Simi Singh
-
నా భార్య వల్లే ఇలా: శుభవార్త చెప్పిన క్రికెటర్
ఐర్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ సిమ్రన్‌జిత్ సింగ్ అభిమానులకు శుభవార్త చెప్పాడు. కాలేయ మార్పిడి విజయవంతంగా జరిగిందని.. ప్రస్తుతం తాను కోలుకుంటున్నట్లు వెల్లడించాడు. అదృష్టవశాత్తూ తన భార్యే దాతగా మారిందని.. ఆమె మంచి మనసు, అభిమానుల ప్రార్థన వల్లే ప్రాణాలతో బయటపడ్డాడని కృతజ్ఞతా భావం చాటుకున్నాడు.పంజాబ్‌కు ఆడిన సిమికాగా సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన అతడు భారత దేశవాళీ క్రికెట్లో అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్ తరఫున ఆడాడు. కానీ ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం స్థానం దక్కలేదు. దీంతో మళ్లీ చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. అక్కడే హోటల్ మేనేజ్మెంట్ చేశాడు.అవకాశాలు లేక ఐర్లాండ్‌కు వెళ్లిఅయితే, క్రికెట్‌పై మక్కువ తగ్గకపోవడంతో 2006లో డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ తరఫున ఇంటర్నేషనల్ క్రికెట్లో అడుగుపెట్టాడు. ప్రతిభను చాటుకుంటూ జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు తీశాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ కొట్టి సంచలనం సృష్టించాడు.సెంట్రల్ కాంట్రాక్టు ప్లేయర్గాఈ క్రమంలో... 2020లో సిమికి ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కింది. కాగా సిమి సింగ్ లివర్ పూర్తిగా పాడైపోయినట్లు అతడి కుటుంబ సభ్యులు ఇటీవల మీడియాకు తెలిపారు. అతడిని ఇండియాకు తీసుకువచ్చామని.. గురుగ్రామ్‌లో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ చేసేందుకు డాక్టర్లు ప్రయత్నిస్తున్నారని వెల్లడించారు. ఈ నేపథ్యంలో తాజాగా సిమి సింగ్ స్వయంగా తన ఆరోగ్యానికి సంబంధించిన అప్డేట్ అందించాడు.నా భార్య వల్లే ఇదంతా‘‘అందరికీ హాయ్.. నా లివర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జరీ విజయవంతంగా పూర్తైంది. 12 గంటల పాటు శస్త్ర చికిత్స జరిగింది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాను. తప్పుడు యాంటి బయాటిక్స్, స్టెరాయిడ్స్‌ను కొందరు నాకు ప్రిస్కైబ్ చేశారు. వాటి వల్లే లివర్ పాడయ్యే దుస్థితి తలెత్తింది. నా భార్యే నాకు కాలేయ దాత కావడం నిజంగా నా అదృష్టం. నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా’’ అని సిమి సింగ్ ఇన్‌స్టా స్టోరీలో రాసుకొచ్చాడు.నిపుణులు సూచించిన మందులనే వాడాలని తన ఫాలోవర్లను అప్రమత్తం చేశాడు.చదవండి: Ind vs Aus: ఆ ముగ్గురు బ్యాటర్లు ప్రమాదకరం: ఆసీస్ బౌలర్ -
ప్రాణాపాయ స్థితిలో ఐర్లాండ్ టాప్ క్రికెటర్.. ఇండియాలో చికిత్స
ఐర్లాండ్ టాప్ క్రికెటర్ సిమ్రన్‌జిత్ సింగ్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. అతడి కాలేయం పూర్తిగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రస్తుతం అతడు గురుగ్రామ్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే సిమ్రన్‌జిత్‌కు కాలేయ మార్పిడి జరుగనుందని.. ఆస్పత్రి సిబ్బంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తిచేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది.మొహాలీ నుంచి ఐర్లాండ్‌కు సిమి సింగ్‌గా ప్రసిద్ధి చెందిన సిమ్రన్‌జిత్ సింగ్ భారత్‌లోని పంజాబ్‌లో గల మొహాలిలో జన్మించాడు. చిన్ననాటి నుంచే క్రికెట్‌పై మక్కువ పెంచుకున్న సిమి.. దేశవాళీ క్రికెట్ ఆడాడు. అండర్-14, అండర్-17 స్థాయిలో పంజాబ్‌కు ప్రాతినిథ్యం వహించాడు.అయితే, ఈ లెగ్ స్పిన్ ఆల్‌రౌండర్‌కు భారత అండర్-19 జట్టులో మాత్రం చోటు దక్కలేదు. ఈ నేపథ్యంలో.. చదువుపై దృష్టి సారించిన సిమి.. 2005లో హోటల్ మేనేజ్మెంట్ చదివేందుకు ఐర్లాండ్‌కు వెళ్లిపోయాడు. ఆ మరుసటి ఏడాది డబ్లిన్‌లో ప్రొఫెషనల్ క్రికెటర్ మారిన అతడు.. 2017లో ఐర్లాండ్ జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు.సౌతాఫ్రికాపై శతకం బాదిఅద్భుత ప్రదర్శనలతో జట్టులో కీలక సభ్యుడిగా ఎదిగిన 37 ఏళ్ల సిమి.. ఐర్లాండ్ టాప్ క్రికెటర్‌గా ప్రశంసలు అందుకున్నాడు. మొత్తంగా ఇప్పటి వరకు 35 వన్డేల్లో 39, 53 టీ20లలో 44 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అంతేకాదు.. సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో శతకం బాది సంచలనం సృష్టించాడు. ప్రపంచస్థాయి బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని సిమి వంద పరుగుల మార్కు అందుకున్న తీరు క్రికెట్ అభిమానులను అలరించింది. ఇక 2020లో ఐర్లాండ్ సెంట్రల్ కాంట్రాక్టు దక్కించుకున్న సిమి సింగ్.. ప్రస్తుతం చావుతో పోరాడుతున్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. అతడి లివర్ పూర్తిగా పాడైపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని పేర్కొంది. భార్య కాలేయదానంకాగా సిమి భార్య అగమ్‌దీప్ కౌర్ అతడికి కాలేయదానం చేసేందుకు ముందుకు వచ్చింది. డబ్లిన్‌లో ఉద్యోగం చేస్తున్న ఆమె భర్తను కాపాడుకునేందుకు ఇండియాకు వచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఐర్లాండ్‌లో ఉన్నపుడు ఎన్ని మందులు వాడినా జ్వరం తగ్గకపోవడంతో ఆస్పత్రికి వెళ్లగా.. డాక్టర్లకు సిమి సమస్య అర్థం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అందుకే అతడిని భారత్‌కు తీసుకువచ్చి చికిత్స చేయిస్తున్నట్లు వెల్లడించారు.చదవండి: T20 WC Qualifiers: పెను సంచలనం.. 10 పరుగులకే ఆలౌట్ -
భారత్‌లా కాదు.. ఐర్లాండ్ భేష్: క్రికెటర్
డబ్లిన్: భారత్‌లో పుట్టి అవకాశాలు రాకపోవడంతో.. ఐర్లాండ్‌కు వలస వెళ్లిన క్రికెటర్ సిమీసింగ్. అయితే భారత్‌లో వ్యవస్థలు కంటే ఐర్లాండ్‌లో వ్యవస్థే ఉత్తమం అని తాజాగా ఎద్దేవా చేశాడు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ జాతీయ జట్టుకు ఆడటంతో తన కల సాకారమైనట్లు పేర్కొన్నాడు. ‘నా జీవితంలో ఇదో కఠినమైన ప్రయాణం. భారత జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నాను. కానీ, ఇప్పుడు నేను ఐర్లాండ్ జట్టుకు ఆడుతున్నాను. ఈ రకంగానైనా జాతీయ జట్టుకు ఆడాలన్ననా కల నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఐర్లాండ్‌లో పద్ధతులన్నీ ఎంతో పారదర్శకంగా ఉంటాయి. భారత్ తరహాలో కాదు. ఇలా నేను వెలుగులోకి వచ్చానంటే... అందుకు కారణం క్రికెట్' అని పేర్కొన్నాడు. భారత్‌లో పుట్టి పంజాబ్ తరఫున క్రికెట్ ఆడిన సిమి సింగ్ ఆ తర్వాత చదువు కోసం ఐర్లాండ్ వెళ్లాడు. భారత్‌లో అవకాశాల కోసం ఎదురుచూడటం తనకు, కుటుంబానికి ఎంతో బాధ కల్గించేదన్నాడు. దాంతోనే ఐర్లాండ్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నాడు. చివరకు ఒక జాతీయ జట్టుకు ఆడటం మధురానుభూతిని తీసుకొచ్చిందన్నాడు. -
నా ఫేవరెట్ బ్యాట్స్‌మన్‌కి బౌలింగ్ చేయడమా?
డబ్లిన్: టీమిండియా క్రికెటర్లు మహేంద్ర సింగ్ ధోని, విరాట్ కోహ్లిని ఇప్పటి వరకూ ఎప్పుడూ కలవలేదని, వారిని టీవీలో మాత్రమే చూశానని అంటున్నాడు ఐర్లాండ్ క్రికెటర్ సిమి సింగ్. భారత్‌లో పుట్టిన సిమి సింగ్ పంజాబ్ తరపున క్రికెట్ ఆడాడు. ఇక్కడ అవకాశాలు రాకపోవడంతో ఐర్లాండ్ వెళ్లిపోయాడు. అక్కడ స్థానిక టోర్నమెంట్లో రాణించి జాతీయ జట్టుకు ఎంపికయ్యాడు. త్వరలో భారత్‌తో జరగబోయే టీ20 సిరీస్‌లో సిమి సింగ్ ఐర్లాండ్ తరపున ఆడుతున్నాడు. 2006లో సిమి హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదివేందుకు ఐర్లాండ్‌కు వెళ్లి అక్కడే స్థిరపడిపోయాడు. అయితే తన ఫేవరెట్ క్రికెటర్ రోహిత్ శర్మ అని పేర్కొన్న సిమి సింగ్.. తాను ఎక్కువగా అభిమానించే క్రికెటర్‌గా బౌలింగ్ చేయాలని అనుకోవడం లేదన్నాడు. ‘మొహాలీలో నేను క్రికెట్ ఆడటం ప్రారంభించినప్పుడు భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాలని కలలు కనేవాడిని. కానీ, పంజాబ్‌కు క్రికెట్ ఆడే సమయంలో నాకు పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో నేను చదువు కోసం ఐర్లాండ్ వెళ్లిపోయాను. కానీ, ఇప్పుడు ఐర్లాండ్ జాతీయ జట్టుకు ఆడుతున్నాను. ఐర్లాండ్ వచ్చినప్పటి నుంచి నేను ఏ క్రికెట్ మైదానంలో అయితే ప్రాక్టీస్ చేశానో, చిన్నారులకు శిక్షణ ఇచ్చానో ఇప్పుడు అదే మైదానంలో భారత్-ఐర్లాండ్ మధ్య మ్యాచ్‌లు జరగబోతున్నాయి. ఇదో గొప్ప అనుభూతి. నా కెరీర్లో ఎప్పటికీ మరిచిపోలేను. ఇప్పటి వరకు నేను మహేంద్ర సింగ్ధోనీ, విరాట్ కోహ్లీని కలిసింది లేదు. టీవీలో వారు ఆడుతుంటే చూశాను అంతే. చండీగఢ్‌లో నేను కాలేజీలో చదివే సమయంలో చాహల్, సిద్దార్థ్ కౌల్‌తో కలిసి ఆడాను. ఇప్పుడు ఐర్లాండ్ పర్యటనకు ఆ ఇద్దరూ వచ్చారు. భారత జట్టుతో ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. నా అభిమాన క్రికెటర్ రోహిత్ శర్మ. అతనికి బౌలింగ్ చేయాలని అనుకోవడం లేదు(నవ్వుతూ)’ అని సిమి తెలిపాడు. ఈ నెల 27, 29న భారత్-ఐర్లాండ్ మధ్య రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్ జరగనుంది.