డబ‍్లిన్: భారత్‌లో పుట్టి అవకాశాలు రాకపోవడంతో.. ఐర్లాండ్‌కు వలస వెళ్లిన క్రికెటర్ సిమీసింగ్. అయితే భారత్‌లో వ్యవస్థలు కంటే ఐర్లాండ్‌లో వ్యవస్థే ఉత్తమం అని తాజాగా ఎద్దేవా చేశాడు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ జాతీయ జట్టుకు ఆడటంతో తన కల సాకారమైనట్లు పేర్కొన్నాడు.
‘నా జీవితంలో ఇదో కఠినమైన ప్రయాణం. భారత జాతీయ జట్టు తరఫున క్రికెట్ ఆడాలని కలలు కన్నాను. కానీ, ఇప్పుడు నేను ఐర్లాండ్ జట్టుకు ఆడుతున్నాను. ఈ రకంగానైనా జాతీయ జట్టుకు ఆడాలన్ననా కల నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఐర్లాండ్‌లో పద్ధతులన్నీ ఎంతో పారదర్శకంగా ఉంటాయి. భారత్ తరహాలో కాదు. ఇలా నేను వెలుగులోకి వచ్చానంటే... అందుకు కారణం క్రికెట్' అని పేర్కొన్నాడు. భారత్‌లో పుట్టి పంజాబ్ తరఫున క్రికెట్ ఆడిన సిమి సింగ్ ఆ తర్వాత చదువు కోసం ఐర్లాండ్ వెళ్లాడు. భారత్‌లో అవకాశాల కోసం ఎదురుచూడటం తనకు, కుటుంబానికి ఎంతో బాధ కల్గించేదన్నాడు. దాంతోనే ఐర్లాండ్‌కు వెళ్లాల్సి వచ్చిందన్నాడు. చివరకు ఒక జాతీయ జట్టుకు ఆడటం మధురానుభూతిని తీసుకొచ్చిందన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment