ.170 లభించింది. ప్రస్తుతం 20 కేజీల బంకమట్టికి రూ.200 వెచ్చించాల్సి వస్తోందని అంబర్నాథ్కు చెందిన నానా కడు అనే విగ్రహాల తయారీదారుడు తెలిపారు. విగ్రహాలకు తయారుచేసిన త ర్వాత వాడే రంగులు 20 శాతం మేర ధరలు పెరిగాయి. భారీ విగ్రహాలకు ఉపయోగించే నాణ్యమైన ఇనుప చువ్వల ధరలు కూడా ఆకాశాన్నంటాయి. గిట్టుబాటు కాకపోవడంతో ఇప్పటికే అనేక విగ్రహాలు తయారుచేసే ఫ్యాక్టరీలు మూతపడిపోయాయి. కార్మికులు దొరకడం కూడా కష్టతరంగా మారింది. వారికి చెల్లించే కూలిని రెట్టింపు చేసినా కూలీలు దొరకడం లేదు. వారు డిమాండ్ చేసిన ంత కూలి చెల్లించడంతోపాటు భోజనం, బస ఏర్పాటు చేస్తే తప్ప కార్మికులు దొరకడం లేదు. ఈ సౌకర్యాలన్నీ కల్పిస్తే విగ్రహాల తయారీ ఫ్యాక్టరీ యజమానులకు ఏమీ మిగలడం లేదు. ఏటా రాయ్‌గడ్ జిల్లాలోని పేన్, రోహ తాలూకాల నుంచి భారీ ఎత్తున విగ్రహాలు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి. ఈసారి ధరలు మండిపోవడంతో అనేక మంది ఫ్యాక్టరీ యజమానులు ముందుగా ఆర్డర్లు స్వీకరించడం మానుకున్నారు. ముఖ్యంగా విగ్రహాల తయారీకి ఉపయోగించే బంక మట్టి గుజరాత్లో లభిస్తుంది. అక్కడి నుంచి ట్రక్కులో తీసుకురావడం యజమానులకు గిట్టుబాటు కావడం లేదు. దీంతో కొందరు విగ్రహాలను తయారుచేయడం నిలిపివేశారు.